షకీబ్ అల్ హసన్

షకీబ్ అల్ హసన్ (జననం 1987 మార్చి 24) బంగ్లాదేశ్ క్రికెటరు.

అతనీ పూర్తి పేరు ఖోండాకర్ సాకిబ్ అల్-హసన్. బంగ్లాదేశ్ జాతీయ క్రికెట్ జట్టుకు ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ కెప్టెన్. అతను మిడిల్ ఆర్డర్‌లో దూకుడుగా ఆడే ఎడమచేతి వాటం బ్యాటరు. ఎడమచేతి ఆర్థడాక్స్ బౌలింగు కూడా వేస్తాడు. అతన్ని సార్వకాలిక అత్యుత్తమ ఆల్ రౌండర్లలో ఒకరిగా పరిగణిస్తారు.

షకీబ్ అల్ హసన్
షకీబ్ అల్ హసన్
2021 లో షకీబ్ అల్ హసన్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ (1987-03-24) 1987 మార్చి 24 (వయసు 37)
ఖుల్నా, బంగ్లాదేశ్
మారుపేరుఫేసల్
ఎత్తు1.75 m (5 ft 9 in)
బ్యాటింగుఎడమచేతి వాటం
బౌలింగుSlow left-arm orthodox
పాత్రఆల్ రౌండరు
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
తొలి టెస్టు (క్యాప్ 46)2007 మే 18 - ఇండియా తో
చివరి టెస్టు2023 ఏప్రిల్ 4 - ఐర్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 82)2006 ఆగస్టు 6 - జింబాబ్వే తో
చివరి వన్‌డే2023 సెప్టెంబరు 15 - శ్రీలంక తో
వన్‌డేల్లో చొక్కా సంఖ్య.75
తొలి T20I (క్యాప్ 11)2006 నవంబరు 27 - జింబాబ్వే తో
చివరి T20I2023 జూలై 16 - Afghanistan తో
T20Iల్లో చొక్కా సంఖ్య.75
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2004–presentKhulna Division
2010–2011వోర్సెస్టర్‌షైర్
2011–2017, 2021, 2023కోల్‌కతా నైట్‌రైడర్స్
2011–2017బార్బడాస్ ట్రైడెంట్స్
2013, 2021జమైకా Tallawahs
2016–2019ఢాకా డైనమైట్స్
2016Karachi Kings
2018–2019సన్ రైజర్స్ హైదరాబాద్
2022గయానా Amazon వారియర్స్
2023ఫార్చూన్ బరిషాల్
2017,2023Peshawar Zalmi
2023గాలే టైటన్స్
2023మాంట్రియల్ టైగర్స్
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు వన్‌డేలు T20I FC
మ్యాచ్‌లు 66 240 117 102
చేసిన పరుగులు 4,454 7,384 2,382 8,523
బ్యాటింగు సగటు 39.07 37.67 23.82 37.24
100లు/50లు 5/31 9/55 0/12 8/41
అత్యుత్తమ స్కోరు 217 134* 84 217
వేసిన బంతులు 14,775 12200 2,493 20,925
వికెట్లు 233 308 140 333
బౌలింగు సగటు 31.06 29.32 20.49 30.06
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 19 4 2 24
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 2 0 0 2
అత్యుత్తమ బౌలింగు 7/36 5/29 5/20 7/32
క్యాచ్‌లు/స్టంపింగులు 26/– 58/– 26/– 49/–
మూలం: ESPNcricinfo, 27 March 2023

షకీబ్ అల్ హసన్, 2007లో భారత్‌పై టెస్టుల్లో రంగప్రవేశం చేశాడు. అతని పురోగతి, 2008లో చిట్టగాంగ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్‌లో వచ్చింది, అక్కడ అతను 36 పరుగులకు 7 వికెట్లు తీశాడు. ఆ సమయంలో ఇది బంగ్లాదేశ్ బౌలర్లలో అత్యుత్తమ గణాంకం. అతను ఫార్మాట్‌లో 4,000 పైగా పరుగులు, 200 పైచిలుకు వికెట్లూ సాధించాడు. 2016లో ఇంగ్లండ్‌పై బంగ్లాదేశ్ మొట్టమొదటి టెస్టు మ్యాచ్ విజయం సాధించినపుడు అతనే జట్టు కెప్టెన్‌. వన్డేల్లో షకీబ్ మరింత రాణించాడు. అతను 6,000 పైచిలుకు పరుగులు చేశాడు. 270 కు పైబడి వికెట్లు తీసుకున్నాడు. వన్‌డేలలో 5,000 పరుగులు, 250 వికెట్ల డబుల్‌ను సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. 2012 ఆసియా కప్‌లో షకీబ్, మూడు అర్ధసెంచరీలతో సహా 237 పరుగులు చేసి ఆరు వికెట్లు పడగొట్టాడు. బంగ్లాదేశ్ మొదటిసారిగా టోర్నమెంట్ ఫైనల్‌కు చేరుకుంది. అయితే చివరికి పాకిస్తాన్ చేతిలో 2 పరుగుల తేడాతో ఓడిపోయింది. అతను 2019 ఐసిసి క్రికెట్ ప్రపంచ కప్‌లో అత్యంత ప్రభావవంతమైన ఆటగాళ్ళలో ఒకరిగా పరిగణించబడ్డాడు, ఆ ప్రపంచ కప్ గ్రూప్ దశలలో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును బద్దలు కొట్టాడు. టోర్నమెంట్‌లో మొత్తం 606 పరుగులు చేసి, మూడవ స్థానంలో నిలిచాడు.

షకీబ్, 2006లో జింబాబ్వేపై T-20 రంగప్రవేశం చేశాడు. అతను కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, జమైకా తల్లావాస్, ఢాకా డామినేటర్స్‌తో సహా అనేక జట్ల కోసం ప్రపంచవ్యాప్తంగా వివిధ T20 టోర్నమెంట్‌లలో ఆడాడు. 2012, 2014లో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో రెండుసార్లు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) గెలిచాడు. అతను బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (BPL) టైటిల్‌ను 2012, 2013, 2016లో ఢాకా డామినేటర్స్‌తో 3 సార్లు గెలుచుకున్నాడు. 2012, 2013, 2018, 2022లో నాలుగు సార్లు BPL లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. 41 మ్యాన్-ఆఫ్-ది-మ్యాచ్ అవార్డులను గెలుచుకున్నాడు. అన్ని ఫార్మాట్లలో 16 మ్యాన్-ఆఫ్-ది-సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో అత్యధిక సంఖ్యలో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డుల విజేతగా నిలిచాడు. 2009, 2022 మధ్య అతను, బంగ్లాదేశ్ క్రికెట్ జట్టుకు మూడు ఫార్మాట్లలో 85 మ్యాచ్‌లలో కెప్టెన్‌గా చేసాడు.


షకీబ్ అల్ హసన్ అనేక సంవత్సరాలుగా స్థిరమైన ప్రదర్శన చేస్తున్నాడు. అతను బంగ్లాదేశ్‌లో అత్యంత వివాదాస్పద వ్యక్తి, ఎల్లప్పుడూ వార్తలలో ఉంటాడు. 2019లో ESPN అతన్ని ప్రపంచంలోని 90వ అత్యంత ప్రసిద్ధ అథ్లెట్‌గా ర్యాంకు ఇచ్చింది. ఐసిసి పురుషుల జట్టులో రెండుసార్లు (2009, 2021) స్థానం పొందాడు. 2023 ఏప్రిల్ నాటికి, అత్యధిక పురుషుల T20 అంతర్జాతీయ వికెట్లు సాధించిన రికార్డు షకీబ్ పేరిట ఉంది.

ప్రారంభ సంవత్సరాల్లో క్రికెట్

ఖుల్నాలోని మగురాలో జన్మించిన షకీబ్ చిన్న వయస్సులోనే క్రికెట్ ఆడటం ప్రారంభించాడు. ప్రోథోమ్ అలో స్పోర్ట్స్ ఎడిటర్ ఉత్పల్ షువ్రో ప్రకారం, షకీబ్ "క్రికెట్‌లో చాలా ప్రావీణ్యం కలవాడు. తరచూ వివిధ గ్రామాలు, జట్లకు ఆడాడు". ఆ మ్యాచ్‌లలో ఒకదానిలో షకీబ్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు, అతను సాధారణంగా చేసే విధంగా వేగంగా బౌలింగ్ చేశాడు. కానీ స్పిన్ బౌలింగ్‌తో కూడా ప్రయోగాలు చేసాడు గానీ, అది అంత బాగా చేయలేకపోయాడు. అతను ఇస్లాంపూర్ తరపున ఆడుతూ, మొదటి బంతికే వికెట్ తీసుకున్నాడు. సరైన క్రికెట్ బంతితో అతని మొదటి డెలివరీ అది. గతంలో టేపు చుట్టిన టెన్నిస్ బాల్‌తో ఆడేవాడు. అతను ప్రభుత్వ ఆధ్వర్యంలోని బంగ్లాదేశ్ క్రీడా శిఖా ప్రొతిష్ఠాన్, సంస్థలో ఆరు నెలల శిక్షణ పొందాడు.

2005 జనవరి 1 న బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డ్ ప్రెసిడెంట్స్ XI, జింబాబ్వేల మధ్య జరిగిన మ్యాచ్‌లో షకీబ్ ఫస్ట్-క్లాస్ రంగప్రవేశం చేసి, తొలి ఇన్నింగ్స్‌లో 14 బంతుల్లో 14 పరుగులు, 2వ ఇన్నింగ్స్‌లో 66 కి 15 పరుగులు చేశాడు. 32 ఓవర్లలో 0/133 బౌలింగ్ గణాంకాలను కూడా సాధించాడు. 2005 ఫిబ్రవరిలో షకీబ్, జింబాబ్వే A తో ఆడి, ఐదు వికెట్ల పంట తీసుకున్నాడు.

2019 ఏప్రిల్లో, అతను 2019 క్రికెట్ ప్రపంచ కప్ కోసం బంగ్లాదేశ్ జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ప్రపంచ కప్‌లో బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో, దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో, అతను, ముష్ఫికర్ రహీమ్ మూడో వికెట్‌కు 142 పరుగులు సాధించారు. ఇది ప్రపంచ కప్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్యం. బంగ్లాదేశ్ 50 ఓవర్లలో 330/6 చేసి, వన్‌డే మ్యాచ్‌లో వారి అత్యధిక స్కోరును సాధించింది. రెండవ ఇన్నింగ్స్‌లో, అతను వన్‌డేలలో అతని 250వ వికెట్‌గా ఐడెన్ మార్క్‌రామ్ వికెట్‌ను తీసుకున్నాడు. మ్యాచ్‌ల పరంగా (199) వన్‌డేలలో అత్యంత వేగంగా 250 వికెట్లు, 5,000 పరుగులు చేసిన క్రికెటర్‌గా నిలిచాడు. బంగ్లాదేశ్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. షకీబ్ ప్లేయర్ ఆఫ్ మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.

అంతర్జాతీయ కెరీర్

షకీబ్ అల్ హసన్ 
2010లో హసన్.

తొలి మ్యాచ్‌లు

షకీబ్ 2006 ఆగస్టు 6న హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జింబాబ్వేపై వన్డే ఇంటర్నేషనల్ (వన్‌డే) రంగప్రవేశం చేశాడు. అతను 30 పరుగులు చేసి ఎల్టన్ చిగుంబురాను బౌల్డ్ చేసి బంగ్లాదేశ్ విజయంలో ముఖ్యమైన పాత్ర పోషించాడు.

2006 నవంబరు 28న, షకీబ్ జింబాబ్వేపై తన T20, T20I రంగప్రవేశం చేశాడు. తొలి మ్యాచ్‌లో 28 బంతుల్లో 26 పరుగులు చేశాడు. బౌలింగ్ ఫిగర్ 1/31 పొందాడు.

షకీబ్ 2007 మే 6న భారత్‌పై టెస్టుల్లో అడుగు పెట్టి, 0/62 (19 ఓవర్లు) బౌలింగ్ ఫిగర్ పొందాడు. మొదటి ఇన్నింగ్స్‌లో 47 బంతుల్లో 30, 2వ ఇన్నింగ్స్‌లో 64 బంతుల్లో 15 పరుగులు చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన 2వ టెస్టులో షకీబ్‌కి క్రెయిగ్ కమ్మింగ్ తొలి వికెట్.

2008 అక్టోబరు 20న, షకీబ్ టెస్టుల్లో బంగ్లాదేశ్ ఆటగాడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు, న్యూజిలాండ్‌పై 7/36, సాధించాడు.


2009 జనవరి నుండి 2011 ఏప్రిల్ వరకు, మళ్లీ 2012 మార్చి నుండి 2013 జనవరి వరకు షకీబ్, ఐసిసి వన్‌డే ఆల్ రౌండరు ర్యాంకుల్లో మొదటి స్థానంలో నిలిచాడు. 2011 డిసెంబరులో, అతను ప్రపంచ టాప్ ర్యాంక్ టెస్టు ఆల్ రౌండర్ అయ్యాడు. 2014 డిసెంబరులో, షకీబ్ ప్రపంచ టాప్ ర్యాంక్ ట్వంటీ 20 ఆల్ రౌండర్ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లోని ప్రతి ఫార్మాట్‌లో ఐసిసి ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో టాప్ 3లో ర్యాంక్ పొందిన ఏకైక ఆల్ రౌండరు అతను.

షకీబ్ 2009 జూన్‌లో బంగ్లాదేశ్ వైస్ కెప్టెన్‌గా నియమితుడయ్యాడు. మరుసటి నెలలో వెస్టిండీస్‌లో బంగ్లాదేశ్ పర్యటన సందర్భంగా, కెప్టెన్ మష్రాఫ్ మోర్తజా గాయపడటంతో షకీబ్ కెప్టెన్సీని చేపట్టాడు. అతనికి అప్పటికి 22 సంవత్సరాల వయస్సు. వెస్టిండీస్‌పై షకీబ్ సాధించిన విజయం, జట్టుకు మొదటి ఓవర్సీస్ సిరీస్ విజయం. మష్రాఫ్ కోలుకున్న తర్వాత కూడా అతనే కెప్టెనుగా కొనసాగాడు. షకీబ్ 2009 అక్టోబరులో ది విస్డెన్ క్రికెటర్ "టెస్టు ప్లేయర్ ఆఫ్ ది ఇయర్"గా ఎంపికయ్యాడు. 2010 జూలైలో, అతను తన వ్యక్తిగత ప్రదర్శనపై దృష్టి పెట్టడానికి వన్‌డే కెప్టెన్సీ నుండి వైదొలిగాడు. మోర్తజా ఆ బాధయత తీసుకున్నాడు. అతను మళ్లీ గాయపడడంతో షకీబ్ మళ్ళీ కెప్టెను బాధ్యతలు స్వీకరించాడు. ప్రపంచ కప్‌లో పేలవమైన ప్రదర్శన కారణంగా 2011 సెప్టెంబరులో అతన్ని కెప్టెన్సీ నుండి తప్పించారు.


2011 ప్రపంచ కప్

2011 ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు బంగ్లాదేశ్, భారతదేశం, శ్రీలంకలతో కలిసి ప్రపంచ కప్‌ను నిర్వహించింది. బంగ్లాదేశ్‌ను వెస్టిండీస్ 58 పరుగులకే ఆలౌట్ చేసింది. వన్‌డేలలో ఇది జట్టుకు అత్యల్ప స్కోరు. ఈ మ్యాచ్‌ను తన కెరీర్‌లో 'చెత్త రోజు'గా షకీబ్ అభివర్ణించాడు. ఆగ్రహించిన అభిమానులు, షకీబ్ ఇంటిపైన, మైదానం నుండి బయలుదేరినప్పుడు వెస్టిండీస్ జట్టు బస్సుపైనా రాళ్లతో దాడి చేశారు. ఇంగ్లండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్‌పై బంగ్లాదేశ్ విజయాలను నమోదు చేసింది. అయితే వెస్టిండీస్, భారతదేశం, దక్షిణాఫ్రికాలపై ఓడిపోవడంతో వారు టోర్నమెంట్ మొదటి రౌండ్‌కు మించి ముందుకు సాగలేదు. 27.87 సగటుతో 8 వికెట్లతో షకీబ్, టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన బంగ్లాదేశ్‌ బౌలరు. అతను 6 ఇన్నింగ్సులలో 142 పరుగులు చేసాడు.

2019 క్రికెట్ ప్రపంచ కప్

టోర్నీలో బంగ్లాదేశ్ తర్వాతి మ్యాచ్‌లో, న్యూజిలాండ్‌తో షకీబ్ తన 200వ వన్డే ఆడాడు. 2019 జూన్ 17న, వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో, బంగ్లాదేశ్ తరపున వన్‌డేలలో 6,000 పరుగులు చేసిన రెండవ బ్యాట్స్‌మెన్‌గా నిలిచాడు. అజేయంగా 124 పరుగులు చేసి, అతను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

2019 జూన్ 24న, ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో, అతను మళ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు. క్రికెట్ ప్రపంచ కప్‌లో 1,000 పరుగులు చేసిన బంగ్లాదేశ్ తరపున షకీబ్ మొదటి బ్యాట్స్‌మెన్ అయ్యాడు, ప్రపంచకప్ మ్యాచ్‌లో ఐదు వికెట్ల పంట సాధించిన మొదటి బంగ్లాదేశ్ బౌలరు కూడా. యువరాజ్ సింగ్ తర్వాత ప్రపంచ కప్‌లో ఒకే మ్యాచ్‌లో 50 పరుగులు, ఐదు వికెట్లు తీసిన రెండవ క్రికెటర్‌గా కూడా అతను నిలిచాడు.

2019 జూలై 2న, భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో షకీబ్, ప్రపంచ కప్‌లో ఒకే టోర్నమెంట్‌లో 600 పరుగులు, 10 వికెట్లు తీసిన మొదటి క్రికెటర్‌గా నిలిచాడు. అతను ఎనిమిది మ్యాచ్‌లలో 606 పరుగులతో బంగ్లాదేశ్ తరపున అత్యధిక పరుగుల స్కోరర్‌గా టోర్నమెంట్‌ను ముగించాడు. ప్రపంచ కప్‌లో గ్రూప్ దశలో అత్యధిక పరుగులు చేసిన సచిన్ టెండూల్కర్ రికార్డును అధిగమించాడు. ప్రపంచకప్‌లో షకీబ్ బ్యాట్‌తో 86.57 సగటుతో ఉన్నాడు. ప్రపంచకప్‌లో 8 మ్యాచ్‌ల్లో ఆడి, 11 వికెట్లు పడగొట్టాడు. అతను ఐసిసి, ESPNCricinfo ల 'టీమ్ ఆఫ్ ది టోర్నమెంట్'లో స్థానం పొందాడు.

క్రమశిక్షణా సమస్యలు

  • 2010 అక్టోబరులో న్యూజిలాండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో షకీబ్ 92 పరుగులతో ఉండగా, సైట్స్క్రీన్ సమీపంలో కదలికలు జరిగాయి. వాటిని అంపైర్లు ఆపలేకపోయారు. కొన్ని నిమిషాల తరువాత షకీబ్ సైట్ స్క్రీన్ వైపు పరిగెత్తి, అక్కడీ వ్యక్తిని దూషించాడు తన బ్యాట్తో కొడతానని బెదిరించాడు. ఆ తర్వాత మ్యాచ్ రిఫరీ అతన్ని హెచ్చరించాడు.
  • 2011 మార్చిలో వెస్టిండీస్తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్ సందర్భంగా షేర్ - ఎ - బంగ్లా నేషనల్ క్రికెట్ స్టేడియం గ్రాండ్స్టాండ్లో షకీబ్ తనను ఎగతాళి చేసినవారిపై చాలా తీవ్రంగా స్పందించాడని చాలా మంది ఫిర్యాదు చేశారు. అభ్యంతరకరమైన చిత్రం ఇంటర్నెట్లో వ్యాపించి అనేక వార్తాపత్రికలలో ప్రచురించబడింది. ఆ సంఘటన జరిగిన కొద్ది రోజుల్లోనే షకీబ్ తన ప్రొథొమ్ ఆలో లోని కాలమ్‌లో మాజీ జాతీయ క్రికెటర్లను దూషించాడు.
  • 2014 ఫిబ్రవరిలో శ్రీలంకతో జరిగిన రెండో వన్డే సందర్భంగా డ్రెస్సింగ్ రూమ్లో తన కటి ప్రాంతాన్ని చూపిస్తూ అసభ్యంగా ప్రవర్తించినందుకు షకీబ్‌కు 3 లక్షల యూరోల (2800 డాలర్లు) జరిమానా విధించారు. ఆ తర్వాత షకీబ్ తన అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా బహిరంగ క్షమాపణలు చెప్పాడు.
  • అంతర్జాతీయ నిషేధంః 2014 జూలై 7న షకీబ్ను అన్ని రకాల క్రికెట్ల నుండి ఎనిమిది నెలల పాటు నిషేధించారు. దీనిని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు " తీవ్రమైన వైఖరి సమస్య " గా అభివర్ణించింది. షకీబ్ బంగ్లాదేశ్ వెస్టిండీస్ పర్యటనకు దూరమయ్యాడు. 2015 డిసెంబరు 31 వరకు విదేశీ టోర్నమెంట్లలో పాల్గొనకుండా కూడా నిషేధించారు. బోర్డు అధికారులకు సమాచారం ఇవ్వకుండా , బోర్డు నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పొందకుండానే కరీబియన్ ప్రీమియర్ లీగ్‌లో బార్బడోస్ ట్రైడెంట్స్ తరఫున ఆడటానికి షకీబ్ బయలుదేరినప్పుడు వివాదం తలెత్తింది. కోచ్ చండికా హతురుసింఘతో వివాదం కారణంగా టెస్టు , వన్డే క్రికెట్కు రిటైర్మెంట్ ఇస్తానని షకీబ్ బెదిరించాడని పుకార్లు వచ్చాయి.
  • దేశీయ ఫస్టు క్లాస్ క్రికెట్ వ్యవస్థలో అధిక జీతాలు ఇవ్వాలని, బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఫ్రాంచైజ్ పద్ధతిని అవలంబించమనీ కోరుతూ 2019 అక్టోబరు 21 నుండి 2019 అక్టోబరు 23 వరకు జరిగిన ఆటగాళ్ల సమ్మెకు షకీబ్ నాయకత్వం వహించాడు. అతను తోటి ఆటగాళ్లతో కలిసి వేతన వివాద సమస్యను మీడియాకు ప్రస్తావించాడు. తమ డిమాండ్లను నెరవేర్చే వరకు భారత పర్యటన, మిగిలిన అంతర్జాతీయ క్రికెట్ సీజన్ను బహిష్కరిస్తానని బెదిరించాడు. అయితే , వేతన పెంపు ఇవ్వడానికి బిసిబి అంగీకరించడంతో ఈ సమస్య పరిష్కారమైంది. అతను ఆటగాళ్ల సమ్మెకు నాయకత్వం వహిస్తున్న సమయంలో, మాజీ జాతీయ జట్టు స్పాన్సర్ అయిన గ్రామీణ్ఫోన్ అనే ప్రముఖ టెలికమ్యూనికేషన్ ఆపరేటర్తో వెల్లడించని మొత్తానికి రాయబారిగా స్పాన్సర్షిప్ ఒప్పందంపై సంతకం చేయడం ద్వారా బిసిబితో ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు కూడా ఆరోపించబడింది.
  • అంతర్జాతీయ నిషేధంః భారతదేశంతో జరిగిన టి20ఐ, టెస్టు సిరీస్‌లలో జట్టుకు నాయకత్వం వహించడానికి షకీబ్‌ను మొదట ఎంపిక చేశారు. కాని 2019 అక్టోబరు 29న షకీబ్ ఒక సంవత్సరం పాటు సస్పెండయ్యాడు. ఐసిసి - యాంటీ కరప్షన్ కోడ్ను ఉల్లంఘించినందుకు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అన్ని రకాల క్రికెట్ నుండి అతణ్ణి రెండేళ్ల పాటు నిషేధించింది. 2018 బంగ్లాదేశ్ ట్రై - నేషన్ సిరీస్లో ఆడుతున్నప్పుడు, 2018 ఇండియన్ ప్రీమియర్ లీగ్లో సన్రైజర్స్ హైదరాబాద్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మధ్య జరిగిన గ్రూప్ మ్యాచ్లో షకీబ్ను బుక్‌మేకర్లు సంప్రదించినట్లు సమాచారం. ఆ సంగతిని వెల్లడించకుండా, ఐసిసి అవినీతి నిరోధక కోడ్ను ఉల్లంఘించినందుకు అతన్ని దోషిగా నిర్ధారించి, రెండు సంవత్సరాల నిషేధం విధించారు. తరువాత ఒక సంవత్సరం తగ్గించారు. అతను 2020 అక్టోబరు 29 నాటికి అంతర్జాతీయ క్రికెట్ను తిరిగి ప్రారంభించగలిగాడు.
  • 2021 జూన్లో అబహానీ లిమిటెడ్, 2021 ఢాకా ప్రీమియర్ లీగ్లోని మొహమ్మదాన్ స్పోర్టింగ్ క్లబ్ మధ్య జరిగిన 40వ గ్రూప్ మ్యాచ్లో అంపైర్ ఇమ్రాన్ పర్వేజ్ ఎల్బిడబ్ల్యు అప్పీల్ను తిరస్కరించడంతో షకీబ్, స్టంపులను తన్ని విరగ్గొట్టాడు. అదే మ్యాచ్లో , తరువాతి ఓవర్లో వర్షం కారణంగా అంపైర్ మ్యాచ్ను నిలిపివేసినప్పుడు అతను స్వయంగా స్టంప్స్ను తొలగించాడు. అయితే షకీబ్ తన అధికారిక ఫేస్బుక్ పేజీ ద్వారా బహిరంగ క్షమాపణ ప్రకటన చేసి తన ప్రవర్తనను " మానవ తప్పిదం " అని పేర్కొన్నాడు. ఈ సంఘటన తరువాత షకీబ్ను టోర్నమెంట్లో మూడు మ్యాచ్‌ల సస్పెన్షను విధించారు. బీసీబీ, 5 లక్షల యూరోల (4,700 డాలర్లు) జరిమానా విధించింది. దేశీయ క్రికెట్లో పక్షపాత అంపైరింగ్ ఆరోపణలపై దర్యాప్తు చేయడానికి ఒక ప్యానెలును ఏర్పాటు చేయనున్నట్లు బిసిబి ప్రకటించింది.

వ్యక్తిగత జీవితం

షకీబ్ 2023 మార్చిలో అమెరికన్ ఇంటర్నేషనల్ యూనివర్శిటీ-బంగ్లాదేశ్ (AIUB) నుండి BBA పొందాడు

అతను 2012 డిసెంబరు 12న బంగ్లాదేశ్ అమెరికన్ అయిన ఉమ్మె అహ్మద్ షిషిర్‌ను వివాహం చేసుకున్నాడు 2010లో షకీబ్‌ ఇంగ్లండ్‌లోని వోర్సెస్టర్‌షైర్‌ తరఫున కౌంటీ క్రికెట్‌ ఆడుతున్నప్పుడు వారికి పరిచయమైంది.

2018 ఆగస్టులో, అతను USలో నివసించడానికి, పని చేయడానికి అనుమతించే గ్రీన్ కార్డ్ హోల్డర్ అయ్యాడు.

షకీబ్ మోనార్క్ హోల్డింగ్స్‌కు చైర్మన్. బంగ్లాదేశ్, హువాయ్ అవినీతి నిరోధక కమిషన్ (బంగ్లాదేశ్) కొరకు UNICEF గుడ్విల్ అంబాసిడర్ ) . బంగారం వ్యాపారంలోకి ప్రవేశించేందుకు షకీబ్ 2021 ఆగస్టులో బురాక్ కమోడిటీస్ ఎక్స్ఛేంజ్ కో పేరుతో కొత్త కంపెనీని ప్రకటించారు.

దాతృత్వం

షకీబ్ నుండి తన దాతృత్వ కార్యక్రమాలను కొనసాగించడానికి SAHF (షకీబ్ అల్ హసన్ ఫౌండేషన్) అనే స్వచ్ఛంద సంస్థను నడుపుతున్నాడు. ఈ ఫౌండేషన్ను 2020 మార్చిలో, 2000 కుటుంబాలకు సహాయం చేయడానికి 'మిషన్ సేవ్ బంగ్లాదేశ్' పేరుతో ఒక ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది 2020 ఏప్రిల్లో, షకీబ్ COVID-19 ఉపశమనం కోసం తన 2019 క్రికెట్ ప్రపంచ కప్ బ్యాట్‌ను వేలం వేసాడు.

రికార్డులు, విజయాలు

కెప్టెన్సీ రికార్డు

కెప్టెన్‌గా షకీబ్ రికార్డు
ఫార్మాట్ మ్యాచ్‌లు గెలిచింది కోల్పోయిన డ్రా/NR
పరీక్ష 19 4 15 0
వన్‌డే 50 23 26 1
T20I 37 14 23 0
చివరిగా నవీకరించబడినది: 2022 డిసెంబరు 2

అంతర్జాతీయ రికార్డు

  • 2015 జనవరి 12న, షకీబ్ ఆటలోని మూడు ఫార్మాట్లలో (టెస్ట్, వన్ డే ఇంటర్నేషనల్, T20 ఇంటర్నేషనల్స్) ప్లేయర్ ర్యాంకింగ్స్‌లో ఐసిసి 'నం.1 ఆల్-రౌండర్' ర్యాంకు ఇచ్చింది. అది పొందిన ఏకైక క్రికెటరతను.
  • అన్ని ఫార్మాట్లలో 7000 పరుగులు, 300 వికెట్లు డబుల్ చేసిన ఆల్ రౌండరు అతనొక్కడే.
  • వన్డేల్లో మహ్మదుల్లా (224)తో కలిసి బంగ్లాదేశ్ తరఫున ఏ వికెట్‌కైనా అత్యధిక భాగస్వామ్య రికార్డు. ( ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో 5వ వికెట్‌లో ఇది అత్యధిక పరుగుల భాగస్వామ్యం కూడా)
  • టెస్టుల్లో అత్యంత వేగవంతమైన 3000 పరుగులు, 200 వికెట్లు (54 మ్యాచ్‌లు) డబుల్ చేసిన ఐదవ ఆల్ రౌండరు.
  • T20లలో (260 మ్యాచ్‌లలో) 4,000 పరుగులు, 300 వికెట్లు సాధించిన అత్యంత వేగవంతమైన, మూడవ ఆల్-రౌండర్ లో ఒకరు.
  • పురుషుల T20Iలలో 100 వికెట్లు, 1,000 పరుగులు డబుల్ చేసిన ఏకైక ఆల్ రౌండర్.
  • టెస్టుల్లో వేగంగా 3000 పరుగులు, 200 వికెట్లు డబుల్ చేసిన ఆటగాడు.
  • వన్‌డేలలో (202 మ్యాచ్‌లు) వేగవంతమైన 6000 పరుగులు, 250 వికెట్లు రెట్టింపు చేసిన నాల్గవ ఆల్-రౌండరు
  • వన్‌డేలలో (156 మ్యాచ్‌లలో) 4,000 పరుగులు, 200 వికెట్లు డబుల్ చేసిన అత్యంత వేగవంతమైన, అతి పిన్న వయస్కుడైన క్రికెటరు.
  • ఒకే మైదానంలో 100 కంటే ఎక్కువ వన్‌డే వికెట్లు ( షేర్-ఎ-బంగ్లా నేషనల్ స్టేడియంలో 119) తీసుకున్నాడు.
  • ట్వంటీ-20 క్రికెట్‌లో ఒకే మైదానంలో అత్యధిక వికెట్లు ( మీర్పూర్‌లోని షేర్ బంగ్లా నేషనల్ స్టేడియంలో 123) తీశాడు.
  • 2021 ఆగస్టులో, పురుషుల T20Iలలో 100 వికెట్లు, 1,000 పరుగులు చేసిన మొదటి క్రికెటర్ అయ్యాడు.
  • 2021 అక్టోబరు 17న, 2021 ఐసిసి పురుషుల T20 ప్రపంచ కప్‌లో, స్కాట్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో, తన 108వ ఔట్‌తో, అతను పురుషుల T20Iలలో లసిత్ మలింగను అధిగమించి, అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.
  • 2021 అక్టోబరు 24న, అతను T20 ప్రపంచ కప్‌లలో తన 40వ ఔట్‌తో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు, అతను షాహిద్ అఫ్రిదిని అధిగమించాడు.
  • 2021 డిసెంబరులో, పాకిస్థాన్‌తో జరిగిన 2వ టెస్టులో, టెస్టు క్రికెట్‌లో 4,000 పరుగులు, 200 వికెట్ల డబుల్‌ను సాధించిన మ్యాచ్‌ల (59) పరంగా అతను అత్యంత వేగవంతమైన ఆల్‌రౌండర్ అయ్యాడు.
  • 2023 మార్చి 6న, ఇంగ్లండ్‌తో జరిగిన 3వ వన్‌డే లో అతను వన్‌డేలో 300 వికెట్లు తీసిన మొదటి బంగ్లాదేశ్ ఆటగాడిగా నిలిచాడు. వన్‌డేలో 6000 పరుగులు, 300 వికెట్ల డబుల్‌ను సాధించిన మూడవ ఆల్ రౌండర్‌గా కూడా నిలిచాడు.

గమనికలు

మూలాలు

Tags:

షకీబ్ అల్ హసన్ ప్రారంభ సంవత్సరాల్లో క్రికెట్షకీబ్ అల్ హసన్ అంతర్జాతీయ కెరీర్షకీబ్ అల్ హసన్ క్రమశిక్షణా సమస్యలుషకీబ్ అల్ హసన్ వ్యక్తిగత జీవితంషకీబ్ అల్ హసన్ దాతృత్వంషకీబ్ అల్ హసన్ రికార్డులు, విజయాలుషకీబ్ అల్ హసన్ గమనికలుషకీబ్ అల్ హసన్ మూలాలుషకీబ్ అల్ హసన్ఆల్ రౌండర్ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్క్రికెట్

🔥 Trending searches on Wiki తెలుగు:

గున్న మామిడి కొమ్మమీదఉత్తర ఫల్గుణి నక్షత్రముమహాసముద్రంనన్నయ్యబొడ్రాయిలలితా సహస్ర నామములు- 1-100వై.ఎస్.వివేకానందరెడ్డికృత్తిక నక్షత్రముడిస్నీ+ హాట్‌స్టార్కెనడామాయదారి మోసగాడుసింగిరెడ్డి నారాయణరెడ్డిసప్తర్షులురౌద్రం రణం రుధిరంఏ.పి.జె. అబ్దుల్ కలామ్అక్కినేని నాగార్జునసమాసంరాకేష్ మాస్టర్మండల ప్రజాపరిషత్టిల్లు స్క్వేర్మారేడునంద్యాల లోక్‌సభ నియోజకవర్గంరమ్య పసుపులేటిఇత్తడిమేషరాశిరాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్మెరుపుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంసింహరాశిభారతీయ శిక్షాస్మృతిపది ఆజ్ఞలుఎస్. జానకిభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలువారాహిసముద్రఖనివిశాల్ కృష్ణశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంఅనిఖా సురేంద్రన్పునర్వసు నక్షత్రముఇజ్రాయిల్ద్రౌపది ముర్ముపరిటాల రవిభారతీయ సంస్కృతిశ్రీ గౌరి ప్రియకాలుష్యంవంగా గీతభారతదేశ ప్రధానమంత్రిరావణుడువిష్ణువు వేయి నామములు- 1-1000నారా బ్రహ్మణిభారతదేశంలో సెక్యులరిజందశదిశలుఝాన్సీ లక్ష్మీబాయిపక్షవాతంమహాత్మా గాంధీమలేరియాఛత్రపతి శివాజీకుటుంబంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముగంగా నదిచిరుధాన్యంతాటి ముంజలుఅవకాడోభీష్ముడుదేశాల జాబితా – వైశాల్యం క్రమంలోతెలుగు అక్షరాలువ్యవసాయంమర్రిరెండవ ప్రపంచ యుద్ధంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్పెరిక క్షత్రియులువై.యస్.రాజారెడ్డిపుష్యమి నక్షత్రముఆషికా రంగనాథ్అనసూయ భరధ్వాజ్🡆 More