మల్లు భట్టివిక్రమార్క

మల్లు భట్టివిక్రమార్క తెలంగాణ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన మధిర నియోజకవర్గం నుండి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2023 డిసెంబరు 7 నుండి రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా,  ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహిస్తున్నాడు.

మల్లు భట్టివిక్రమార్క
మల్లు భట్టివిక్రమార్క

తెలంగాణ రాష్ట్ర శాసన సభ ప్రతిపక్ష నాయకుడు


తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి & ఆర్ధిక, విద్యుత్ శాఖ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
2023 డిసెంబర్ 7 నుండి ప్రస్తుతం
ముందు కడియం శ్రీహరి

పదవీ కాలం
18 జనవరి 2019 – 6 జూన్ 2019
ముందు కె. జానారెడ్డి, భారత జాతీయ కాంగ్రెస్

ప్రస్తుత పదవిలో
అధికార కాలం
2014 - ప్రస్తుతం
ముందు కట్టా వెంకట నర్సయ్య
నియోజకవర్గం మధిర

డిప్యూటి స్పీకర్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2011 – 2014
తరువాత మండలి బుద్ధ ప్రసాద్, తెలుగుదేశం పార్టీ

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సభ్యుడు
పదవీ కాలం
2009 – 2014
నియోజకవర్గం మధిర

వ్యక్తిగత వివరాలు

జననం (1961-06-15) 1961 జూన్ 15 (వయసు 62)
స్నానాల లక్ష్మీపురం, వైరా మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెస్
తల్లిదండ్రులు అఖిలాండ, మాణిక్యమ్మ
జీవిత భాగస్వామి నందిని
బంధువులు మల్లు అనంత రాములు, మల్లు రవి (సోదరులు)
సంతానం సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య

జననం, విద్యాభ్యాసం

మల్లు భట్టివిక్రమార్క 1961, జూన్ 15న మల్లు అఖిలాండ, మాణిక్యమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లా, వైరా మండలం, స్నానాల లక్ష్మీపురం గ్రామంలో జన్మించాడు. ఈయన అన్న మల్లు అనంత రాములు నాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గం మాజీ పార్లమెంటు సభ్యుడు కాగా, మరో అన్న మల్లు రవి మాజీ పార్లమెంటు సభ్యుడు. విక్రమార్క హైదరాబాదులోని కళాశాల నుండి గ్రాడ్యుయేషన్, హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.

వ్యక్తిగత జీవితం

విక్రమార్కకు నందీనితో వివాహం జరిగింది. వారికి ఇద్దరు కుమారులు (సూర్య విక్రమాదిత్య, సహేంద్ర విక్రమాదిత్య) ఉన్నారు.

రాజకీయ విశేషాలు

భట్టి విక్రమార్క భారత జాతీయ కాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించి 2007 నుండి 2009 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడిగా పనిచేశాడు. ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2009లో మధిర నియోజకవర్గం నుండి తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికై చీఫ్ విప్‌గా పనిచేశాడు. భట్టి విక్రమార్క 2011 జూన్ 04 నుండి 2014 మే 20 వరకు ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశాడు. 2014లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కాంగ్రెస్ పార్టీనుండి పోటీచేసి సమీప సి. పి. యం పార్టీ అభ్యర్థి లింగాల కమల్​ రాజు పై 12,329 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. 2018లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేసి సమీప తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ అభ్యర్థి లింగాల కమల్ రాజు పై 3567 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. బోడేపూడి వెంకటేశ్వరరావు తర్వాత మధిర నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన రెండో వ్యక్తిగా విక్రమార్క నిలిచాడు. 2019 జనవరి 18న తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష (సీఎల్పీ) నేతగా నియామకమయ్యాడు.

భట్టి విక్రమార్క 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో మధిర నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, డిసెంబరు 7న రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రిగా,  ఆర్థిక శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశాడు. ఆయనను 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో డిసెంబరు 18న సికింద్రాబాద్, హైదరాబాద్ లోక్‌సభ నియోజకవర్గల ఇన్‌చార్జ్‌గా నియమించారు.

పదవులు

  • డైరెక్టర్, ఆంధ్రాబ్యాంక్
  • పిసిసి కార్యనిర్వాహక సభ్యుడు (1990–92)
  • పిసిసి కార్యదర్శి (2000–2003)
  • శాసనమండలి సభ్యుడు (2007 -2009)
  • ప్రభుత్వ చీఫ్ విప్, ఆంధ్రప్రదేశ్ శాసనసభ (2009 - 03.06.2011)
  • డిప్యూటీ స్పీకర్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ (04.06.2011 - 20.05.2014)
  • తెలంగాణ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు (2019 జనవరి 20 - 2023)

పాదయాత్ర

మల్లు భట్టి విక్రమార్క 2023 మార్చి 16న ఆదిలాబాద్​ జిల్లాలోని బోథ్ నుంచి ‘పీపుల్స్​ మార్చ్’​ పాదయాత్ర ప్రారంభించి రాష్ట్రంలోని 17 జిల్లాలు, 36 అసెంబ్లీ నియోజకవర్గాల మీదుగా 1,360 కిలో మీటర్లు పూర్తి చేసి పాదయాత్రకు గుర్తుగా ఖమ్మం రూరల్​ మండలంలోని తల్లంపాడు దగ్గర పైలాన్ ను ఆవిష్కరించి ముగింపు సందర్భంగా ఖమ్మంలో 2023 జూలై 2న రాహుల్‌ గాంధీ ముఖ్యఅతిధిగా జన గర్జన సభను నిర్వహించాడు.

మూలాలు

Tags:

మల్లు భట్టివిక్రమార్క జననం, విద్యాభ్యాసంమల్లు భట్టివిక్రమార్క వ్యక్తిగత జీవితంమల్లు భట్టివిక్రమార్క రాజకీయ విశేషాలుమల్లు భట్టివిక్రమార్క పదవులుమల్లు భట్టివిక్రమార్క పాదయాత్రమల్లు భట్టివిక్రమార్క మూలాలుమల్లు భట్టివిక్రమార్కతెలంగాణ రాష్ట్రంమధిర శాసనసభ నియోజకవర్గంరాజకీయ నాయకుడురేవంత్ రెడ్డి మంత్రివర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

నల్ల జీడిహనీ రోజ్చిరుధాన్యంవిల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్హీమోగ్లోబిన్మొదటి భారత స్వాతంత్ర్య యుద్ధంరాజశేఖర చరిత్రముభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుధర్మపురి అరవింద్అగ్నికులక్షత్రియులుకందుకూరి వీరేశలింగం పంతులుఛత్రపతి (సినిమా)భారత జాతీయగీతంమలబద్దకంఅబ్యూజాక్షయవ్యాధి చికిత్సముదిరాజు క్షత్రియులుగురువు (జ్యోతిషం)గోదావరిఅల్లసాని పెద్దనపుట్టపర్తి నారాయణాచార్యులుమొదటి పేజీజ్యేష్ట నక్షత్రంహస్తప్రయోగంకాలుష్యంప్లీహముకర్ణాటక యుద్ధాలుగ్రీన్‌హౌస్ ప్రభావంసింగిరెడ్డి నారాయణరెడ్డిఅండాశయముఅటార్నీ జనరల్తెలంగాణా బీసీ కులాల జాబితాభారత ప్రభుత్వ చట్టం - 1935వాలిశక్తిపీఠాలుఅర్జున్ దాస్నువ్వొస్తానంటే నేనొద్దంటానాతెలంగాణ జిల్లాలుభారతదేశ ప్రధానమంత్రిచాట్‌జిపిటిముస్లిం లీగ్శుక్రుడువిశ్వబ్రాహ్మణనాయిబ్రాహ్మణులు(ఇంటి పేర్లు,గోత్ర నామములు)కరణం బలరామకృష్ణ మూర్తిధర్మపురి శ్రీనివాస్రాజ్యాంగంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంబలగంభారతదేశ పంచవర్ష ప్రణాళికలుమానవ హక్కులుఎంసెట్బైబిల్తెలంగాణ శాసనసభ నియోజకవర్గాలు జాబితాఆనందవర్ధనుడుఇస్లామీయ ఐదు కలిమాలుసౌర కుటుంబంవాతావరణంమామిడినడుము నొప్పిరావి చెట్టుజగ్జీవన్ రాంసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుయూట్యూబ్కాళేశ్వరం ఎత్తిపోతల పథకంఉత్తర ఫల్గుణి నక్షత్రముజన్యుశాస్త్రంన్యుమోనియారైతుఆశ్లేష నక్షత్రమునరసింహావతారంకుక్కబ్రాహ్మణులుబలి చక్రవర్తితెలుగు కవులు - బిరుదులుసి.హెచ్. మల్లారెడ్డి🡆 More