పాఠం

సహాయం పేజీలు | స్వాగతం  ·   తెలుగులో రచనలు చెయ్యడం  ·   5 నిమిషాల్లో వికీ  ·   పాఠం  ·   గైడు  ·   పదకోశం  ·   సహాయం  ·   సహాయ కేంద్రం  ·   ప్రశ్నలు  ·   వీడియో పాఠాలు

మొదటి పేజీ   దిద్దుబాటు   ఫార్మాటింగు   వికీపీడియా లింకులు   బయటి లింకులు   చర్చాపేజీలు   గుర్తుంచుకోండి   ఖాతా   ముగింపు    

వికీపీడియా వ్యాసాలపై వికీపీడియన్ల మధ్య చర్చకు అవకాశం కలిగించే వేదిక, చర్చాపేజీలు.

ఏదైనా వ్యాసం గురించిన సందేహం గానీ, వ్యాఖ్య గానీ రాయాలనుకుంటే సదరు వ్యాసపు చర్చాపేజీలో రాయవచ్చు. వ్యాసపు పేజీలోని "చర్చ" ట్యాబును నొక్కి ఈ చర్చాపేజీకి వెళ్ళవచ్చు. ఈ "చర్చ" లింకు ఎర్రగా ఉన్నా పరవాలేదు; మొదటి వ్యాఖ్య రాసి మీరే ఆ పేజీని సృష్టించండి.

కొత్త వ్యాఖ్య రాస్తుంటే, ఇప్పటికే ఉన్న వ్యాఖ్యలకు అడుగున రాయండి. ఇప్పటికే ఉన్న ఏదైనా వ్యాఖ్యకు సమాధానం రాస్తూ ఉంటే దాన్ని సదరు వ్యాఖ్యకు దిగువన రాయండి. మీ వ్యాఖ్యకు ముందు ఒక కోలను (:) పెట్టండి; దీనివలన మీరు పైనున్న వ్యాఖ్యకు సమాధానం రాస్తున్నారని తెలుస్తుంది.

మీ వ్యాఖ్యకు చివర సంతకం చెయ్యండి. కేవలం సభ్యనామం మాత్రమే చూపదలిస్తే ~~~ - ఇలాగాను, సభ్యనామంతో పాటు తేదీ, సమయం కూడా చూపదలిస్తే ~~~~ ఇలాగాను సంతకం చెయ్యండి. ఇలా రాయడం వలన పేజీని భద్రపరచిన తరువాత, మీ వ్యాఖ్య చివర ఆటోమాటిగ్గా మీ సంతకం వచ్చి చేరుతుంది. సంతకం చెయ్యకపోయినా, మీ వ్యాఖ్యలు కనిపిస్తాయి. కానీ, మీ పేరు కనబడదు. చాలామంది సంతకం చేస్తారు. సంతకం చెయ్యడం వలన చర్చ చదవడానికి వీలుగా ఉంటుంది. మీ సౌకర్యం కోసం ఎడిట్ బాక్సుకు పైన ఉన్న టూలుబారులో ఒక ఐకను కూడా ఉంది. దీన్ని నొక్కినపుడు "--~~~~" అనే కోడు మీ వ్యాఖ్యలోకి వచ్చి చేరుతుంది..

ఎకౌంటు సృష్టించుకుని సభ్యనామాన్ని పొందవచ్చు. మీకు ఎకౌంటు లేకపోయినా, ఉండీ లాగిన్ కాకున్నా, సంతకంలో మీ సభ్యనామానికి బదులు మీ ఐ.పి.అడ్రసు కనిపిస్తుంది.

సభ్యుల చర్చాపేజీలు

ప్రతీ వికీపీడియనుకూ ఒక చర్చాపేజీ ఉంటుంది. ఇతర వికీపీడియనులు అక్కడ సందేశాలు రాయవచ్చు. మీకెవరైనా సందేశం రాస్తే, వికీపీడియాలో మీరు ఏ పేజీలో ఉన్నా, ఆ పేజీలో పైన "మీకు కొత్త సందేశాలున్నాయి" అంటూ మీకో సందేశం కంపిస్తుంది.

ఈ సందేశాలకు మీరు రెండు రకాలుగా సమాధానాలివ్వవచ్చు. ఎవరికి సమాధానమిస్తున్నారో ఆ సభ్యుని చర్చాపేజీలో రాయడం ఒక పద్ధతి. మీ చర్చాపేజీలోనే, ఆ సభ్యుడు/సభ్యురాలు రాసిన వ్యాఖ్యకు దిగువనే రాయడం రెండో పద్ధతి. వికీపీడియాలో రెండూ మామూలే. అయితే మీ పేజీలొనే సమాధానం రాస్తే సదరు సభ్యుడు/సభ్యురాలు అది చూడకపోయే అవకాశం ఉంది. అంచేత మీరు రెండో పద్ధతినే పాటించదలచినపుడు, మీ చర్చాపేజీలో పైన అలా అని ఓ నోటీసు పెట్టడం మంచిది.

ఇండెంటింగు

వ్యాఖ్యలోని వాక్యాలను ఎడమ అంచు నుండి కాక, కాస్త ఎడమ వైపుకు (పేజీ లోపలికి) జరిపి మొదలు పెట్టడాన్ని ఇండెంటింగు అంటారు. ఇలా చెయ్యడం వలన సంభాషణలో ఎవరు ఎవరికి సమాధానం రాసారు అనే విషయం స్పష్టంగా తెలుస్తూ చర్చ చదివేందుకు వీలుగా ఉంటుంది. ఏ వ్యాఖ్యకైతే మీరు సమాధానం రాస్తున్నారో ఆ వ్యాఖ్యకంటే ఒక్క స్థాయి లోపలికి జరిపి మీ వ్యాఖ్య రాయడం ప్రామాణిక పద్ధతి.

ఇండెంటు చేసేందుకు అనేక పద్ధతులు ఉన్నాయి:

సూటి ఆదేశాలు

అతి తేలికైన విధానం.. మీ వ్యాఖ్యలోని ప్రతీ లైనుకు ముందు ఓ కోలను (:) పెట్టడం. ఎన్ని కోలన్లు పోడితే లైను అంత లోపలికి పోతుంది. కొత్త లైనుకు చేరినపుడు ఇండెంటింగు పోతుంది.

ఉదాహరణకు:

    ఇది పూర్తిగా ఎడమ అంచుకు చేరి ఉంది.
    : ఇది కొద్దిగా ఎడమ పక్కకు జరిగి ఉంది.
    :: ఇది కొద్దిగా ఎక్కువ జరిగి ఉంది.

ఇవి ఇలా కనిపిస్తాయి:

    ఇది పూర్తిగా ఎడమ అంచుకు చేరి ఉంది.
    :ఇది కొద్దిగా ఎడమ పక్కకు జరిగి ఉంది.
    :: ఇది కొద్దిగా ఎక్కువ జరిగి ఉంది.

బులెట్ పాయింట్లు

బులెట్లు వాడి కూడా ఇండెంటు చెయ్యవచ్చు. బులెట్ పెట్టేందుకు, నక్షత్రం (*) గుర్తును వాడాలి. ఎన్ని నక్షత్రాలు పెడితే అంత లోపలికి జరుగుతుంది.

ఉదాహరణ:

    * మొదటి లైను మొదటి వస్తువు
    * రెండో వస్తువు
    ** రెండో దానిలో మొదటి వస్తువు
    * మూడో వస్తువు

అవి ఇలా కనిపిస్తాయి:

    * మొదటి లైను మొదటి వస్తువు
    * రెండో వస్తువు
    **రెండో దానిలో మొదటి వస్తువు
    *మూడో వస్తువు

సంఖ్యా జాబితాలు

సంఖ్యా జాబితాలను కూడా సృష్టించవచ్చు. ఇందుకు హాష్ (#) ను వాడాలి. సాధారణంగా దీన్ని పోల్సు కోసము, వోటింగు కోసము వాడతారు. పైన చెప్పినట్లుగానే ఎన్ని హాష్ లు రాస్తే అంత ఎక్కువ లోపలికి జరౌగుతాయి.

ఉదాహరణ: # మొదటి వస్తువు

    # రెండవ వస్తువు
    ## రెండవ వస్తువు కింద ఉప వస్తువు
    # మూడో వస్తువు

ఇలా కనిపిస్తుంది:

  1. మొదటి వస్తువు
    1. రెండవ వస్తువు
      1. రెండవ వస్తువు కింద ఉప వస్తువు
    2. మూడో వస్తువు

ప్రయోగం

ఈసారి ప్రయోగశాలలో చేసే బదులు దీని చర్చాపేజీలోనే రాయండి. పైనున్న చర్చ లింకును నొక్కి, మీ వ్యాఖ్య రాయండి. సంతకం పెట్టడం మరువకండీ. భద్రపరచబోయే ముందు, సరిచూడు మీటను నొక్కి, మీ దిద్దుబాటు సరిగ్గా ఉందో లేదో చూసుకోండి.

చర్చాపేజీలో మీ ప్రయోగాలు చెయ్యండి.
ఇక గుర్తుంచుకోవలసిన విషయాలు కొన్ని చూద్దాం


Tags:

పాఠం సభ్యుల చర్చాపేజీలుపాఠం ఇండెంటింగుపాఠం ప్రయోగంపాఠంవికీపీడియా:5 నిమిషాల్లో వికీవికీపీడియా:కొత్త సభ్యులకు స్వాగతమువికీపీడియా:గైడువికీపీడియా:తెలుగులో రచనలు చెయ్యడంవికీపీడియా:పదకోశంవికీపీడియా:పాఠంవికీపీడియా:ప్రశ్నలువికీపీడియా:వీడియో పాఠాలువికీపీడియా:సహాయ కేంద్రంసహాయం:సూచిక

🔥 Trending searches on Wiki తెలుగు:

గురువు (జ్యోతిషం)నమాజ్మొదటి పేజీమంగళసూత్రంనారా చంద్రబాబునాయుడుఏనుగునాగార్జునసాగర్అంగచూషణఎన్నికలుపావని గంగిరెడ్డివిశాల్ కృష్ణఎలక్టోరల్ బాండ్వాసిరెడ్డి పద్మఅయ్యప్పభారతీయ స్టేట్ బ్యాంకుమిఖాయిల్ గోర్బచేవ్అమృత అయ్యర్మెరుపురఘురామ కృష్ణంరాజుదశావతారములుచాట్‌జిపిటికానుగఎంసెట్2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుయోనిటిల్లు స్క్వేర్జ్యేష్ట నక్షత్రంనిర్మలా సీతారామన్ఆపిల్వ్యాసుడుహైదరాబాదుభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలువ్యవసాయంపూర్వాభాద్ర నక్షత్రమువందే భారత్ ఎక్స్‌ప్రెస్జగదేకవీరుడు అతిలోకసుందరితహశీల్దార్గజము (పొడవు)దక్షిణామూర్తి ఆలయంసుందరం మాస్టర్ (2024 తెలుగు సినిమా)వై.యస్.భారతిమహేంద్రసింగ్ ధోనిమ్యూనిక్ ఒప్పందంఆదిత్య హృదయంనడుము నొప్పినవధాన్యాలుఇంటి పేర్లులావణ్య త్రిపాఠిపద్మశాలీలురక్షకుడుగౌడవిడదల రజినిఅష్ట దిక్కులునన్నయ్యనా సామిరంగట్రినిడాడ్ అండ్ టొబాగోఅల్లూరి సీతారామరాజుఅనపర్తి శాసనసభ నియోజకవర్గంపరిటాల శ్రీరాములుదేశద్రోహులు (1964 సినిమా)భీష్ముడురచిన్ రవీంద్రభారత రాజ్యాంగంవృషణంఎలినార్ అస్ట్రోంభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభారత రాజ్యాంగ పీఠికశోభన్ బాబు నటించిన చిత్రాలుసంకటహర చతుర్థిపసుపుమదర్ థెరీసా2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుH (అక్షరం)తెలుగు వికీపీడియాషడ్రుచులుతెలుగు సినిమాలు డ, ఢకేంద్రపాలిత ప్రాంతంమండల ప్రజాపరిషత్🡆 More