జాకిర్ హుసేన్: భారత 3వ రాష్ట్రపతి

జాకిర్ హుస్సేన్ (ఫిబ్రవరి 8, 1897 - మే 3, 1969), భారత 3వ రాష్ట్రపతి (మే 13 1967 నుండి 1969 మే 3 న మరణించినంతవరకు)

జాకీర్ హుసేన్
జాకిర్ హుసేన్

1998 పోస్ట్ స్టాంప్‌పై హుస్సేన్ చిత్రం


పదవీ కాలం
13 మే 1967 – 3 మే 1969
ప్రధాన మంత్రి ఇందిరా గాంధీ
ఉపరాష్ట్రపతి వి. వి. గిరి
ముందు సర్వేపల్లి రాధాకృష్ణన్
తరువాత వి. వి. గిరి (తాత్కాలిక)

2వ భారత ఉపరాష్ట్రపతి
పదవీ కాలం
1962 మే 13 – 1967 మే 12
అధ్యక్షుడు సర్వేపల్లి రాధాకృష్ణన్
ప్రధాన మంత్రి జవాహర్ లాల్ నెహ్రూ
లాల్ బహాదుర్ శాస్త్రి
ఇందిరా గాంధీ
ముందు సర్వేపల్లి రాధాకృష్ణన్
తరువాత వి. వి. గిరి

బీహార్ గవర్నరు
పదవీ కాలం
6 జూలై 1957 – 11 మే 1962
ముందు ఆర్.ఆర్.దివాకర్
తరువాత ఎం.ఎ.అయ్యంగార్

వ్యక్తిగత వివరాలు

జననం (1897-02-08)1897 ఫిబ్రవరి 8
హైదరాబాదు, హైదరాబాదు రాష్ట్రం, బ్రిటిష్ ఇండియా
(ప్రస్తుతం తెలంగాణ, భారతదేశము)
మరణం 1969 మే 3(1969-05-03) (వయసు 72)
న్యూఢిల్లీ, భారతదేశం
రాజకీయ పార్టీ స్వతంత్రుడు
జీవిత భాగస్వామి షాజహాన్ బేగం
పూర్వ విద్యార్థి HMS ఇస్లామియా, ఎట్‌వాత్
ఆలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం
ఢిల్లీ విశ్వవిద్యాలయం
హంబోల్ట్ విశ్వవిద్యాలయం, బెర్లిన్
పురస్కారాలు జాకిర్ హుసేన్: భారత 3వ రాష్ట్రపతి Bharat Ratna (1963)

హుసేన్ హైదరాబాదు (భారతదేశం) లో జన్మించాడు. ఇతని తండ్రి పఖ్తూన్ జాతికి చెందినవాడు. ఇతడు హైదరాబాదు నుండి ఉత్తర ప్రదేశ్ లోని ఫరూఖాబాద్ జిల్లా ఖాయిమ్ గంజ్ కు వలస వచ్చాడు. హుసేన్ ఇటావా (ఉత్తరప్రదేశ్) లోని 'ఇస్లామియా ఉన్నత పాఠశాల' లో చదువుకున్నాడు, ఉన్నతవిద్య అలీఘర్ లోని ఆంగ్లో మహమ్మడన్ ఓరియంటల్ కాలేజిలో అభ్యసించాడు. ఇచట విద్యార్థిసంఘ నాయకుడిగా గుర్తింపబడ్డాడు.

హుసేన్ 23 సంవత్సరాల వయస్సులో ఢిల్లీ దగ్గర, ఒక జాతీయముస్లింవిశ్వవిద్యాలయాన్ని స్థాపించి, దానికి జామియా మిల్లియా ఇస్లామియా అనే పేరు పెట్టాడు. తరువాత ఇతను విత్తశాస్త్రంలో పి.హెచ్.డి. చేసేందుకు, 'బెర్లిన్ విశ్వవిద్యాలయానికి (జర్మనీ) వెళ్ళాడు. జర్మనీలో ఉన్నప్పుడు గాలిబ్ (1797-1868) జీవితగాధ, కవితాసంగ్రహాలను క్రోడీకరించాడు. భారతదేశానికి తిరిగి వచ్చి, జామియా మిల్లియా ఇస్లామియాకు మార్గదర్శకుడిగా మారాడు.

బ్రిటిష్ వారితో పోరాటానికి, మహాత్మా గాంధీతో చేతులుకలిపి, "బేసిక్ విద్య" పై కఠోర పరిశ్రమ చేశాడు. భారతదేశంలో విద్యాభ్యుదయానికి శ్రమించాడు. ఈ కాలంలో హుసేన్ ఉత్తమ దార్శనికుడిగా, భారత విద్యావిభాగ మార్గదర్శకునిగా గుర్తింపు పొందాడు. తమ రాజకీయ ప్రత్యర్థియైన మహమ్మద్ అలీ జిన్నా చేతగూడా పొగడబడ్డాడు. తన వ్యక్తిగత సంపదనంతా భారతదేశానికి ధారబోసిన దేశభక్తుడు.

భారత స్వాతంత్ర్యం తరువాత, అలీఘర్ ముస్లిం యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ పదవికి అంగీకరించాడు. స్వాతంత్ర్యం వచ్చిన ప్రథమ దశలో విద్యార్థుల ఉద్యమాలను, ముఖ్యంగా అలీఘర్ లో, అదుపులో ఉంచుటకు, ఇతని నియామకం ఎంతో ఉపయోగపడింది. వైస్ ఛాన్సలర్ పదవీకాలం ముగిసిన తరువాత 1956 లో పార్లమెంటు సభ్యునిగా నామినేట్ చేయబడ్డాడు. 1957 లో బీహారు గవర్నరుగా నియమింపబడి, పార్లమెంటుకు రాజీనామాచేశాడు.

బీహారు గవర్నరుగా 1957 నుండి 1962 వరకు సేవలందించిన తరువాత 1962 నుండి 1967 వరకు భారత ఉప రాష్ట్రపతి పదవిని అలంకరించాడు. తదనంతరం మే 13 1967 న భారతరాష్ట్రపతిగా ఎన్నుకోబడ్డాడు. ఇతని ప్రథమ ఉపన్యాసంలో "మొత్తం భారతదేశం నా ఇల్లు, ప్రజలందరూ నా కుటుంబం" అని పేర్కొన్నాడు. అత్యల్పకాలం రాష్ట్రపతి పదవి నిర్వహించిన మొదటి వ్యక్తి. రాష్ట్రపతి పదవిలో ఉండగా మరణించిన మొదటి వ్యక్తి కూడా ఆయనే. (ఇప్పటి వరకు ఇద్దరు రాష్ట్రపతులు పదవిలో ఉండగా మరణించారు - డా.జాకీర్ హుస్సేన్, ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ). ఈయన చేసిన సేవలకు కేంద్ర ప్రభుత్వం 1963 లో ‘భారతరత్న’ పురస్కారాన్ని అందించింది.

ఇవి కూడా చూడండి

మూలాలు

ఇతను రాష్టపతి పదవీకాలంలో మరణించిన ప్రథమ రాష్ట్రపతి, ( 1969 మే 3)

ఇంతకు ముందు ఉన్నవారు:
{{{ముందరి}}}
భారత రాష్ట్రపతి
1967 మే 131969 మే 3
తరువాత వచ్చినవారు:
{{{తరువాతి}}}


Tags:

189719671969ఫిబ్రవరి 8మే 13మే 3

🔥 Trending searches on Wiki తెలుగు:

కామినేని శ్రీనివాసరావుతొలిప్రేమరజినీకాంత్వై.ఎస్. జగన్మోహన్ రెడ్డిప్రభాస్యోగి ఆదిత్యనాథ్భారతీయ జనతా పార్టీరోహిణి నక్షత్రంభారతదేశంలో సెక్యులరిజంఅరుణాచలంవైఫ్ ఆఫ్ రణసింగంకాకతీయుల శాసనాలురాజ్యసభభరణి నక్షత్రముకేంద్రపాలిత ప్రాంతంతేటగీతికడియం కావ్యభువనగిరిచదరంగం (ఆట)చాకలిమానవ హక్కులుపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితాసౌర కుటుంబంభారత జాతీయపతాకంవికీపీడియానువ్వు లేక నేను లేనుజే.సీ. ప్రభాకర రెడ్డిబెంగళూరుపాల్కురికి సోమనాథుడుఅ ఆసంకటహర చతుర్థిశ్రీశైలం (శ్రీశైలం మండలం)క్లోమమునిర్మలా సీతారామన్అమెరికా సంయుక్త రాష్ట్రాలుపొంగులేటి శ్రీనివాస్ రెడ్డిరామసహాయం సురేందర్ రెడ్డిగోదావరికన్యకా పరమేశ్వరిమంతెన సత్యనారాయణ రాజుమంద జగన్నాథ్తెలంగాణ గవర్నర్ల జాబితాభలే మంచి రోజుతెలుగు విద్యార్థిముదిరాజ్ (కులం)అన్నవరంఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్వాతి నక్షత్రముఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంఅనుష్క శెట్టివినోద్ కాంబ్లీరైతుబంధు పథకంవర్షంబైండ్లమత్తేభ విక్రీడితముద్వంద్వ సమాసముభగవద్గీతఋతువులు (భారతీయ కాలం)పాండవులుగోత్రాలుమహాభారతంప్రబంధముభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలుజెర్రి కాటుపాలకొల్లు శాసనసభ నియోజకవర్గంహైదరాబాదుయనమల రామకృష్ణుడునరసింహావతారంసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్కమ్యూనిజంలక్ష్మీనారాయణ వి వికుతుబ్ షాహీ సమాధులుఅక్కినేని నాగార్జునవై.యస్.రాజారెడ్డిపూజా హెగ్డేఅమెరికా రాజ్యాంగం🡆 More