యుయుత్సుడు

యుయుత్సుడు మహాభారతంలో ధృతరాష్ట్రునికి వైశ్య కన్యకయైన సుఖదకు జన్మించిన పుత్రుడు.

ధుర్యోధనునితో సమ వయస్కుడు. వంద మంది కౌరవులలో ఒకడు. మహాభారత యుద్ధం తరువాత కౌరవులలో జీవించియున్నది ఒక్క యుయుత్సుడు మాత్రమే. తరువాత ఇంద్రప్రస్థానికి రాజైనాడు.

యుయుత్సుడు
యుయుత్సుడు
యుయుత్సుడి చిత్రం
సమాచారం
లింగంపురుషుడు
ఆయుధంధనస్సు, బాణాలు
కుటుంబం
  • ధృతరాష్ట్రుడు (తండ్రి)
  • గాంధారికి దాసి (తల్లి)
  • గాంధారి (సవతి తల్లి)
  • దుర్యోధనుడు, దుశ్శాసనుడు, వికర్ణుడితో పాటు 100 మంది కొరవ సోదరులు
  • దుశ్శల (చెల్లెలు)

జననం

గాంధారి గర్భం దాల్చి రెండేళ్ళు గడిచినా సంతానం కలగక పోవడంతో ధృతరాష్ట్రుడు వైశ్య కన్యకయైన సుఖదను వివాహమాడి యుయుత్సుని పుత్రుడుగా పొందాడు. యుయుత్సుడు, దుర్యోధనుడు ఒకే రోజు జన్మించారు. మిగతా కౌరవులు, దుస్సల కన్నా ముందే జన్మించాడు.

ధర్మ నిరతుడు

ఒకసారి విషపు నీటి ప్రయోగం నుంచి భీముని కాపాడాడు. అలాగే ద్రౌపదీ వస్త్రాపహరణం సమయంలో అందరూ మౌనంగా ఉన్నా యుయుత్సుడు మాత్రమే దానిని వ్యతిరేకించాడు. మహాభారతం ధర్మయుద్ధం కావును అందులో పాల్గొనే ఇరు పక్షాల యోధులకు వారికి ధర్మం ఏ పక్షాన ఉందనిపిస్తుందో ఆ వైపుకి మారే అవకాశం ఉంది. యుద్ధ సమయంలో కౌరవులకు సమాచారం చేరవేయడంలో సహాయం చేశాడు. కౌరవుల యుద్ధ వ్యూహాలను ఎదుర్కోవడంలో పాండవులకు కూడా సహాయం చేశాడు.

గాంధారి మూడో కొడుకు వికర్ణుడు కూడా యుయుత్సుడితో సమానంగా ధర్మాచరణుడే. ధుర్యోదనుని కుటిల బుద్ధిని ద్వేషించిన వాడే కానీ ధర్మాన్ని అనుసరించి యుయుత్సుడు ధుర్యోధనుడిని విడిచి పెట్టాడు. వికర్ణుడు అన్నగారిని విడిచిపెట్ట లేక పోయాడు. ఇది రామాయణంలో విభీషణుడు, కుంభకర్ణుడు సంబంధం లాంటిది.

కురుక్షేత్రంలో

పాండవులకు, కౌరవులకూ కురుక్షేత్ర యుద్ధం ప్రారంభమవక ముందే యుయుత్సుడు పాండవుల పక్షానికి చేరాడు. వారి తరపునే పోరాడాడు. కౌరవ సైన్యంలో ఉన్న పదకొండు మంది అతిరథుల్లో (ఒక్కసారి పదివేల మందితో పోరాడగలిగినవాడు) యుయుత్సుడు కూడా ఒకడు. యుద్ధానంతరం పదకొండు మందిలో జీవించి ఉన్నది కూడా యుయుత్సుడే.

యుద్ధం అనంతరం

సంగ్రామం ముగిసిన తరువాత పాండవులు హిమాలయాలకు వెళుతూ చిన్నవాడైన రాజు పరీక్షిత్తుకు యుయుత్సుడిని సంరక్షకుడిగా నియమించారు. యాదవకులంలో ముసలం ప్రారంభం కాకమునుపే నగరంలో అరాచకం ప్రభలడం గమనించాడు యుయుత్సుడు. దాన్ని గురించి ప్రజలను అడగగా వారు అతని మీదే నిందలు వేసి ద్రోహిగా సొంత బంధువుల మరణానికి కారకుడిగా ముద్ర వేశారు. కలియుగం ప్రారంభమౌతుందన్న సూచనలు తెలుసుకొన్న ధర్మరాజు ఇంద్రప్రస్థానికి రాజుని చేశారు.

మూలాలు

Tags:

యుయుత్సుడు జననంయుయుత్సుడు ధర్మ నిరతుడుయుయుత్సుడు కురుక్షేత్రంలోయుయుత్సుడు యుద్ధం అనంతరంయుయుత్సుడు మూలాలుయుయుత్సుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

వై.యస్. రాజశేఖరరెడ్డియన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాజనసేన పార్టీదూదేకులతాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిశివలింగంవింధ్య విశాఖ మేడపాటిజో బైడెన్నందమూరి తారక రామారావుదత్తాత్రేయటిల్లు స్క్వేర్నాని (నటుడు)సుభాష్ చంద్రబోస్హైదరాబాదుసమాసంరేణూ దేశాయ్ప్రజాస్వామ్యంకనకదుర్గ ఆలయంపరశురాముడుపాలపిట్టస్వాతి నక్షత్రముచాట్‌జిపిటిఅల్యూమినియంఆవుబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుఇండియన్ ప్రీమియర్ లీగ్వికలాంగులుసమాచార హక్కుపొడుపు కథలురేబిస్సెక్స్ (అయోమయ నివృత్తి)వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిఆపరేషన్ పోలోప్రశ్న (జ్యోతిష శాస్త్రము)వావిలినరసింహావతారంహస్త నక్షత్రముఆంధ్రప్రదేశ్ గవర్నర్ల జాబితానోబెల్ బహుమతికొణతాల రామకృష్ణఅదితిరావు హైదరీక్లోమముగోత్రాలు జాబితాసౌర కుటుంబంమొఘల్ సామ్రాజ్యంతెలుగుదేశం పార్టీవిజయ్ (నటుడు)వృషణంనాయీ బ్రాహ్మణులుఆక్యుపంక్చర్గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుఅనుష్క శెట్టివిశాఖ నక్షత్రమునంద్యాల వరదరాజులరెడ్డిపౌరుష గ్రంధి క్యాన్సర్తెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాభారతదేశంఇత్తడిభారతీయ జనతా పార్టీకన్నెగంటి బ్రహ్మానందంగాయత్రీ మంత్రంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకాకతీయులుపర్యాయపదంశ్రీ గౌరి ప్రియపక్షవాతంకరక్కాయమాగుంట శ్రీనివాసులురెడ్డిట్రూ లవర్వరలక్ష్మి శరత్ కుమార్ఆపిల్దక్షిణ భారతదేశంఅశ్వగంధఅమ్మతెలుగులో అనువాద సాహిత్యంవృశ్చిక రాశిఅమెరికా సంయుక్త రాష్ట్రాలు🡆 More