భారత స్వాతంత్ర్య దినోత్సవం:

ఆగస్టు పదిహేను భారతదేశపు స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోబడుతోంది.

1947 ఆగస్టు పదిహేనున భారతదేశం వందల ఏళ్ళ బానిసత్వాన్నుంచి విడుదలయింది. దానికి గుర్తుగా, స్వాతంత్ర్యానంతరం కేంద్ర ప్రభుత్వం ఆగస్టు పదిహేనుని భారత స్వాతంత్ర్య దినోత్సవంగా, జాతీయ శెలవు దినంగా ప్రకటించి అమలు చేస్తోంది.🇮🇳

The national flag of India hoisted on a wall adorned with domes and minarets.
ఆగస్టు పదిహేను న ఎర్రకోటపై ఎగురుతున్న త్రివర్ణ పతాకం

చరిత్ర

భారతదేశాన్ని బ్రిటీష్ వారు క్రమక్రమంగా ఆక్రమించుకుంటూ దేశంలోని చాలా భాగాన్ని తమ పరిపాలన క్రిందకు, కొన్ని రాజ్యాలను తమ ప్రభావం క్రిందకు తీసుకువచ్చారు. 19వ శతాబ్ది తొలినాటికి వారి ఆధిపత్యం పూర్తిగా స్థిరపడిపోయింది. 1858 వరకూ భారత దేశ సార్వభౌమునిగా మొఘల్ పరిపాలకులే ఉన్నా 19వ శతాబ్ది తొలినాళ్ళ నుంచే వారి ప్రాభవం తగ్గుతూ వచ్చింది. చివరకు 1857లో ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం జరిగి దానిలో సిపాయిలు, రాజులు ఓడిపోయాక 1858లో బ్రిటీష్ రాణి భారత సామ్రాజ్యధినేత్రి అయ్యాక దేశం బ్రిటీష్ పాలన కిందకి వచ్చింది. బ్రిటీష్ పరిపాలన నుంచి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చేందుకు జరిగిన అనేకమైన పోరాటాల్లో ఎందరో దేశభక్తులు పాల్గొన్నారు. ప్రపంచ రాజకీయాల నేపథ్యంలోనూ, భారతీయ స్వాతంత్ర్య పోరాటాల ఫలంగానూ దేశానికి 1947 ఆగస్టు 14న అర్థరాత్రి సమయంలో స్వాతంత్ర్యం వచ్చింది.జై భారత్.

తేదీ ప్రాధాన్యత

బ్రిటీష్ ఇండియా ఆఖరు గవర్నర్ జనరల్ మౌంట్ బాటన్ 1948లో నిర్ణీతమైన స్వాతంత్ర్య దినాన్ని ముందుకు జరుపుతూ 1947 ఆగస్టు 15న జరగాలని నిర్ణయించారు. రెండవ ప్రపంచయుద్ధం జపాన్ లొంగుబాటుతో ముగిసిపోయిన రోజు ఆగస్టు 15 కావడంతో భారత స్వాతంత్ర్యానికి దానిని ఎంచుకున్నారు బాటన్.

వేడుకలు

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రతి సంవత్సరం ఢిల్లీలోని ఎర్రకోట వద్ద వైభవోపేతంగా జరుగుతాయి. మొదటి స్వాతంత్ర్య దినోత్సవం నాడు రాత్రి సమయంలో నెహ్రూ మాట్లాడిన మాటలివి:
అనేక సంవత్సరాల క్రితమే మన భవితవ్యం గురించిన గమ్యస్థానాన్ని చేరుకొని తీరాలని మనం నిర్ణయించాం. మన ఈ నిర్ణయాన్ని పూర్తిగా, కూలంకషంగా సాధించే సమయం యిప్పుడు ఆసన్నమయింది. అర్థరాత్రి పన్నెండు గంటలు కొట్టగానే, ప్రపంచమంతా నిద్రాదేవి ఒడిలో పారవశ్యం చెందివున్న సమయాన, భారతదేశం, పునరుజ్జీవనంతో, స్వేచ్ఛగా స్వతంత్రదేశంగా ఆవిర్భవిస్తుంది.

ఇవికూడా చూడండి

మూలాలు

Tags:

భారత స్వాతంత్ర్య దినోత్సవం చరిత్రభారత స్వాతంత్ర్య దినోత్సవం తేదీ ప్రాధాన్యతభారత స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలుభారత స్వాతంత్ర్య దినోత్సవం ఇవికూడా చూడండిభారత స్వాతంత్ర్య దినోత్సవం మూలాలుభారత స్వాతంత్ర్య దినోత్సవంజాతీయ శెలవుస్వాతంత్ర్య దినోత్సవం

🔥 Trending searches on Wiki తెలుగు:

మీనాకన్యారాశిభారత స్వాతంత్ర్యోద్యమంమహాత్మా గాంధీరాగులువంగవీటి రాధాకృష్ణగోత్రాలుకుంభరాశిషణ్ముఖుడుహార్దిక్ పాండ్యాచంద్ర గ్రహణంబతుకమ్మతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థవ్యతిరేక పదాల జాబితాటబురజాకార్చిరంజీవివిజయ్ (నటుడు)ద్రౌపది ముర్ముసోడియం బైకార్బొనేట్దేవదాసినక్షత్రం (జ్యోతిషం)రాజీవ్ గాంధీఇంగువఋతువులు (భారతీయ కాలం)మహేంద్రసింగ్ ధోనిసమాసంభారతీయ రిజర్వ్ బ్యాంక్మగధీర (సినిమా)అనపర్తి శాసనసభ నియోజకవర్గంమిథునరాశిఘట్టమనేని మహేశ్ ‌బాబుజాతీయ అర్హత, ప్రవేశ పరీక్షశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంగ్రామ సచివాలయంకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంపరిటాల రవిస్వాతి నక్షత్రమురాజమండ్రి లోక్‌సభ నియోజకవర్గందానిమ్మకుప్పంరుద్రమ దేవిగుంటూరు కారంకల్వకుంట్ల తారక రామారావుఅమరావతిరష్మి గౌతమ్ప్రభాస్అంజూరంభారతదేశంలో మహిళలుఅశోకుడుఛందస్సుమొదటి ప్రపంచ యుద్ధంభీష్ముడుశని (జ్యోతిషం)చరవాణి (సెల్ ఫోన్)90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్లడఖ్విశ్వక్ సేన్శ్రీశ్రీబ్రాహ్మణ గోత్రాల జాబితాభారత రాజ్యాంగ సవరణల జాబితాఅమరావతి (గ్రామం)కర్మ సిద్ధాంతంపొట్టి శ్రీరాములురాజకుమారుడుఆరుద్ర నక్షత్రముబైబిల్పిఠాపురంమాయాబజార్తేలురవీంద్ర జడేజాఆయాసంవృద్ధిమాన్ సాహాబీరం హర్షవర్దన్ రెడ్డిభారత ఆర్ధిక వ్యవస్థశ్రీకాంత్ (నటుడు)🡆 More