బాబీ ఫిషర్

బాబీ ఫిషర్ (Robert James Bobby Fischer) మార్చి 9, 1943న , అమెరికాలో జన్మించాడు.

చిన్నతనంలోనే అరవై నాలుగు గళ్ళ చదరంగం క్రీడలో అపారమైన ప్రతిభను చూపినాడు. 1972లో ప్రపంచ చదరంగ కిరీటాన్ని గెలిచి ఆ ఘనత సాధించిన తొలి అమెరికన్‌గా రికార్డు సృష్టించాడు. అమెరికా-రష్యాల మధ్య ప్రచ్ఛన్నయుద్ధం కొనసాగుతున్న రోజులలో ఒక అమెరికన్ చదరంగంలో రష్యా ఆధిపత్యాన్ని అంతం చేయడం చాలా ప్రాధాన్యత వహించింది. ఐస్‌లాండ్ లో జరిగిన పోటీలో ప్రముఖ క్రీడాకారుడు బొరిస్ స్పాస్కీని ఓడించి చదరంగంలో రష్యా ఆధిపత్యాన్ని సవాలు చేశాడు. ఆ తరువాత అతని జీవితం అనేక మలుపులు తిరిగి ప్రవాసంలోకి వెళ్ళిపోవలసి వచ్చింది. చివరికి టైటిల్ నెగ్గి పేరు సంపాదించిన ఐస్‌లాండ్ దేశ పౌరసత్వం తీసుకున్నాడు. ప్రపంచ చదరంగ క్రీడలో అతను సుస్థిర స్థానం సంపాదించినాడు. జనవరి 17, 2008న తుదిశ్వాస వదిలాడు.

బాబి ఫిషర్
బాబీ ఫిషర్
Fischer in 1960
పూర్తి పేరురాబర్ట్ జేమ్స్ ఫిషర్
దేశంUnited States
Iceland (2005–08)
పుట్టిన తేది(1943-03-09)1943 మార్చి 9
చికాగో, అమెరికా
మరణం2008 జనవరి 17(2008-01-17) (వయసు 64)
అమెరికా, ఐస్‌లాండ్
టైటిల్Grandmaster (1958)
ప్రపంచ ఛాంపియన్1972–75
అత్యున్నత రేటింగ్2785 (July 1972 FIDE rating list)

బాల్యం

బాబీ ఫిషర్ అమెరికాలోని చికాగోలో మార్చి 9, 1943న జన్మించాడు. ఆరు సంవత్సరాల ప్రాయంలోనే ఫిషర్ చదరంగ క్రీడపై మక్కువ చూపినాడు. ఇతడి అక్క జోన్‌నీ ప్రభావంతో గంటల తరబడి చదరంగం క్రీడలోనే మునిగి తేలేవాడు. ఈ కృషితో 13 ఏళ్ళ ప్రాయంలో ఫిషర్ అమెరికా జూనియర్ చెస్ చాంపియన్‌గా చేసింది.

క్రీడా జీవితం

13 సంవత్సరాల వయస్సులో అమెరికా జూనియర్ చాంపియన్‌షిప్ గెలుపొంది అతిపిన్న వయస్సులో ఈ టైటిల్ సాధించిన రికార్డు కూడా పొందినాడు. ఈ రికార్డు నేటికీ పదిలంగానే ఉంది. 1960లో రష్యాకు చెందిన బొరిస్ స్పాస్కీతో తొలిసారిగ తలపడ్డాడు. అందులో 13.5/15 స్కోరు సాధించాడు. 1962లో స్టాక్‌హోం ఇంటర్ జోనల్ టైటిల్ పొందినాడు. అమెరికన్ చెస్ చాంపియన్‌షిప్ ను బాబీ ఫిషర్ 8 పర్యాయాలు విజయం సాధించాడు.

రష్యా ఆధిపత్యానికి సవాలు

అమెరికా-రష్యాల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతున్న రోజులలో ఏ చిన్న విషయమైనా ఇరుదేశాల మధ్య అగ్ని ప్రజ్వరిల్లేది. అలాంటి సమయంలో రష్యా ఆధిపత్యంలో ఉన్న చదరంగం క్రీడలో బాబీ ఫిషర్ జయపతాకం ఎగురవేసి సంచలనం సృష్టించాడు. అప్పటి వరకు ఏ అమెరికన్ కూడా చదరంగంలో ప్రపంచ చాంపియన్ కాలేదు. 1972లో ఐస్‌లాండ్ రాజధాని నగరం రిక్జావిక్ లో జరిగిన పోరులో రష్యాకు చెందిన ప్రముఖ చెస్ మేధావి బొరిక్ స్పాస్కీని బోల్టా కొట్టించి రష్యా ఆధిపత్యానికి పగ్గాలు వేశాడు. 21 గేములు సాగిన పోరులో విజయం సాధించి అమెరికా తరఫున తొలి చదరంగ ప్రపంచ చాంపియన్ అయ్యాడు.

వివాదాల క్రీడా జీవితం

రష్యా ఆధిపత్యాన్ని అంతంచేసిన బాబీ ఫిషర్ అమెరికాలో గొప్ప పేరు సంపాదించాడు. కాని వింత మనస్తత్వంతో తన క్రీడాజీవితాన్ని తానే కూలగొట్టుకున్నాడు. 1975లో అంతర్జాతీయ చెస్ సమాఖ్య తన నిబంధనలను ఆమోదించలేదని రష్యా గ్రాండ్‌మాస్టర్ అనతోలీ కార్పోవ్ తో చదరంగం ఆడేందుకు నిరాకరించినాడు. తద్వారా ప్రపంచ చాంపియన్ టైటిల్ కోల్పోయాడు. తక్కువ వయస్సులోనే చెస్‌కు వీడ్కోలు చెప్పాడు. 1992లో మళ్ళీ అంతర్జాతీయ పోటీలలో పాల్గొని యుగోస్లేవియాలో జరిగిన పోరులో బొరిస్ స్పాస్కీని ఓడించాడు. అదే సంఘటన అతని జీవితాన్ని విషాదమయం చేసింది. యుగోస్లేవియాపై ఉన్న ఆంక్షలు కారణంగా ఆ దేశంలో జరిగే పోటీలలో పాల్గొనరాదనే హెచ్చరికను లెక్కచేయని బాబీ ఫిషర్‌పై అమెరికా చర్యలు తీసుకుంది. అంతవరకు చదరంగం క్రీడ ద్వారా ఆర్జించిన పారితోషికాలను అమెరికా కోశాగారంలో జప్తుచేయాలని ఆదేశించింది. దీనిపై బాబీ ఫిషర్ అమెరికాపై విరుచుకుపడ్డాడు.

అజ్ఝాత జీవితం

బాబీ ఫిషర్ అమెరికాను విమర్శించుటతో అమెరికా ఫిషర్‌ను పట్టుకోవడానికి శతవిధాల ప్రయత్నించింది. దీనితో ఫిషర్ చాలా కాలం జపాన్ లో అజ్ఞాతజీవితం గడిపాడు. 2001, సెప్టెంబర్ 11న అమెరికాపై జరిగిన దాడులను సమర్థించి సంచలనం సృష్టించాడు. ఆ తరువాత మొదటిసారి బొరిక్ స్పాస్కీని ఓడించి ప్రపంచ చదరంగం టైటిల్ సాధించిన ఐస్‌లాండ్‌లో తలదాచుకున్నాడు. ఐస్‌లాండ్ ప్రభుత్వం కూడా బాబీ ఫిషర్‌కు పౌరసత్వం ప్రసాదించింది.

నెరవేరని కోరిక

భారత్ కు వచ్చి విశ్వనాథన్ ఆనంద్ తో ఫిషర్ రాండమ్, చెస్ 960 పద్దతులలో తలపడాలని భావించిన ఫిషర్ కోరిక నెరవేరకుండానే 2008, జనవరి 17న మూత్రపిండాల వ్యాధితో రిక్జావిక్‌లో మరణించాడు.

మూలాలు

ఇతర లింకులు

బాబీ ఫిషర్ 
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.

Tags:

బాబీ ఫిషర్ బాల్యంబాబీ ఫిషర్ క్రీడా జీవితంబాబీ ఫిషర్ రష్యా ఆధిపత్యానికి సవాలుబాబీ ఫిషర్ వివాదాల క్రీడా జీవితంబాబీ ఫిషర్ అజ్ఝాత జీవితంబాబీ ఫిషర్ నెరవేరని కోరికబాబీ ఫిషర్ మూలాలుబాబీ ఫిషర్ ఇతర లింకులుబాబీ ఫిషర్194319722008అమెరికాఐస్‌లాండ్చదరంగంజనవరి 17మార్చి 9రష్యా

🔥 Trending searches on Wiki తెలుగు:

పవనస్థితినీటి కాలుష్యంభారత రాజ్యాంగ ఆధికరణలు20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంపిఠాపురం శాసనసభ నియోజకవర్గంపూర్వాషాఢ నక్షత్రముకాకినాడ లోక్‌సభ నియోజకవర్గంయేసుతెలంగాణ రాష్ట్ర సమితిచంద్రయాన్-3మేనకా గాంధీవెంకటేశ్ అయ్యర్ప్రజా రాజ్యం పార్టీ2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుఆంధ్ర మహాసభ (తెలంగాణ)శక్తిపీఠాలుమంతెన సత్యనారాయణ రాజుసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనుభూమి వాతావరణందాసరి నారాయణరావులైంగిక విద్యఆంధ్రప్రదేశ్ చరిత్రశ్రీశైలం (శ్రీశైలం మండలం)అండాశయముకీర్తి రెడ్డిఅమ్మల గన్నయమ్మ (పద్యం)దగ్గుబాటి పురంధేశ్వరిఅసదుద్దీన్ ఒవైసీఋగ్వేదంనాన్నకు ప్రేమతోప్రకృతి - వికృతిక్వినోవాఏలకులుకరక్కాయరామావతారంఆర్టికల్ 370 రద్దుగూగుల్ఫరియా అబ్దుల్లానామవాచకం (తెలుగు వ్యాకరణం)బమ్మెర పోతనఎనుముల రేవంత్ రెడ్డిసోనాలి బెంద్రేచెట్టుఛందస్సుచిరంజీవి నటించిన సినిమాల జాబితాపొంగులేటి శ్రీనివాస్ రెడ్డికాలేయంస్టాక్ మార్కెట్నితీశ్ కుమార్ రెడ్డిఫ్యామిలీ స్టార్హనుమాన్ చాలీసాభారతదేశ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలుబ్రహ్మంగారి కాలజ్ఞానంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాచెదలుశంషాబాద్ మండలంనవధాన్యాలుయానిమల్ (2023 సినిమా)అంగారకుడు (జ్యోతిషం)కస్తూరి రంగ రంగా (పాట)అదితిరావు హైదరీవిశ్వనాథ సత్యనారాయణభారతీయ శిక్షాస్మృతిహోళీజానీ లీవర్రాహువు జ్యోతిషంనీ మనసు నాకు తెలుసుఈశాన్యంపరశురాముడుదూదేకులఆంధ్రజ్యోతివాయు కాలుష్యంమురుడేశ్వర ఆలయంశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రమునువ్వు నేనులావు రత్తయ్యజాతీయ పత్రికా దినోత్సవం🡆 More