ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం

ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం భారత జాతీయ కాంగ్రెస్ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ పేరుమీద ప్రదానం చేస్తున్న ప్రతిష్ఠాత్మక పురస్కారం.

1985 నుండి ప్రతియేటా ఇందిరా గాంధీ వర్ధంతిరోజు అంటే అక్టోబర్ 31వ తేదీన ఈ పురస్కారాన్ని భారతీయ జాతి, మత, సాంస్కృతిక, భాషా, సాంప్రదాయ గుంపులతో సాంగత్యం కలిగి ఉండి, జాతి సమైక్యతను అర్థం చేసుకుని, వృద్ధి చేస్తూ, భారతీయాత్మ అయిన ఏకత్వాన్ని ఆలోచన ద్వారా, ఆచరణ ద్వారా కృషి చేసే వ్యక్తులకు, సంస్థలకు ప్రదానం చేస్తున్నారు. కళ, విజ్ఞాన, సాంస్కృతిక, విద్యా, సాహిత్య, మత, సామాజిక సేవ, జర్నలిజం రంగాలలోని నిష్ణాతులు సభ్యులుగా కల సలహాసంఘం ఈ పురస్కారానికి విజేతను ఎన్నుకుంటుంది. ఏ సంవత్సరం ఈ పురస్కారానికి ఎన్నుకుంటారో ఆ ఏడాదికి వెనుక రెండు సంవత్సరాల కాలంలో చేసిన కృషిని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పురస్కారం క్రింద 5 లక్షల రూపాయల నగదు బహుమతి, ప్రశంసాపత్రం ఇస్తారు.

ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం
వివరణజాతీయ సమైక్యతకోసం కృషికి
Locationన్యూ ఢిల్లీ
దేశంభారతదేశం Edit this on Wikidata
అందజేసినవారుభారత జాతీయ కాంగ్రెస్
మొదటి బహుమతి1985
ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం
అక్టోబరు 31, 2004న న్యూ ఢిల్లీలో ప్రముఖ చలనచిత్ర నిర్మాత శ్రీ శ్యామ్ బెనెగల్‌కు ప్రధాన మంత్రి డాక్టర్. మన్మోహన్ సింగ్ జాతీయ సమగ్రత కోసం ఇందిరా గాంధీ అవార్డును ప్రదానం చేశారు.

పురస్కార గ్రహీతలు

ఈ పురస్కారం పొందినవారిలో స్వామి రంగనాథానంద (1987), అరుణా అసఫ్ అలీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ (1987), పి.ఎన్.హస్కర్, ఎం.ఎస్. సుబ్బులక్ష్మి (1990), రాజీవ్ గాంధీ (మరణానంతరం), పరంధామ ఆశ్రమం (వార్ధా, మహారాష్ట్ర), ఆచార్య తులసి (1993), భీష్మాంబర్ నాథ్ పాండే (1996), బియాంత్ సింగ్ (పంజాబ్ ముఖ్యమంత్రి, మరణానంతరం) &నట్వర్ ఠక్కర్ (జంటగా), గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఎఫైర్స్ (కర్ణాటక), ఇందిరాగాంధీ సెంటర్ ఫర్ నేషనల్ ఇంటిగ్రేషన్ (శాంతినికేతన్), ఎ.పి.జె.అబ్దుల్ కలాం, శంకర్ దయాళ్ శర్మ (మరణానంతరం), సతీష్ ధావన్, హెచ్.వై.శారదా ప్రసాద్, రామ్‌ - రహీమ్‌ నగర్ స్లమ్‌ డ్వెల్లర్స్ అసోసియేషన్ (అహ్మదాబాద్), ఆమన్ పాఠక్ పీస్ వాలంటీర్ గ్రూప్ (అహ్మదాబాద్), రామ్‌సింహ్ సోలంకి & సునీల్ తమైచే (జంటగా), ఆచార్య మహాప్రజ్ఞ (2002), శ్యామ్ బెనగళ్ (2003), మహాశ్వేతాదేవి (2004), జావేద్ అఖ్తర్ (2005), డా.జె.ఎస్.బందూక్ వాలా & రామ్‌ పునియాని (జంటగా) (2006), బలరాజ్ పురి (2009), ఎ.ఆర్.రహమాన్& రామకృష్ణ మఠం (జంటగా) (2010), మోహన్ ధరియా (2011), గుల్జార్ (2012), యం.యస్.స్వామినాధన్ (2013), పి.వి.రాజగోపాల్ (2014), టి.ఎం.కృష్ణ (2015-2016), చండీప్రసాద్ భట్ (2017 -2018) మొదలైనవారున్నారు.

మూలాలు

Tags:

అక్టోబర్ 31ఇందిరా గాంధీభారత జాతీయ కాంగ్రెస్

🔥 Trending searches on Wiki తెలుగు:

గుంటూరురోహిత్ శర్మఉదగమండలంజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షగొట్టిపాటి రవి కుమార్గూగుల్కార్తెబస్వరాజు సారయ్యరెడ్డివిద్యలావు శ్రీకృష్ణ దేవరాయలుహస్త నక్షత్రముఆవేశం (1994 సినిమా)పూర్వ ఫల్గుణి నక్షత్రముగోదావరిమోదుగసర్పంచిఅమెరికా సంయుక్త రాష్ట్రాలుబెంగళూరుకన్యారాశిశ్రీదేవి (నటి)సూర్యుడుమౌర్య సామ్రాజ్యంపాల్కురికి సోమనాథుడుతెలుగు పదాలుఋగ్వేదంగుంటూరు జిల్లాశ్రేయా ధన్వంతరినామనక్షత్రముస్వాతి నక్షత్రముపాల కూరభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులువాల్మీకిఈసీ గంగిరెడ్డిజోల పాటలుక్లోమముసప్త చిరంజీవులుమానవ హక్కులునందమూరి బాలకృష్ణవిద్యా హక్కు చట్టం - 2009పిఠాపురం శాసనసభ నియోజకవర్గంరావణుడుశ్రీలీల (నటి)సమ్మక్క సారక్క జాతరమాచెర్ల శాసనసభ నియోజకవర్గంతెలుగు నెలలుప్రీతీ జింటాలలితా సహస్ర నామములు- 1-100బి.ఆర్. అంబేద్కర్ఏ.పి.జె. అబ్దుల్ కలామ్ఉలవలుమఖ నక్షత్రమునభా నటేష్నయన తారమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిభలే మంచి రోజుచెమటకాయలుచేవెళ్ళ లోక్‌సభ నియోజకవర్గంఅందెశ్రీతెలుగు అక్షరాలుగుంటూరు కారంతేటగీతిఅల్లు అరవింద్పసుపు గణపతి పూజఇండియన్ ప్రీమియర్ లీగ్నారా చంద్రబాబునాయుడుతెలంగాణభూమిపురాణాలుసాక్షి (దినపత్రిక)సుకన్య సమృద్ధి ఖాతాసోమనాథ్ఇంటి పేర్లుఅనుపమ పరమేశ్వరన్పరశురామ్ (దర్శకుడు)కింజరాపు ఎర్రన్నాయుడుగర్భాశయము🡆 More