విస్పష్టమైన చెత్త

సాధారణంగా వికీపీడియన్లు ఎంతో ప్రయోజనకరమైన రచనలను అందిస్తూండగా, కొందరు చెత్తకూడా పోసేస్తూంటారు.

ఈ విస్పష్టమైన చెత్తను రెండు వర్గాలుగా చెయ్యవచ్చు:

  1. కల్తీలేని చెత్త:  అంటే ఏవో కొన్ని అక్షరాల పరస్పర సంబంధం లేని, ఒక అర్థం పర్థం లేని కలయిక.  హ్ద్గ్స్త్షక్పెద్త్గిఉజ్క్ఫిల్గొగ్ - ఇలా అన్నమాట. కీబోర్డు లోని కీలను ఎడాపెడా కొట్టుకుంటూ పోతే వచ్చే పాఠ్యం అన్నమాట.
  2. రెండోది, అర్థం పర్థం లేని మాటల కలయిక. చూట్టానికి ఇదేదో గంభీరమైన, తెలివైన పాఠ్యం లాగే కనిపిస్తుంది. ఏదో గొప్ప అర్థాన్ని చెప్పేందుకే రాసారనిపిస్తుంది. తీరా చదివాక ఏమీ అర్థం కాదు, ఉత్త చెత్త. ఆ పాఠ్యాన్ని సవరించి ఒక దారికి తెచ్చి, ఒక అర్థాన్ని కల్పించడం దాదాపు అసంభవం.

ఇతర రకాల చెత్తతో తికమక పడరాదు...

కింది వాటిని విస్పష్టమైన చెత్తగా భావించరాదు. వీటిలో కొన్ని త్వరిత తొలగింతకు అర్హమైనవే -కానీ వేరే కారణాల వలన, విస్పష్టమైన చెత్త అని కాదు. వీటితో ఎలా వ్యవహరించాలో వికీపీడియా:తొలగింపు విధానం వివరిస్తుంది.

  • కాపీహక్కుల ఉల్లంఘన లేదా ఎత్తిపోతల (ప్లేజరిజమ్‌): అది చెత్త అయినా కాకపోయినా సరే, వెంటనే తొలగించెయ్యాలి.
  • అసత్యాలు, అప్రతిష్ఠ, పరువునష్టం కలిగించేవి, అపవాదులు వేసే వ్యాఖ్యలు. సరైన మూలాలుంటే తప్ప, వాటిని వెంటనే తొలగించాలి. వీలైతే, నిర్వాహకులు సదరు కూర్పును పూర్తిగా తొలగించాలి.  వికీపీడియా:జీవించి ఉన్నవారి చరిత్రలు చూడండి
  • భాషాదోషభూయిష్టంగా, పేలవంగా ఉన్న రచనలు.
  • లింకుల్లేని పాఠ్యం. దానికి {{Underlinked}} ట్యాగును తగిలించవచ్చేమో చూడండి.
  • ఇంగ్లీషులో ఉన్న పాఠ్యం. అనువాదం కోరబడిన పేజీలు చూడండి
  • దుశ్చర్యలు: తలాతోకా లేని, అసందర్భమైన, అసంబద్ధమైన, పరిణతి లేని రాతలు. ఇది విస్పష్టమైన చెత్త కాకపోవచ్చుగానీ, దానితో సమానంగానే చూడాలి. అయితే కొన్ని సందర్భాల్లో  ఆ చెత్త సరిగా రాయడం చేతకాకపోవడం వలన చేరి ఉండవచ్చు, వాడుకరి కావాలని చెత్త పోసి ఉండకపోవచ్చు. దాన్ని గమనించాలి.

విస్పష్టమైన చెత్తతో వ్యవహరించడం

విస్పష్టమైన చెత్తతో వ్యవహరించడానికి అనేక పద్ధతులున్నాయి. ఆయా సందర్భాలకు ఏది తగునో మీరు నిర్ణయించండి:

  • దాని స్థానంలో బాగా రాసిన వ్యాసం పెట్టండి.
  • ఆ వ్యాసాన్ని దాని చర్చాపేజీకి తరలించండి.
  • ఆ వ్యాసాన్ని వాడుకరి చర్చాపేజీకి తరలించండి.
  • చెత్తను తొలగించాక వ్యాసంలో పనికొచ్చే పాఠ్యం ఉంటుందనుకుంటే ఆ చెత్తను తొలగించండి. విస్పష్టమైన చెత్తను తొలగించడం సాధారణంగా సులువుగానే ఉంటుంది.
  • కొత్త వాడుకరి చేసిన ప్రయోగం కావచ్చునేమో చూడండి. అలా అయితే, కొత్తవాళ్ళను బెదరగొట్టకండి, వాళ్ళను హెచ్చరించండి. హెచ్చరించడానికి uw-test శ్రేణి మూసలున్నాయి పరిశీలించండి. ఆ మూసలను వాడుతూ, వాడుకరులను హెచ్చరిస్తూ, దుశ్చర్యలను కొనసాగిస్తున్న వాడుకరులను దుశ్చరితులుగా ప్రకటించండి.
  • అయితే, వాడుకరి తాను చేస్తున్నది సరైనదే అని సమర్ధించుకుంటూ, మీ చర్యలకు అభ్యంతరం చెబితే, వారితో చర్చించి ఒక ఏకాభిప్రాయానికి రండి. ఈ చెత్తను సరిదిద్ది పనికొచ్చేలా తయారుచేసేందుకు ఎవరైనా ముందుకు వస్తే అందుగ్గాను వారికి తగినంత సమయం ఇవ్వండి.

ఏదైనా పేజీలో విస్పష్టమైన చెత్త తప్ప మరేమీ లేకపోతే:

  • ముందుగా, పేజీ చరితాన్ని పరిశీలించండి. ఇప్పుడున్న ఈ చెత్త గతంలోని మంచి పాఠ్యాన్ని తీసేసి పెట్టారేమో చూడండి. అలా అయితే, దానికి ముందున్న కూర్పుకు పేజీని పునస్థాపించండి. అలా చేసిన వాడుకరిని హెచ్చరించండి.
  • లేదంటే {{db-g1}} లేదా {{db-nonsense}} వంటి మూసలను పెట్టి పేజీ త్వరిత తొలగింపుకు నోటిసు ఇవ్వండి. బాధ్యులైన వాడుకరిని హెచ్చరిక మూసల ద్వారా హెచ్చరించండి. 

ఇవి కూడా చూడండి

  • Buffalo buffalo Buffalo buffalo buffalo buffalo Buffalo buffalo, another example
  • The Sokal hoax (article), nonsense that made it to Social Text
  • Word salad
  • Wiki: Complete bollocks
  • తొలగింపు విధానం
  • Wiki: Policies and guidelines

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

ఇత్తడికొల్లేరు సరస్సుఐడెన్ మార్క్‌రమ్గోల్కొండఆర్యవైశ్య కుల జాబితాబి.ఎఫ్ స్కిన్నర్భారతదేశ పంచవర్ష ప్రణాళికలుపరిటాల రవితాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిబ్రాహ్మణ గోత్రాల జాబితాబాల కార్మికులుచరాస్తిపరశురాముడురుద్రమ దేవిగజేంద్ర మోక్షంనాగర్‌కర్నూల్ లోక్‌సభ నియోజకవర్గంభారతీయ రైల్వేలుఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల సంఘంశోభన్ బాబుతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ఓటుబైండ్లతెలుగు సినిమాలు 2022ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రుల జాబితానవధాన్యాలుఆవేశం (1994 సినిమా)సంధితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థఅనిఖా సురేంద్రన్తీన్మార్ మల్లన్నప్రజా రాజ్యం పార్టీసమాచార హక్కుగుంటూరునర్మదా నదిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్మహేంద్రగిరిరేణూ దేశాయ్పాల కూరనామవాచకం (తెలుగు వ్యాకరణం)మీనాక్షి అమ్మవారి ఆలయంజగ్జీవన్ రాంఅల్లూరి సీతారామరాజురక్తంపి.వి.మిధున్ రెడ్డిశ్రీరామనవమిఉగాదివిజయసాయి రెడ్డిఅనుష్క శెట్టిఎల్లమ్మకార్తెదీపావళికల్వకుంట్ల కవితభారత రాజ్యాంగ సవరణల జాబితాడీజే టిల్లురాజంపేట లోక్‌సభ నియోజకవర్గంబైబిల్ఫిరోజ్ గాంధీరౌద్రం రణం రుధిరంశ్రీ కృష్ణుడుబర్రెలక్కగైనకాలజీదేవుడుభరణి నక్షత్రమువాతావరణంగోదావరిభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుపెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంనాయీ బ్రాహ్మణులుతెలుగు పదాలుశార్దూల విక్రీడితముకుప్పం శాసనసభ నియోజకవర్గం2019 భారత సార్వత్రిక ఎన్నికలువరల్డ్ ఫేమస్ లవర్గుంటూరు లోక్‌సభ నియోజకవర్గంరామోజీరావువినాయక చవితి2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలు🡆 More