బిల్లీ ది కిడ్

బిల్లీ ది కిడ్ (జననం హెన్రీ మెక్‌కార్టీ ; 1859 సెప్టెంబర్ 17 లేదా నవంబర్ 23 – జూలై 14, 1881), విలియం హెచ్.

బోనీ అనే మారుపేరుతో కూడా పిలుస్తారు, అతను అమెరికన్ ఓల్డ్ వెస్ట్ ప్రాంతానికి చెందిన నేరస్తుడు, గన్‌ఫైటర్. ఎనిమిదిమంది వ్యక్తులను చంపిన బిల్లీ ది కిడ్ 21 సంవత్సరాల వయసులో తుపాకీ కాల్పుల్లో దెబ్బతిని చనిపోయాడు అతను న్యూ మెక్సికోలో లింకన్ కౌంటీ యుద్ధంలో కూడా పోరాడాడు, ఆ సమయంలో మూడు హత్యలు చేసాడని ఆరోపణలు ఉన్నాయి.

Billy the Kid
బిల్లీ ది కిడ్
బిల్లీ ది కిడ్ ఫోటోగ్రాఫ్ (సుమారు 1880లో)
జననం
హెన్రీ మెకార్తీ

1859
న్యూయార్క్ సిటీ, న్యూయార్క్ (రాష్ట్రం)
మరణం1881 జూలై 14(1881-07-14) (వయసు 21–22)
ఫోర్ట్ సమ్‌నర్
మరణ కారణంతుపాకీ కాల్పుల వల్ల జరిగిన గాయంతో
సమాధి స్థలంఓల్డ్ ఫోర్ట్ సమ్‌నర్ సెమెంటరీ
34°24′13″N 104°11′37″W / 34.40361°N 104.19361°W / 34.40361; -104.19361 (బిల్లీ ది కిడ్ గ్రేవ్‌సైట్)
ఇతర పేర్లువిలియమ్ హెచ్. బోనీ, హెన్రీ ఆంట్రిమ్, కిడ్ ఆంట్రిమ్
వృత్తి
ఎత్తు5 ft 7 in (1.70 m) at age 17

మెక్‌కార్తీ 15 సంవత్సరాల వయస్సులో అనాథ అయ్యాడు. 1875లో 16 సంవత్సరాల వయస్సులో అతను ఆహారాన్ని దొంగిలించినందుకు మొట్టమొదటిసారి అరెస్టయ్యాడు. పది రోజుల తరువాత, ఒక చైనీస్ లాండ్రీని దోచుకుని మళ్లీ అరెస్టు అయ్యాడు. కానీ, ఈసారి కొద్దిసేపటికే అరెస్టు నుంచి తప్పించుకుని న్యూ మెక్సికో ప్రాంతం నుండి పొరుగున ఉన్న ఆరిజోనా ప్రాంతానికి పారిపోయాడు. అలా పరారీగానూ, చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేసి చట్టం నుంచి తప్పించుకుని జీవించే "ఔట్‌లా"గానూ మారాడు. 1877లో, అతను తనకు తాను "విలియం హెచ్. బోనీ" అన్న పేరు పెట్టుకుని ఆ పేరుతో చలామణీ కావడం ప్రారంభించాడు. 1875 సెప్టెంబర్ 23 నాటి వాంటెడ్ పోస్టర్‌లోని రెండు వెర్షన్లు, అతన్ని "బిల్లీ ద కిడ్‌గా పేరొందిన Wm. రైట్" అని పేర్కొన్నాయి. 

1877 ఆగస్టులో జరిగిన గొడవలో ఒక కమ్మరిని చంపడంతో, మెక్‌కార్తీ అరిజోనాలోనూ వాంటెడ్ మాన్ కావడంతో న్యూ మెక్సికోకు తిరిగి వచ్చాడు. అక్కడ అతను పశువుల దళారుల జట్టులో చేరాడు. న్యూమెక్సికోలోని లింకన్ కౌంటీ ప్రాంతంలోని పశువుల శాలల (ర్యాంచ్) యజమానులు, కౌబాయ్‌ల నుంచి కొందరు రెగ్యులేటర్లుగా ఏర్పడి వ్యవహారాలు నియంత్రించేవారు. ఈ రెగ్యులేటర్ల గుంపులో బిల్లీ ద కిడ్ చేరాడు. పశువుల వ్యాపారంలో లాభాల విషయంలో జరిగిన వివాదాలు ముదిరి రెండు ప్రత్యర్థి రెగ్యులేటర్ల గుంపు మధ్య 1878లో ఘర్షణ జరిగింది. ఇది లింకన్ కౌంటీ యుద్ధం అని పేరొందింది. ఈ లింకన్ కౌంటీ యుద్ధంలో పాల్గొన్నప్పుడు అతను న్యూమెక్సికో ప్రాంతంలో బాగా పేరు పొందాడు. లింకన్ కౌంటీ షెరీఫ్ విలియం J. బ్రాడిని, అతని సహాయకుడిని సహా మొత్తం ముగ్గురిని చంపినట్లు అతనిపైనా, మరో ఇద్దరు రెగ్యులేటర్ల పైనా తర్వాత అభియోగాలు వచ్చాయి.

1880 డిసెంబరులో న్యూమెక్సికోలోని లాస్ వెగాస్‌కి చెందిన లాస్ వెగాస్ గెజిట్, న్యూయార్క్ నగరంలోని ది సన్ పత్రికలు అతని నేరాల గురించి కథనాలను ప్రచురించాయి. దీనివల్ల మెక్‌కార్తీ నేరస్తునిగా చాలా ప్రాచుర్యం పొందాడు. ఆ నెల తర్వాత షెరీఫ్ పాట్ గారెట్ మెక్‌కార్తీని పట్టుకోగలిగాడు. 1881 ఏప్రిల్లో మెక్‌కార్తీని బ్రాడీ హత్య గురించి విచారించి దోషిగా నిర్ధారించారు. ఆ ఏడాది మేలో ఇతనికి ఉరిశిక్ష విధించారు. అయితే, ఇంతలోగానే అతను ఏప్రిల్ 28న జైలు నుండి తప్పించుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు షెరీఫ్ డిప్యూటీలను చంపాడు. తర్వాత రెండు నెలలకు పైగా పట్టుబడకుండా తప్పించుకున్నాడు. గారెట్ 1881 జూలై 14న ఫోర్ట్ సమ్మర్‌లో మెక్‌కార్తీని కాల్చి చంపాడు. మరణించేనాటికి అతని వయసు 21.

అతని మరణం తరువాతి దశాబ్దాలలో, మెక్‌కార్తీ ప్రాణాలతో బయటపడినట్లు కథనాలు పెరిగాయి. చాలామంది వ్యక్తులు తామే మెక్‌కార్తీ అని చెప్పుకున్నారు. బిల్లీ ద కిడ్ అమెరికా, ఇతర పాశ్చాత్య దేశాలకు చెందిన సాహిత్యం, సినిమా, డ్రామా, టెలివిజన్ వంటి అనేక రూపాల్లో ప్రాచుర్యం పొందాడు. బిల్లీ ద కిడ్‌ పాత్రతో వచ్చిన సినిమాలు 50 కన్నా ఎక్కువ ఉండగా, టెలివిజన్ సీరీస్‌లు కూడా ఇంకెన్నో ఉన్నాయి.

నోట్స్

మూలాలు

Tags:

అమెరికా సంయుక్త రాష్ట్రాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

శాసనసభపూజా హెగ్డేగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుపంచభూతలింగ క్షేత్రాలు2009 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుముదిరాజ్ (కులం)దివ్యభారతిగజేంద్ర మోక్షంపుష్పవై.ఎస్.వివేకానందరెడ్డిరత్నం (2024 సినిమా)కీర్తి రెడ్డిసాహిత్యంపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితెలంగాణసెక్స్ (అయోమయ నివృత్తి)నామనక్షత్రముజ్యోతీరావ్ ఫులేవారాహిపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిసచిన్ టెండుల్కర్అంగారకుడుచదలవాడ ఉమేశ్ చంద్రఇంద్రుడుబి.ఆర్. అంబేద్కర్జాంబవంతుడువిశ్వామిత్రుడుస్వాతి నక్షత్రముసౌందర్యఛత్రపతి శివాజీప్రపంచ మలేరియా దినోత్సవంఓం భీమ్ బుష్మకరరాశిమహర్షి రాఘవమలబద్దకంమీనాక్షి అమ్మవారి ఆలయంస్త్రీవాదంబ్రాహ్మణులునవరసాలుసామెతల జాబితానిర్మలా సీతారామన్గుణింతంహైదరాబాదుAరాజంపేటభారత రాష్ట్రపతివినుకొండమండల ప్రజాపరిషత్వరంగల్ లోక్‌సభ నియోజకవర్గంనారా చంద్రబాబునాయుడుభారత రాజ్యాంగంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులునామవాచకం (తెలుగు వ్యాకరణం)గౌడపెరిక క్షత్రియులునువ్వు వస్తావనిఉత్పలమాలసంగీతంనామినేషన్తొలిప్రేమపేర్ని వెంకటరామయ్యతిక్కనటిల్లు స్క్వేర్సిద్ధు జొన్నలగడ్డఫిరోజ్ గాంధీఉగాదిచంద్రుడుజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంనందమూరి తారక రామారావులోక్‌సభ నియోజకవర్గాల జాబితావిభక్తిరావణుడుశక్తిపీఠాలుక్రికెట్అర్జునుడుఋగ్వేదంఆతుకూరి మొల్లపెళ్ళిపూర్వాభాద్ర నక్షత్రము🡆 More