మరుగుజ్జు

మరుగుజ్జు (Dwarf) అనగా పొట్టి ఆకారం గల మనిషి.

ఒక వ్యక్తి యొక్క ఇలాంటి స్థితిని మరుగుజ్జుతనం (Dwarfism) అంటారు. ఎవరైనా యవ్వనంలో 4 అడుగుల 10 అంగుళాల ఎత్తుకంటే తక్కువ ఎత్తు ఉంటే వారిని మరుగుజ్జు అని వ్యవహరిస్తారు. 70% మరుగుజ్జుతనం ఎముకలు సరిగ్గా పెరగకుండా ఉండటం వల వస్తుంది. దీనినే వైద్య పరిభాషలో అకోండ్రోప్లేసియా అని వ్యవహరిస్తారు. అంటే శరీరంలో ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ భాగాలు, మిగతా భాగాలతో పోలిస్తే బాగా పెద్దవిగా లేదా బాగా చిన్నవిగా ఉంటాయి.

మరుగుజ్జు
మరుగుజ్జు వ్యక్తి

కారణాలు

మరుగుజ్జు తనం కలగడానికి చాలా వైవిధ్యమైన కారణాలున్నాయి. కానీ అకాండ్రోప్లేసియా, గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ అనేవి దీనికి ప్రధాన కారణాలుగా గుర్తించడం జరిగింది.

అకాండ్రోప్లేసియా

కొన్ని జన్యుపరమైన కారణాల వల్ల ఎముకల పెరుగదల ఆగిపోతుంది. ప్రపంచంలో మరుగుజ్జులలో 70% మంది దీనివల్లే ప్రభావితులైనట్లు అంచనా.

గ్రోత్ హార్మోన్ డెఫిషియన్సీ

శరీరంలో గ్రోత్ హార్మోన్ సరిపడినంతగా విడుదల కాకపోవడం వలన కూడా మురుగుజ్జుతనం సంక్రమిస్తుంది.

ఇతర కారణాలు

నివారణ

మరుగుజ్జులుగా జన్మించేవారు జన్యులోపాలతో పుట్టడం మూలాన దీన్ని ముందుగానే నివారించడం దాదాపు అసాధ్యమనే చెప్పవచ్చు. మరుగుజ్జు తనాన్ని కలుగజేసే అనేక కారణాల్ని శాస్త్రవేత్తలు కనిపెట్టి ఉండటం మూలాన ఒక శిశువు మరుగుజ్జుగా జన్మిస్తాడనేది కచ్చితంగా చెప్పలేము. అయితే దీన్ని కలుగజేసే పోషకాహార లేమి, హార్మోన్ల సమతుల్యతలోలో లోపం మొదలైన కారణాలను సరైన ఆహార పద్ధతుల ద్వారా, హార్మోన్ థెరపీ ద్వారా కొంత వరకు నివారించవచ్చు.

సాహిత్యం

మరుగుజ్జుతనాన్ని ఆధారంగా చేసుకుని పాశ్చాత్య సాహిత్యంలోనూ, భారతీయ జానపద కథల్లోనూ చాలా రచనలు ప్రచురింపబడ్డాయి. గల్లివర్ ట్రావెల్స్ అనే ప్రసిద్ధి గాంచిన ఆంగ్ల రచనలో వీరి గురించిన ప్రస్తావన ఉంది.

మూలాలు

మరుగుజ్జు 
వికీమీడియా కామన్స్‌లో కి సంబంధించిన మీడియా ఉంది.

Tags:

మరుగుజ్జు కారణాలుమరుగుజ్జు నివారణమరుగుజ్జు సాహిత్యంమరుగుజ్జు మూలాలుమరుగుజ్జు Weblinksమరుగుజ్జు

🔥 Trending searches on Wiki తెలుగు:

కోయంబత్తూరుమియా ఖలీఫాతట్టునడుము నొప్పిఛత్రపతి శివాజీఏ.పి.జె. అబ్దుల్ కలామ్వాల్మీకిఎలినార్ అస్ట్రోంజర్మన్ షెపర్డ్అమెజాన్ నదినెల్లూరువై. ఎస్. విజయమ్మఅక్కినేని నాగార్జున నటించిన చిత్రాలుతిరుమలఉదయకిరణ్ (నటుడు)మోదుగపార్లమెంట్ సభ్యుడుఓం భీమ్ బుష్నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డితాజ్ మహల్భారత స్వాతంత్ర్యోద్యమంమకరరాశివిశాఖ నక్షత్రముచతుర్యుగాలుపాడుతా తీయగా (సినిమా)సెయింట్ లూసియాకరోనా వైరస్ 2019వెలమశాసన మండలికుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంసీతమ్మ అందాలు రామయ్య సిత్రాలుభారతదేశ జిల్లాల జాబితాతెలంగాణ ఉద్యమంహన్సిక మోత్వానీసూర్యుడురాగంతెలుగుదేశం పార్టీకంప్యూటరుభరణి నక్షత్రముభారత జాతీయపతాకంఅమెరికా సంయుక్త రాష్ట్రాలుఆక్యుపంక్చర్న్యూయార్క్గజేంద్ర మోక్షంవస్తు, సేవల పన్ను (జీఎస్టీ)విజయశాంతిచిత్తూరు నాగయ్యవిటమిన్ బీ12పౌరుష గ్రంధి క్యాన్సర్ఆది శంకరాచార్యులుఢిల్లీ డేర్ డెవిల్స్సామెతల జాబితాస్మృతి మందానభీమా (2024 సినిమా)కలబందసమ్మక్క సారక్క జాతరచిరంజీవిమలబద్దకంసచిన్ టెండుల్కర్వామువై.యస్.అవినాష్‌రెడ్డిభారతీయ జనతా పార్టీపరిపూర్ణానంద స్వామిపూజా హెగ్డేఊరు పేరు భైరవకోనశ్రీవిష్ణు (నటుడు)పెరిక క్షత్రియులుసూర్యుడు (జ్యోతిషం)కడియం శ్రీహరిసెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్అలసందపాల కూరచిరంజీవి నటించిన సినిమాల జాబితాకాలేయంసుహాసిని (జూనియర్)ఆర్థిక శాస్త్రంఆపిల్ఇత్తడి🡆 More