దువ్వూరి సుబ్బారావు

భారతీయ రిజర్వ్ బాంక్ 22వ గవర్నర్‌గా నియమితుడైన దువ్వూరి సుబ్బారావు ఆగష్టు 11, 1949న పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జన్మించిన చెందిన తెలుగు వ్యక్తి.

అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఎస్.పట్టా పొందిన సుబ్బారావు 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచాడు. నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించాడు. ఆ తరువాత కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రటరీగాను, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగాను పనిచేశాడు. 2004 నుంచి 2008 వరకు ఆర్థిక కార్యదర్శిగా పనిచేసిన తరువాత భారతదేశపు కేంద్రబ్యాంకు అయిన రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా నియమితుడై, ఆ పదవిలో 2013 సెప్టెంబరు 4 వరకు ఉన్నాడు.

దువ్వూరి సుబ్బారావు
దువ్వూరి సుబ్బారావు
దువ్వూరి సుబ్బారావు
జననందువ్వూరి సుబ్బారావు
ఆగష్టు 11, 1949
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు
వృత్తిభారతీయ రిజర్వ్ బాంక్ 22వ గవర్నర్‌
ప్రసిద్ధిభారతీయ రిజర్వ్ బాంక్ 22వ గవర్నర్‌
పదవి పేరురిజర్వ్ బ్యాంకు గవర్నర్
ముందు వారువై.వేణుగోపాలరెడ్డి
భార్య / భర్తఊర్మిళ
పిల్లలుమల్లిక్, రాఘవ
తండ్రిమల్లికార్జునరావు
తల్లిసీతారామం

బాల్యం, విద్యాభ్యాసం

దువ్వూరి సుబ్బారావు పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో 1949 ఆగష్టు 11న పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పనిచేసిన తండ్రి మల్లికార్జునరావు తల్లి సీతారామంకు మూడవ సంతానంగా జన్మించాడు. కోరుకొండ సైనిక పాఠశాలలో ఉన్నత పాఠశాల విద్య పూర్తిచేసి బిఎస్సీకై సీఆర్ఆర్ కళాశాలలో ప్రవేశించాడు. అమెరికాలోని ఓహియో విశ్వవిద్యాలయం నుంచి ఆర్థికశాస్త్రంలో ఎంఎస్ పట్టా పొందగా, ఆంధ్రా విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్‌డి పుచ్చుకున్నాడు. 1972లో సివిల్ సర్వీసు పరీక్షలో టాపర్‌గా నిలిచి ఐఏఎస్ ఆంధ్రా కేడర్ అధికారిగా తొలుత నెల్లూరు జాయింట్ కలెక్టర్‌గా, ఆ తరువాత ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా పనిచేశాడు.

కెరీర్

సుబ్బారావు ఆర్ధిక శాస్త్రంతో పాటు భౌతిక శాస్త్రాన్ని కూడా ఎంతో లోతుగా చదువుకున్నాడు. అతను ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో మాస్టర్స్ డిగ్రీ చదువుకునేటప్పుడు, అలాగే తన సివిల్స్ పరీక్షలకు కూడా భౌతిక శాస్త్రాన్ని తన ముఖ్యమైన సబ్జెక్ట్‌గా ఎంచుకున్నాడు. స్టీఫెన్ హాకింగ్ రాసిన "బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం" అనే పుస్తకం పైన ఒక విక్లీలో సమీక్ష రాశాడు సుబ్బారావు. ఈ సమీక్ష "ఫ్రం ద ఎటర్నిటీ" అనే పేరుతో ప్రచురితమైంది. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి వ్యక్తి సుబ్బారావు కావడం విశేషం.

సుబ్బారావు 1988 నుండి 1993 మధ్య కాలంలో భారత ప్రభుత్వంలోని ఆర్ధిక మంత్రిత్వ శాఖలో, ఆర్ధిక వ్యవహారాల శాఖకు సంయుక్త కార్యదర్శిగా పనిచేశాడు. ఆ తరువాత, 1993 నుండి 1998 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఆర్ధిక కార్యదర్శిగా పనిచేశాడు. రాష్ట్ర ప్రభుత్వ శాఖలో తన పదవీకాలం పూర్తి అయిన తరువాత ప్రపంచ బ్యాంకుకు ప్రధాన ఆర్ధిక శాస్త్రజ్ఞుడిగా బదిలీ చేయబడ్డాడు. ప్రపంచ బ్యాంకులో 1999 నుండి 2004 వరకూ ఆ పదవిలో కొనసాగాడు. అటు పైన 2005 నుండి 2007 వరకూ ప్రధానమంత్రి ఆర్ధిక సలహా సంఘంలో ముఖ్య పదవి పోషించాడు. 2007లో భారత ప్రభుత్వ ఆర్ధిక కార్యదర్శిగా పదోన్నతి పొందాడు. సెప్టెంబరు 5 2008న, భారత ఆర్ధిక రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన పదివి అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్.బి.ఐ)కు 22వ గవర్నర్‌గా నియమితుడు అయ్యాడు. అతని స్థానంలో, 21 సెప్టెంబరు 2008న అరుణ్ రామనాథన్ ఆర్ధిక కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాడు. 2011లో సుబ్బారావు పదవీ బాధ్యతలు మరో రెండేళ్ళు పొడిగింపబడ్డాయి.

సుబ్బారావు ఎన్నో ఆర్ధిక కోశ విధానాల సవరింపులను చేపట్టాడు. తూర్పు ఆసియాలోని ముఖ్య దేశాలు అయిన చైనా, ఇండోనేషియా, వియత్నాం, ఫిలిప్పైన్‌స్, కంబోడియాలలో ఆర్ధిక వికేంద్రీకరణ చర్యలకు ఉపయోగపడే ఎన్నో అధ్యయనాలు నిర్వహించాడు. వాటిని అమలుపరిచే విధానలను కూడా రూపొందించి, వాటి అమలుకు ఎంతో తోడ్పడ్డాడు సుబ్బారావు. 90వ దశకం చివరిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నో ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంది. తలకు మించిన అప్పుల భారంతో ఇబ్బందిలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్ధికంగా పుంజకునేలా చేసిన ఘనత సుబ్బారావుకే దక్కింది. అతను ప్రవేశపెట్టిన కొన్ని ఆర్ధిక విధానాల వల్ల లోటు బడ్జెట్‌లోకి కూరుకుపోయిన ఆర్ధిక శాఖ, మిగులు బడ్జెట్‌లోకి నడవడం గమనార్హం.

సాధించిన విజయాలు

ఆర్.బి.ఐ గవర్నర్‌గా పనిచేసే సమయంలో ఆర్.బి.ఐ నుండి వెలువడే పత్రికలలో ఎన్నో ఆర్ధిక విధానాలను అందరికీ అర్ధమయ్యే రీతిలో వాటిని విపులంగా, సులభతరంగా మార్చి ప్రచురింపజేశాడు సుబ్బారావు. సెంట్రల్ బ్యాంకు పాలసీలను, క్లిష్టతరమైన ఆర్ధికపరమైన విధానలను సామాన్యులకు కూడా అర్ధమయ్యే విధంగా ఉండేవి ఆ ప్రచురణలు. మారుమూల పల్లెలలోని వారికి కూడా ఆర్ధిక అక్షరాస్యత అందే విధంగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించి, నిర్వహించాడు సుబ్బారావు. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో 100శాతం ఆర్ధిక విధానాల వినియోగానికి శ్రీకారం చుట్టిన ఘనత సుబ్బారావుకే దక్కింది.

నిర్వహించిన పదవులు

  • 1988-93 : కేంద్ర ఆర్థిక వ్యవహారాల శాఖలో జాయింట్ సెక్రెటరీగా
  • 1993-98 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక కార్యదర్శిగా
  • 1998-04: ప్రపంచ బ్యాంకు తరఫున ఆఫ్రికా తదితర దేశాలలో ఆర్థిక అద్యయనం
  • 2004-08 : కేంద్ర ఆర్థిక కార్యదర్శిగా
  • 2008 - 2013 : రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా
  • 2014 - సింగపూర్ నేషనల్ యూనివర్సిటీలో విశిష్ట అధ్యాపకుడు (Distinguished Visiting Fellow )

అవీ ఇవీ

దువ్వూరి సుబ్బారావు 
దువ్వూరి_సుబ్బారావు_గారి_తల్లి_తండ్రి
  • అత్యధిక జ్ఞాపకశక్తి ఉన్న వారితో ఏర్పాటైన ఒక అంతర్జాతీయ సంఘంలో ఇతడు సభ్యుడు.
  • ఆర్థిక కార్యదర్శి స్థాయి నుంచి నేరుగా రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా నియమితుడైన తొలి వ్యక్తి
  • ఇది వరకు రిజర్వ్ బ్యాంకు గవర్నర్‌గా పనిచేసిన వై.వేణుగోపాలరెడ్డి కూడా తెలుగు వ్యక్తే.

రచనలు

  • Who Moved My Interest Rate? - రిజర్వు బ్యాంకు రాతిగోదల వెనకాల (తెలుగు లో)

మూలాలు

Tags:

దువ్వూరి సుబ్బారావు బాల్యం, విద్యాభ్యాసందువ్వూరి సుబ్బారావు కెరీర్దువ్వూరి సుబ్బారావు సాధించిన విజయాలుదువ్వూరి సుబ్బారావు నిర్వహించిన పదవులుదువ్వూరి సుబ్బారావు అవీ ఇవీదువ్వూరి సుబ్బారావు రచనలుదువ్వూరి సుబ్బారావు మూలాలుదువ్వూరి సుబ్బారావు19491972అమెరికాఆగష్టు 11ఏలూరుఖమ్మంతెలుగునెల్లూరుపశ్చిమ గోదావరిభారతదేశంభారతీయ రిజర్వ్ బాంక్

🔥 Trending searches on Wiki తెలుగు:

పెళ్ళిరైలుపన్ను (ఆర్థిక వ్యవస్థ)అంగుళంఎస్. ఎస్. రాజమౌళిశతభిష నక్షత్రముసీ.ఎం.రమేష్నయన తారదిల్ రాజురాజనీతి శాస్త్రముతెలుగు సినిమాల జాబితారేణూ దేశాయ్ఫేస్‌బుక్భారతీయ జనతా పార్టీపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిబొత్స సత్యనారాయణవిభక్తిగున్న మామిడి కొమ్మమీదఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ2019 భారత సార్వత్రిక ఎన్నికలుపల్లెల్లో కులవృత్తులుజవాహర్ లాల్ నెహ్రూమహామృత్యుంజయ మంత్రంపార్లమెంటు సభ్యుడుమృణాల్ ఠాకూర్చిరంజీవులువై.యస్. రాజశేఖరరెడ్డివందేమాతరంరజత్ పాటిదార్సంఖ్యమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిపరశురాముడుమహాసముద్రంకృష్ణా నదిభారత రాజ్యాంగంశ్రీనివాస రామానుజన్మహర్షి రాఘవవికలాంగులుగైనకాలజీయేసుఈనాడుఅంగారకుడు (జ్యోతిషం)తెలంగాణ విమోచనోద్యమంఛందస్సుఆత్రం సక్కుఅన్నప్రాశనపులివెందులసాయిపల్లవిఉగాదిమఖ నక్షత్రముకీర్తి రెడ్డిఅగ్నికులక్షత్రియులుపులివెందుల శాసనసభ నియోజకవర్గంతెలంగాణ రాష్ట్ర సమితిఉండి శాసనసభ నియోజకవర్గంసునీత మహేందర్ రెడ్డిటెట్రాడెకేన్సర్పిఊరు పేరు భైరవకోనరాజంపేట లోక్‌సభ నియోజకవర్గంసమాసంశక్తిపీఠాలుయూట్యూబ్వెలిచాల జగపతి రావుషిర్డీ సాయిబాబాభారత జాతీయ క్రికెట్ జట్టుటంగుటూరి ప్రకాశంఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాసామెతల జాబితాఋతువులు (భారతీయ కాలం)సూర్య (నటుడు)గజము (పొడవు)రాష్ట్రపతి పాలనఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళిప్రకాష్ రాజ్అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలుహైపర్ ఆది🡆 More