ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ (ISP) అంటే అంతర్జాలం (ఇంటర్నెట్) లో ప్రవేశించడానికి, వాడుకోవడానికి, పాల్గొనడానికి అవకాశం కల్పించే సంస్థ.

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లు పలు రకాలుగా ఉండవచ్చు. వాణిజ్యపరమైనవి, లాభాపేక్షరహితమైనవి, ప్రైవేటు వ్యక్తుల చేతిలోనివి అయి ఉండవచ్చు. అంతర్జాల ప్రవేశం, విహరించడం, డొమైన్ పేరు నమోదు, వెబ్ హోస్టింగ్, యూజ్ నెట్ సర్వీసు లాంటి సేవలు ఈ సంస్థలు ప్రధానంగా అందిస్తుంటాయి. అంతర్జాలంలో లభించే ఏ సేవ వినియోగించుకోవలన్నీ ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు ఒక ప్రవేశ ద్వారం లాంటివి.

ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్
తుది వినియోగదారు నుండి 3/2 ISP ల వరకు ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎంపికలు

ఉదాహరణకు విదేశీ సంచార్ నిగం లిమిటెడ్ భారతదేశంలో గల ఒక ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడరు.

చరిత్ర

అంతర్జాలం (మొదట్లో ఆర్పానెట్ - ARPAnet) ప్రభుత్వ పరిశోధనా సంస్థలకు, కొన్ని విశ్వవిద్యాలయాల్లోని విభాగాలకు వారధిగా ఉండేందుకు అభివృద్ధిచేయబడింది. ఇతర సంస్థలు నేరుగా బ్యాక్ బోన్ కు అనుసంధానమై కానీ, అంతర్జాలానికి అనుసంధానమైన ఇతర సంస్థల ద్వారా ఏర్పాట్లు చేసుకుని గానీ, UUCP లాంటి డయల్ అప్ ఉపకరణాలను ఉపయోగించి గానీ అంతర్జాలాన్ని వాడుకుంటారు. 1980 దశాబ్దం చివరకు వచ్చేసరికి అంతర్జాలాన్ని సాధారణ ప్రజలు, వ్యాపార ప్రయోజనాల కోసం వాడుకునేందుకు కొన్ని విధానాలు ఏర్పాటు అయ్యాయి. వరల్డ్ వైడ్ వెబ్ అందుబాటులోకి వచ్చిన కొద్దికాలం తర్వాత 1991 సంవత్సరంలో కొన్ని నియంత్రణలు ఎత్తివేశారు.

1980 దశకంలోనే కంప్యూసర్వ్ (CompuServ), అమెరికా ఆన్లైన్ (AOL) లాంటి కంపెనీలు అంతర్జాలాన్ని ఈమెయిలు వాడకం లాంటి నియంత్రిత విధానాల ద్వారా చేరుకోవడానికి అవకాశం కల్పించాయి. కానీ సాధారణ ప్రజలు అంతర్జాలాన్ని పూర్తి స్థాయిలో వాడుకోవడానికి సాధ్యం కాలేదు. 1989 లో ఆస్ట్రేలియా, అమెరికా దేశాల్లో కొన్ని తొలితరం ఇంటర్నెట్ సర్వీసు ప్రొవైడర్లు ఏర్పడి, నెలవారీ కొంత రుసుము చెల్లించి అంతర్జాలాన్ని పూర్తి స్థాయిలో వాడుకునేందుకు అవకాశం కల్పించాయి.

మూలాలు

Tags:

అంతర్జాలముడొమైన్ పేరు

🔥 Trending searches on Wiki తెలుగు:

కాలుష్యంతారక రాముడునవధాన్యాలుఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలుడీజే టిల్లుసంభోగంజిల్లేడునరేంద్ర మోదీసావిత్రి (నటి)యానిమల్ (2023 సినిమా)రమ్య పసుపులేటిభరణి నక్షత్రముపిత్తాశయముఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంకర్ణుడుబోయపాటి శ్రీనుపాలకొండ శాసనసభ నియోజకవర్గంఎనుముల రేవంత్ రెడ్డిమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంపాల కూరచార్మినార్తాటిభారతీయ రైల్వేలుగరుత్మంతుడుభీమా (2024 సినిమా)శాసనసభ సభ్యుడుగున్న మామిడి కొమ్మమీదస్వామి రంగనాథానందశివపురాణందక్షిణామూర్తి ఆలయంమహామృత్యుంజయ మంత్రంబైబిల్భారత రాష్ట్రపతిఆషికా రంగనాథ్షణ్ముఖుడుఅడాల్ఫ్ హిట్లర్కొమురం భీమ్పక్షవాతంబాదామిశ్రవణ కుమారుడుధనూరాశిదీపావళిభారతదేశ రాజకీయ పార్టీల జాబితాయేసుతెలుగుశ్రీనాథుడుతెలుగు నాటకరంగంశ్రీశైల క్షేత్రంఇంటి పేర్లునోటాపాడ్కాస్ట్ఐడెన్ మార్క్‌రమ్ఆరుద్ర నక్షత్రముబంగారంకూరరష్మికా మందన్నవెలిచాల జగపతి రావుకంప్యూటరుప్రభాస్రక్తపోటుఅక్కినేని నాగ చైతన్యఇంద్రుడుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షఇంగువగోదావరిచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంఫహాద్ ఫాజిల్డామన్ఐక్యరాజ్య సమితిఅనసూయ భరధ్వాజ్దొంగ మొగుడుభారతదేశంలో సెక్యులరిజంతెలుగు సాహిత్యం - ఎఱ్ఱన యుగంపొంగులేటి శ్రీనివాస్ రెడ్డికేతువు జ్యోతిషంబి.ఆర్. అంబేద్కర్🡆 More