బిపిన్ రావత్: భారత ఆర్మీ మాజీ చీఫ్

బిపిన్ లక్ష్మణ్ సింగ్ రావత్ (16 మార్చి 1958 - 8 డిసెంబర్ 2021)భారతీయ సైనిక అధికారి.

జనవరి 2020 నుండి డిసెంబర్ 2021లో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించే వరకు భారత సాయుధ దళాల మొదటి చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (CDS) గా పనిచేశాడు.ఆయనకు భారత ప్రభుత్వం 2021లో పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.

బిపిన్ రావత్
బిపిన్ రావత్

బిపిన్ రావత్


1వ భారత త్రివిధ దళాల దళాధిపతి
పదవీ కాలం
2020 జనవరి 1 (2020-01-01) – 8 డిసెంబరు 2021 (2021-12-08)
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
ముందు నూతనంగా ఏర్పాటు చేశారు
తరువాత అనిల్ చౌహాన్

వ్యక్తిగత వివరాలు

జననం (1958-03-16)1958 మార్చి 16
ఉత్తరాఖండ్‌, పౌరీ జిల్లా ,భారతదేశం
మరణం 2021 డిసెంబరు 8(2021-12-08) (వయసు 63)
కూనూర్, తమిళనాడు, భారతదేశం
జాతీయత భారతీయులు
జీవిత భాగస్వామి మధులిక రావత్‌
సంతానం కృతిక, తారిణి
పురస్కారాలు *పరమ విశిష్ట సేవా పతకం
  • ఉత్తమ యుద్ధ సేవా పతకం
  • ఉత్తమ యుద్ధ సేవా పతకం
  • అతి విశిష్ట సేవా పతకం
  • యుద్ధ సేవా పతకం
  • సేవా పతకం
  • విశిష్ట సేవా పతకాలను
బిపిన్ రావత్: విద్యాభ్యాసం, సైన్యాధిపతి హోదాలో, సైన్యంలో ఎదిగిన తీరు
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతులమీదుగా పద్మ విభూష‌ణ్‌ అవార్డు అందుకున్న బిపిన్‌ రావత్‌ కుమార్తెలు కృతిక, తారిణి


బిపిన్ రావత్ |ఉత్తరాఖండ్‌లోని పౌరీ జిల్లాలో 16 మార్చి, 1958న జన్మించారు. సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్ పాఠశాలలో, లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో చదువుకున్నారు. 1978 డిసెంబర్‌లో డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లోని పదకొండవ గూర్ఖా రైఫిల్స్ విభాగంలో ఐదవ రెజిమెంట్‌లో చేరారు. డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఆర్మీ ట్రైనింగ్ సెంటర్‌లో ఇండియన్ ఆర్మీ డైరెక్టరేట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్‌తో సహా శిక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. 2016 డిసెంబర్‌లో కమాండర్ ఇన్ చీఫ్‌గా నియమితులయ్యారు.

విద్యాభ్యాసం

రావత్ డెహ్రాడూన్‌లోని కేంబ్రియన్ హాల్ స్కూల్‌లో, సిమ్లాలోని సెయింట్ ఎడ్వర్డ్స్ స్కూల్‌లో విద్యను అభ్యసించారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఖడక్వాస్లా, ఇండియన్ మిలిటరీ అకాడమీ, డెహ్రాడూన్‌లో చేరారు. రావత్ డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్, వెల్లింగ్‌టన్‌, యునైటెడ్ స్టేట్స్ ఆర్మీ కమాండ్‌, కాన్సాస్‌లోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లోని జనరల్ స్టాఫ్ కాలేజీలో ఉన్నత కమాండ్ కోర్సులో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. 2011లో మీరట్‌లోని చౌదరి చరణ్ సింగ్ యూనివర్శిటీ ఆయనకు సైనిక-మీడియా వ్యూహాత్మక అధ్యయనాలపై చేసిన పరిశోధనలకు డాక్టరేట్ ఆఫ్ ఫిలాసఫీని ప్రదానం చేసింది. చెన్నై యూనివర్సిటీ నుంచి డిఫెన్స్ స్టడీస్‌లో ఎంఫిల్ పట్టా పొందారు. మేనేజ్‌మెంట్, కంప్యూటర్ సైన్స్‌లో బ్యాచిలర్ డిగ్రీ చేశారు. అమెరికాలోని ఫోర్ట్ లీవెన్‌వర్త్‌లో సైనిక కమాండర్లకు ఇచ్చిన శిక్షణా తరగతులు హాజరయ్యారు.

సైన్యాధిపతి హోదాలో

సైన్యాధిపతి హోదాలో రావత్‌ అనేక సంస్కరణలు చేపట్టారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు కఠిన విధానాన్ని తెచ్చారు. సిమ్లాలోని సెయింట్‌ ఎడ్వర్డ్‌ పాఠశాలలో చదివిన రావత్‌ ప్రతిష్ఠాత్మక నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీ ద్వారా సైన్యంలోకి ఎంపికయ్యారు. శిక్షణ తర్వాత 1978 డిసెంబర్‌లో గూర్ఖా రైఫిల్స్‌ రెజిమెంట్‌లో అధికారిగా చేరారు. అనేక ప్రాంతాల్లో, వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించారు.

సైన్యంలో ఎదిగిన తీరు

  • సెకండ్‌ లెఫ్టినెంట్‌: 1978 డిసెంబర్‌ 16
  • లెఫ్టినెంట్‌: 1980 డిసెంబర్‌ 16
  • కెప్టెన్‌: 1984 జూలై 31
  • మేజర్‌: 1989 డిసెంబర్‌ 16
  • లెఫ్టినెంట్‌ కల్నల్‌: 1998 జూన్‌ 1
  • కల్నల్‌: 2003 ఆగస్టు 1
  • బ్రిగేడియర్‌: 2007 అక్టోబర్‌ 1
  • మేజర్‌ జనరల్‌: 2011 అక్టోబర్‌ 20
  • లెఫ్టినెంట్‌ జనరల్‌: 2014 జూన్‌ 1
  • జనరల్‌(సీఓఏఎస్‌): 2017 జనవరి 1
  • జనరల్‌(సీడీఎస్‌): 2019 డిసెంబర్‌ 31

పురస్కారాలు

రక్షణశాఖలో రావత్‌ అదించిన సేవలకు గాను.. భారత ప్రభుత్వం పరమ విశిష్ట సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం, ఉత్తమ యుద్ధ సేవా పతకం అతి విశిష్ట సేవా పతకం, అతి విశిష్ట సేవా పతకం, యుద్ధ సేవా పతకం, సేవా పతకం, విశిష్ట సేవా పతకాలను పొందారు. 2022

సంవత్సరానికి గానూ బిపిన్‌ రావత్‌ కు భారత ప్రభుత్వం పద్మ విభూషణ్‌ పురస్కారాన్ని ప్రకటించింది. 

మరణం

తమిళనాడులో ఆర్మీ హెలికాప్టర్‌ ప్రమాదవశాత్తూ మరణించారు. హెలికాప్టర్‌లో బిపిన్‌ రావత్‌తో పాటు, ఆయన సతీమణి మధులిక రావత్‌, ఆర్మీ ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్‌ కాలేజీలో లెక్చర్‌ ఇచ్చేందుకు డిసెంబరు 8, 2021న ఉదయం రావత్‌ దంపతులు, ఇతర ఆర్మీ అధికారులతో కలిసి ప్రత్యేక విమానంలో దిల్లీ నుంచి తమిళనాడు వెళ్లారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో సూలూరు ఎయిర్‌బేస్‌ నుంచి ఆర్మీ హెలికాప్టర్‌లో వెల్లింగ్టన్‌ వెళ్తుండగా ప్రమాదవశాత్తూ కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న 14 మందిలో రావత్‌ దంపతులు సహా పదమూడు మంది మృతిచెందినట్లు వాయుసేన అధికారికంగా ధ్రువీకరించింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన గ్రూప్‌ కెప్టెన్‌ వరుణ్‌ సింగ్‌ చికిత్స పొందుతున్నారు.

మూలాలు

Tags:

బిపిన్ రావత్ విద్యాభ్యాసంబిపిన్ రావత్ సైన్యాధిపతి హోదాలోబిపిన్ రావత్ సైన్యంలో ఎదిగిన తీరుబిపిన్ రావత్ పురస్కారాలుబిపిన్ రావత్ మరణంబిపిన్ రావత్ మూలాలుబిపిన్ రావత్పద్మ విభూషణ్ పురస్కారం

🔥 Trending searches on Wiki తెలుగు:

చిత్త నక్షత్రముఆరణి శ్రీనివాసులుసమంతముఖేష్ అంబానీవంగా గీతఅరవింద్ కేజ్రివాల్పార్లమెంట్ సభ్యుడుపక్షముమాల (కులం)ఏ.పి.జె. అబ్దుల్ కలామ్వన్ ఇండియాసైంధవుడుఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థకిరణజన్య సంయోగ క్రియLట్రావిస్ హెడ్అశ్వగంధవిష్ణువుజమ్మి చెట్టువిజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంఆతుకూరి మొల్లశ్రీవిష్ణు (నటుడు)గేమ్ ఛేంజర్పి.వెంక‌ట్రామి రెడ్డిద్వాదశ జ్యోతిర్లింగాలుఉత్తరాషాఢ నక్షత్రముడోర్నకల్కుండలేశ్వరస్వామి దేవాలయంఅలంకారంరామోజీరావుయేసురోగ నిరోధక వ్యవస్థగన్నేరు చెట్టువడ్డీతెలంగాణా బీసీ కులాల జాబితామూర్ఛలు (ఫిట్స్)రాశితెలంగాణసావిత్రి (నటి)గోకర్ణవిజయశాంతికోల్‌కతా నైట్‌రైడర్స్భారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుగంగా నదిరాకేష్ మాస్టర్రోహిత్ శర్మతెలుగు అక్షరాలుశ్రీరామనవమిట్రూ లవర్ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాతెలంగాణ లోక్‌సభ నియోజకవర్గాల జాబితారామదాసుగాంధీఇండోనేషియాప్రకృతి - వికృతిమానసిక శాస్త్రంభారతదేశ చరిత్రగుంటూరునాగార్జునసాగర్తిరుమలఉమ్మెత్తవై.యస్.అవినాష్‌రెడ్డిప్రకటనహరే కృష్ణ (మంత్రం)తెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్రైతుబంధు పథకంచింతశాంతికుమారిపవన్ కళ్యాణ్రజినీకాంత్నువ్వు లేక నేను లేనుగుమ్మడిపుట్టపర్తి నారాయణాచార్యులుబేతా సుధాకర్శతక సాహిత్యముమాగంటి గోపీనాథ్ఆంధ్రప్రదేశ్వింధ్య విశాఖ మేడపాటిగుడ్ ఫ్రైడే🡆 More