ధనసరి అనసూయ

ధనసరి అనసూయ (సీతక్క) తెలంగాణకు చెందిన రాజకీయ నాయకురాలు.

ములుగు శాసనసభ నియోజకవర్గం ఎమ్మెల్యే,అణగారిన ప్రజల్లో చైతన్యం కోసం రాజకీయాల్లో చేరడానికి ముందు పదిహేనేళ్లకు పైగా మావోయిస్టుగా అజ్ఞాతవాసం గడిపిన మాజీ నక్సలైటు నాయకురాలు. సుమారు 15 ఏళ్ల పాటు మావోయిస్టుగా (Maoist) ఉంటూ ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. అనంతర కాలంలో తన బావ శ్రీరాముడిని వివాహం చేసుకుని తన పేరును సీతక్కగా మార్చుకున్నారు.

సీతక్క
ధనసరి అనసూయ


తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి
పదవీ కాలం
07 డిసెంబర్ 2023 - ప్రస్తుతం

పదవీ కాలం
2018 - ప్రస్తుతం
ముందు అజ్మీరా చందులాల్
నియోజకవర్గం ములుగు శాసనసభ నియోజకవర్గం

పదవీ కాలం
2009 - 2014
ముందు పోదెం వీరయ్య
తరువాత అజ్మీరా చందులాల్
నియోజకవర్గం ములుగు శాసనసభ నియోజకవర్గం

వ్యక్తిగత వివరాలు

జననం (1971-07-09) 1971 జూలై 9 (వయసు 52)
జగ్గన్నపేట్ గ్రామం, ములుగు మండలం, ములుగు జిల్లా
సెల్: 9440170702.
జాతీయత భారతీయురాలు
రాజకీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ
జీవిత భాగస్వామి దివంగత శ్రీరాము
సంతానం సూర్య
నివాసం హైదరాబాద్, తెలంగాణ, భారతదేశం
మతం హిందూ

బాల్యం

సీతక్క వరంగల్ జిల్లా, ములుగు మండలం జగన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో 1971 జూలై 9న జన్మించింది. సమయ్య, సమ్మక్క దంపతులకు సీతక్క రెండో సంతానం. సీతక్క పదో తరగతి వరకూ ప్రభుత్వ పాఠశాలలోనే చదువుకుంది. ప్రజా సమస్యలపై స్పందించే గుణం సీతక్కకు చిన్నతనం నుంచే అలవరింది. ప్రజలపై జరుగుతున్న అనేక అన్యాయాలపై చదువుతున్న రోజుల్లోనే ప్రశ్నించేది. తదనంతర కాలంలో ఆదీవాసీలపై జరుగుతున్న దౌర్జన్యాలకు రగిలిపోయి పోరాటం చేయాలనే ఉద్దేశంతో 1988లో నక్సల్ పార్టీలో చేరారు.

రాజకీయ విశేషాలు

ధనసరి అనసూయ రెండుసార్లు ఎమ్మెల్యేగా ములుగు శాసనసభ నియోజకవర్గం నుండి ఎన్నుకోబడిన నాయకురాలు, అఖిల భారత మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కూడా అయిన సీతక్క.

నక్సల్ ఉద్యమం

ధనసరి అనసూయ జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో గ్రామాల్లో తిరిగి ప్రజలను చైతన్యవంతులను చేసారు. రాజ్య హింసను కళ్ళకు కట్టే విధంగా నాటకాల ద్వారా ప్రజలకు తెలియ జెప్పేవారు జననాట్యమండలి వారు. కూలీరేట్ల, పాలేర్ల జీతాల పెంపుదలకోసం, అధికవడ్డీలకు వ్యతిరేకంగా, గిరిజన ప్రాంతాలలో భూములు ఆక్రమించుకున్న మైదానప్రాంత భూస్వాములకు, షావుకార్లకు వ్యతిరేకంగా, అమాయక గిరిజనులపై అటవీ అధికారులు, పోలీసులు సాగిస్తున్న దాష్టీకానికి వ్యతిరేకంగా గిరిజన రైతాంగం పోరాటానికి గిరిజనులు దోపిడీ దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజనులలో చైతన్యం నింపుతుంటే సంఘం కార్యకలాపాలను వాటిని పోలీసుల ద్వారా అధికార పార్టీ నాయకులు అణచి వేసారు. అందులో భాగంగానే వారిమీద కాల్పులు జరిపి చాలా మందిని చంపివేశారు, కొట్టారు స్త్రీలను అవమానించారు. భూస్వామి నాయకత్వంలో జరిగిన ఈ హత్యలపై ప్రభుత్వం, పోలీసులు ఎటువంటి చర్యా తీసుకోలేదు. నిందితులను అరెస్టు చేయడంగాని, హత్యకేసు నమోదుచేసి విచారించడం గాని జరగలేదు. తమను రక్షించవలసిన ప్రభుత్వం భూస్వాములకు, షావుకార్లకు కొమ్ము కాస్తుంటే, వాళ్ల హింసకు, హత్యలకు మద్దతు తెలుపుతుంటే, ఇక గత్యంతరం లేదనుకున్న గిరిజనులు సాయుధపోరాట మార్గం చేపట్టారు. ఈ భూస్వాముల ఆగడాలను ఎదుర్కోవడానికి సాయుధ ప్రతిఘటన తప్ప మరొక మార్గం లేదని అనసూయ పోరాట నిర్ణయానికి వచ్చింది. అప్పటికే బెంగాల్ లోని నక్సల్బరీలో ప్రారంభమైన సాయుధ పోరాట మార్గంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

పరిష్కార మార్గంలో

ధనసరి అనసూయ 1988 లో నక్సల్ పార్టీలో చేరినప్పుడు సీతక్కా 10 వ తరగతి చదువుతున్న విద్యార్థి. ఫూలన్ దేవి రచనల నుండి ప్రేరణ పొంది, ఆర్థిక దోపిడీ కులవాద వివక్షతో కోపంగా ఉన్న ఆదివాసులు సీతక్క తొలుత విప్లవోద్యమం వైపు అడుగులు వేశారు. ఆ మార్గంలో జనశక్తి (సీపీఐ) (ఎంఎల్) పార్టీలో చేరి సంవత్సరాలు ముందుకుసాగినా ఆదివాసులమీద, ఇతర అణగారిన వర్గాలమీద మౌనంగా నిశ్శబ్దంగా శతాబ్దాలుగా సాగిపోతున్న మెరికల్లాంటి యువతీయువకులు ఆ మార్గంలో ప్రాణాలు పోగొట్టుకున్నా ఆ మార్గానికి హింసనూ దౌర్జన్యాన్నీ అడవులలో, కొండలు, గుట్టలలో నిరంతరం మృత్యువు వెన్నాడుతుండగా నిద్రాహారాలు కరువై అత్యంత కఠోరమైన పోరాటం సాగిస్తూ ఆ ఉద్యమంలోకి ప్రవేశించడం, ఈ దోపిడీని, దుర్మార్గాన్ని, పాలకుల కిరాతకత్వాన్ని భరించి బానిసల్లా బతికేకంటే, మనుషుల్లా గౌరవ ప్రదంగా జీవించాలన్న ఈ పరిస్థితి కారణంగా ప్రగాఢమైన వాంఛ ఆ సమయంలోనే తన నిర్ణయాలు తీసుకున్నా వ్యవస్థలోపల తమ సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయనే విశ్వాసాన్ని కోల్పోయి ఎటువంటి ప్రజాస్వామిక పరిష్కారం అందులో నక్సలైటు మార్గంలో కూడా నెరవేరలేదు. నక్సలైటుపార్టీ సభ్యులలో కొన్ని సైద్ధాంతిక వివాదాలు, వ్యక్తిగత విభేదాల అప్రదిష్ట పాలయింది చాలా సంవత్సరాలు అజ్ఞాత జీవితం గడిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జనశక్తి సాయుధ పోరాటంలో మహిళా నక్సలైట్‌గా, దళం లీడర్‌గా ప్రధాన భూమిక వహించారు.

జన జీవనస్రవంతి

మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలవాలని నందమూరి తారక రామారావు పిలుపునిచ్చారు.తెలిసీ తెలియని వయస్సులో అమాకత్వంతో తప్పుదారి పట్టిన యువతలో కొందరు నేటికీ నిషేధిత మావోయిస్టు సంస్థలో కొన సాగుతున్నారని వారు వెంటనే జనజీవన స్ర వంతిలో కలవాలని అడవుల్లో కుటుంబాలను విడిచి అనారోగ్యాల పాలవుతూ సాధించేదేమీలేదన్నారు నందమూరి తారక రామారావు తమ బిడ్డల జాడ కోసం తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారని మావోయిస్టులు జన జీవన స్రవంతిలో కలిసిపోయి ప్రశాంతమైన జీవనాన్ని గడపడానికి ప్రభుత్వం అనేక అవకాశాలు కల్పిస్తుందని చెప్పా రు. అత్యంత స్నేహ పూరితంగా మనస్ఫూర్తిగా మీ రాక కోసం ఎదురుచూస్తుందని పేర్కొన్నారు. పోరుబాట వదిలి లొంగిపోయారు. వివిధ హోదాల్లో పనిచేసి సీతక్క కామ్రేడ్‌గా దాదాపు రెండు దశాబ్దాలు గడిపాడు, ఈ సమయంలో ఆమె దళకమాండర్ నక్సల్ నాయకుడిని వివాహం చేసుకుంది వారికి ఒక కొడుకు. ఆ సమయంలో తనకు తాను పోలీసులకు లొంగిపోయింది, ఇక ఆమె అజ్ఞాత జీవితానికి గుడ్‌బై చెప్పి జన జీవన స్రవంతిలోకి వచ్చారు.2001లో హైదరాబాద్లో న్యాయవాదిగా మారడానికి ఎల్.ఎల్.బి చదివింది, చట్టం అధ్యయనం చేసిన తర్వాతే ఆమెకు ప్రజా విధానం, పాలనపై ఆసక్తి ఏర్పడింది. సీతక్క సామాజిక సేవలో చురుకుగా ఉండి, స్థానికంగా నాయకురాలిగా పేరుఉన్నందున, అప్పుడు ఎపి ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబు నాయుడు ఆమెకు టికెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. పోరుబాటను వీడిన సీతక్క రాజకీయ రంగప్రవేశం చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. జనజీవన స్రవంతిలోకి వచ్చిన ఆమె మొదటిసారి బ్యాలెట్ పోరులో దిగారు, 2004లో జరిగిన సాధారణ ఎన్నికల్లో టీడీపీ ఆమెకు ములుగు నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీచేసే అవకాశం కల్పించింది.

రాజకీయ జీవితం

సీతక్క తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2004లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ములుగు నియోజకవర్గం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓడిపోయింది. ఆమె 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరపు నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 వరుసగా మూడోసారి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయింది. ఆమె తర్వాత 2018 అక్టోబరులో టిడిపికి రాజీనామా చేసి కాంగ్రెస్‌ పార్టీలో చేరింది.

ఆమె 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందులాల్పై 22,671 ఓట్ల మెజారిటీతో గెలిచింది. సీతక్క 2022 డిసెంబరు 10న తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యుడిగా నియమితురాలైంది.

ఎమ్మెల్యేగా ప్రజలకు సేవ చేస్తూనే తన ఉన్నత విద్యను కొనసాగించారు సీతక్క. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి వలస గిరిజనుల వెనుకబాటు (The social exclusion and deprivation of the Gotti Koya tribe) పై ఆమె పీహెచ్‌డీని 2012 లో మొదలు పెట్టి 2022 లో పూర్తి చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఆమె పీహెచ్‌డీని అందుకున్నారు.

కరోనా సమయంలో సీతక్క చేసిన సేవలు ప్రజల్లో మరింత అభిమానాన్ని సంపాదించిపెట్టాయి. ములుగు నియోజకవర్గంలోని ఏటూరునాగారం, తాడ్వాయి, ములుగు, గోవిందరావుపేట మండలాల పరిధిలోని దాదాపు 275 గ్రామాలకు రేషన్, ఇతర నిత్యావసర వస్తువులను సరఫరా చేసేందుకు అడవి దారుల్లో పాదయాత్ర చేసి స్వయంగా అందజేశారు.

ఆమెకు 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ప్రకటించిన మొదటి జాబితాలో ములుగు అభ్యర్థిగా ప్రకటించగా, ములుగు ఎమ్మెల్యేగా గెలిచి, రేవంత్ రెడ్డి మంత్రివర్గంలో 2023 డిసెంబర్ 7న రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసింది. మంత్రులందరిలో సీతక్క ప్రమాణం (Minister Seethakka).. ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘‘పవిత్ర హృదయంతో ప్రతిజ్ఞ చేస్తున్నానను’’... అని ఆమె అనగానే ఎల్బీ స్టేడియం మొత్తం హర్షధ్వానాలతో మారుమోగింది.

ఆమె డిసెంబర్ 14న డా.బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించింది.  ఆమెకు 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో డిసెంబర్ 18న ఆదిలాబాద్ లోక్‌సభ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌గా, డిసెంబర్ 24న ఆదిలాబాద్​ జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రిగా నియమించారు.

ఎన్నికల చరిత్ర

ఎన్నికల ఫలితాలు
సంవత్సరం కార్యాలయం నియోజక వర్గం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పార్టీ ఓట్లు ఫలితం
2004 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ములుగు తెలుగుదేశం పార్టీ ధనసరి అనసూయ  41,107 పోదెం వీరయ్య భారత జాతీయ కాంగ్రెస్ ధనసరి అనసూయ  55,701 ఓటమి
2009 64,285 45,464 గెలుపు
2014 తెలంగాణ శాసనసభ 39,441 అజ్మీరా చందులాల్ తెలంగాణ రాష్ట్ర సమితి ధనసరి అనసూయ  58,325 ఓటమి
2018 భారత జాతీయ కాంగ్రెస్ ధనసరి అనసూయ  88,971 66,300 గెలుపు
2023 1,02,267 బడే నాగజ్యోతి 68,567 గెలుపు

మూలాలు

Tags:

ధనసరి అనసూయ బాల్యంధనసరి అనసూయ రాజకీయ విశేషాలుధనసరి అనసూయ రాజకీయ జీవితంధనసరి అనసూయ ఎన్నికల చరిత్రధనసరి అనసూయ మూలాలుధనసరి అనసూయనక్సలైటుములుగు శాసనసభ నియోజకవర్గం

🔥 Trending searches on Wiki తెలుగు:

ఆతుకూరి మొల్లకోణార్క సూర్య దేవాలయంతాజ్ మహల్మరణానంతర కర్మలుభారత ప్రధానమంత్రులువిల్హేల్మ్ కన్రాడ్ రాంట్జెన్మార్కాపురంకలబందఅలీనోద్యమంచెట్టుఉసిరిఎం. ఎం. కీరవాణిషిర్డీ సాయిబాబాతెలుగు అక్షరాలుపాండవులురామరాజభూషణుడునామనక్షత్రముభారతరత్నఆంధ్రజ్యోతివిష్ణువువిద్యుత్తుశ్రీనాథుడుకాళిదాసుముహమ్మద్ ప్రవక్తగుంటకలగరపాల కూరపంచాయితీ రాజ్ (గ్రామీణ స్వపరిపాలన వ్యవస్థ)లలితా సహస్ర నామములు- 1-100చేపగోత్రాలుభారత కేంద్ర మంత్రిమండలినరసింహావతారంతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్మంచు లక్ష్మిగోల్కొండకురుక్షేత్ర సంగ్రామంకర్ణాటక యుద్ధాలుబలి చక్రవర్తివై.యస్. రాజశేఖరరెడ్డిరాహువు జ్యోతిషంఅక్కినేని నాగార్జునఛందస్సుగర్భంవేడి నీటి బుగ్గనాని (నటుడు)తెలుగు నాటకరంగ దినోత్సవంమార్చిభారతదేశ చరిత్రభారతీయ జనతా పార్టీవిశ్వక్ సేన్ఎస్. శంకర్భీష్ముడుజయలలిత (నటి)రాజ్యసభసమ్మక్క సారక్క జాతరఛత్రపతి శివాజీఅంగారకుడు (జ్యోతిషం)శాతవాహనులుధర్మంఆర్టికల్ 370యోగామొఘల్ సామ్రాజ్యంవాతావరణంఇస్లాం మతంమోదుగరంగమర్తాండసర్దార్ వల్లభభాయి పటేల్హైదరాబాదుగంగా పుష్కరంగిలక (హెర్నియా)శుక్రుడుఫిరోజ్ గాంధీమహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పధకంఆనం చెంచుసుబ్బారెడ్డిదత్తాత్రేయరోహిణి నక్షత్రంఉప్పు సత్యాగ్రహం🡆 More