కాటసాని రామిరెడ్డి

కాటసాని రామిరెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు.

ఆయన 2019లో బనగానపల్లె నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచాడు.

కాటసాని రామిరెడ్డి
కాటసాని రామిరెడ్డి

పదవీ కాలం
23 మే 2019 – ప్రస్తుతం
నియోజకవర్గం బనగానపల్లె

వ్యక్తిగత వివరాలు

జననం 18 ఆగష్టు 1968
గుండ్ల శింగవరం, అవుకు మండలం , కర్నూలు జిల్లా , ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
రాజకీయ పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ
ఇతర రాజకీయ పార్టీలు తెలుగుదేశం పార్టీ, ప్రజారాజ్యం పార్టీ
తల్లిదండ్రులు కాటసాని ఓబులమ్మ, ఓబులరెడ్డి
జీవిత భాగస్వామి జయమ్మ
సంతానం   ఓబుల్‌రెడ్డి, నాగార్జునరెడ్డి (లేట్), ప్రతిభ, ప్రణతి
నివాసం బనగానపల్లి
పూర్వ విద్యార్థి శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ
వృత్తి రాజకీయ నాయకుడు

జననం, విద్యాభాస్యం

కాటసాని రామిరెడ్డి 1968లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, కర్నూలు జిల్లా, అవుకు మండలం , గుండ్ల శింగవరం గ్రామంలో కాటసాని ఓబులమ్మ, ఓబులరెడ్డి దంపతులకు జన్మించాడు. ఆయన శ్రీ కృష్ణదేవరాయ యూనివర్సిటీ నుండి బిఎ పూర్తి చేశాడు.

రాజకీయ జీవితం

కాటసాని రామిరెడ్డి తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1987లో అవుకు మండలం మెట్టుపల్లె సింగిల్‌ విండో అధ్యక్షుడిగా, 1988–93 వరకు గుండ్ల శింగవరం సర్పంచ్‌గా, అవుకు మండల ఉపాధ్యక్షుడిగా, 1994–98 వరకు బనగానపల్లె మండల జెడ్పీటీసీ సభ్యుడిగా పని చేసి, 2006లో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ లో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బనగానపల్లె నియోజకవర్గం నుండి పీఆర్పీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా రామకృష్ణారెడ్డి పై 13,686 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2011లో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం కావడంతో కాంగ్రెస్ పార్టీ లో చేరి 26 ఆగష్టు 2013న రాజీనామా చేశాడు. ఆయన 4 సెప్టెంబర్ 2013న వైఎస్సార్సీపీ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లో చేరాడు.

కాటసాని రామిరెడ్డి 2014లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్ధన రెడ్డి చేతిలో 17341 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యాడు.కాటసాని రామిరెడ్డి 2019లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బీసీ జనార్ధన రెడ్డి పై 13,384 ఓట్ల మెజారిటీతో గెలిచాడు.

మూలాలు

Tags:

బనగానపల్లె శాసనసభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

సంగీతంఎన్నికలుకూరసచిన్ టెండుల్కర్చే గువేరాచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంపెరిక క్షత్రియులుసప్త చిరంజీవులుఉగాదిమొఘల్ సామ్రాజ్యంపక్షవాతంకాళోజీ నారాయణరావుదొంగ మొగుడునాయుడుఉపద్రష్ట సునీతపి.వి.మిధున్ రెడ్డిమహాసముద్రంచిరంజీవి నటించిన సినిమాల జాబితాఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాలోక్‌సభఅమెజాన్ (కంపెనీ)గుంటూరుమేరీ ఆంటోనిట్టేసుందర కాండబంగారంసుభాష్ చంద్రబోస్భారతీయ సంస్కృతిప్రకృతి - వికృతిషణ్ముఖుడుజాతిరత్నాలు (2021 సినిమా)జాతీయ పౌష్టికాహార పరిశోధనా సంస్థమహాకాళేశ్వర జ్యోతిర్లింగంఅంగుళంశామ్ పిట్రోడావిజయ్ (నటుడు)భారత సైనిక దళంతెలుగు సినిమాల జాబితాహార్దిక్ పాండ్యావినోద్ కాంబ్లీనెమలిపాముసాయిపల్లవివిటమిన్ బీ12అనూరాధ నక్షత్రంమా తెలుగు తల్లికి మల్లె పూదండకోల్‌కతా నైట్‌రైడర్స్పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంషాబాజ్ అహ్మద్నామవాచకం (తెలుగు వ్యాకరణం)ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితాజాషువాగ్లోబల్ వార్మింగ్ఆర్టికల్ 370 రద్దుభూమా అఖిల ప్రియరాశిఆతుకూరి మొల్లభారత రాజ్యాంగ ఆధికరణలుకోవూరు శాసనసభ నియోజకవర్గంవై.ఎస్. జగన్మోహన్ రెడ్డిశుక్రుడుకిలారి ఆనంద్ పాల్రాష్ట్రపతి పాలనకామాక్షి భాస్కర్లభారతరత్నరవితేజఢిల్లీ డేర్ డెవిల్స్యేసుమహాభాగవతంశ్రీకాళహస్తిఘట్టమనేని కృష్ణశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రములగ్నంశ్రీశైల క్షేత్రంనువ్వు లేక నేను లేనుటమాటోవాస్తు శాస్త్రంరాహుల్ గాంధీ🡆 More