నటుడు గోవిందా: భారతదేశ నటుడు, రాజకీయ నేత

గోవిందా ప్రముఖ భారతీయ నటుడు, హాస్యనటుడు, మాజీ రాజకీయ నాయకుడు. గోవిందా అసలు పేరు గోవింద్ అర్జున్ అహుజా. మంచి  డ్యాన్సర్ గా కూడా ఈయన ప్రసిద్ధులు.

12 ఫిలింఫేర్ అవార్డు  నామినేషన్లు, ఒక ఫిలింఫేర్ స్పెషల్ అవార్డు, ఫిలింఫేర్ ఉత్తమ  హాస్యనటుడు, జీ సినీ అవార్డులు అందుకున్నారు. 2004 నుంచి 2009 వరకు ఎం.పిగా కూడా పనిచేశారు. 1986లో విడుదలైన ఇల్జామ్  ఆయన నటించిన మొదటి సినిమా.165 హిందీ సినిమాల్లో  నటించారు  గోవిందా 1999 జూన్ లో బిబిసి న్యూస్ నిర్వహించిన ఆన్ లైన్  పోల్ లో గోవిందా 10వ గ్రేటెస్ట్ స్టార్ ఆఫ్ స్టేజ్ ఆర్ స్క్రీన్ గా ఎన్నుకోబడ్డారు.

గోవింద
నటుడు గోవిందా: భారతదేశ నటుడు, రాజకీయ నేత
2018లో ఫ్రైడే సినిమా ట్రైలర్ ప్రారంభం సందర్భంగా గోవింద
భారత పార్లమెంటు సభ్యుడు
In office
2004–2009
అధ్యక్షుడుఏ.పి.జె. అబ్దుల్ కలామ్
అంతకు ముందు వారురాం నాయక్
తరువాత వారుసంజయ్ నిరుపం
నియోజకవర్గంఉత్తర ముంబై
వ్యక్తిగత వివరాలు
జననం
గోవింద అరుణ్ అహుజా

(1963-12-21) 1963 డిసెంబరు 21 (వయసు 60)
ముంబై , భారతదేశం
రాజకీయ పార్టీభారత జాతీయ కాంగ్రెస్
జీవిత భాగస్వామి
సునీతా అహుజా
(m. 1987)
సంతానం2; టీనా అహుజా తో సహా
తల్లిదండ్రులుఅరుణ్ కుమార్ అహుజా (తండ్రి)
నిర్మలా దేవి (తల్లి)
బంధువులుకృష్ణ అభిషేక్ (మేనల్లుడు), ఆర్తి శర్మ (మేనకోడలు)
నివాసంజుహు, ముంబై, భారతదేశం
వృత్తి
  • నటుడు
  • నిర్మాత
  • రాజకీయ నాయకుడు
  • డాన్సర్
  • కమేడియన్
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
మారుపేరుచీ చీ, హీరో నెం. 1

1980లలో గోవిందా ఫ్యామిలీ, డ్రామా, యాక్షన్, రొమాన్స్ వంటి అన్ని రకాల సినిమాల్లోనూ చేశారు. 80వ దశకం మొదట్లో యాక్షన్ హీరోగా చేసినా 90లలో మాత్రం హాస్య కథానాయకునిగా మారారు. సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన అమితాబ్, ఒక సమయంలో తన సినిమాలన్ని వరుసగా పరాజయం పాలవ్వడంతో ఒక స్టార్ట్ బ్యాక్ కోసం గోవిందాతో కలసి సినిమా నటించారు. 1992లో దివ్య భారతి తో కలసి నటించిన షోలా ఔర్ షబ్నమ్ సినిమాతో మొదటిసారిగా హాస్య కథానాయకుని అవతారం ఎత్తారు గోవిందా. ఆంఖే(1993), రాజా బాబు(1994), కూలీ నెం.1(1995), హీరో నెం.1(1997), హసీనా మాన్ జాయేగీ(1999) వంటి సినిమాల్లో నటించారాయన. మాన్ జాయేగా సినిమాలోని నటనకుగాను ఫిలింఫేర్ ఉత్తమ హాస్యనటుడు పురస్కారం, సాజన్ చలే ససురాల్ సినిమాకు ఫిలింఫేర్ స్పెషల్ అవార్డు అందుకున్నారు గోవిందా. జాన్ సే ప్యారా(1992), ఆంఖే(1993), బడేమియా చోటేమియా(1998), అనారీ నెం.1(1999) వంటి సినిమాల్లో ద్విపాత్రాభినయం చేశారు గోవిందా. ఒక్క హధ్ కర్ దీ ఆప్నే(2000)  సినిమాలోనే ఆరు పాత్రల్లో నటించారు ఆయన. రాజు, అతని తల్లి, తండ్రి, చెల్లి, బామ్మ, తాతల పాత్రలు నటించారు గోవిందా.

2000వ దశకం మొదట్లో ఎన్నో పరాజయాలను చవి చూసిన గోవిందా, భగమ్ భాగ్(2006), పార్ట్ నర్(2007), లైఫ్ పార్ట్ నర్(2009), రావన్(2010) వంటి హిట్లను అందుకున్నారు. 2015లో మిథున్ చక్రవర్తి స్థానంలో జీ టివిలోని డాన్స్ రియాలిటీ షో డాన్స్ ఇండియా  డాన్స్ సూపర్ మామ్  సీజన్ 2 కి న్యాయనిర్ణేత అయ్యారు గోవిందా. ఈ షోకు మరే షోకూ రానన్ని టి.ఆర్.పి రేటింగులు వచ్చాయి.

మహారాష్ట్ర లోని ఉత్తర ముంబై నియోజకవర్గం నుండి కాంగ్రెస్ తరఫున 2014లో ఎంపిగా ఎన్నికయ్యారు గోవిందా.

తొలినాళ్ళ జీవితం

1963 21 డిసెంబరున పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు గోవిందా. నటుడు అరుణ్ కుమార్ అహుజా, నటి, గాయకురాలు నిర్మలా దేవిల కుమారుడు గోవిందా. అరుణ్ కుమార్ పంజాబ్ కు చెందినవారు. నిర్మలాదేవి సింధీ కుటుంబానికి చెందినవారు. ఔరత్(1940) సినిమాలో నటించిన అరుణ్ ఆ సినిమా ద్వారా అప్పట్లో చాలా ప్రముఖులు. ఒక సినిమాను నిర్మించిన అరుణ్, ఆ సినిమా  ఫ్లాప్ కావడంతో అనారోగ్యం పాలయ్యారు. ముంబైలోని కార్టర్ రోడ్ లో ఒక పెద్ద బంగ్లా లో నివసించే అరుణ్ కుటుంబం, ఆయన అనారోగ్యం  పాలవ్వడంతో ఉత్తర ముంబై సబ్ అర్బ్ లోని విరార్ కు మారిపోయారు. ఆరుగురు సంతానంలో ఆఖరివాడు గోవిందా. గోవిందా ముద్దు పేరు "చీ చీ" అంటే చిటికెన్ వేలు అని పంజాబీ భాషలో అర్ధం. వారి ఇంట్లో పంజాబీ భాషే మాట్లాడుకుంటారు.

Awards and nominations

References

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

భారతీయ శిక్షాస్మృతిఅనిల్ అంబానీత్రిఫల చూర్ణంతెలంగాణా బీసీ కులాల జాబితాచందనా దీప్తి (ఐపీఎస్‌)భారతీయ స్టేట్ బ్యాంకుయునైటెడ్ అరబ్ ఎమిరేట్స్భారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుభారతీయ రిజర్వ్ బ్యాంక్నాని (నటుడు)మాదిగమాయాబజార్మంచు మనోజ్ కుమార్అల్లూరి సీతారామరాజుసత్య సాయి బాబారాప్తాడు శాసనసభ నియోజకవర్గంక్వినోవాసత్య కృష్ణన్ఇంగువపవన్ కళ్యాణ్సీ.ఎం.రమేష్కారకత్వంఅమెరికా సంయుక్త రాష్ట్రాలువావిలితెలుగు భాష చరిత్రధనిష్ఠ నక్షత్రమువృశ్చిక రాశిభారత జాతీయ ప్రతిజ్ఞమహాసముద్రంరష్యాపుట్టపర్తి నారాయణాచార్యులునరేంద్ర మోదీలంబాడిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాభారతదేశ జిల్లాల జాబితావిశ్వామిత్రుడుగేమ్ ఛేంజర్ప్లీహముఎల్లమ్మహార్దిక్ పాండ్యాసంతోషం (2002 సినిమా)టి.జీవన్ రెడ్డికన్నూర్ జిల్లా (కేరళ)గోల్కొండరావుల శ్రీధర్ రెడ్డికాలేయంఊరు పేరు భైరవకోనఅక్కినేని నాగేశ్వరరావునువ్వుల నూనెరచిన్ రవీంద్రసుఖేశ్ చంద్రశేఖర్మెయిల్ (సినిమా)గర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలువై.యస్.భారతిజొన్నసమ్మక్క సారక్క జాతరఈనాడుఅహోబిలంఆంధ్రప్రదేశ్ లోక్‌సభ నియోజకవర్గాల జాబితాబాల్యవివాహాలుతిరుమలఉపాధ్యాయ అర్హత పరీక్షఆరూరి రమేష్ఆఖరి క్షణంటిల్లు స్క్వేర్వింధ్య విశాఖ మేడపాటిహిరోషిమా, నాగసాకిలపై అణ్వస్త్ర దాడులుఆక్యుపంక్చర్ఢిల్లీ డేర్ డెవిల్స్యేసు శిష్యులువిజయ్ (నటుడు)సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్విద్యట్రినిడాడ్ అండ్ టొబాగోస్వామి వివేకానందఎంసెట్నోటి పుండుమారేడుబుధుడు (జ్యోతిషం)🡆 More