లోమో

లోమో (ఆంగ్లం: LOMO) రష్యా లోని సెయింట్ పీటర్స్‌బర్గ్ కేంద్రంగా వైద్య పరికరాలు/చలన చిత్రాలకు కావలసిన కటకాలు/పరికరాలు తయారు చేసే సంస్థ .

LOMO యొక్క పూర్తి రూపం Leningradskoye Optiko-Mekhanicheskoye Obyedinenie (Ленинградское Oптико-Mеханическое Oбъединение) అనగా లెనిన్ గ్రాడ్ ఆప్టికల్ మెకానికల్ అసోసియేషన్ అని అర్థం. సోవియట్ యూనియన్ యొక్క ప్రఖ్యాత ఆర్డర్ ఆఫ్ లెనిన్ అవార్డులు లోమో సంస్థకు మూడు లభించినవి.

LOMO
Native name
ЛОМО
పరిశ్రమImaging, Medical
స్థాపనపెట్రోగ్రాడ్, రష్యా (1914)
Foundersస్థాపకుడు
ప్రధాన కార్యాలయంసెయింట్ పీటర్స్‌బర్గ్, Russia
Areas served
ప్రాంతాల సేవలు
Productsకటకాలు, వైద్య పరికరాలు, స్టిల్, మూవీ కెమెరాలు, చలన చిత్ర శ్రవణ సాధనాలు
Revenue3,27,27,95,000 (2017) Edit this on Wikidata
Operating income
51,46,71,000 (2017) Edit this on Wikidata
Net income
−33,95,25,000 (2017) Edit this on Wikidata
Total assets13,84,84,34,000 (2017) Edit this on Wikidata
Number of employees
2,386 Edit this on Wikidata
Website

చరిత్ర

లోమో 
లోమో చే తయారు చేయబడ్డ 9 X 12 కెమెరా - FOTOKOR

1914 లో పెట్రోగ్రాడ్ (ఇప్పటి సెయింట్ పీటర్స్బర్గ్) లో కటకాలు, కెమెరాలు తయారు చేసే ఫ్రెంచి-రష్యన్ సంస్థగా స్థాపించబడింది. 1919లో ఇది జాతీయం చేయబడింది. 1921 లో Factory of State Optics (G.O.Z) గా పేరు మార్చబడింది. 1928 లో 9 X 12 కెమెరాను తయారు చేయవలసిందిగా సంస్థ ఆజ్ఙాపించడమైంది.

GOMZ

రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత పలు సంస్కరణల వలన 1932లో సంస్థను GOMZ (Gosularstvennyi Optiko-Mehanicheskiy Zavod అనగా State Optical-Mechanical Plant) గా మార్చారు.

లోమో 
లోమో చే తయారు చేయబడ్డ ఎస్ ఎల్ ఆర్ కెమెరా - Sport

లోమో సంస్థ లైకా కెమెరా స్ఫూర్తిగా VOOMP I ను తయారు చేసింది. దీనిని అభివృద్ధి చేసి VOOMP II, పయనీర్ కెమెరాలు తయారు చేసింది. ఎస్ ఎల్ ఆర్ కెమెరా అయిన Sport ను తయారు చేసింది.

LOMO

1965లో పలు ఇతర సంస్థలను కలుపుకొంటూ GOMZ కాస్తా LOMO అయ్యింది.

టాయ్ కెమెరాల నిర్మాణం

లుబిటెల్

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన సంవత్సారానికే లోమో సోవియట్ యూనియన్ యొక్క మొట్టమొదటి టి ఏల్ ఆర్ కెమెరా, Komosmolets ను రూపొందించింది. వోయిగ్ట్ ల్యాండర్ బ్రిల్లియంట్ స్ఫూర్తిగా ఈ కెమెరా నిర్మాణం జరిగింది. ఒక సుదీర్ఘమైన యుద్ధం నుండి ఆర్థికంగా చిత్తు అయి అప్పుడప్పుడే కోలుకొంటూన్న దేశానికి ఇది గొప్ప విజయమే. దీనికి మరిన్ని మెరుగులు దిద్ది 1949లో లుబిటెల్ కెమెరా విడుదల చేయడం జరిగింది. లుబిటెల్ అనగా Amateur అని అర్థం. చవకగా లభ్యమయ్యే లుబిటెల్ ఔత్సాహిక ఫోటోగ్రఫర్ల ప్రియతమ కెమెరా అయ్యింది. ఎప్పటికప్పుడు లుబిటెల్ కు లోమో సంస్థ మెరుగులు దిద్దుకొంటూ వచ్చింది.

లోమో ఎల్ సి ఏ

లోమో 
ఫిలిం విప్లవాన్ని సృష్టించిన లోమో ఎల్ సీ ఏ కెమెరా

Cosina CX-2 స్ఫూర్తిగా రష్యాలో ఒక కెమెరా రూపొందించవలసిందిగా లోమో ఆజ్ఙాపించబడింది. 1981 లో లోమో కాంపాక్ట్ ఆటోమేట్ (LC-A) నిర్మాణం ప్రారంభం అయ్యింది. 1984 లో కెమెరా తయారీ ప్రారంభం అయ్యింది. సోవియట్ విచ్ఛిన్నం తర్వాత లోమో ఎల్ సి ఏ ఉత్పత్తిలో ఒడిదుడుకులు ఎదురయ్యాయి.

ఆస్ట్రియా కి చెందిన ఒక విద్యార్థి బృందం చెకోస్లోవకియా కు సెలవులకు వెళ్ళి ఒక పురాతన కెమెరా స్టోరులో ఉత్పత్తి ఆగిపోయిన లోమో ఎల్ సి-ఏ కెమెరాను కొనుగోలు చేసి దానితో ఛాయాచిత్రాలు తీసారు. లోమో ఎల్ సి-ఏ తో వీరు తీసిన ఛాయాచిత్రాలకు అంతర్జాతీయ స్థాయిలో మన్ననలు రావటం, తర్వాత అది లోమోగ్రఫీ అనే కళా విప్లవాన్ని తీసుకు రావటం, లోమోగ్రఫీ ఒక సంస్థగా ఏర్పడటం జరిగాయి.

1993లో సంస్థ LOMO PLC అయ్యింది.

ఇవి కూడా చూడండి

మూలాలు

Tags:

లోమో చరిత్రలోమో ఇవి కూడా చూడండిలోమో మూలాలులోమోen:LOMOరష్యాసెయింట్ పీటర్స్‌బర్గ్

🔥 Trending searches on Wiki తెలుగు:

సర్పంచిభారత జాతీయగీతంఉప రాష్ట్రపతిద్వంద్వ సమాసముకొండా సురేఖకవిత్రయంఇస్లాం మత సెలవులుపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిఅనుష్క శర్మయువరాజ్ సింగ్జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్సిద్ధు జొన్నలగడ్డస్త్రీతెలుగు సంవత్సరాలుకడియం కావ్యకుమ్ర ఈశ్వరీబాయిరేణూ దేశాయ్జాతీయ విద్యా విధానం 2020పరిటాల రవిఉష్ణోగ్రతభారత రాజ్యాంగ పీఠికమా తెలుగు తల్లికి మల్లె పూదండసెక్యులరిజంషష్టిపూర్తిఅందెశ్రీ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఓటుఉగాదిరమ్యకృష్ణచంపకమాలఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుసుమంగళి (1965 సినిమా)పెళ్ళిఫేస్‌బుక్బాలకాండరష్మి గౌతమ్స్వామి వివేకానందమత్తేభ విక్రీడితముఎల్లమ్మమేషరాశికరోనా వైరస్ 2019ఇందిరా గాంధీసుందర కాండఘట్టమనేని కృష్ణబోనాలుఝాన్సీ లక్ష్మీబాయిద్విగు సమాసముపిఠాపురం శాసనసభ నియోజకవర్గంవంగవీటి రంగాభారత జాతీయ మానవ హక్కుల కమిషన్దినేష్ కార్తీక్నాగ్ అశ్విన్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుడి. కె. అరుణనందమూరి తారక రామారావు2019 భారత సార్వత్రిక ఎన్నికలువై.యస్.అవినాష్‌రెడ్డిరెడ్డివినోద్ కాంబ్లీఎస్. ఎస్. రాజమౌళిశుక్రుడుఏప్రిల్ 26మానవ శరీరముప్రకృతి - వికృతిశ్రీ అనంతపద్మనాభస్వామి దేవాలయం (కేరళ)ప్రధాన సంఖ్యనరసింహావతారంగూగుల్చతుర్వేదాలుభారత జాతీయపతాకంతెలంగాణ ఉద్యమంభారత జీవిత బీమా సంస్థవిడాకులుగొట్టిపాటి రవి కుమార్అయోధ్యవేమిరెడ్డి ప్రభాకరరెడ్డి🡆 More