నిమిషము: కాలావధి

నిమిషము అనేది ఒక కాలమానము.

ఒక గంటలో 60 వ భాగం నిముషం. ఇది 60 సెకండ్ల కాలానికి సమానము. ఇది SI ప్రమాణం కానప్పటికీ, దీనీ SI ప్రమాణంగా అంగీకరించారు. దీనికి SI ప్రమాణం min (ప్రమాణం ప్రక్కన డాట్ ఉంచరాదు). నిముషం కోణానికి కూడా ఒక కొలమానం. కోణాన్ని కొలిచేటపుడు ఒక నిముషం అంటే ఒక డిగ్రీలో 60 వ వంతు. ఇది 60 ఆర్కు సెకండ్లకు సమానం.

నిమిషము: కాలావధి
గంటలు నిమిషాలను లెక్కించే గడియారం

చరిత్ర

సా.శ. 1000లో యూదు నెలలను చర్చిస్తున్నప్పుడు మొట్టమొదటి సారి ఆల్-బెరూని గంటను అరవై భాగాలుగా విభజిస్తూ నిమిషం, సెకండ్లు, దర్డ్, ఫోర్త్‌లను ప్రవేశపెట్టాడు. 1235 ప్రాంతంలో జాన్ ఆఫ్ సాక్రోబోస్కో ఈ విధానాన్ని కొనసాగించాడు. కానీ సాక్రోబోస్కో అది కనుగొన్న మొదటి వ్యక్తి అని నాథాఫ్ట్ భావించాడు.

చారిత్రికంగా "minute" (మినిట్) అనే పదం లాటిన్ పదమైన pars minuta prima నుండి వ్యుత్పత్తి అయినది. దాని అర్థం "మొదటి చిన్న భాగం". గంటను విభజించడం తరువాత "సెకండ్ చిన్న భాగం" (లాటిన్:pars minuta secunda)గా జరిగింది. తరువాత "సెకండు" అనే పదం వచ్చింది. తరువాత సెకండును కూడా 60 భాగాలుగా విభజించి "దర్డ్" (సెకండులో 1⁄60 వంతు) పేరు పెట్టారు. అయినప్పటికీ వాడుకలో సెకండులోని భాగాలను దశాంశాలలో సూచించడం జరుగుతున్నది.

1267 లో, మధ్యయుగ శాస్త్రవేత్త రోజర్ బేకన్, లాటిన్లో వ్రాస్తూ, రెండు పౌర్ణమి ల మధ్య సమయాన్ని అనేక గంటలు, నిమిషాలు, సెకన్లు, థర్డ్‌లు, ఫోర్త్‌లు (హోరే, మినుటా, సెకండ, టెర్టియా, క్వార్టా) లను పేర్కొన్న క్యాలెండర్ తేదీలతో నిర్వచించారు.

1675 లో థామస్ టాంపియన్ అనే ఇంగ్లీష్ వాచ్ మేకర్ హెయిర్‌స్ప్రింగ్ కనిపెట్టిన తర్వాతే నిమిషం చేతి గడియారాలలో ప్రవేశపెట్టడం సాధ్యమైంది.

మూలాలు

గ్రంథవళి

Tags:

కాలమానము

🔥 Trending searches on Wiki తెలుగు:

అనిల్ అంబానీనోటి పుండుపరిపూర్ణానంద స్వామిఏనుగుమెదక్ లోక్‌సభ నియోజకవర్గంకానుగగూగుల్కే. కేశవరావుఇజ్రాయిల్తట్టుఅమృత అయ్యర్సీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుఅష్టవసువులురాప్తాడు శాసనసభ నియోజకవర్గంవై.యస్.రాజారెడ్డిసామెతలులగ్నంఆవుఅర్జునుడుజవాహర్ లాల్ నెహ్రూయోనిఅరుణాచలంపసుపు గణపతి పూజముంతాజ్ మహల్ధాన్యంమ్యాడ్ (2023 తెలుగు సినిమా)ఆదిత్య హృదయంAలవ్ స్టోరీ (2021 సినిమా)సామజవరగమనతెలంగాణ ఉద్యమంసోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిక్రోధిమూర్ఛలు (ఫిట్స్)హైదరాబాద్ రేస్ క్లబ్విరాట్ కోహ్లిహనుమంతుడునిజాంఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితాసావిత్రి (నటి)సిరికిం జెప్పడు (పద్యం)వినాయకుడుభూమా అఖిల ప్రియవిశ్వబ్రాహ్మణపాలిటెక్నిక్జయప్రదదాసోజు శ్రవణ్భారత జాతీయ ప్రతిజ్ఞడియెగో మారడోనాచోళ సామ్రాజ్యంజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంరాయలసీమఆవర్తన పట్టికజో బైడెన్భారతీయ తపాలా వ్యవస్థన్యుమోనియామేషరాశివాసుకి (నటి)నగరి శాసనసభ నియోజకవర్గంచార్మినార్తమిళనాడుఅమ్మశ్రీముఖిప్రేమలుతెలుగు అక్షరాలుసోరియాసిస్పన్నుదక్షిణామూర్తి ఆలయంబాలకాండమహేంద్రసింగ్ ధోనిరక్తంధరణి పోర్టల్ తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వంసూర్యవంశం (సినిమా)జొన్నసుమంగళి (1940 సినిమా)పునర్వసు నక్షత్రముచెక్కురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్లుటీషియం🡆 More