బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్

బొమ్మగాని ధర్మబిక్షం ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, తెలంగాణ సాయుధ పోరాట యోధులు.

ఈయన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా తరపున నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం ఎమ్.పి.గా 10, 11వ లోక్ సభ సభ్యులుగా పనిచేశారు. ఈయన నల్లగొండ జిల్లాలోని మునుగోడు మండలం, ఊకొండి గ్రామంలో బొమ్మగాని ముత్తి లింగయ్య గౌడ్, పద్మ దంపతులకు 1922 ఫిబ్రవరి 15లో జన్మించారు. బొమ్మగాని ధర్మబిక్షం తండ్రి చిన్నవయస్సులో మునుగోడు మండలం ఊకొండి నుండి సూర్యాపేటకు వచ్చి స్థిరపడ్డారు.

బొమ్మగాని ధర్మబిక్షం గౌడ్
బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్

మాజీ ఎంపీ, నల్గొండ


నియోజకవర్గం నల్గొండ

వ్యక్తిగత వివరాలు

జననం (1922-02-15) 1922 ఫిబ్రవరి 15 (వయసు 102)/1922, ఫిబ్రవరి, 15
మునుగోడు మండలం ఊకొండి గ్రామం నల్లగొండ జిల్లా, ఆంధ్రప్రదేశ్
మరణం మార్చి 26, 2011
రాజకీయ పార్టీ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా
జీవిత భాగస్వామి అవివాహితుడు
సంతానం బొమ్మగాని ప్రభాకర్(దత్తత)
మతం హిందూ మతం

విద్యార్థి జీవితం

ధర్మభిక్షం విద్యార్థి దశలోనే జాతీయ భావాలు అలవరుచుకున్నారు. నిజాం పట్టాభిషేక రజతోత్సవాల సందర్భంగా పాఠశాలలో ఉత్సవాలు జరపాలన్న ప్రధానోపాధ్యాయుడి ఆదేశాలను వ్యతిరేకించి తోటి విద్యార్థులతో కలిసి బహిష్కరించారు. సామాజిక రుగ్మతలపై పోరాడటం కోసం తన సహ విద్యార్థులకు శిక్షణనివ్వటానికి విరాళాలు సేకరించి ఒక వసతిగృహం ఏర్పాటు చేశారు. కమ్యూనిస్టుపార్టీ పట్ల ఆకర్షితులైన ధర్మభిక్షం 1942లో సీపీఐలో చేరారు. పార్టీలో పనిచేస్తూనే పాత్రికేయునిగా తెలంగాణలోని నాటి ప్రముఖ పత్రికలైన మీజాన్‌, రయ్యత్‌, గోల్కొండల్లో పనిచేశారు. నిజాంపై సాయుధపోరాటం మొదలైన తర్వాత తుపాకి చేతబట్టి యుద్ధరంగంలోకి దిగారు. సాయుధపోరాటాన్ని విస్తరింపజేశారు. ఈ క్రమంలో అరెస్త్టే ఐదేళ్లకుపైగా జైలుశిక్షను అనుభవించారు.

చదువు

  • మెట్రిక్యులేషన్, ప్రభుత్వ ఉన్నత పాఠశాల, సూర్యాపేట.
  • అలిగ్రా యూనివర్సటీ కోర్స్, సూర్యాపేట.

వివాహం

  • అవివాహితుడు
  • సోదరుని కుమారున్ని దత్తత తీసుకున్నారు.

వృత్తి

సామాజిక కార్యకర్త, కార్మికులు, వ్యాపార సంఘం సభ్యులు, పాత్రికేయులు.

రాజకీయ జీవితం

స్వాతంత్య్రం అనంతరం 1952లో తొలిసారిగా హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు సూర్యాపేట నియోజకవర్గం నుండి అత్యధిక మెజార్టీతో ఎమ్మెల్యేగా గెలుపొందారు. తరువాత ఆంధ్రప్రదేశ్ శాసనసభకు 1957లో నకిరేకల్ నుండి, 1962లో నల్గొండ నుండి ప్రాతినిధ్యం వహించారు. 1991లో, 1996లోనూ ఆయన ఎంపీగా నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుండి విజయం సాధించి పార్లమెంట్‌లో అడుగుపెట్టారు. 1996 లో 11వ లోక్‌సభ ఎన్నికలలో నల్లగొండనుండి 480 మంది ఫ్లోరైడ్ బాధితులు పోటీ చేసినప్పటికి ఆయన 76 వేల ఓట్ల మెజారిటీతో గెలిచాడు. గీత పనివారల సంఘం ఏర్పాటు చేసి గౌడ కులస్తుల హక్కుల కోసం ఆయన చివరివరకు పోరాడారు. పలు కార్మిక సంఘాల స్థాపనలో ధర్మబిక్షం ప్రధాన పాత్ర వహించి ‘కార్మిక పక్షపాతి’గా గుర్తింపు తెచ్చుకున్నారు.

పదవులు

  • 1951-73లో కార్యదర్శి, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) జిల్లా మండలి, నల్గొండ.
  • 1952-57లో శాసనసభ్యులు, హైదరబాద్ శాసనసభ (
  • 1957-62, 1962-67 శాసన సభ్యులు, ఆంధ్రప్రదేశ్ శాసనసభ.
  • 1972 నుంచి కార్యవర్గ సభ్యులు, సిపిఐ, ఆంధ్రప్రదేశ్.
  • 1991లో 10వ లోక్ సభ స్థానానికి ఎన్నిక.
  • 1991-96 సభ్యులు, సంప్రదింపుల కమిటీ, గ్రామీణాభివృద్ధి శాఖ.
  • 1992-95 కార్యదర్శివర్గ సభ్యులు, రాష్ట్ర సమితి, సిపిఐ, ఆంధ్రప్రదేశ్
  • 1996 లో 11వ లోక్ సభ స్థానానికి రెండవసారి ఎన్నిక
  • సభ్యులు, భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ), జాతీయ మండలి.

సాంఘీక, సాంస్కృతిక కార్యక్రమాలు

  • భారత ప్రభుత్వం నుంచి తామ్రపత్ర పురస్కారం అందుకున్నారు.
  • గ్రామీణ పేదలు హక్కుల కోసం పోరాటం,, ఈత, యువత, విద్యార్థులు అసంఘటిత కార్మికుల సంఘటితం, పేదలకోసం భూమి, ఇళ్ళు కొనుగోలు.

విదేశి పర్యటనలు

  • U.S.S.R.

ఇతర వివరాలు

స్వాతంత్ర్య సమరయోధులు, నల్గొండలో కార్మిక సంఘాలు వ్యవస్థాపకులు, అధ్యక్షుడు, అఖిల భారతదేశ గీత కార్మిక కర్జాజ్మరియు పనివారల ఫెడరేషన; ఆర్య సమాజ్ ఆర్గనైజర్, ఆంధ్ర మహాసభ కార్యకర్త.

కాలక్షేపం పఠనం, పర్యటన, సాంఘికీకరణ

క్రీడలు హాకీ, యోగ

ఎన్నికల ఫలితాలు

నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం

  • మెత్తం ఓట్లు 14,27,026
  • పోలైన ఓట్లు 8,51,118

ఒక్కొక్కరికి వచ్చిన ఓట్లు

  1. శ్రీ బొమ్మగాని ధర్మబిక్షం కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా 2,77,336
  2. శ్రీ నల్లు ఇంద్రసేనారెడ్డి భారతీయ జనతా పార్టీ 2,05,579
  3. శ్రీ గంగాధర్ తిరునగరూ భారత జాతీయ కాంగ్రెస్ 1,99,282
  4. శ్రీ వెంరెడ్డి నరేందర్ రెడ్డి ఎన్.టి.ఆర్. (టి.డి.పి) 22,994

మరణం

89 ఏళ్ళ వయసులో ఇంట్లో జారి పడటంతో ఆయన తుంటి ఎముకకు దెబ్బతగిలింది. హైదరాబాద్‌లోని కామినేని ఆసుపత్రిలో ఫిబ్రవరి 11న శస్త్రచికిత్స జరిపారు. తర్వాత తేరుకున్నప్పటికీ వూపిరితిత్తుల సమస్య జఠిలం కావటంతో చికిత్స పొందుతూ 2011, మార్చి 26న మరణించాడు.

విగ్రహావిష్కరణ

యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌ నారాయణపూర్‌ గ్రామంలో 2019 నవంబరు 8 రోజున బొమ్మగాని ధర్మభిక్షం విగ్రహాన్ని ఎక్సైజ్‌శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌ గౌడ్‌ ఆవిష్కరించాడు.

వనరులు

Tags:

బొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విద్యార్థి జీవితంబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ చదువుబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ వివాహంబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ వృత్తిబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ రాజకీయ జీవితంబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ పదవులుబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ సాంఘీక, సాంస్కృతిక కార్యక్రమాలుబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విదేశి పర్యటనలుబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ ఇతర వివరాలుబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ ఎన్నికల ఫలితాలుబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ మరణంబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ విగ్రహావిష్కరణబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్ వనరులుబొమ్మగాని ధర్మభిక్షం గౌడ్కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియానల్గొండ జిల్లానల్గొండ లోక్‌సభ నియోజకవర్గంమునుగోడు మండలంవూకొండి

🔥 Trending searches on Wiki తెలుగు:

శార్దూల విక్రీడితముత్రిష కృష్ణన్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుగోదావరిసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుగుంటకలగరఉత్తరాషాఢ నక్షత్రము2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)కాశీపెళ్ళి చూపులు (2016 సినిమా)శ్రీశైల క్షేత్రంకన్నుహను మాన్జీలకర్రజవహర్ నవోదయ విద్యాలయంనువ్వుల నూనెస్వామియే శరణం అయ్యప్పతెలుగు నాటకరంగంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్రిషబ్ పంత్నాగార్జునసాగర్రుతురాజ్ గైక్వాడ్జాతీయ అర్హత, ప్రవేశ పరీక్షశ్రీ కృష్ణుడుతెలంగాణ చరిత్రనువ్వు లేక నేను లేనుభారతదేశంలో కోడి పందాలుభారతదేశ ప్రధానమంత్రిరామ్ పోతినేనిఇక్ష్వాకులుసన్ రైజర్స్ హైదరాబాద్కస్తూరి రంగ రంగా (పాట)నందమూరి తారక రామారావుఉప్పు సత్యాగ్రహంతాటి ముంజలువసంత ఋతువుగుణింతంఇంటర్మీడియట్ విద్యమీనరాశిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిద్రౌపది ముర్ముఛందస్సుకృపాచార్యుడుతెలంగాణ రాష్ట్ర సమితిసిద్ధు జొన్నలగడ్డవిష్ణువు వేయి నామములు- 1-1000తెలంగాణ జిల్లాల జాబితాఇందిరా గాంధీశివ కార్తీకేయన్గుంటూరు కారంరామసహాయం సురేందర్ రెడ్డిపెళ్ళి (సినిమా)విరాట్ కోహ్లిరవితేజసన్నిపాత జ్వరంకొణతాల రామకృష్ణభారతదేశ జిల్లాల జాబితాఉపనిషత్తుగీతాంజలి (1989 సినిమా)అశ్వని నక్షత్రముఫ్లిప్‌కార్ట్ఆల్ఫోన్సో మామిడివిశ్వనాథ సత్యనారాయణ రచనల జాబితాఅనాసఏడు చేపల కథభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుతెలుగు సినిమాలు 2024జోకర్20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిపంచకర్ల రమేష్ బాబుసుడిగాలి సుధీర్గుజరాత్ టైటాన్స్కామసూత్రదానం నాగేందర్ఆంధ్ర విశ్వవిద్యాలయంపర్యాయపదంకేరళటీవీ9 - తెలుగు🡆 More