ఒమర్ షరీఫ్

ఒమర్ షరీఫ్ ప్రముఖ హాలీవుడ్ నటుడు.లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ ఝివాగో వంటి సినిమాల్లో అద్భుతంగా నటించిన ఒమర్ షరీఫ్ అంతర్జాతీయంగా పేరు తెచ్చుకున్నారు.

లారెన్స్ ఆఫ్ అరేబియాలో నటనకు ఆస్కార్ అవార్డుకు నామినేట్ అయిన ఒమర్ అదే సినిమాకు గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకున్నారు. నటనపై ఆసక్తితో లండన్‌లోని 'రాయల్ అకాడమీ ఆఫ్ డ్రమెటిక్ ఆర్ట్'లో నటనకు సంబంధించిన మెళకువలు నేర్చుకున్నారు. 1954లో 'సిర్రా ఫిల్-వాడి' అనే ఈజిప్టియన్ చిత్రంతో నటనా ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఒమర్ షరీఫ్
عمر الشريف
జననం
మైఖేల్ డిమిట్రీ కాల్‌హబ్

(1932-04-10)1932 ఏప్రిల్ 10
అలెగ్జాండ్రియా, ఈజిప్టు
మరణం2015 జూలై 10(2015-07-10) (వయసు 83)
కైరో, ఈజిఫ్టు
మరణ కారణంగుండెపోటు
జాతీయతఈజిఫ్టు దేశస్తుడు
ఇతర పేర్లుఒమర్ ఎల్-షరీఫ్, Omar Cherif
విద్యవిక్టోరియా కళాశాల, అలెగ్జాండ్రియా
విద్యాసంస్థకైరో విశ్వవిద్యాలయం
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1954–2015
జీవిత భాగస్వామిఫాటెన్ హమామా (1954–1974)
పిల్లలుటారెక్ ఎల్-షరీఫ్
పురస్కారాలు
  • César Award (2004)
  • Golden Globe Award (1962, 1963, 1965)

మెకన్నాస్ గోల్డ్, లారెన్స్ ఆఫ్ అరేబియా, డాక్టర్ జివాగో, ది టెన్ కమాండ్ మెంట్స్, ది మెమొరీస్ ఆఫ్ మిడ్ నైట్ లాంటి చిత్రాలతో దూసుకుపోయారు. దాదాపు 70 చిత్రాల్లో ఒమర్ నటించారు. ఇలా ఛాన్సులపై ఛాన్సులతో తీరికలేకుండా గడిపిన ఒమర్‌కు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

జీవిత విశేషాలు

ఆయన ఈజిఫ్టు లోని అలెగ్జాండ్రియా నగరంలో ఏప్రిల్ 10 1932 న జన్మించారు. ఆయన నటనా ప్రస్థానం 1953 లో సిరా ఫి ఆల్-వది చిత్రంతో ప్రారంభమైంది. అతి కొద్దికాలంలోనే సుప్రసిద్ధ నటునిగా ప్రఖ్యాతి పొందారు. 1958లో హాలీవుడ్ గాయన అయిన అబ్దెల్ హలీం హఫీజ్ తో కలసి ఇరవై ఈజిఫ్టు చిత్రాలలో నతించారు. ఆమె సతీమణి అయిన ఈజిప్టు నటీమణి ఫాతెన్ హమామతో కలసి అనేక రొమాంటిక్ చిత్రాలలో నటించారు.

నటనా ప్రస్థానం

ఆయన నటించిన మొట్టమొదటి ఆంగ్ల చిత్రం 'లారెన్స్ ఆఫ్ అరేబియా'. డేవిడ్‌ లీన్స్‌ నిర్మించిన దీనిలో షరీఫ్‌ ఆలీ పాత్రను ఒమర్‌ పోషించాడు. తన నటనా వైదుష్యంతో ఆస్కార్‌ నామినేషన్‌కు ఉత్తమ సహాయ నటునిగా నామినేట్‌ అయ్యాడు. దీనితోపాటే గోల్డెన్‌ గ్లోబ్‌ అవార్డును సైతం దక్కించుకున్నాడు. అద్భుతమైన యీ పాత్ర అనంతరం ఆయన రకరకాలైన పాత్రలకు జీవం పోశాడు. బిహౌల్డ్‌ ఏ పాలి హార్స్‌లో (1964) స్పానిష్‌ మతబోధకునిగా, చెంఘిజ్‌ఖాన్‌లో (1965) మంగోలియన్‌ విజేతగా, అదే ఏడాది బోరిస్‌ పాస్టర్‌నాక్‌ రచించిన నవల డాక్టర్‌ జివాగోలో ప్రధాన పాత్రధారిగా ఆయన నటించాడు. ఆ తరువాత ది నైట్‌ ఆఫ్‌ జనరల్స్‌లో జర్మన్‌ సైనికాధికారిగా, మేయర్‌లింగ్‌లో ఆస్ట్రియా యువరాజు రుడాల్ప్‌గా, చె గువేరాలో చే పాత్రను, ఫన్నీ గర్ల్‌లో ఫన్నీ బ్రిస్‌ భర్తగా నటించడం ద్వారా ఆయన ఎంతో ప్రఖ్యాతి పొందాడు.

2003లో ఫ్రెంచ్‌ భాషా చిత్రంలో పోషించిన ఒక పాత్ర ఆయనకు ఎంతో పేరును సంపాదించి పెట్టింది. 1932లో పుట్టినది మొదలు 1965లో ఐరోపాకు వెళ్ళేవరకు ఓమర్‌ షరీఫ్‌ తన మాతృదేశమైన ఈజిప్టులోనే గడిపాడు. ఈజిప్టు చిత్రనటి ఫాటెన్‌ హమామాను వివాహమాడేటందుకై 1955లో ఓమర్‌ షరీఫ్‌ ఇస్లాంను స్వీకరించాడు. 1957లో ఈ దంపతులకు పుత్రుడు కలిగాడు. పేరు తారిక్‌ ఎల్‌-షరీఫ్‌. ఎనిమిదేళ్ళ వయసులో డాక్టర్‌ జివాగో చిత్రంలో యూరి పాత్రలో నటించాడు. 1966లో యీ దంపతులు వేరుపడ్డారు. 1974లో వివాహ బంధం తెగిపోయింది. షరీఫ్‌ మరలా వివాహం చేసుకోలేదు. 2010లో హల్‌ విశ్వవిద్యాలయం ఓమర్‌కు గౌరవ పట్టాను ప్రదానం చేసింది.

చిత్రమాలిక

మూలాలు

ఇతర లింకులు

Tags:

ఒమర్ షరీఫ్ జీవిత విశేషాలుఒమర్ షరీఫ్ నటనా ప్రస్థానంఒమర్ షరీఫ్ చిత్రమాలికఒమర్ షరీఫ్ మూలాలుఒమర్ షరీఫ్ ఇతర లింకులుఒమర్ షరీఫ్గోల్డెన్ గ్లోబ్ పురస్కారంలారెన్స్ ఆఫ్ అరేబియాసినిమాహాలీవుడ్

🔥 Trending searches on Wiki తెలుగు:

కడప లోక్‌సభ నియోజకవర్గంఘట్టమనేని కృష్ణసమంతఆలంపూర్ జోగులాంబ దేవాలయంమాచెర్ల శాసనసభ నియోజకవర్గంమహాభాగవతంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థశాతవాహనులుఫ్లిప్‌కార్ట్తెలుగు అక్షరాలునాగ్ అశ్విన్కుంభరాశికామాక్షి భాస్కర్లపరకాల ప్రభాకర్నర్మదా నదిఅన్నమయ్యట్రూ లవర్భారత ప్రధానమంత్రుల జాబితాఅల్లు అరవింద్అరకులోయధర్మంఘిల్లిసోనియా గాంధీఅ ఆభీమసేనుడుషిర్డీ సాయిబాబాఆవేశం (1994 సినిమా)శ్రీ కృష్ణుడుబ్రాహ్మణ గోత్రాల జాబితాతామర వ్యాధిరతన్ టాటాఆర్టికల్ 370 రద్దుయేసు శిష్యులువర్షంమహాత్మా గాంధీసమ్మక్క సారక్క జాతరదగ్గుబాటి వెంకటేష్మృణాల్ ఠాకూర్ఎయిడ్స్నాయీ బ్రాహ్మణులుప్రబంధముఅశ్వత్థామఉండి శాసనసభ నియోజకవర్గంశోభన్ బాబుచెమటకాయలుఏ.పి.జె. అబ్దుల్ కలామ్యవలుభలే మంచి రోజురుక్మిణీ కళ్యాణంబారిష్టర్ పార్వతీశం (నవల)శ్రీశ్రీవాయల్పాడు శాసనసభ నియోజకవర్గంYహైపర్ ఆదిపచ్చకామెర్లువిశాల్ కృష్ణశ్యామశాస్త్రిభారతీయ రిజర్వ్ బ్యాంక్గంగా నదిభారతదేశ జిల్లాల జాబితామరణానంతర కర్మలుకోట్ల విజయభాస్కరరెడ్డిమంగలిఅశోకుడుకడియం కావ్యకరోనా వైరస్ 2019లోక్‌సభకన్నెగంటి బ్రహ్మానందంసుడిగాలి సుధీర్సప్త చిరంజీవులుతొలిప్రేమతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రితెలుగు సినిమావిశాఖ నక్షత్రముపవన్ కళ్యాణ్వై.యస్. రాజశేఖరరెడ్డికార్తెజానీ బెయిర్‌స్టో🡆 More