కూష్మాండా దుర్గా

కూష్మాండా దుర్గా, నవదుర్గల్లో నాలుగో అవతారం. నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు.

"కు" అంటే చిన్న, "ఊష్మ" అంటే శక్తి, "అండా" అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని  సృష్టించింది అని అర్ధం.

ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం, ఐశ్వర్యం, శక్తీ లభిస్తాయని భక్తుల విశ్వాసం.

రూపం

కుష్మాండా దుర్గా దేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం,  ఖడ్గం, గద, పాశం, ధనువు, బాణాలు, ఒక తేనె భాండం, ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి/సింహం.

విశ్వ ఆవిర్భావం

ఈ విశ్వం లేనప్పుడు, అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి, తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగును ఇచ్చింది కుష్మాండా దుర్గా దేవి అని పురాణోక్తి. సూర్యుని మధ్యభాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవీ పురాణం.

త్రిమూర్తులు, త్రిమాతల సృష్టి

మహాకాళీ

కుష్మాండా దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి పది తలలు, పది చేతులు, పది కాళ్ళు, 30 కళ్ళు, 30 చేతి వేళ్ళు, 30 కాలి వేళ్ళు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో, నాలుకలు బయట పెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పళ్ళు, తన 10 నాలుకలను కొరుకుతున్నట్టుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు. ఆయుధం, త్రిశూలం, చక్రం, బాణం, డాలు, తెంచిన రాక్షసుని తల, పుర్రె, నత్త గుల్ల, ధనువు, కర్ర ధరించి ఉంటుంది కాళీ. కూష్మాండా దేవి ఈమెకు మహాకాళీ అని పేరు పెట్టింది.

మహాలక్ష్మి

కుష్మాండా దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు, కవచం, కిరీటం ధరించింది. ఆ చేతుల్లో గొడ్డలి, త్రిశూలం, చక్రం, గద, పిడుగు, బాణం, ఖడ్గం, కమలం, జపమాల, నత్తగుల్ల, ఘంట, ఉచ్చు, బల్లెం, కొరడా, ధనువు, డాలు, మధుకలశం, నీటిపాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి, గట్టిగా గర్జించిందిట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండా దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది.

మహాసరస్వతి

కుష్మాండాదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి, తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. తెల్లటి బట్టలు కట్టుకుని, తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం, చక్రం, చిన్న ఢమరుకం, నత్తగుల్ల, ఘంట, విల్లు, నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది. కుష్మాండాదేవి ఆమెను మహా సరస్వతి అని పిలిచింది.

శక్తి

కుష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే, ఆమె నుండి ఒక స్త్రీ, పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు, 15 కళ్ళు, 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది.  అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి, జింక, బాణం, ధనువు, త్రిశూలం, పిడుగు, కపాలం, ఢమరుకం, జపమాల, కమండలం ఉన్నాయి. కూష్మాండా దుర్గా అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళీ శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి,  నాలుగు చేతుల్లో పాశం, జపమాల పుస్తకం, కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. ఇలా కలసి పుట్టిన  శివుడు,  శక్తి(సరస్వతీదేవి)లు అన్నాచెల్లెళ్ళు అని అంటారు.

బ్రహ్మ/లక్ష్మీ

కుష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ, ఒక పురుషుడు వచ్చారు. నాలుగు ముఖాలతో, నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామరపువ్వు, పుస్తకం, జపమాల, కలశం పట్టుకుని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి. అందంగా, లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామరమొగ్గలు, కింద రెండు చేతులూ అభయ ముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది అమె. కుష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నాచెల్లెళ్ళే.

ధ్యాన శ్లోకం

"సురాసంపూర్ణ కలశం రుధిరప్లుత మేవ చ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభదాస్తు మే"

మూలాలు

Tags:

కూష్మాండా దుర్గా రూపంకూష్మాండా దుర్గా విశ్వ ఆవిర్భావంకూష్మాండా దుర్గా త్రిమూర్తులు, త్రిమాతల సృష్టికూష్మాండా దుర్గా ధ్యాన శ్లోకంకూష్మాండా దుర్గా మూలాలుకూష్మాండా దుర్గా

🔥 Trending searches on Wiki తెలుగు:

రాజోలు శాసనసభ నియోజకవర్గంజహీరాబాదు లోక్‌సభ నియోజకవర్గంతీన్మార్ సావిత్రి (జ్యోతి)ఆలంపూర్ జోగులాంబ దేవాలయంఉప రాష్ట్రపతిధర్మవరం శాసనసభ నియోజకవర్గంటిల్లు స్క్వేర్మియా ఖలీఫాఅవకాడోగన్నేరు చెట్టుఅమరావతివరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)చిరంజీవి నటించిన సినిమాల జాబితాకన్నెగంటి బ్రహ్మానందంకందుకూరి వీరేశలింగం పంతులు2019 భారత సార్వత్రిక ఎన్నికలుభారతదేశ ప్రధానమంత్రిహైపర్ ఆదిమద్దెలచెరువు సూర్యనారాయణరెడ్డిఓం నమో వేంకటేశాయభగత్ సింగ్విద్యడామన్తీన్మార్ మల్లన్నవరంగల్యూట్యూబ్జాంబవంతుడునందమూరి బాలకృష్ణవిష్ణువు వేయి నామములు- 1-1000శ్రీనివాస రామానుజన్ఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలుకుమ్ర ఈశ్వరీబాయితెలుగు అక్షరాలురైతుబంధు పథకంతెలుగుదేశం పార్టీభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుశాసన మండలినారా చంద్రబాబునాయుడుచిరంజీవులుపిఠాపురం శాసనసభ నియోజకవర్గంసంధ్యావందనంబ్రాహ్మణ గోత్రాల జాబితానరసింహావతారంఅంగచూషణకామాక్షి భాస్కర్లభారత జాతీయపతాకంభారత ఎన్నికల కమిషనుభారత రాజ్యాంగ సవరణల జాబితాశ్యామశాస్త్రిఅంగుళంభారతీయ రిజర్వ్ బ్యాంక్అల్లసాని పెద్దనసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ప్రజాస్వామ్యంఉస్మానియా విశ్వవిద్యాలయంనర్మదా నదిపార్శ్వపు తలనొప్పితెనాలి రామకృష్ణుడుబైండ్లసజ్జల రామకృష్ణా రెడ్డిలోక్‌సభపునర్వసు నక్షత్రముశ్రవణ కుమారుడువిజయనగరంఆవర్తన పట్టికఆల్ఫోన్సో మామిడిపంచారామాలుకేతిరెడ్డి పెద్దారెడ్డిప్రస్తుత భారత ముఖ్యమంత్రుల జాబితాకాటసాని రాంభూపాల్ రెడ్డిభువనగిరి లోక్‌సభ నియోజకవర్గంసచిన్ టెండుల్కర్నామవాచకం (తెలుగు వ్యాకరణం)భారతదేశంలో సెక్యులరిజంఅక్షయ తృతీయఉడుముజ్ఞాన సరస్వతి దేవాలయం, బాసరలేపాక్షి🡆 More