జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం

జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్మేనియన్:Զվարթնոց միջազգային օդանավակայան, (IATA: EVN, ICAO: UDYZ) జ్వర్ట్నాట్స్ సమీపంలో ఆర్మేనియా రాజధాని యెరెవాన్‌కు దక్షిణదిశలో 15 కి.మీల దూరంలో నెలకొని వుంది.

ఇది ఆర్మేనియా దేశపు ముఖ్యమైన అంతర్జాతీయ విమానాశ్రయంగా పరిగణించబడుతున్నది. ఇది ఆ దేశపు అత్యంత రద్దీ కలిగిన విమానాశ్రయం.

జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
Զվարթնոց Միջազգային Oդանավակայան
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
సంగ్రహం
విమానాశ్రయ రకంఅంతర్జాతీయ
యజమానిజనరల్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆఫ్ ఆర్మేనియా
కార్యనిర్వాహకత్వంఆర్మేనియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ CJSC
సేవలుయెరెవాన్
ప్రదేశంయెరెవాన్, ఆర్మేనియా
ఎయిర్ హబ్ఆర్మేనియా ఎయిర్‌కంపెనీ
ఎత్తు AMSL2,838 ft / 865 m
అక్షాంశరేఖాంశాలు40°08′50″N 044°23′45″E / 40.14722°N 44.39583°E / 40.14722; 44.39583
వెబ్‌సైటుwww.zvartnots.aero
పటం
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం is located in Armenia
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం
Location of airport in Armenia
రన్‌వే
దిశ పొడవు ఉపరితలం
మీటర్లు అడుగులు
09/27 3,850 12,631 తారు/కాంక్రీటు
గణాంకాలు (2017)
ప్రయాణీకుల సంఖ్య24,48,250
Soure:EUROCONTROL వద్ద ఆర్మేనియన్ AIP

చరిత్ర

జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం 
పాత టర్మినల్ యొక్క దృశ్యం (ఎడమ), కొత్త అరైవల్స్ హాల్ (కుడి)

ఈ విమానాశ్రయం 1961లో తన కార్యకలాపాలను ఆరంభించింది. 1970లో నిర్వహించిన పోటీలో ఎం.ఖచిక్యన్, ఎ.తర్ఖన్యన్, ఎస్.కలష్యన్,ఎం.బఘ్దసర్యన్‌లు మొదటి టర్మినల్‌ను డిజైన్ చేయడానికి ఎన్నికైనారు. సోవియట్ యూనియన్ ప్రాంతీయ రవాణా అవసరాలకు అనుగుణంగా కొత్త టర్మినల్ ఏరియా అభివృద్ధితో ఈ విమానాశ్రయం 1980లలో నవీకరించబడింది.

ఆర్మేనియా 1990లలో సోవియట్ యూనియన్ నుండి విడిపోయి స్వతంత్రదేశంగా ప్రకటించుకున్న తర్వాత సరుకు రవాణా అభివృద్ధి కావడంతో 1998లో ఈ విమానాశ్రయంలో మిలియన్ టన్నుల వార్షిక సామర్థ్యం కల కొత్త కార్గో టర్మినల్ నిర్మాణం జరిగింది. కార్పొరేషన్ అమెరికా అనే అర్జెంటీనా కంపెనీ యాజమాన్యంలో ఉన్న ఆర్మేనియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ CJSC అనే సంస్థతో 2001లో విమానాశ్రయం నిర్వహణ కొరకు 30 సంవత్సరాల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆ ఒప్పందం ప్రకారం ఆర్మేనియా ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్స్ CJSC రన్‌వేను, టాక్సీ వేస్‌ను, ర్యాంపును నవీకరించింది. 2006లో క్రొత్త అరైవల్స్ హాల్‌ను ప్రారంభించారు. తరువాత 2011లో డిపార్చర్స్ & అరైవల్స్ టర్మినల్‌ను, 1000 వాహనాలు సామర్థ్యం ఉన్న కార్ పార్కింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. 2013 జనవరి 30న దుబాయ్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో జరిగిన ఎమర్జింగ్ మార్కెట్స్ ఎయిర్‌పోర్ట్స్ అవార్డ్ (EMAA) వేడుకల్లో జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయానికి "కామన్‌వెల్త్ ఇండిపెండెంట్ స్టేట్స్ (CIS)లో ఉత్తమ ఎయిర్‌పోర్ట్" అవార్డ్ లభించింది.

విహంగ వీక్షణం

ఈ విమానాశ్రయానికి ఆంటొనొవ్ An-225, బోయింగ్ 747-400, ఎయిర్‌బస్ A380 వంటి విమానాలను నిలిపే సామర్థ్యం ఉంది. ఈ విమానశ్రయపు రన్‌వే రెండవ కేటగరీ ఇన్‌స్ట్రుమెంట్ ల్యాండింగ్ సిస్టంతో అనుసంధానించ బడి ఉంది. దానివల్ల 30 మీటర్ల గరిష్ట పరిమితి, 350 మీటర్ల దృగ్గోచరంతో విమానాలను నడుపవచ్చు.

జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం 
చెక్-ఇన్ హాల్
జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం 
డిపార్చర్స్ హాల్

ఈ విమానాశ్రయంలో కొత్తగా ఫ్లయిట్ ఇన్ఫర్మేషన్ డిస్‌ప్లే సిస్టం (FIDS), బ్యాగేజీల కొరకు ఆటొమేటెడ్, బయోమెట్రిక్ ఐడెంటిఫికేషన్ సిస్టం, చెక్-ఇన్, ప్యాసింజర్ కంట్రొల్, 150 సర్వైలెన్స్ కెమెరాలు వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు. ఈ విమానాశ్రయంలో ప్రవేశానికి ప్రి కంట్రోల్ (వేలిముద్రలు, బోర్డింగ్ పాస్), పాస్‌పోర్ట్ కంట్రోల్, ఎక్స్‌రే కంట్రోల్ అనే మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

విమానాలు వాటి గమ్యస్థానాలు

విమానయాన సంస్థలు గమ్యస్థానాలు
ఏజియన్ ఎయిర్‌లైన్స్ ఏథెన్స్
నిర్ణీత సమయంలో: హెరాక్లియాన్, రోడ్స్, థెస్సాలోనికి
ఎయిరోఫ్లాట్ మాస్కో
ఎయిర్ అరేబియా షార్జా
ఎయిర్ కైరో షర్ం ఎల్ షేక్
నిర్ణీత సమయంలో: హర్గడ
ఎయిర్ ఫ్రాన్స్ పారిస్ చార్లెస్ డి గల్లె
ఎయిర్ మాల్టా నిర్ణీత సమయంలో: మాల్టా
ఎ.ఎం.సి.ఎయిర్‌లైన్స్ నిర్ణీత సమయంలో: హర్గడ,షర్ం ఎల్ షేక్
ఆర్కియా టెల్ అవీవ్ - బెన్ గురియాన్
ఆర్మేనియా ఎయిర్ కంపెనీ బాగ్దాద్, బీరట్,ఎర్బిల్,లియాన్, మినరల్నె వొడి, టెల్ అవీవ్ - బెన్ గురియాన్, వొరొనెజ్,
నిర్ణీత సమయంలో: అరెక్సాస్, హెరక్లియాన్, కోస్, లర్నకా, నైస్, రోడ్స్, రిమిని, సులేమానియా, థెస్సాలోనికి, టివత్, వర్నా, వెనిస్
ఆస్ట్రియన్ ఎయిర్‌లైన్స్ వియన్నా
బెలావియా మిన్‌స్క్
బ్రుసెల్స్ ఎయిర్‌లైన్స్ బ్రుసెల్స్
బల్గేరియా ఎయిర్ నిర్ణీత సమయంలో: బర్గస్, వర్నా
బల్గేరియన్ ఎయిర్ ఛార్టర్ నిర్ణీత సమయంలో: బర్గస్
ఛామ్‌ వింగ్స్ డమాస్కస్
చెక్ ఎయిర్‌లైన్స్ ప్రేగ్
ఈజిప్ట్ ఎయిర్ నిర్ణీత సమయంలో: షర్ం ఎల్ షేక్
ఫ్లై దుబాయ్ దుబాయ్
ఫ్లై ఈజిప్ట్ నిర్ణీత సమయంలో: హర్గడ
జార్జియన్ ఎయిర్‌వేస్ బిలిసి
జర్మేనియా బెర్లిన్
కరుణ్ ఎయిర్‌లైన్స్ నిర్ణీత సమయంలో: అహ్వజ్, ఇస్‌ఫహాన్
కిష్ ఎయిర్ నిర్ణీత సమయంలో: షిరాజ్, టెహరాన్
కొరియన్ ఎయిర్ నిర్ణీత సమయంలో: సియోల్
LOT పోలిష్ ఎయిర్‌లైన్స్ వార్సా
మహన్ ఎయిర్ టెహరాన్
మిడిల్ ఈస్ట్ ఎయిర్‌లైన్స్ బీరట్
నార్ద్‌విండ్ ఎయిర్‌లైన్స్ మినరల్నె వొడి, మాస్కో సోచి
కతర్ ఎయిర్‌వేస్ దోహా
రెడ్ వింగ్స్ ఎయిర్‌లైన్స్ మాస్కో
S7 ఎయిర్‌లైన్స్ మాస్కో, నొవొసిబిర్స్క్
SCAT ఎయిర్‌లైన్స్ అక్తవ్, ఆస్తానా
తబన్ ఎయిర్ నిర్ణీత సమయంలో: ఇస్‌ఫహాన్, మషద్, సరి, షిరాజ్, తబ్రిజ్
తారోం బుకారెస్ట్
తుర్క్‌మెనిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఆష్గబత్, ఫ్రాంక్‌ఫర్ట్
ఉక్రెయిన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కీవ్ - బోరిస్పిల్
నిర్ణీత సమయంలో: ఒడెస్సా
యూరల్ ఎయిర్‌లైన్స్ క్రాస్‌నోడర్, మాస్కో, ప్లాటొవ్, సెయింట్ పీటర్స్‌బర్గ్, సమర, సోచి,యెకటరిన్‌బర్గ్
యుట్‌ఎయిర్ మాస్కో
నిర్ణీత సమయంలో: సర్గట్

కార్గో

విమానయాన సంస్థలు గమ్యస్థానాలు
ఉక్రయిన్ ఎయిర్ అలయన్స్ బిలిసి

రవాణా, గణాంకాలు

సంవత్సరం 2005 2006 2007 2008 2009 2010 2011 2012 2013 2014 2015 2016 2017
మొత్తం ప్రయాణీకుల సంఖ్య 1,111,400 1,125,698 1,387,002 1,480,000 1,447,397 1,612,016 1,600,891 1,691,815 1,691,710 2,045,058 1,879,667 2,105,540 2,448,250
వెళ్లే ప్రయాణీకుల సంఖ్య 546,000 562,825 698,614 751,310 729,835 816,866 807,953 845,700 830,000 1,019,765 944,373 1,048,153 1,218,340
వచ్చే ప్రయాణీకుల సంఖ్య 547,400 562,873 688,388 628,690 717,562 795,150 792,944 846,115 861,710 1,025,293 935,294 1,057,387 1,229,910
మొత్తం సరుకుల రవాణా (టన్నులలో) 9,119 9,276 10,004 10,774 8,400 8,800 10,014 12,251 10,361 10,345 10,123 18,269 22,324
ఎగుమతి సరుకులు(టన్నులు) 3,701 4,080 3,515 4,000 3,100 3,300 4,741 6,687 6,109 6,450 6,607 13,784 16,983
దిగుమతి సరుకులు(టన్నులు) 5,418 5,196 6,489 6,700 5,200 5,500 5,273 5,564 4,252 3,895 3,516 4,485 5,341
విమానాల రాకపోకలు 6,897 6,746 7,953 8,624 8,699 9,783 9,858 10,392 8,721 10,409 9,012 9,266 10,621

ఉపరితల రవాణా

టర్మినల్ బయట అనేక రకాలైన టాక్సీ సర్వీసులు ఉన్నాయి. కానీ జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారిక టాక్సీ సర్వీసు ఎయిర్‌పోర్ట్ టాక్సీ పేరుతో నడుపబడుతున్నది. ఈ సర్వీసు విమానాశ్రయం నుండి ఏ వైపుకైనా, అన్ని ప్రదేశాల నుండి విమానాశ్రయానికి ప్రయాణీకులను చేరుస్తుంది.

2017లో ఎయిర్ పోర్టు నుండి యెరెవాన్ డౌన్‌టౌన్‌కు బస్ సర్వీసును ప్రారంభించారు. ఈ సదుపాయం ఉదయం 7 గంటలనుండి రాత్రి 10 గంటల వరకు ప్రతి అరగంటకు, రాత్రి 10 గంటలనుండి ఉదయం 7 గంటల వరకు ప్రతి గంటకు ఒక బస్సు నడుపబడుతుంది.

ఇవీ చూడండి

మూలాలు

Tags:

జ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం చరిత్రజ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం విహంగ వీక్షణంజ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం విమానాలు వాటి గమ్యస్థానాలుజ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం రవాణా, గణాంకాలుజ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం ఉపరితల రవాణాజ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం ఇవీ చూడండిజ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం మూలాలుజ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయం బయటి లింకులుజ్వర్ట్నాట్స్ అంతర్జాతీయ విమానాశ్రయంఆర్మేనియాయెరెవాన్

🔥 Trending searches on Wiki తెలుగు:

రాహువు జ్యోతిషండీజే టిల్లుశిబి చక్రవర్తికడియం కావ్యక్వినోవాకామసూత్రహైదరాబాదుతెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుజిల్లేడుభద్రాచలంగజేంద్ర మోక్షంతెలుగుకర్కాటకరాశిచే గువేరాబొడ్రాయితెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థచంపకమాలఇందిరా గాంధీపన్ను (ఆర్థిక వ్యవస్థ)చరాస్తిసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఇండియన్ ప్రీమియర్ లీగ్సత్యనారాయణ వ్రతంకామాక్షి భాస్కర్లగూగ్లి ఎల్మో మార్కోనిరవీంద్రనాథ్ ఠాగూర్హార్సిలీ హిల్స్దేవులపల్లి కృష్ణశాస్త్రిఅక్కినేని నాగ చైతన్యకొమురం భీమ్స్త్రీవాదంప్రకృతి - వికృతిటమాటోభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుతొట్టెంపూడి గోపీచంద్రోహిత్ శర్మషిర్డీ సాయిబాబాకెనడాఅమిత్ షాఘట్టమనేని కృష్ణవాతావరణంమండల ప్రజాపరిషత్తాజ్ మహల్ఋతువులు (భారతీయ కాలం)భూమికందుకూరి వీరేశలింగం పంతులుసురేఖా వాణినందిగం సురేష్ బాబుఆంధ్రజ్యోతిఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్మ్యాడ్ (2023 తెలుగు సినిమా)రౌద్రం రణం రుధిరంటంగుటూరి సూర్యకుమారిశుక్రుడుభగత్ సింగ్భారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుగున్న మామిడి కొమ్మమీదఆషికా రంగనాథ్శ్రీదేవి (నటి)చెమటకాయలుసుడిగాలి సుధీర్గ్లెన్ ఫిలిప్స్దసరాదాశరథి కృష్ణమాచార్యఅక్కినేని నాగేశ్వరరావు నటించిన సినిమాలుఉదగమండలంభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుథామస్ జెఫర్సన్శివుడుదానం నాగేందర్ఉగాదిఈనాడుబలి చక్రవర్తిఅరుణాచలంటిల్లు స్క్వేర్ఉదయకిరణ్ (నటుడు)సీతాదేవి🡆 More