ఝాన్సీ: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని పట్టణం

ఝాన్సీ, ఉత్తర ప్రదేశ్‌లోని చారిత్రిక నగరం.

ఇది రాష్ట్రంలో దక్షిణాన, బుందేల్ఖండ్ ప్రాంతంలో పహుజ్ నది ఒడ్డున ఉంది. ఝాన్సీ జిల్లాకు, ఝాన్సీ విభాగానికి ఇది ముఖ్య పట్టణం. బుందేల్‌ఖండ్ ముఖ ద్వారం అని ఈ నగరాన్ని పిలుస్తారు, ఝాన్సీ పహుజ్, బెట్వా నదుల సమీపంలో సముద్రమట్టం నుండి 285 మీటర్ల ఎత్తున ఉంది. ఇది సుమారు న్యూ ఢిల్లీ నుండి సుమారు 420 కిలోమీటర్లు, గ్వాలియరు నుండి 102 కి.మీ. దూరంలో ఉంది.

ఝాన్సీ
నగరం
jhansi city
ఝాన్సీ
Nickname: 
బుందేల్‌ఖండ్ ముఖద్వారం
ఝాన్సీ is located in Uttar Pradesh
ఝాన్సీ
ఝాన్సీ
Coordinates: 25°26′55″N 78°34′11″E / 25.44862°N 78.56962°E / 25.44862; 78.56962
దేశంఝాన్సీ: చరిత్ర, భౌగోళికం, ఆర్థికం, జనాభా వివరాలు India
రాష్ట్రంఉత్తర ప్రదేశ్
ప్రాంతంబుందేల్‌ఖండ్
జిల్లాఝాన్సీ
Founded byఓర్చా రాజు
Elevation
285 మీ (935 అ.)
Population
 (2011 census)
 • Total5,05,693
 • Rank57
భాషలు
 • అధికారికహిందీ
Time zoneUTC+5:30 (IST)
PIN
284001-2-3-4
టెలిఫోన్ కోడ్0510
Vehicle registrationUP-93
లింగనిష్పత్తి 0.905 : 1.000

చరిత్ర

ఝాన్సీ: చరిత్ర, భౌగోళికం, ఆర్థికం, జనాభా వివరాలు 
ఝాన్సీ కోట, 1900

పురాతన కాలంలో ఝాన్సీ, చందేలా రాజ్‌పుత్ర రాజులకు బలమైన కోటగా ఉండేది. దీనిని బల్వంత్ నగర్ అని పిలిచేవారు. అయితే, 11 వ శతాబ్దంలో చందేలా రాజవంశం క్షీణించిన తరువాత నగరం దాని ప్రాముఖ్యతను కోల్పోయింది. 17 వ శతాబ్దంలో ఓర్చా రాష్ట్రానికి చెందిన రాజా బీర్ సింగ్ దేవ్ 1613 లో ఝాన్సీ కోటను నిర్మించినప్పుడు ఇది మళ్ళీ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

1729 లో తన రాజ్యంపై దాడి చేసిన ఫరూఖాబాద్ నవాబు ముహమ్మద్ ఖాన్ బంగాష్ ను ఓడించడంలో తనకు సహాయం చేసినందుకు కృతజ్ఞతా చిహ్నంగా మహారాజా చత్రసాల్, ఝాన్సీని, మరికొన్ని ప్రాంతాలనూ మరాఠా పేష్వా బాజీ రావు I కి అప్పగించాడు. దాంతో ఝాన్సీ, మరాఠా సామ్రాజ్యం లోకి వచ్చింది.

18 వ శతాబ్దంలో, ఝాన్సీ పట్టణం మరాఠా ప్రాంతీయ రాజధానిగా ఉండేది. తరువాత 1804 నుండి 1858 వరకు ఈ భూభాగం బ్రిటిష్ భారతదేశంలో భాగమైనప్పుడు ఝాన్సీ సంస్థానంగా ఉండేది.

స్వాతంత్ర్యం తరువాత, ఝాన్సీని ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలో చేర్చారు

భౌగోళికం, ఆర్థికం

ఝాన్సీ 25.4333 ఉత్తర అక్షాంశం, 78.5833 తూర్పు రేఖాంశాల వద్ద, సముద్రమట్టం నుండి 284 మీటర్ల ఎత్తున ఉంది. సిట్రస్ పండ్ల జాతులకు ఇక్కడి భూమి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ పండే పంటలలో గోధుమలు, పప్పుధాన్యాలు, బఠానీలు, నూనె గింజలు ముఖ్యమైనవి. నీటిపారుదల అవసరాల కోసం ఈ ప్రాంతం రుతుపవనాలపై ఎక్కువగా ఆధారపడుతుంది. ప్రతిష్ఠాత్మక కాలువ ప్రాజెక్టు (రాజ్‌ఘాట్ కాలువ) కింద, ఝాన్సీ, లలిత్‌పూర్, మధ్యప్రదేశ్‌లోని కొంత భాగంలో నీటిపారుదల కోసం ప్రభుత్వం కాలువల‌ను నిర్మిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తుల వ్యాపారం (ధాన్యం, నూనె గింజలతో సహా) గొప్ప ఆర్థిక ప్రాముఖ్యత కలిగి ఉంది. నగరం ఇత్తడి వస్తువుల తయారీ కేంద్రంగా కూడా ఉంది.

శీతోష్ణస్థితి

శీతోష్ణస్థితి డేటా - Jhansi (1981–2010, extremes 1901–2012)
నెల జన ఫిబ్ర మార్చి ఏప్రి మే జూన్ జూలై ఆగ సెప్టెం అక్టో నవం డిసెం సంవత్సరం
అత్యధిక రికార్డు °C (°F) 33.8
(92.8)
39.4
(102.9)
43.3
(109.9)
46.2
(115.2)
48.0
(118.4)
47.8
(118.0)
45.6
(114.1)
42.2
(108.0)
40.6
(105.1)
40.6
(105.1)
38.1
(100.6)
33.1
(91.6)
48.0
(118.4)
సగటు అధిక °C (°F) 23.4
(74.1)
27.5
(81.5)
34.0
(93.2)
39.6
(103.3)
42.4
(108.3)
40.5
(104.9)
34.4
(93.9)
32.5
(90.5)
33.5
(92.3)
34.1
(93.4)
30.0
(86.0)
25.4
(77.7)
33.1
(91.6)
సగటు అల్ప °C (°F) 8.1
(46.6)
11.1
(52.0)
16.7
(62.1)
22.6
(72.7)
26.7
(80.1)
27.5
(81.5)
25.1
(77.2)
23.9
(75.0)
23.2
(73.8)
19.5
(67.1)
13.8
(56.8)
9.5
(49.1)
19.0
(66.2)
అత్యల్ప రికార్డు °C (°F) 1.2
(34.2)
0.6
(33.1)
5.3
(41.5)
10.1
(50.2)
15.1
(59.2)
18.5
(65.3)
20.3
(68.5)
18.3
(64.9)
16.7
(62.1)
10.7
(51.3)
1.1
(34.0)
0.3
(32.5)
0.3
(32.5)
సగటు వర్షపాతం mm (inches) 8.5
(0.33)
9.2
(0.36)
10.0
(0.39)
2.6
(0.10)
15.5
(0.61)
92.3
(3.63)
238.9
(9.41)
263.1
(10.36)
168.3
(6.63)
28.4
(1.12)
5.3
(0.21)
3.6
(0.14)
845.6
(33.29)
సగటు వర్షపాతపు రోజులు 0.8 1.0 0.8 0.5 1.7 5.0 11.4 12.6 6.9 1.4 0.5 0.4 43.0
సగటు సాపేక్ష ఆర్ద్రత (%) (at 17:30 IST) 51 40 27 22 24 39 66 73 62 43 44 52 45
Source: India Meteorological Department

జనాభా వివరాలు

చారిత్రికంగా జనాభా
సంవత్సరంజనాభా±%
187130,000—    
188133,000+10.0%
189153,779+63.0%
190155,724+3.6%
191170,200+26.0%
192166,400−5.4%
193176,700+15.5%
19411,03,300+34.7%
19511,27,400+23.3%
19611,40,200+10.0%
19711,73,300+23.6%
19812,31,300+33.5%
19913,00,850+30.1%
20014,26,198+41.7%
20115,05,693+18.7%
Source: 1871-1891 - ఇంపీరియల్ గెజెటీర్ ఆఫ్ ఇండియా
1901-1981 - Populstat.info
1991-2011 - Citypopulation.de

2011 భారత జనగణన శాఖ లెక్కల ప్రకారం, ఝాన్సీ నగర జనాభా 5,05,693. వీరిలో 2,65,449 మంది పురుషులు, 2,40,244 మంది స్త్రీలు. ఆరేళ్ళ లోపు పిల్లల సంఖ్య 55,824. ఝాన్సీ నగరంలో మొత్తం అక్షరాస్యత 3,73,500, ఇది జనాభాలో 73.9%. పురుషుల అక్షరాస్యత 78.9%, స్త్రీల అక్షరాస్యత 68.3%. ఏడేళ్ళ పైబడిన వారిలో అక్షరాస్యత 83.0%. ఇందులో పురుషుల అక్షరాస్యత 88.9%, స్త్రీల అక్షరాస్యత 76.6%. షెడ్యూల్డ్ కులాల జనాభా 1,10,318, షెడ్యూల్డ్ తెగల జనాభా 1,681. 2011 లో నగరంలో 91,150 గృహాలు ఉన్నాయి.

రవాణా

భారతీయ రైల్వేల ఉత్తర మధ్య రైల్వే జోన్లో ఝాన్సీ, ఒక డివిజను కేంద్రంగా ఉంది. ఇది ప్రధాన ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-ముంబై మార్గాల్లో ఉంది. స్టేషన్ కోడ్ JHS.

గుజరాత్ - అస్సాం జాతీయ రహదారి 27; గ్వాలియర్ - రేవా జాతీయ రహదారి 75 ; జమ్మూ - కన్యాకుమారి జాతీయ రహదారి 44 ; జాతీయ రహదారి 39 రహదారులు ఝాన్సీ నగరం గుండా పోతున్నాయి. ఈ విధంగా, ఐదు వేర్వేరు దిశలలోని రహదారులు పోతున్నందున రహదారుల నెట్‌వర్కు‌లో నగరానికి ఒక వ్యూహాత్మక స్థానం ఉంది.

ప్రముఖులు

మూలాలు

Tags:

ఝాన్సీ చరిత్రఝాన్సీ భౌగోళికం, ఆర్థికంఝాన్సీ జనాభా వివరాలుఝాన్సీ రవాణాఝాన్సీ ప్రముఖులుఝాన్సీ మూలాలుఝాన్సీఉత్తరప్రదేశ్క్రొత్త ఢిల్లీ

🔥 Trending searches on Wiki తెలుగు:

రేవతి నక్షత్రంకరోనా వైరస్ 2019చంద్రుడువిశ్వామిత్రుడువిశాఖ నక్షత్రముకేంద్రపాలిత ప్రాంతంసత్యమేవ జయతే (సినిమా)యేసు శిష్యులుకృతి శెట్టితమిళ అక్షరమాలతెలుగు సినిమాల జాబితాచే గువేరాసూర్యుడునామనక్షత్రముకొణతాల రామకృష్ణస్వాతి నక్షత్రముపర్యాయపదంవిరాట్ కోహ్లిగొట్టిపాటి నరసయ్యఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంవర్షం (సినిమా)రావి చెట్టుభీష్ముడువెంట్రుకబంగారంఇంద్రుడుపి.సుశీలబొత్స సత్యనారాయణలోక్‌సభతమన్నా భాటియానవరసాలుపి.వెంక‌ట్రామి రెడ్డిరఘురామ కృష్ణంరాజుసునాముఖియూట్యూబ్నువ్వు నాకు నచ్చావ్వ్యవసాయంభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంమహాభారతంభారత పార్లమెంట్ఇజ్రాయిల్పరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుశ్రీలీల (నటి)దత్తాత్రేయబైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డిసంధ్యావందనంశుభాకాంక్షలు (సినిమా)మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిఆవులగ్నంపురాణాలుఆంధ్రప్రదేశ్ పుణ్యక్షేత్రాల జాబితాకోవూరు శాసనసభ నియోజకవర్గంపూరీ జగన్నాథ దేవాలయంఏప్రిల్ 26పర్యావరణంషణ్ముఖుడుఅనుష్క శర్మలక్ష్మిశ్రీముఖిదేవుడుఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ధర్మవరం శాసనసభ నియోజకవర్గంమధుమేహంస్త్రీవాదంఉపనయనమురాయప్రోలు సుబ్బారావువిజయవాడతెలంగాణ ప్రభుత్వ పథకాలుమలబద్దకంరాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్గ్లోబల్ వార్మింగ్నర్మదా నదిఆటలమ్మ🡆 More