నేనే మొనగాణ్ణి

నేనే మొనగాణ్ణి 1968, అక్టోబర్ 4న విడుదలైన తెలుగు సినిమా.

ఎస్.డి.లాల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఎన్.టి. రామారావు, షీలా, రాజనాల కాళేశ్వరరావు, ధూళిపాళ, కైకాల సత్యనారాయణ, శాంతకుమారి, జ్యోతిలక్ష్మి తదితరులు నటించారు.

నేనే మొనగాణ్ణి
(1968 తెలుగు సినిమా)
నేనే మొనగాణ్ణి
దర్శకత్వం ఎస్.డి.లాల్
తారాగణం నందమూరి తారక రామారావు,
షీలా
సంగీతం టి.వి.రాజు
నిర్మాణ సంస్థ ప్రతిమ ఫిల్మ్స్
భాష తెలుగు

సంక్షిప్త చిత్రకథ

బందిపోటు భద్రయ్య (రాజనాల) కొడుకు నానీ. భద్రయ్య దోపిడీలు చేస్తూ జీవిస్తాడు. పోలీస్ అధికారి నందనరావు (కైకాల సత్యనారాయణ) భద్రయ్యను బంధించడానికి ప్రయత్నిస్తుంటాడు. ఈతని భార్య యశోద (శాంతకుమారి). ఒకసారి భద్రయ్యను పట్టించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు నందనరావును చంపేస్తాడు. అతను తప్పించుకోడానికి ప్రయత్నిస్తుండగా ధూళిపాల అతడిని కాలుస్తాడు. ప్రాణ భయంతో పారిపోతూ పిల్లవాడిని వదిలేస్తాడు. నానీ పోలీసులకు చిక్కుతాడు. నందనరావు భార్య యశోద (శాంతకుమారి), నానీని ఇంటికి తీసుకొచ్చి పెంచి పెద్దచేస్తుంది. వంశీధర్ (ఎన్టీ రామారావు)గా పెరిగి పెద్దవాడయిన నానీ.. యశోద, నందనరావులనే తల్లిదండ్రులుగా భావిస్తుంటాడు. ఉత్తమ వ్యక్తిగా మన్ననలు పొందుతూ, మేనమామ (యశోద తమ్ముడు) ముత్యాలరావు కుమార్తె నీల (షీల) ప్రేమలో పడతాడు. ఈ ప్రేమను ఇష్టపడని ముత్యాలరావు, వంశీధర్‌ను దొంగ కొడుకుగానే పరిగణిస్తుంటాడు. వంశీధర్ నందనరావు కొడుకేనని, తన కొడుకు నానీ పోలీసు కాల్పుల్లో మరణించాడన్న భ్రమతో, వంశీధర్‌ను అంతం చేసేందుకు బందిపోటు భద్రయ్య ప్రయత్నాలు చేస్తుంటాడు. మరోవైపువిదేశీ శక్తులతో చేతులు కలిపి దేశంలో అనేక మారణకాండలు జరిపిస్తుంటాడు. వంశీధర్ వీటినన్నిటినీ చాకచక్యంగా ఎదుర్కొంటుంటాడు. వేలమంది జనానికి ప్రాణాధారమైన ప్రాజెక్టును ధ్వంసం చేయబోయిన దుండగులను అడ్డుకుని, భద్రయ్య ప్రయత్నాలను భంగం చేస్తాడు. ఆ కాల్పుల్లో భద్రయ్య మరణిస్తూ వంశీధరే తన కుమారుడని నిజం గ్రహించడం, వంశీధర్‌లోని నిజాయితీ, మంచితనం గుర్తించిన ముత్యాలరావు నీలతో పెళ్లి నిశ్చయించటం, వంశీధర్‌కు పోలీస్ ఆఫీసర్‌గా పోస్టింగ్ రావటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.

సాంకేతిక వర్గం

  • కథ: షణ్ముగం
  • కెమెరా: బాబు
  • నృత్యం: చిన్ని, సంపత్
  • కళ: తోట
  • కూర్పు: గోవిందస్వామి
  • పోరాటాలు: సాంబశివరావు
  • సంగీతం: టి.వి.రాజు
  • ఫొటోగ్రఫీ: కెఎస్ ప్రసాద్
  • నిర్మాత: కెఎస్ ప్రసాద్.
  • దర్శకత్వం: ఎస్.డి.లాల్

నటీనటులు

పాటలు

  1. గారడి చేసేస్తా నేనే గమ్మత్తు చేసేస్తా నవ్వని - ఘంటసాల, కె. ఎల్. రాఘవులు బృందం - రచన: దాశరథి
  2. చూస్కో నా రాజా చూస్కో ... వయసుంది సొగసుంది - ఎల్. ఆర్. ఈశ్వరి
  3. నిన్ను చూసింది మొదలు కలలే కలలే నిన్ను వలచింది - పి.సుశీల ( ఎన్.టి.రామారావు మాటలతో)
  4. వయసు పిలిచింది ఎందుకో నాలో వలపు విరిసింది అందుకో డార్లింగ్ - ఘంటసాల - రచన: డా. సి.నారాయణ రెడ్డి
  5. షోకిల్లా పిల్లా నిన్నే నిన్నే మెచ్చుకుంటుంది బాకల్లె - ఎల్. ఆర్. ఈశ్వరి, పి.సుశీల, ఘంటసాల

మూలాలు

బయటిలింకులు

Tags:

నేనే మొనగాణ్ణి సంక్షిప్త చిత్రకథనేనే మొనగాణ్ణి సాంకేతిక వర్గంనేనే మొనగాణ్ణి నటీనటులునేనే మొనగాణ్ణి పాటలునేనే మొనగాణ్ణి మూలాలునేనే మొనగాణ్ణి బయటిలింకులునేనే మొనగాణ్ణిఎన్.టి. రామారావుఎస్.డి.లాల్కైకాల సత్యనారాయణజ్యోతిలక్ష్మి (నటి)తెలుగు సినిమాధూళిపాళరాజనాల కాళేశ్వరరావుశాంతకుమారి

🔥 Trending searches on Wiki తెలుగు:

గుణింతంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థజంగం కథలుమకరరాశిఅమ్మమహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంసామెతలుసౌర కుటుంబంభారత జాతీయగీతంవిశ్వబ్రాహ్మణన్యుమోనియానరేంద్ర మోదీజ్యోతీరావ్ ఫులేభారత ఎన్నికల కమిషనుఇండోనేషియాశ్రీరంగనాయక స్వామి దేవాలయం (శ్రీరంగాపూర్)మహాభాగవతంసెల్యులార్ జైల్లగ్నంఅనూరాధ నక్షత్రంమొదటి ప్రపంచ యుద్ధంసాయిపల్లవిశ్రీ కృష్ణుడువేయి స్తంభాల గుడిసానియా మీర్జాఅన్నప్రాశనపెళ్ళికాకతీయులుపెరూడిస్నీ+ హాట్‌స్టార్అధిక ఉమ్మనీరుఆరుద్ర నక్షత్రమురామ్ చ​రణ్ తేజముఖేష్ అంబానీశ్రీలీల (నటి)రజినీకాంత్సుమేరు నాగరికతఅండాశయముసమాచార హక్కుటబువిడాకులురుక్మిణీ కళ్యాణంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాప్రియురాలు పిలిచిందిడి.వై. చంద్రచూడ్మశూచిట్రూ లవర్లావణ్య త్రిపాఠిహైదరాబాదులక్ష్మియేసు శిష్యులుఅష్ట దిక్కులుసూర్యకుమార్ యాదవ్హనుమాన్ చాలీసాపసుపు గణపతి పూజబతుకమ్మతొట్టెంపూడి గోపీచంద్గురువు (జ్యోతిషం)ఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితావిద్యారావుశ్రీకాంత్ (నటుడు)రావుల శ్రీధర్ రెడ్డిపిచ్చుకుంటులవారుభాషా భాగాలుగూగుల్శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానం (పెనుగంచిప్రోలు)మంతెన సత్యనారాయణ రాజుఅయ్యప్పనువ్వు లేక నేను లేనుమ్యాడ్ (2023 తెలుగు సినిమా)ఉత్తరాషాఢ నక్షత్రముబ్రాహ్మణ గోత్రాల జాబితాయునైటెడ్ కింగ్‌డమ్భారతదేశ అత్యున్నత న్యాయస్థానంసుందర కాండపన్ను (ఆర్థిక వ్యవస్థ)తెలుగు సాహిత్యంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిగోకర్ణ🡆 More