పొన్నం ప్రభాకర్

పొన్నం ప్రభాకర్ గౌడ్ తెలంగాణ రాష్ట్రానికి చెందిన న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు, రాజకీయ నాయకుడు.

ఆయన 2009 నుండి 2014 వరకు15వ లోకసభకు ఎన్నికై , 2009లో ఎన్నికైన ఎం.పి.లలో చిన్న వయస్కుడు.

పొన్నం ప్రభాకర్ గౌడ్
పొన్నం ప్రభాకర్


పదవీ కాలం
2023 డిసెంబర్ 7 నుండి ప్రస్తుతం

పదవీ కాలం
2023 డిసెంబర్ 3 నుండి ప్రస్తుతం
నియోజకవర్గం హుస్నాబాద్

లోక్‌సభ సభ్యుడు
పదవీ కాలం
2009 నుండి 2014
నియోజకవర్గం కరీంనగర్

వ్యక్తిగత వివరాలు

జననం (1967-05-08) 1967 మే 8 (వయసు 56)
కరీంనగర్, కరీంనగర్, తెలంగాణ
రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రేస్
తల్లిదండ్రులు పొన్నం సత్తయ్యగౌడ్‌, తల్లి మల్లమ్మ
జీవిత భాగస్వామి మంజుల పొన్నం
బంధువులు పొన్నం అశోక్‌ గౌడ్‌ (అన్నయ్య) , పొన్నం రవిచంద్ర (అన్నయ్య)
సంతానం ఇద్దరు కుమారులు (పృథ్వి, ప్రణవ్)
నివాసం హైదరాబాద్, తెలంగాణ
మతం భారతీయుడు
వెబ్‌సైటు పొన్నం ప్రభాకర్ వెబ్ సైట్

జననం

ప్రభాకర్ 1967, మే 8న సత్తయ్య - మల్లమ్మ దంపతులకు తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో జన్మించాడు. హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీలో బిఏ, ఎల్.ఎల్.బి. పూర్తిచేశాడు.

వివాహం

ప్రభాకర్ కి 2000, ఏప్రిల్ 21న మంజులతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు (పృథ్వి, ప్రణవ్).

రాజకీయ జీవితం

పొన్నం ప్రభాకర్ ఎన్‌ఎస్‌యూఐ ద్వారా తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించి పార్టీలో వివిధ హోదాల్లో పని చేశాడు. ఆయన 2009లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తొలిసారి లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. పొన్నం ప్రభాకర్ తెలంగాణ ఉద్యమ సమయంలో కీలకంగా పని చేసి తెలంగాణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెట్టినప్పుడు క్రియాశీలకంగా వ్యవహరించి లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి గురయ్యాడు.

పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన ఎన్నికల్లో 2014లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు. ఆయన ఆ తరువాత 2018లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా, 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ ఓడిపోయాడు. ఆయన 2018 సెప్టెంబరులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియమితుడై,  2019 జూన్ 28న రాజీనామా చేశాడు.

పొన్నం ప్రభాకర్ 2022 డిసెంబర్ 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితుడయ్యాడు. ఆయన 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీసీ డిక్లరేషన్ కమిటీ చైర్మన్‌గా 2023 ఆగస్ట్ 30న నియమితుడయ్యాడు. ఆయన 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా హుస్నాబాద్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచి, డిసెంబర్ 7న మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి, డిసెంబర్ 18న డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో బాధ్యతలు స్వీకరించాడు.

పొన్నం ప్రభాకర్ కు 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా, డిసెంబర్ 24న హైదరాబాద్ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమించారు.

రాజకీయ ప్రస్థానం

  1. 1987-1988 మధ్యకాలంలో కరీంనగర్‌ ఎస్‌ఆర్‌ఆర్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పీజీ కళాశాలలో చదువుకునే రోజుల్లో నుండి, ఒక విద్యార్థి నాయకుడుగా, యూనియన్ అధ్యక్షుడుగా పనిచేశాడు.
  2. 1987-1989 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా ప్రధాన కార్యదర్శిగా సేవలందించాడు.
  3. 1987-1988 మధ్యకాలంలో కరీంనగర్ జిల్లా కళాశాలల కన్వీనర్ గా పనిచేశాడు.
  4. 1989-1991 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర కార్యదర్శి పదవిని, 1992-1998 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. జిల్లా అధ్యక్ష పదవిని చేపట్టాడు.
  5. 1999-2002 మధ్యకాలంలో ఎన్.ఎస్.యు.ఐ. రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
  6. 2002-2003 మధ్యకాలంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ యొక్క ప్రధాన కార్యదర్శిగా పని చేశాడు.
  7. 2002-2004 మధ్యకాలంలో ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మీడియా సెల్ సమన్వయకర్తగా పని చేశాడు.
  8. 2005లో ఆంధ్రప్రదేశ్‌ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌
  9. 2004-2009 మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ ఎంపీల కన్వీనర్‌గా పని చేశాడు.
  10. 2009లో లోక్‌సభకు పోటీచేసే వరకు డి.సి.ఎం.ఎస్. అధ్యక్షుడుగా, మార్క్‌ఫెడ్‌ విదేశాంగ ఛైర్మన్‌గా చేశాడు.
  11. భారత జాతీయ కాంగ్రెస్ తరపున 2009 లో 15వ లోక్‌సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గం ఎం.పి.గా ఎన్నికయ్యాడు.
  12. 2018 సెప్టెంబరులో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నియామకం. (2019 సార్వత్రిక ఎన్నికల రాజీనామా చేశాడు)
  13. ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నవారిలో పొన్నం ప్రభాకర్ ఒకరు.
  14. 2023లో హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యేగా గెలిచి, రేవంత్‌రెడ్డి మంత్రివర్గంలో బీసీ సంక్షేమ & రవాణా శాఖ మంత్రి

నిర్వర్తించిన పదవులు

  • తెలంగాణ ప్రాంతం నుండి 15వ లోక్‌సభలో అతి పిన్న వయస్కుడైన పార్లమెంటు సభ్యుడు.
  • రైల్వే, విద్యుత్ మంత్రిత్వ శాఖ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు.
  • రసాయనాలు, ఎరువులు, కంప్యూటర్లపై జాతీయ కమిటీల సభ్యుడు.
  • ఏపీ మార్క్‌ఫెడ్‌ చైర్మన్‌.

మంత్రిగా

  1. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం జారీ చేసిన 317, 46 జీవోలపై అధ్యయనానికి రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉప సంఘంలో మంత్రి దామోదర రాజనర్సింహ చైర్మన్‌గా, సభ్యులుగా మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ను నియమించింది.

మూలాలు

ఇతర లంకెలు

Tags:

పొన్నం ప్రభాకర్ జననంపొన్నం ప్రభాకర్ వివాహంపొన్నం ప్రభాకర్ రాజకీయ జీవితంపొన్నం ప్రభాకర్ రాజకీయ ప్రస్థానంపొన్నం ప్రభాకర్ నిర్వర్తించిన పదవులుపొన్నం ప్రభాకర్ మంత్రిగాపొన్నం ప్రభాకర్ మూలాలుపొన్నం ప్రభాకర్ ఇతర లంకెలుపొన్నం ప్రభాకర్15వ లోకసభరాజకీయ నాయకుడు

🔥 Trending searches on Wiki తెలుగు:

చతుర్యుగాలుకస్తూరి రంగ రంగా (పాట)రోహిత్ శర్మవిశ్వామిత్రుడుసజ్జల రామకృష్ణా రెడ్డిబోడె రామచంద్ర యాదవ్భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థఎయిడ్స్పెదకూరపాడు శాసనసభ నియోజకవర్గంబాలకాండమా తెలుగు తల్లికి మల్లె పూదండఫ్లిప్‌కార్ట్గైనకాలజీఅభిమన్యుడుపూర్వాషాఢ నక్షత్రముహైదరాబాదువృశ్చిక రాశిమల్కాజ్‌గిరి లోక్‌సభ నియోజకవర్గంశామ్ పిట్రోడాత్రిష కృష్ణన్ప్రియురాలు పిలిచిందిమండల ప్రజాపరిషత్భారత ప్రభుత్వంఋగ్వేదంఉపమాలంకారంశ్రీనాథుడుసోరియాసిస్పోకిరిదేవికఉత్పలమాలఓం భీమ్ బుష్రాజమండ్రిసౌందర్యసలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్తెలుగు భాష చరిత్రక్రికెట్లగ్నంపి.వి.మిధున్ రెడ్డిపరిపూర్ణానంద స్వామియూట్యూబ్నామవాచకం (తెలుగు వ్యాకరణం)సామెతల జాబితాపరమాణు సంఖ్య ప్రకారం మూలకాలుఅయోధ్య రామమందిరంఏ.పి.జె. అబ్దుల్ కలామ్తాడేపల్లి రాఘవ నారాయణ శాస్త్రిపాల కూరపెంటాడెకేన్భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంకనకదుర్గ ఆలయంచంద్రుడువృషభరాశివ్యతిరేక పదాల జాబితాజవాహర్ లాల్ నెహ్రూపక్షవాతంతెలుగు సాహిత్యంసత్యనారాయణ వ్రతంవై.ఎస్.వివేకానందరెడ్డి హత్యగుంటూరుటంగుటూరి సూర్యకుమారిఉగాదిఉష్ణోగ్రతపూర్వ ఫల్గుణి నక్షత్రముకెనడాదేవుడుతొలిప్రేమరామదాసువరంగల్ లోక్‌సభ నియోజకవర్గంతాజ్ మహల్వినోద్ కాంబ్లీప్రధాన సంఖ్యపెమ్మసాని నాయకులుఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్తెలుగు సినిమాలు 2024తెలుగు సంవత్సరాలుఅగ్నికులక్షత్రియులుఅంగారకుడు (జ్యోతిషం)రాయలసీమడి. కె. అరుణ🡆 More