యునిక్స్ అనేది ఎటి & టి యునిక్స్ నుండి ఆవిర్భవించిన ఒక కంప్యూటరు ఆపరేటింగ్ సిస్టమ్.
దీనిని 1970లలో బెల్ ల్యాబ్స్ పరిశోధనా కేంద్రం వద్ద కెన్ థామ్సన్, డెన్నిస్ రిచీ ఇంకా పలువురి సహాయంతో అభివృద్ధి చేయబడింది. వేరువేరు వ్యక్తులు ఒకే కంప్యూటరును వాడుకునే విధంగా అవకాశం కల్పిస్తుంది యునిక్స్. అందువలన దీనిని మల్టీయూజర్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటారు. అలాగే వివిధ పనులను ఏక కాలంలో ఈ నిర్వాహక వ్యవస్థపై చేయవచ్చు.
అభివృద్ధికారులు | కెన్ థామ్సన్, డెన్నిస్ రిచీ, బ్రియాన్ కెర్నియాన్, Douglas McIlroy, Joe Ossannaలు బెల్ ల్యాబ్స్ వద్ద |
---|---|
ప్రోగ్రామింగ్ భాష | సీ and అసెంబ్లీ భాష |
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్ |
పనిచేయు స్థితి | ప్రస్తుతం |
మూల కోడ్ విధానం | Historically closed-source, while some Unix projects (including BSD family and Illumos) are open-source |
తొలి విడుదల | Development started in 1969 First manual published internally in 1971 నవంబరు Announced outside Bell Labs in 1973 అక్టోబరు |
విడుదలైన భాషలు | ఆంగ్లము |
Kernel విధము | మోనోలిథిక్ |
అప్రమేయ అంతర్వర్తి | కమాండ్-లైన్ ఇంటర్ఫేస్, Graphical (X విండో సిస్టమ్) |
లైెసెన్స్ | Varies; some versions are proprietary, others are free/open-source software |
మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ), ఎటి & టి బెల్ ల్యాబ్స్, జనరల్ ఎలక్ట్రిక్ లు కలిసి సంయుక్తంగా టైమ్ షేరింగు (సమయ పాలన) నిర్వాహక వ్యవస్థ మల్టిక్స్ ను జియి-645 మెయిన్ ఫ్రేమ్ కోసం ఆరంభించారు. మల్టిక్స్ చాలా ఆవిష్కరణలను పరిచయం చేసింది, కానీ అనేక సమస్యలు కలిగివుంది. మల్టిక్స్ యొక్క పరిమాణం, సంక్లిష్టత వలన విసుగు చెందిన, బెల్ ల్యాబ్స్ నెమ్మదిగా ప్రాజెక్టు తప్పుకుంది. మల్టిక్స్ పరియోజనను విడువ వలసిన బెల్ ల్యాబ్స్ చివరి పరిశోధకులు, కెన్ థాంప్సన్, డెన్నిస్ రిట్చీ, MD మక్లెరాయ్, JF ఒస్సానా, చాలా తక్కువ స్థాయిలో తిరిగి పని చేయాలని నిర్ణయించుకున్నారు.
This article uses material from the Wikipedia తెలుగు article యునిక్స్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.