ఆరిజోనా

ఆరిజోనా అమెరికా లోని రాష్ట్రాల్లో ఒకటి.

ఈ రాష్ట్రం అమెరికా నైఋతి ప్రాంతంలో ఉంది. ఈ రాష్ట్రం ఎడారి ప్రదేశాలకు, అతి తీవ్రమయిన వేసవికి, మధ్యస్థమైన చల్లదనం కలిగిన శీతాకాలానికి ప్రసిద్ధి కెక్కింది. ఈ రాష్ట్రానికి న్యూమెక్సికో, యూటా, నెవాడా, కాలిఫోర్నియా, కొలరాడో రాష్ట్రాలు సరిహద్దులు. మెక్సికోలోని సొనోరా, బాజా కాలిఫోర్నియా అంతర్జాతీయ సరిహద్దులు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్ కాన్యన్ లోయ, అనేకమయిన అడవులు, స్మారక స్థూపాలు, రెడ్ ఇండియన్ ల ఆవాసాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. దీని రాజధాని, అతిపెద్ద నగరమూ ఫీనిక్స్.

ఆరిజోనా
అమెరిక మ్యాపులో అరిజోనా రాష్ట్రం
ఆరిజోనా

అమెరికాలో చేరిన రాష్ట్రాల్లో అరిజీఓనా 48 వది. 1912 ఫిబ్రవరి 14 న రాష్ట్ర హోదా పొందింది. చారిత్రికంగా న్యూ స్పెయిన్ లోని అల్టా కాలిఫోర్నియాలో ఉండే ఈ ప్రాంతం, 1821 లో మెక్సికోలో భాగమైంది. మెక్సికో - అమెరికా యుద్ధాంలో ఓడిపోయాక 1848 లో మెక్సికో ఈ ప్రాంతాన్ని అమెరికాకు అప్పగించింది. రాష్ట్రం లోని దక్షిణ కొసన ఉన్న ప్రాంతాన్ని 1853 లో అమెరికా కొనేసింది.

దక్షిణ అరిజోనాలో ఎడారి శీతోష్ణస్థితి ఉంటుంది. ఉత్తరాన పైన్ అడవులు, కొలరడో పీఠభూమి, పర్వతాలు, లోతైన గండ్లతో ఉంటుంది. ఈ ప్రాంతంలో వేసవి ఉష్ణోగ్రతలు మధ్యస్థంగాను, శీతాకాలాల్లో మంచు కురుస్తూనూ ఉంటుంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన గ్రాండ్ కాన్యన్ జాతీయ పార్కు అరిజోనా లోనే ఉంది. ప్రపంచ ఏడు వింతల్లో ఇదొకటి. రాష్ట్రంలో ఇంకా అనేక జాతీయ పార్కులు, జాతీయ పర్వతాలూ ఉన్నాయి.

రాష్ట్రం లోని న్లుగీ వంతు భూభాగంలో స్థానిక రెడ్ ఇండియనుల కోసం కేటాయించారు. 1924 లో దేశవ్యాప్తంగా వీరికి వోటు హక్కు ఇచ్చినప్పటికీ, అరిజోనాలో మాత్రం 1948 లో ఆ రాష్ట్ర సుప్రీంకోర్టు జోక్యంతో వచ్చింది.

జనాభా వివరాలు

2019 జూలై 1 నాటికి అరిజోనా జనాభా 72,78,717. 2010 నాటి జనాభా 63,92,017 నుండి 13.87% పెరిగింది. రాజధాని ఫీనిక్స్ జనాభా 2018 నాటికి 49 లక్షలు. రాష్ట్ర మొత్తం జనాభాలో మూడింట రెండు వంతులు రాజధాని లోనే ఉన్నారు.

మూలాలు

Tags:

అమెరికా సంయుక్త రాష్ట్రాలుకాలిఫోర్నియాకొలరాడోగ్రాండ్ కేనియన్మెక్సికోవేసవి కాలం

🔥 Trending searches on Wiki తెలుగు:

శ్రీనివాస రామానుజన్Aకొమురవెల్లి మల్లన్న స్వామి దేవాలయంతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కుంభరాశి2014 భారత సార్వత్రిక ఎన్నికలుశ్యామశాస్త్రితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థభారతదేశ జిల్లాల జాబితాసుమంగళి (1965 సినిమా)నీరుఏప్రిల్ 26ఏ.పి.జె. అబ్దుల్ కలామ్రాజంపేట లోక్‌సభ నియోజకవర్గంశోభన్ బాబుగరుత్మంతుడుతత్పురుష సమాసముపల్లెల్లో కులవృత్తులువాసిరెడ్డి పద్మతిరుపతిప్రబంధముబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంక్లోమముఅధిక ఉమ్మనీరువేమిరెడ్డి ప్రభాకరరెడ్డిఎనుముల రేవంత్ రెడ్డిసంభోగంపమేలా సత్పతిదశరథుడుచాళుక్యులుతామర వ్యాధివై.యస్. రాజశేఖరరెడ్డిబారిష్టర్ పార్వతీశం (నవల)కొండా సురేఖఆంధ్రప్రదేశ్జాతీయ ప్రజాస్వామ్య కూటమిరమ్య పసుపులేటిప్లాస్టిక్ తో ప్రమాదాలుపటికతెలంగాణసిద్ధార్థ్శాసనసభరైతుబంధు పథకందానం నాగేందర్నువ్వులు2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅమెరికా సంయుక్త రాష్ట్రాలుసిరికిం జెప్పడు (పద్యం)పెమ్మసాని నాయకులుమాచెర్ల శాసనసభ నియోజకవర్గంజాంబవంతుడుతమన్నా భాటియాసోరియాసిస్అందెశ్రీపూజా హెగ్డేసర్పంచిమా తెలుగు తల్లికి మల్లె పూదండఅక్కినేని నాగ చైతన్యసవర్ణదీర్ఘ సంధికొడాలి శ్రీ వెంకటేశ్వరరావుతీన్మార్ మల్లన్నసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్పిఠాపురంవర్షం (సినిమా)నాయుడుతెలుగు సినిమాలగ్నంకీర్తి సురేష్ఫ్యామిలీ స్టార్అంగారకుడు (జ్యోతిషం)చరాస్తిఅల్లూరి సీతారామరాజువై.యస్.భారతితెలుగు వికీపీడియాహైపర్ ఆదిబి.ఆర్. అంబేద్కర్2024 భారతదేశ ఎన్నికలు🡆 More