విలియం క్రూక్స్

సర్ విలియం క్రూక్స్ (1832 జూన్ 17 - 1919 ఏప్రిల్ 4) బ్రిటిష్ భౌతిక, రసాయన శాస్త్రవేత్త.

అతడు రాయల్ కాలేజ్ ఆఫ్ కెమిస్ట్రీ, లండన్ లో వర్ణపట శాస్త్రం పై పరిశోధనలు చేశాడు. అతడు ఉత్సర్గ నాళం రూపకల్పనకు మార్గదర్శి.ఆయన తయారుచేసిన ఉత్సర్గ నాళాన్ని క్రూక్స్ నాళం అనికూడా అంటారు.క్రూక్స్ రేడియో వికిరణ మాపకం యొక్క ఆవిష్కర్త. ఇది ప్రస్తుతం అద్భుతమైన వస్తువుగా అమ్మబడుతోంది.

విలియం క్రూక్స్
విలియం క్రూక్స్
జననం(1832-06-17)1832 జూన్ 17
లండన్, ఇంగ్లాండ్
మరణం1919 ఏప్రిల్ 4(1919-04-04) (వయసు 86)
లండన్, ఇంగ్లాండ్
జాతీయతBritish
రంగములుభౌతిక రసాయన శాస్త్రము
ప్రసిద్ధిథాలియం
ముఖ్యమైన పురస్కారాలుElliott Cresson Medal (1912)

జీవితం

క్రూక్స్ తన జీవన గమనంలో ఒక అంతరిక్ష శాస్త్రవేత్తగా, ఉపన్యాసకునిగా వివిధ ప్రాంతాలలో పనిచేశాడు. క్రూక్స్ భౌతిక, రసాయన శాస్త్రాలలో అనేక పరిశోధనలు చేశాడు. తన పరిశోధన ముఖ్య లక్షణము ప్రయోగముల ద్వారా వివిధ భావనల ను, వాస్తవాలను కనుగొనుట.ఆయన అభిరుచులయిన అనువర్తిత భౌతిక శాస్త్రము, ఆర్థిక, ప్రాయోగిక సమస్యలు, మానసిక సంబంధమైన పరిశోధనలు, ఆయనను ఉన్నత వ్యక్తిగా నిలిపింది. ఆయన అనేక అవార్డులు, వివిధ గౌరవాలను పొందాఅరు. ఆయన జీవితం ఒక అవిచ్ఛిన్నమైన శాస్త్రీయ కృత్యాలలో ఒకటిగా నిలిచింది.

బాల్యం

విలియం క్రూక్స్ లండన్లో 1832 జూన్ 17 లో జన్మించాడు. ఆయన తండ్రి జోసెఫ్ క్రూక్స్. అయన తండ్రి యొక్క వృత్తి దర్జీ. అతడు ఆయన రెండవభార్య అయిన మేరీ స్కాట్ తో కలిసి ఉండేవాడు.

1850 నుండి 1854 మధ్య కాలంలో ఆయన కళాశాలలో సహాయకునిగా పనిచేశాడు. అనతికాలంలో ఆయన కర్బన రసాయన శాస్త్రంలో కాకుండా ఆయనకు యిష్టమైన రంగంలో ఆయన గురువు అయిన ఆగస్టు విల్‌హెల్ం వోన్ హోఫ్మాన్న్ ప్రేరణతో ప్రవేశించాడు.ఆయన పరిశోధనల ఫలితంగా సెలేనియం యొక్క సంయోగ పదార్థములు కనుగొనబడ్డాయి. ఆయన మొదటి పరిశోధనా పత్రాలను 1851 లో ప్రచురించాడు. ఆయన ఆక్స్‌ఫర్డ్లో రాడ్‌క్లిఫ్ అబ్సర్వేటరీ విభాగంలో 1854 లో పనిచేశారు. 1855 లో ఆయన ఛెస్టెర్ డియోసియన్ ట్రయినింగ్ కళాశాలలో ఉపన్యాసకునిగా పనిచేశాడు. 1856 లో ఆయన ఎల్లెన్ (డార్లింగ్ టన్ లో గల విలియం హంఫ్రీ యొక్క కుమార్తె) ను వివాహం చేసుకున్నాడు. అయనకు ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె.వివాహం చేసుకున్న తర్వాత ఆయన లండన్ లో స్వతంత్ర పరిశోధనలలో నిమగ్నమయ్యాడు. 1859 లో ఆయన కెమికల్ న్యూస్ అనే విజ్ఞానశాస్త్ర పత్రికను ప్రారంభించాడు. అనేక సంవత్సరములు ఆపత్రికలో వివిధ మార్పులు చేస్తూ నిర్వహించి అన్ని విజ్ఞాన శాస్త్ర జర్నల్స్ లో అగ్రగామిగా నిలిపాడు.

జీవిత మధ్య కాలం

1861 లో క్రూక్స్ థాలియం అనే క్రొత్త మూలకాన్ని కనుగొన్నాడు. ఈ మూలకం వర్ణపటంలో ఆకుపచ్చని కాంతిని ఉద్గారంచేయుటను గమనించాడు. గ్రీకు భాషలో థల్లోస్ అనగా ఆకుపచ్చని ఉద్గారం అనిఅర్థము. అందువల్ల దానికి థాలియం అని నామకరణం చేశాడు. క్రూక్స్ 1871 లో Select Methods in Chemical Analysis అనే ప్రామాణిక గ్రంథాన్ని వ్రాశాడు. క్రూక్స్ పరిశోధనల పట్ల క్రూక్స్ ఆకర్షితుడైనాడు. ప్రముఖ శాస్త్రవేత్తలైన బున్సెన్, కిర్కాఫ్లు ప్రవేశపెట్టిన వర్ణపట విశ్లేషణ పద్ధతిని ఉపయోగించి క్రూక్స్ అత్యంత ఉత్సుకతతో పరిశోధనలు చేసి అందించాడు. ఆయన మొదటి ముఖ్యమైన ఆవిష్కరణ కొత్తమూలకమైన థాలియం. దీనిని 1861 లో ప్రకటించాడు.దీనిని వర్ణపట విశ్లేషణ సహాయంతో కనుగొన్నాడు.

ఆయన ఆవిష్కరణ ఆయనకు ప్రముఖమైన కీర్తిని తెచ్చి పెట్టింది. ఆయన 1863 లో రాయల్ సొసైటీకి ఫెలోగా ఎంపికయ్యాడు.

ఆయన క్రూక్స్ నాళంను అభివృద్ధి చేశాడు. దీనిసహాయంతో ఋణధృవ కిరణాల ఆవిష్కరణ జరిగింది. ఆయన అనేకమైన పరిశోధనా పత్రాలను వర్ణపట శాస్త్రం పై ప్రచురించాడు. అనేక విశేషమైన విషయాల పట్ల పరిశోధనలు చేశాడు. అల్ప పీడనం వద్ద వాయువుల గుండా విద్యుత్ ను ప్రవహింపజేయు పరిశోధనలలో ఆయన అతి తక్కువ పీడనం వద్ద వాయువుల గుండా విద్యుత్ ను ప్రవహింపజేసినపుడు ఋణధృవం (కాథోడ్) నుండి కొన్ని కిరణాలు ఉద్గారమగుచున్నట్లు కనుగొన్నాడు. వాటికి "ఋణధృవ కిరణాలు" అని పిలిచాడు. యివి ప్రస్తుతం స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల ప్రవాహంగా పిలువబదుతున్నాయి. యివి ప్రస్తుతం కాథోడ్ కిరణ నాళాలలో ఉపయోగపడుతున్నాయి. ఈ ఉదాహరణల నుండి ఆయన భౌతిక దృగ్విషయాలను అధ్యయనం చేయుటకు ఉపయోగపడే ఉత్సర్గనాలాల తయారీలో ప్రసిద్ధి పొందాడు.. 1879 లో ఆయన పదార్థం యొక్క స్థితులలో (ఘన, ద్రవ, వాయు) నాల్గవ స్థితి అయిన ప్లాస్మాను కనుగొనుటలో, ఆ స్థితిని గుర్తించుటలో మొదటి శాస్త్రవేత్తగా నిలచాడు.. ఆయన కేంద్రక రేడియోధార్మికతను అధ్యయనం చేయుటకు ఉపయోగించే పరికరం spinthariscope.ను కనుగొన్నాడు.

క్రూక్స్ ఋణధృవ కిరణాలు లక్షణాలపై పరిశోధనలు చేశాడు. అవి ఋజుమార్గంలో ప్రయాణిస్తాయని, అవి వస్తువులపై పడినపుడు ప్రతిదీప్తిని కలుగజేస్తాయని కనుగొన్నాడు. పదార్థంలో నాల్గవ స్థితి అయిన "ప్లాస్మా" స్థితిని ఆయన కనుగొన్నట్లు విశ్వసించాడు.దానికి "రేడియంట్ మేటర్" అని పిలిచాడు. but his theoretical views on the nature of "radiant matter" were to be superseded. ఋణధృవ కిరణాలు అనేవి కొన్ని కణాల ప్రవాహమని నమ్మాడు. ఆ తర్వాత జె.జె.థామ్సన్ వాటిని కనుగొన్నాడు. కాథోడ్ కిరణాలలో గల కణాలకు ఎలక్ట్రాన్ లుగా గుర్తించాడు).క్రూక్స్ చేసిన పరిశోధనల వల్ల భౌతిక, రసాయన శాస్త్రాలలో విప్లవాత్మకమైన మార్పులువచ్చాయి. దీనిఫలితంగా పరమాణువులో కొత్త కణాల ఆవిష్కరణకు మార్గం సుగమమైంది.

1880 తర్వాత అతడు 7, కెన్సింగ్టన్ గార్డెన్స్ లో గల ప్రైవేటు ప్రయోగశాలలో తన పరిశోధనలను చేశాడు.

చివరి రోజులు

విలియం క్రూక్స్ 
Sir William Crookes
by Sir Leslie Ward 1902

1895 లో విలియం క్రూక్స్ హీలియం యొక్క నమూనాను గుర్తించాడు.

1903 లో ఆయన తన దృష్టిని రేడియోధార్మికత దృగ్విషయాలపై నిలిపాడు. యురేనియం -X (తర్వాత ప్రొటాక్టీనియంగా పిలువబడుతుంది) నుండి యురేనియాన్ని రేడియోధార్మిక పరివర్తన ఆధారంగా వేరుచేయగలిగాడు. ఉత్తేజిత పరివర్తన ఆధారంగా యురేనియం నుండి రేడియోధార్మిక విఘటనాన్ని గమనించాడు. అదే సమయంలో ఆయన రేడియో ధార్మిక పదార్థం నుండి వెలువడే "p-కణముల"ను కనుగొన్నాడు. ఈ కణాలు జింక్ సల్ఫైడ్ తెరను ప్రభావితం చేయుట గమనించాడు.

క్రూక్స్ 1909 లో "డైమండ్స్" అనే చిన్న పుస్తకాన్ని రాశాడు. 1910 లో క్రూక్స్ "ఆర్డర్ ఆఫ్ మెరిట్"ను పొందాడు. ఆయన తన భార్య మరణానంతరం 2 సంవత్సరాల తర్వాత లండన్ లో 4 ఏప్రిల్ 1919 లో మరణించాడు. ఆయన లండన్ లోని బ్రోమ్‌ప్టన్ సెమెటరీలో ఖననం చేయబడ్డాడు.

సూచికలు

    Citations
    సాధారణ సమాచారము

ఇతర రచనలు

  • Trevor H. Hall (1963). The spiritualists: the story of Florence Cook and William Crookes. Helix Press.

బయటి లంకెలు

విలియం క్రూక్స్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
  • Hinshelwood, Cyril Norman, "William Crookes, A Victorian man of science". 1927. (Much material on this page was taken from Hinshlewood's article)

Tags:

విలియం క్రూక్స్ జీవితంవిలియం క్రూక్స్ బాల్యంవిలియం క్రూక్స్ జీవిత మధ్య కాలంవిలియం క్రూక్స్ చివరి రోజులువిలియం క్రూక్స్ సూచికలువిలియం క్రూక్స్ ఇతర రచనలువిలియం క్రూక్స్ బయటి లంకెలువిలియం క్రూక్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

తాటి ముంజలుసత్యవతి (మహాభారతం)తెలంగాణ చరిత్రకామినేని శ్రీనివాసరావువందేమాతరంవడదెబ్బకడప లోక్‌సభ నియోజకవర్గంలోక్‌సభ నియోజకవర్గాల జాబితాతాటిక్లోమముహెక్సాడెకేన్కర్నూలుఏప్రిల్ 26మూలా నక్షత్రంభారతదేశంసామజవరగమనఅమ్మ (1991 సినిమా)పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కులంబుధుడు (జ్యోతిషం)తెలంగాణా బీసీ కులాల జాబితాసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ఉస్మానియా విశ్వవిద్యాలయంరాశి (నటి)రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్పద్మశాలీలుదేవుడునరసింహ (సినిమా)ప్రకాష్ రాజ్తెలుగు సినిమాలు 2023సచిన్ టెండుల్కర్కుంభరాశిపుష్యమి నక్షత్రముసీసము (పద్యం)దాశరథి కృష్ణమాచార్యనిర్వహణమౌర్య సామ్రాజ్యంమంగలి2014 భారత సార్వత్రిక ఎన్నికలుకొమురం భీమ్మానవ జీర్ణవ్యవస్థశివుడుయానిమల్ (2023 సినిమా)తెలుగుభారతదేశంలో విద్యయనమల రామకృష్ణుడుఆరూరి రమేష్అదితిరావు హైదరీమదర్ థెరీసాక్రికెట్అనసూయ భరధ్వాజ్దూదేకులగుంటూరు జిల్లాఆర్టికల్ 370వంగా గీతహస్తప్రయోగంఅందెశ్రీఆటలమ్మజ్యేష్ట నక్షత్రంసమాచార హక్కుమానవ హక్కులుశ్రీలీల (నటి)చాళుక్యులుకుతుబ్ మీనార్వారాహిడొక్కా మాణిక్యవరప్రసాద్2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుకంప్యూటరుహార్సిలీ హిల్స్తన్నీరు హరీశ్ రావుAఅమెరికా సంయుక్త రాష్ట్రాలులలిత కళలుభూమన కరుణాకర్ రెడ్డికరోనా వైరస్ 2019అధిక ఉమ్మనీరుకాటసాని రామిరెడ్డి🡆 More