వెలుదండ నిత్యానందరావు

వెలుదండ నిత్యానందరావు పేరుపొందిన రచయిత, పరిశోధకుడు, ఉపన్యాసకుడు.

ఇతడు ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖకు అధ్యక్షుడిగా పనిచేశాడు.

ఆచార్య

వెలుదండ నిత్యానందరావు
వెలుదండ నిత్యానందరావు
జననం (1962-08-09) 1962 ఆగస్టు 9 (వయసు 61)
జాతీయతభారతీయుడు
విద్యఎం.ఎ., పి.హెచ్.డి.
విద్యాసంస్థఉస్మానియా విశ్వవిద్యాలయం
వృత్తితెలుగు ఆచార్యుడు
ఉద్యోగంఉస్మానియా విశ్వవిద్యాలయం
సుపరిచితుడు/
సుపరిచితురాలు
పరిశోధకుడు,
వ్యాసరచయిత
గుర్తించదగిన సేవలు
తెలుగు సాహిత్యంలో పేరడీ,
హాసవిలాసం,
నిత్యాన్వేషణం
తల్లిదండ్రులువెలుదండ రామేశ్వరరావు, లక్ష్మమ్మ
బంధువులువెలుదండ సత్యనారాయణరావు (అన్న)

జీవిత విశేషాలు

ఇతడు 1962, ఆగష్టు 9వ తేదీన నాగర్‌కర్నూల్ జిల్లా, మంగునూరులో రామేశ్వరరావు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. ఇతని తండ్రి వెలుదండ రామేశ్వరరావు కవి, పండితుడు. ఇతని సోదరుడు వెలుదండ సత్యనారాయణరావు కూడా కవి. ఇతడు మంగునూరులో ప్రాథమిక విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకొని, శ్రీవేంకటేశ్వర ప్రభుత్వ ప్రాచ్య కళాశాల, పాలెంలో డిగ్రీ వరకూ చదివాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎం.ఏ., ఎం.ఫిల్‌., పిహెచ్‌.డి. పూర్తి చేసుకొని తను చదివిన విశ్వవిద్యాలయ తెలుగుశాఖలో 1988-92 వరకూ పార్ట్‌ టైమ్‌ లెక్చరరుగా చేసి, తదనంతరం లెక్చరరుగా, సహాయాచార్యుడుగా, ఆచార్యుడుగా ఎదిగాడు. డిగ్రీ స్థాయిలో రంగాచార్యులు, కపిలవాయి లింగమూర్తి మొదలైనవారు, పి.జి. స్థాయిలో సి.నా.రె, ఎల్లూరి శివారెడ్డి, ఎస్వీ రామారావు మొదలైనవారు ఇతని గురువులు. ఇతడు కవిగా, కథకుడుగా, నాటకకర్తగా, ప్రవక్తగా, సమీక్షకుడుగా, సంపాదకుడుగా, ఆచార్యుడుగా, అన్నింటికీ మించి మహావ్యాసకారుడుగా బహుముఖీనతను సంతరింపజేసుకున్నాడు.

సాహిత్యరంగం

ఇతడు ఇప్పటి వరకు రెండు వేలకు పైచిలుకు పరిశోధక వ్యాసాలు, ఎన్నో గ్రంథ సమీక్షలు, మరెన్నో జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పత్ర సమర్పణలు, ముప్పాతిక దాకా పీఠికలు వ్రాశాడు. సాంకేతికాభివృద్ధి అంతా చేరువలో లేని రోజులలోనే అవిభాజ్య ఆంధ్రదేశంలో వివిధ విశ్వవిద్యాలయాలలోని తెలుగు విభాగాలలో వచ్చిన ఎం.ఫిల్‌, పిహెచ్‌.డి పరిశోధన వివరాలను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి సేకరించి 1998లో 'విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన'గా వేశాడు. 2004, 2013లో పరివర్ధిత ముద్రణలను పొందిన ఈ గ్రంథం పరిశోధక విద్యార్థులకు దిక్సూచిగా పనిచేస్తున్నది. ప్రాచీనాధునిక సాహిత్యకారులందరూ ఈసడించుకున్న చంద్రరేఖా విలాపం అనే ప్రబంధాన్ని తన ఎం.ఫిల్. పరిశోధనాంశంగా స్వీకరించి ఈ తొలి వికట ప్రబంధం పైన సమగ్ర పరిశీలన చేసి ఈ ప్రబంధంలోని ప్రౌఢమైన పదాల గుంభనాన్ని, సరస హాస్యాలను బయల్పరిచాడు. 'తెలుగు సాహిత్యంలో పేరడీ' అనే అంశంపై శోధించి డాక్టరేటు పొందాడు.

రచనలు

రచయితగా

  • తెలుగు సాహిత్యంలో పేరడీ (పి.హెచ్.డి. సిద్ధాంత గ్రంథం)
  • విశ్వవిద్యాలయాల్లో తెలుగు పరిశోధన
  • భారతీయ జ్వలిత చేతన బంకించంద్ర
  • చంద్రరేఖా విలాపం-తొలి వికట ప్రబంధం (ఎం.ఫిల్ సిద్ధాంత గ్రంథం)
  • బూర్గుల రామకృష్ణారావు
  • హాసవిలాసం (వ్యాస సంపుటి)
  • నిత్యవైవిధ్యం (వ్యాస సంపుటి)
  • నిత్యానుశీలనం (వ్యాస సంపుటి)
  • నిత్యాన్వేషణం (వ్యాస సంఫుటి)
  • తెలుగు పరిశోధన (2012లో ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలుగు అకాడమీ ప్రచురించిన గ్రంథం)

సంపాదకుడిగా

  • నవయుగ రత్నాలు ఆచార్య జి.వి. సుబ్రహ్మణ్యం సాహిత్య వ్యాస సంపుటి,
  • తెలుగు పరిశోధన వ్యాసమంజరి (105 సిద్ధాంత గ్రంథాల సారసంగ్రహ సంకలనం),
  • ఆధునిక భాషాశాస్త్రం- ప్రకార్యభాష (ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఏ. దూరవిద్య తెలుగు పాఠ్య గ్రంథం).
  • ఆధునికాంధ్ర భావకవిత్వం (రచన:పాటిబండ మాధవశర్మ)
  • వాఙ్మయ దివాకరుడు (దివాకర్ల వేంకటావధాని శతజయంతి సంచిక, 2014) - సహ సంపాదకత్వం
  • పాలవెల్లి (పల్లా దుర్గయ్య శత జయంతి సంచిక, 2016) - సహ సంపాదకత్వం

పురస్కారాలు

  • కవిశేఖర కొండేపూడి సుబ్బారావు సాహిత్య విమర్శ పురస్కారం

మూలాలు

Tags:

వెలుదండ నిత్యానందరావు జీవిత విశేషాలువెలుదండ నిత్యానందరావు సాహిత్యరంగంవెలుదండ నిత్యానందరావు పురస్కారాలువెలుదండ నిత్యానందరావు మూలాలువెలుదండ నిత్యానందరావుఉస్మానియా విశ్వవిద్యాలయంరచయిత

🔥 Trending searches on Wiki తెలుగు:

విజయసాయి రెడ్డిపది ఆజ్ఞలుయనమల రామకృష్ణుడుభలే మంచి రోజుబమ్మెర పోతనత్రిఫల చూర్ణంగన్నేరు చెట్టుకోదండ రామాలయం, ఒంటిమిట్టఎవడే సుబ్రహ్మణ్యంశ్రుతి హాసన్కుమ్ర ఈశ్వరీబాయివాల్మీకిబ్రహ్మంగారి కాలజ్ఞానంసింహరాశిఎన్నికలుసుకన్య సమృద్ధి ఖాతాగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంమొఘల్ సామ్రాజ్యంశ్రీకాళహస్తిమకరరాశిపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుప్రకృతి - వికృతితులారాశి2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిముదిరాజ్ (కులం)నందమూరి తారక రామారావుకె. విజయ భాస్కర్జాషువాజగదీప్ ధన్కర్పండుతిథిసజ్జల రామకృష్ణా రెడ్డికొండా సురేఖపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిరక్త పింజరిLజాతీయ ప్రజాస్వామ్య కూటమిమహాకాళేశ్వర జ్యోతిర్లింగంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంసప్త చిరంజీవులుగౌడయాపిల్ ఇన్‌కార్పొరేషన్చాకలిపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంనువ్వుల నూనెఉప రాష్ట్రపతిఅక్కినేని నాగార్జునరాజ్యసభవడ్రంగిచదరంగం (ఆట)అగ్నికులక్షత్రియులుజ్ఞాన సరస్వతి దేవాలయం, బాసరహన్సిక మోత్వానీమలబద్దకం2019 భారత సార్వత్రిక ఎన్నికలుస్వర్ణ దేవాలయం, శ్రీపురంభారత జాతీయ కాంగ్రెస్ఈనాడుఏప్రిల్ 27మహేంద్రసింగ్ ధోనిశ్రీలలిత (గాయని)అంగుళంతెలుగు కులాలుకామినేని శ్రీనివాసరావునాగార్జునసాగర్అశ్వని నక్షత్రముమా తెలుగు తల్లికి మల్లె పూదండప్రకాష్ రాజ్రామ్ చ​రణ్ తేజసవర్ణదీర్ఘ సంధితెనాలి రామకృష్ణుడుమాళవిక శర్మస్వామి వివేకానందబుర్రకథగోవిందుడు అందరివాడేలే🡆 More