విరాట పర్వము

విరాట పర్వము, మహాభారతం ఇతిహాసంలోని నాలుగవభాగము.

సంస్కృతమూలం వ్యాసుడు రచించాడు. ఆంధ్ర మహాభారతంలో తిక్కన రచన ఈ పర్వంనుండి ఆరంభమౌతుంది. సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండు సంవత్సరాలు అరణ్యవాసం తరువాత అజ్ఞాతవాసం చేయడం ఈ పర్వంలో ముఖ్య కథాంశం.

దస్త్రం:Mahabharata02ramauoft 0022 37.jpg
మహాభారతంలో నాల్గవ పర్వము. ఇందులో 12 సంవత్సరాల వనవాసం అనంతరం ఒక అజ్ఞాత వాసంలో భాగంగా విరాట రాజు కొలువులో పాండవులు వివిధ ఉద్యోగాలలో చేరుట.

కథా సంగ్రహం

సభాపర్వంలో భంగపడిన పాండవులు జూద నియమానుసారం పన్నెండేండ్ల అరణ్యవాసం చేసిన తరువాత , ఒక సంవత్సరం అజ్ఞాతవాస దీక్ష చేయుట కొరకు మారు పేర్లతో విరాట నగరం ప్రవేశించి, విరాట రాజు కొలువులో ఉద్యోగాలు సంపాదించి కుదురుకుంటారు. అక్కడ ధర్మరాజు విరాట రాజు  కొలువులోకి "కంకుడు" అనే మారుపేరుతో ప్రవేశించాడు. భీముదు " బల్లవ" పేరుతో ప్రవేశించాడు. అర్జునుడు "బృహన్నల" పేరుతో కొలువులోకి ప్రవేశించాడు. ఇక నకులుడు "గ్రంథిక" పేరుతో కొలువు లోకి వచ్చాడు. సహదేవుడు తన పేరును " తంతిపాలుడు" గా చెప్పుకున్నాడు. ద్రౌపది తన పేరును "సైరంధ్రి"గా చెప్పుకున్నది. ఇంకొన్ని రోజులలో అజ్ఞాతవాసం ముగుస్తుందనగా కీచకుని వలన రాణికి పరిచారికగా ఉన్న ద్రౌపదికి ఆపద రాగా, భీముడు అతిచాకచక్యంతో గంధర్వులన్న భ్రాంతి కలిగిస్తూ అతనిని, అతని తమ్ములను సంహరిస్తాడు. దుర్యోధనుడు కుతంత్రంతో పాండవులను బయల్పరచాలని దక్షిణ, ఉత్తర గోగ్రహణాలకు పన్నాగం పన్నుతాడు. అప్పటికే పాండవులు అజ్ఞాతవాసం పూర్తి చేసుకున్నవారై, అర్జునుడు మినహా తక్కిన పాండవులు విరాటునికి బాసటగా వెళ్ళి సుశర్మను ఓడిస్తే, బృహన్నలగా ఉన్న అర్జునుడు ఉత్తరునికి రథసారథిగా వెళ్ళి ఆ పై గాండీవధారియై తన నిజరూపాన్ని ప్రకటించి భీష్మ, ద్రోణ, కర్ణ, సుయోధన, ఆశ్వత్థామాది యోధులను ఒక్కడే ఎదుర్కొని వారలను జయించి గోవులను మరలుస్తాడు. ఉత్తరాభిమన్యుల వివాహంతో మంగళదాయకంగా విరాట పర్వం ముగుస్తుంది.

సంస్కృత మహాభారత విషయాలు

మహా భారతంలోని మొత్తం ౧౦౦ ఉపపర్వాలలో ౪ ఉప పర్వాలు విరాట పర్వంలో ఉన్నాయి. కాని తెలుగు మహా భారతంలో ఉప పర్వాల నియమాన్ని పాటించలేదు.

సంస్కృత మూలంలో ఉన్న ఉపపర్వాలు:

  1. వైరాటం
  2. కీచక వధ
  3. గోగ్రహణం
  4. అభిమన్యుని వివాహం

ఇవి కూడా చూడండి

మూలాలు

బయటి లింకులు

విరాట పర్వము 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:


Tags:

విరాట పర్వము కథా సంగ్రహంవిరాట పర్వము సంస్కృత మహాభారత విషయాలువిరాట పర్వము ఇవి కూడా చూడండివిరాట పర్వము మూలాలువిరాట పర్వము బయటి లింకులువిరాట పర్వముఆంధ్ర మహాభారతంతిక్కనమహాభారతం

🔥 Trending searches on Wiki తెలుగు:

పొంగూరు నారాయణఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.తెలుగు నాటకరంగంస్టూడెంట్ నంబర్ 1మూలా నక్షత్రంవై.యస్.భారతిగర్భంతిలక్ వర్మచాళుక్యులుమాగుంట సుబ్బరామిరెడ్డినీటి కాలుష్యంశ్రీకాంత్ (నటుడు)శ్రీ గౌరి ప్రియఉలవలువడదెబ్బక్రిక్‌బజ్అర్జునుడుభారత ఎన్నికల కమిషనుకిలారి ఆనంద్ పాల్ఆంధ్రప్రదేశ్ శాసనసభసరోజినీ నాయుడుగంగా నదిగజము (పొడవు)రవీంద్ర జడేజాభారతదేశ రాజకీయ పార్టీల జాబితాపొడుపు కథలుహనుమంతుడుఓం భీమ్ బుష్కన్యకా పరమేశ్వరిశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంకింజరాపు అచ్చెన్నాయుడుఅష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలువై.యస్.రాజారెడ్డిఅమితాబ్ బచ్చన్2014 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురాహుల్ గాంధీసంతోషం (2002 సినిమా)ద్రోణాచార్యుడుపూరీ జగన్నాథ దేవాలయంఅల్లు అర్జున్పార్లమెంటు సభ్యుడుప్రపంచ పుస్తక దినోత్సవంఇంటి పేర్లుఉడుముకావ్యముపవన్ కళ్యాణ్విజయనగర సామ్రాజ్యంభారతీయ తపాలా వ్యవస్థతేలుజీలకర్రరాశి (నటి)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాఎయిడ్స్శాంతికుమారివ్యవసాయంబ్రాహ్మణులుయూట్యూబ్నువ్వు నాకు నచ్చావ్భారతదేశంలో బ్రిటిషు పాలనఆల్ఫోన్సో మామిడిసెక్యులరిజం20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిద్రౌపదిఆంధ్రప్రదేశ్ మండలాలుదీపావళికొంపెల్ల మాధవీలతశ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయం (వేములవాడ)నారా చంద్రబాబునాయుడుప్రేమలుజ్యేష్ట నక్షత్రంఆలివ్ నూనెభారతీయ జనతా పార్టీగైనకాలజీసిద్ధు జొన్నలగడ్డయవలు🡆 More