కామోమైల్ నూనె

కామోమైల్ నూనె ఒక ఆవశ్యక నూనె.ఔషదగుణాలు దండిగా వున్న నూనె.కామోమైల్ మొక్కలో పలు రకాలు ఉన్నాయి.

కామోమైల్ నూనెను ప్రధానంగా రెండు రకాల మొక్కల నుండి తీస్తారు. కామోమైల్ మొక్కలు ఆస్టరేసి కుటుంబానికి చెందినవి. ఒక్కప్పుడు ఈ మొక్కలను కంపోసిటే కుటుంబంలో వుంచారు. రోమన్ కామోమైల్ ఆవశ్యక నూనెను అంతేమిస్ నోబిలిస్ (కామేమి లన్ నోబిల్) మొక్క నుండి ఉత్పత్తి చేస్తారు. ఈ మొక్కను ఇంగ్లీసు కామోమైల్, స్వీట్ కామోమైల్, గార్డన్ కామోమైల్ అనికూడా అంటారు.అలాగే జర్మన్ కామోమైల్ ఆవశ్యక నూనెను మార్టికరియా కామోమిల్ల (మార్టికరియా రేకుటిక) మొక్క నుండి ఉత్పత్తి చేస్తారు. మొక్కలలను తెలుగులో రెక్క చామంతి అంటారు.

కామోమైల్ నూనె
German chamomile
కామోమైల్ నూనె
Roman chamomile

కామోమైల్ మొక్క

జర్మనీ కామోమైల్ ను ఎక్కువగా హంగేరి, ఈజిప్టు, ఈస్టరన్ ఐరోపా, ఫ్రాన్స్ లలో సాగు చేస్తారు. రోమన్ కామోమైల్ ను జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, మొరాకో లలో ఎక్కువగా సాగు చేస్తారు. రోమన్ కామోమైల్ మొక్క బహువార్షిక ఓషద మొక్క . కాండం వెంట్రుకల వంటి నిర్మాణాలు కల్గి ఆకులు చీలి వుండును. ఆకులు నునుపుగా లేలికగా వుండును. మొక్క 25 సెం.మీ ఎత్తు పెరుగును.పూల రెమ్మలు తెల్లగా వుండును. జర్మన్ కామోమైల్ మొక్క 60 సెం.మీ ఎత్తు పెరుగును. వెంట్రుకల వంటి నిర్మాణాలులేని కాండం, కొమ్మలు కల్గి వుండును.ఆకులు ఈఁకలతో కప్పఁబడిన తేలికగా వుండును.పూలు తెల్లగా ఏక కాండం మీద వుండును. జర్మనీ కామోమైల్ అజులెన్ అను యాంటీ ఇన్ఫ్లమేటరీ కారకాన్ని కల్గి ఉంది.నీలి రంగు ఈ స్పటికం మొక్కలో కాక నూనెలో ఉంది. కామోమైల్ ను సంస్కృతంలో కర్పూరపుష్ప అంటారు.హిందీలో బాబున (babuna) లేదా బాబూన (baboon) అంటారు.జర్మన్ కామోమైల్ నూనెను ఆయుర్వేదంలో చాలాఏళ్ళుగా వాడబడుచు ఉంది.

నూనె సంగ్రహణ

కామోమైన్ నూనెను మొక్క యొక్క పూల నుండి నీటిఆవిరి స్వేదనక్రియ/స్టీము డిస్టీలేసను పద్ధతిలో సంగ్రహిస్తారు.తాజా పులనుండి నూనెను సంగ్రహిస్తారు. రోమన్ కామోమైల్ పూలలో 1.7% వరకు, జర్మనీ కామోమైన్ పూలలో 0.2-0.4% వరకు నూనె లభించును.

నూనె

రోమన్ కామోమైల్ నూనె తియ్యని, ఆపిల్ వంటి సువాసన కలిగిన నూనె. లేత నీలి రంగులో వుండును.అలాగే నీళ్ళ వంటి స్నిగ్ధత కల్గి వుండును.జర్మన్ కామోమైల్ నూనె తియ్యని, స్ట్రా వంటి వాసన కల్గి ముదురు నీలి రంగులో వుండును. జిగట /స్నిగ్ధత మధ్యస్థంగా వుండును.

నూనెలోని రసాయన పదార్థాలు

రోమన్ కామోమైల్ నూనెలో ఆల్ఫా –పైనేన్, కాంపెన్, బీటా పైనేన్, సబినేన్, మైర్సేన్, 1,8-సినీయోల్, y-టేర్పినేన్, ప్రోపైల్ అంజిలేట్ కారియో పైల్లెన్, బుటైల్ అంజిలేట్ ప్రధానంగా ఉన్నాయి. ఇక జర్మనీ కామోమైల్ నూనెలో ప్రధానంగా కామజులోన్, ఆల్ఫా-బిసబోలోల్, బిసబోలోల్ ఆక్సైడ్ బి, బిసబోలోల్ ఆక్సైడ్-A ఉన్నాయి. జర్మనీ కామోమైల్ నూనెలో 52 రకాల రసాయన సమ్మేళనాలు వున్నట్లు గుర్తించారు.అందులో బీటా- ఫార్నెసేన్ 29.8%, ఏ‌ఎల్‌ఎఫ్‌ఏ‌ఏ- బిసబొలోల్, దాని ఆక్సైడులు 15.7%, కమజులెన్ 6.4% జెర్మాక్రేన్ D 6.2%,, స్పిరో ఈథర్ 5.6% వరకు ఉన్నట్లు గుర్తించారు.

నూనెభౌతికగుణాలు

కామోమైల్ నూనె భౌతిక గూణాల పట్టిక

వరుస సంఖ్య భౌతిక గుణం విలువల మితి
1 రంగు గాఢ నీలి రంగు
2 విశిష్ట గురుత్వం 25C వద్ద 0.91300 to 0.95300
3 ఫ్లాష్ పాయింట్ 125F
4 ద్రావణీయత నీటిలో కరగదు.ఆల్కహాల్ లో కరుగును

నూనె ఒషద గుణాలు

రోమన్ కామోమైల్ నూనె అనాల్దిక్, యాంటీ-స్పాస్మోడిక్, యాంటీ సెప్టిక్, యాంటీ బయోటిక్, యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఇన్ఫెక్షియస్, యాంటీ డిప్రెసెంట్, యాంటీ- న్యూరాలజిక్, యాంటీ ఫ్లోజిస్టిక్, బాక్టరిసిడల్, కార్మినేటివ్, కొలోగోగు వంటీ ఔషదాగుణాలు కల్గి వున్నది

ఇవి కూడా చూదండి

మూలాలు

Tags:

కామోమైల్ నూనె కామోమైల్ మొక్కకామోమైల్ నూనె నూనె సంగ్రహణకామోమైల్ నూనె నూనెకామోమైల్ నూనె నూనె ఒషద గుణాలుకామోమైల్ నూనె ఇవి కూడా చూదండికామోమైల్ నూనె మూలాలుకామోమైల్ నూనెఆవశ్యక నూనెనూనెమొక్క

🔥 Trending searches on Wiki తెలుగు:

డిస్నీ+ హాట్‌స్టార్జాతీయ రహదారి 44 (భారతదేశం)నల్గొండ జిల్లారమ్యకృష్ణదక్షిణామూర్తిగైనకాలజీకాజల్ అగర్వాల్గోకర్ణదగ్గువావిలికుటుంబంరోహిణి నక్షత్రంవందే భారత్ ఎక్స్‌ప్రెస్సీవీ ఆనంద్కృష్ణా నదిడార్విన్ జీవపరిణామ సిద్ధాంతంమే దినోత్సవంజిల్లేడుయక్షగానంకన్యకా పరమేశ్వరిపునర్వసు నక్షత్రమువిశాఖ నక్షత్రముతిప్పతీగమునుగోడుదేశాల జాబితా – జనసంఖ్య క్రమంలోప్లీహముఅంగన్వాడిభారతరత్నభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలులోక్‌సభ స్పీకర్డింపుల్ హయాతిగాయత్రీ మంత్రంసాలార్ ‌జంగ్ మ్యూజియంచదరంగం (ఆట)పరశురాముడువాల్మీకిజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షభారత స్వాతంత్ర్య దినోత్సవంభారత జాతీయ ఎస్సీ కమిషన్యూకలిప్టస్మామిడిసింగిరెడ్డి నారాయణరెడ్డితెలంగాణ రైతుబీమా పథకంలలితా సహస్రనామ స్తోత్రంబద్రీనాథ్ దేవస్థానంరోజా సెల్వమణినరేంద్ర మోదీదాశరథి రంగాచార్యభారతదేశంలో అధికార హోదా ఉన్న భాషలుతెలుగునాట జానపద కళలుఆంజనేయ దండకంగోదావరినెట్‌ఫ్లిక్స్గరుత్మంతుడుఆంధ్రప్రదేశ్ గవర్నర్లుఉత్తరాషాఢ నక్షత్రముజ్ఞానపీఠ పురస్కారంఎకరంయేసుసీతాపతి చలో తిరుపతిగోత్రాలుతెలుగు సినిమాల జాబితాచరవాణి (సెల్ ఫోన్)బలిజపంచారామాలుభరణి నక్షత్రముతొట్టెంపూడి గోపీచంద్కోటప్ప కొండబ్రాహ్మణులుఆది పర్వముహార్దిక్ పాండ్యాఇంటి పేర్లుమహాభాగవతంమహాభారతంతెలుగు కవులు - బిరుదులుశాకుంతలంనరసింహ శతకముబోనాలు🡆 More