2017 సినిమా హలో

హలో! అనే చలన చిత్రం నాగార్జున అక్కినేని చేత అన్నపూర్ణ స్టూడియో పతాకంలో 2017 లో నిర్మించబడింది.

ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ కథ, దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో ముఖ్యపాత్రధారులు అఖిల్ అక్కినేని, కల్యాణి ప్రియదర్శన్. అనుప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించాడు. ఇది 2017 డిసెంబరు 22 న విడుదలైంది.

హలో
2017 సినిమా హలో
దర్శకత్వంవిక్రం కుమార్
రచనవిక్రంకుమార్
నిర్మాతనాగార్జున అక్కినేని
తారాగణంఅక్కినేని అఖిల్
కళ్యాణి ప్రియదర్శన్
ఛాయాగ్రహణంపి.ఎస్.వినోద్
కూర్పుప్రవీణ్ పూడి
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థలు
అన్నపూర్ణ స్టుడియో
మనం ఎంటర్‌ప్రైజెస్
విడుదల తేదీ
2017 డిసెంబరు 22 (2017-12-22)
సినిమా నిడివి
122 నిమిషాలు
దేశంభారతదేశం
భాషతెలుగు

కథ

శీను (అఖిల్‌), జున్ను (కల్యాణి) బాల్యంలోనే పానీపూరి బండి దగ్గర కలిసిన స్నేహితులు. అనాథ అయిన శీను వయొలిన్‌ వాయిస్తూ రోడ్డుపక్క యాచన చేస్తుంటాడు. తన వయొలిన్‌తో పలికించే సంగీతమంటే ఇష్టపడే జున్ను ఓ పెద్దింటి పిల్ల. అనుకోకుండా జున్ను కుటుంబం ఢిల్లీ వెళ్లిపోతుంది. వెళ్ళేటప్పుడు ఒక వందరూపాయల నోటుపై తన ఫోన్ నంబరు రాసి శీనుకు ఇస్తుంది. ఆమె ఫోన్‌ నెంబర్‌ రాసి ఇచ్చిన వంద రూపాయల్ని శీను పోగొట్టుకుంటాడు. దాంతో ఇద్దరి మధ్య లింక్‌ తెగిపోతుంది. ఆ తర్వాత విధి కల్పించిన ఓ ప్రమాదం ద్వారా ఓ పెద్దింటికి చెందిన జగపతిబాబు, రమ్యకృష్ణ వద్దకు శీను దత్తపుత్రుడిగా వెళ్ళి అవినాష్‌గా మారిపోతాడు. అలా 14 ఏళ్ళ 3 నెలలు 20 రోజుల గడిచినా జున్ను కోసం ఎదురుచూస్తూనే వుంటాడు శీను (అవినాష్). ఇక ఢిల్లీకి వెళ్ళిన జున్ను(ప్రియగా పేరు మారింది) తన స్నేహితురాలి పెళ్లి నిమిత్తం హైదరాబాద్‌ వస్తుంది. విమానాశ్రయంలో తన తల్లిని తీసుకుని రావడానికి వెళ్ళిన అవినాష్ ప్రియను చూస్తాడు కాని ఆమెను గుర్తించడు. ఆ తరువాత, ప్రియ పేద పిల్లలకు వందరూపాయలను పంచే సందర్భంలో అవినాష్ కలుస్తాడు. తరువాత తన స్నేహితురాలి పెళ్లిలో కలుస్తారు. ఆ సందర్భంలో ఆమె శీను గూర్చి గుర్తుచేసుకుని వెళ్ళిపోతుంది. అవినాష్ ఆమెను వెంబడిస్తాడు. అనుకోకుండా ఆమె వద్ద ఉన్న, ఇదివరకు శీను బహుమానంగా ఇచ్చిన, గాజు పగిలిపోతుంది. ఆ సంఘటనతో ఆమె బాధపడుతుంది.

అవినాష్ ఫోన్ మాఫియా నుండి తన ఫోన్‌ను తిరిగి పొందిన తర్వాత కథ ప్రస్తుతానికి తిరిగి వస్తుంది. ప్రియ హైదరాబాదు మ్యూజిక్ ఫెస్టివల్ వద్ద ఉన్నట్లు అతను గుర్తిస్తాడు. ఆ మ్యూజిక్ ఫెస్టివల్ లో అతను ప్రియను కలుస్తాడు. తన స్నేహితురాలి వివాహం వద్ద పడిన గొడవకు వారిరువురు ఒకరినొకరు క్షమించుకుంటారు. అవినాష్ ఆమెకు కొత్త గాజును బహుమానంగా ఇస్తాడు. జున్నును వెదుకుటకు మ్యూజిక్ స్టాల్ లో తాను బాల్యంలో వాయించిన వయోలీన్ ట్యూన్ ను వాయిస్తాడు. జున్ను (ప్రియ) ఆ సంగీతాన్ని విని శీనూని వెతుక్కుంటూ వస్తుంది. కానీ అతనిని కనుగొనలేకపోతుంది.

అవినాష్ జున్ను ఫోన్ నంబర్‌తో ఉన్న వంద రూపాయల నోటును కనుగొని, ఆ నంబర్‌కు పదేపదే డయల్ చేస్తాడు. ఆమె కూడా ట్యూన్ వాయించినవారి వివరాల కోసం నిరంతరం ఫోన్ చేస్తుండటం వలన అతని కాల్ కట్ చేస్తుంది. చివరికి ఆమె అతని కాల్ కు స్పందించి మాట్లాడుతున్న సమయంలో అవినాష్ ఫోన్ బ్యాటరీ అయిపోతుంది. ప్రస్తుతం జున్ను మ్యూజిక్ ఫెస్టివల్ లోఉన్నట్లు అతను తెలుసుకుంటాడు. అతను మ్యూజిక్ స్టాల్ కు వెళ్ళి మరలా ట్యూన్ వాయిస్తాడు. ఆ ట్యూన్ విన్న జున్ను అతను కోసం వెతుకుతూ నడుస్తుంది. జున్నుని నిరాశగా చూసి ఆశ్చర్యపోయిన అవినాష్ గొణుగుతూ, జున్నును గుర్తించి, ఆమె అవును అని చెప్పే సంకేతాన్ని గుర్తించి, ఇద్దరూ ప్రేమలో ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటారు.

నటీనటులు

అనూప్ రూబెన్స్ సంగీత దర్శకత్వం వహించారు . ఆదిత్య మ్యూజిక్ కంపెనీలో సంగీతం విడుదలైంది. 2017 డిసెంబరు 7 న విశాఖపట్నంలో ఆడియో ఫంక్షన్ జరిగింది. అనుప్ రూబెన్స్‌కు ఇది 50 వ చిత్రం.

విడుదల

ఫస్ట్‌లుక్ పోస్టర్ 22 ఆగస్టు 2017 న విడుదలైంది. దీని పేరు హలో అని కూడా వెల్లడించింది. ఈ టీజర్ 2017 నవంబరు 16 న విడుదలైంది. థియేటర్ ట్రైలర్ 2017 డిసెంబరు 1 న విడుదలైంది. ఆడియో 2017 డిసెంబరు 7 న విడుదలైంది.

పురస్కారాలు

సైమా అవార్డులు

2017 సైమా అవార్డులు

  1. సైమా ఉత్తమ తొలిచిత్ర నటి (కళ్యాణి ప్రియదర్శన్)

మూలాలు

బయటి లంకెలు

Tags:

2017 సినిమా హలో కథ2017 సినిమా హలో నటీనటులు2017 సినిమా హలో విడుదల2017 సినిమా హలో పురస్కారాలు2017 సినిమా హలో మూలాలు2017 సినిమా హలో బయటి లంకెలు2017 సినిమా హలోఅక్కినేని అఖిల్అక్కినేని నాగార్జునఅనూప్ రూబెన్స్

🔥 Trending searches on Wiki తెలుగు:

బరాక్ ఒబామాభారతీయ నాట్యంచిరంజీవి నటించిన సినిమాల జాబితాదక్షిణామూర్తిఏప్రిల్ 30వరంగల్గుమ్మడి నర్సయ్యబూర్గుల రామకృష్ణారావుఝాన్సీ లక్ష్మీబాయిశ్రీదేవి (నటి)కాకతీయులుమహాభారతంపోకిరిరామప్ప దేవాలయంవరిబీజంనెట్‌ఫ్లిక్స్భారత జాతీయ చిహ్నంతామర పువ్వుభారత రాజ్యాంగ పరిషత్జీ20కుంభరాశిశ్రీ కృష్ణుడుదాశరథి సాహితీ పురస్కారంతెలంగాణ ఉన్నత న్యాయస్థానంభారతదేశంలో బ్రిటిషు పాలనశేషాద్రి నాయుడుభారత గణతంత్ర దినోత్సవంనిఖత్ జరీన్పటిక బెల్లంరోహిణి నక్షత్రంబంగారు బుల్లోడుగొంతునొప్పిబగళాముఖీ దేవిరూపవతి (సినిమా)దశావతారములుదేవులపల్లి కృష్ణశాస్త్రివై.యస్.అవినాష్‌రెడ్డిగుణింతంపుష్యమి నక్షత్రముకృతి శెట్టిగౌతమ బుద్ధుడువేమనదక్ష నగార్కర్లోక్‌సభ స్పీకర్తెలుగు భాష చరిత్రభారత పార్లమెంట్రామానుజాచార్యుడుభారతీయ స్టేట్ బ్యాంకుతెలంగాణ జనాభా గణాంకాలువేములవాడఅచ్చులులక్ష్మీనరసింహాశాతవాహనులుతెలంగాణ మండలాలునిజాంరామోజీరావురేవతి నక్షత్రంభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుతెలంగాణ దళితబంధు పథకంక్షయఎకరంఈత చెట్టుఉసిరిశ్రీ కృష్ణదేవ రాయలుకారకత్వంరావు గోపాలరావుమొఘల్ సామ్రాజ్యంపద్మ అవార్డులు 2023ఫ్లిప్‌కార్ట్కాళోజీ నారాయణరావుకలబందగ్రంథాలయంసైబర్ క్రైంఅటార్నీ జనరల్చిరంజీవిఘటోత్కచుడు (సినిమా)🡆 More