అనుక్రమణి

అనుక్రమణికములు (సంస్కృతం: अनुक्रमणी, Anukramaṇī) (Anukramaṇikā కూడా ) వేద శ్లోకాల స్వరూపాలను ఉన్నది ఉన్నట్లుగా కాపాడటానికి, వేద అర్థాన్ని తెలుసుకోవడానికి, మంత్ర దేవతలు ఎవరు, ప్రతి వేదాన్ని దర్శించిన మహర్షులెవరు, వేద సంహితలో ఎటువంటి చందస్సులు, విభాగాలు ఉన్నాయి, అనే విషయాలను తెలుసుకునే వీలున్న క్రమ సూచికలు.

ఋగ్వేదంలో అనుక్రమణికములు

  • ఋగ్వేదం రక్షణ కొరకు శౌనకుడు (1) అనువాకానుక్రమణి (2) ఆర్షానుక్రమణి (3) చందోనుక్రమణి (4) దేవతానుక్రమణి (5) పాదానుక్రమణి, (6) సూక్తానుక్రమణి అను ఆరు (6) అనుక్రమణికములు రచించాడు. ఇందులో అనువాకానుక్రమణి తప్ప మరొకటి లభించుట లేదు. మిగతావి కేవలం వేదరాశులలో (సధ్గురశిష్య రచనలలో) ఉల్లేఖనాలు రూపాలలో మాత్రమే మనుగడలో ఉన్నాయి.
  • శౌనకుడు వ్రాశిన ఋగ్విధానం గ్రంథం (ఋగ్వానుక్రమణి అనుకోవచ్చు) కూడా అనుక్రమణికా వాజ్మయములో చేరుతుంది.
  • ఋగ్వేదం యొక్క అనుక్రమణికములు అన్నీంటిలో అత్యంత ముఖ్యమైన అనుక్రమణి కాత్యాయనుడు వ్రాశిన ఋక్సర్వానుక్రమణి అత్యంత ముఖ్యమైనది. ఇందులో మొదటి పదం, శ్లోకాలు, పేరు, ఋషులు కుటుంబం, ఋగ్వేద దేవతల పేర్లు, వేదానుక్రమణికములు ఋగ్వేదం లోని 1,028 శ్లోకాలకు వ్రాశి ఉంది. సా.శ. 12వ శతాబ్దంలో సధ్గురశిష్య రచించిన వేదార్థదీపిక లో ఈ కృతి యొక్క ఒక ముఖ్యమైన వ్యాఖ్యానం కూడా ఉంది.

ఇతర వేదాలలో అనుక్రమణీలు

  • కౌతుమ శాఖకు చెందిన ఆర్షేయ బ్రాహ్మణం యొక్క మొట్టమొదటి అనుక్రమణి సామవేదమునకు సంబంధించినంత వరకు పురాతన మైనది. జైమినీయ శాఖకు చెందిన జైమినీయ ఆర్షేయ బ్రాహ్మణం తదుపరి కాలంలో సామవేదం యొక్క అనుక్రమణిగా ఉంది.
  • ఆత్రేయి 'శాఖకు చెందిన తైత్తిరీయ సంహిత, చరణీయ శాఖ (మంత్రార్షధ్యాయ), మాధ్యందిన శాఖకు చెందిన వాజసనేయి సంహిత యజుర్వేదం 'యొక్క మూడు అనుక్రమణీలు ఉన్నాయి అని కాత్యాయనీయుడు ఆపాదించాడు.
  • ఛందస్సు ప్రత్యేకంగా నిరూపించబడిన యాజుషసర్వానుక్రమణి కృష్ణయజుర్వేదానికి చెందినది యాస్కుడు వ్రాశాడు.
  • అథర్వణ వేదమునకు బృహత్సర్వానుక్రమణి, అథర్వవేదియపంచప్తాలిక లు అనుక్రమణీలు ఉన్నాయి. బృహత్సర్వానుక్రమణి విశిష్టమైన గ్రంథం. అథర్వసంహిత యొక్క పూర్తి సూచిక పది అధ్యాయాల్లో ఇందులో ఉంది.
  • శుక్ల యజుర్వేదము నకు చెఈందిన శుక్లయజుస్సర్వానుక్రమసూత్రం అయుదు (5) అధ్యాయాల్లో కాత్యాయనుడు వ్రాశాడు.

ఇవి కూడా చూడండి

సూచనలు

వేదాలు, వేద ఆనుగుణ్యమైన వాటి కోసం ఈ లింక్ క్లిక్ చేయండి. [1] Archived 2017-01-14 at the Wayback Machine

  • Manfred Mayrhofer, Die Personennamen in der Ṛgveda-Saṁhitā. Sicheres und Zweifelhaftes, Munich (2003).
  • Hermann Oldenberg, Ueber die Liedverfasser des Rigveda. ZDMG 42 (1888) 199-247.

మూలాలు

Tags:

అనుక్రమణి ఋగ్వేదంలో కములుఅనుక్రమణి ఇతర వేదాలలో అనుక్రమణీలుఅనుక్రమణి ఇవి కూడా చూడండిఅనుక్రమణి సూచనలుఅనుక్రమణి మూలాలుఅనుక్రమణిదేవతలు

🔥 Trending searches on Wiki తెలుగు:

సిద్ధంభారత రాజ్యాంగంశాసన మండలిఫ్యామిలీ స్టార్ద్వాదశ జ్యోతిర్లింగాలు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలులక్ష్మీనారాయణ వి వివస్తు, సేవల పన్ను (జీఎస్టీ)ఏడు చేపల కథభారత రాజ్యాంగ ఆధికరణలురామావతారంరాజధాని ఫైల్స్దశరథుడుభారతీయ రైల్వేలుగీతా ఫోగట్బౌద్ధ మతంచెమటకాయలుహమీదా బాను బేగంతమిళ అక్షరమాలతహశీల్దార్శ్రీ కృష్ణదేవ రాయలుగుడివాడ శాసనసభ నియోజకవర్గంనువ్వుల నూనెరామాయణంలోని పాత్రల జాబితాభారతదేశ చరిత్రసూర్య నమస్కారాలునరసాపురం లోక్‌సభ నియోజకవర్గందాసరి నారాయణరావుఅమావాస్యపొడుపు కథలుచంద్రగిరి శాసనసభ నియోజకవర్గంగురుడుభారతదేశంభీష్ముడుమాల్దీవులుచతుర్యుగాలుధర్మవరం శాసనసభ నియోజకవర్గంశ్రీనాథుడుధర్మరాజుఅమ్మల గన్నయమ్మ (పద్యం)స్వాతి నక్షత్రముతెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్నాని (నటుడు)మే 7అరుంధతిశ్రీకాళహస్తీశ్వర దేవస్థానంవరుణ్ తేజ్అవకాడోజక్కంపూడి రాజారెండవ ప్రపంచ యుద్ధంఅంగచూషణభీమా (2024 సినిమా)రమణ మహర్షిఅయోధ్యకాండఅయోధ్యతెలుగు వ్యాకరణంఆవేశం (1994 సినిమా)పరిపూర్ణానంద స్వామిరైతురావణుడుసజ్జల రామకృష్ణా రెడ్డిగ్రామ పంచాయతీపోసాని కృష్ణ మురళిసంజు శాంసన్మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంశ్రీ కృష్ణుడుఆంధ్రప్రదేశ్ జనాభా గణాంకాలుఏనుగుమంతెన సత్యనారాయణ రాజుభరణి నక్షత్రముశ్రీ చక్రంఅమ్మసర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్రష్మికా మందన్నఅనుష్క శెట్టిధనిష్ఠ నక్షత్రముకమల్ హాసన్ నటించిన సినిమాలురాజంపేట లోక్‌సభ నియోజకవర్గం🡆 More