అంథోని పీటర్ కిశోర్

ఫాదర్ డా.

జి.ఏ.పి. కిశోర్, యస్.జె, ఫాదర్ కిశోర్ గా సుపరిచితులయిన గుజ్జుల అంథోని పీటర్ కిశోర్ అధ్యాపకులు, బైబులు ఉపదేశకులు, సమాజసేవకులు. ఈయన యేసు సభ సభ్యులు. ప్రస్తుతం ఆంధ్ర లొయోల కళాశాల ప్రిన్సిపాల్ గా వ్యవహరిస్తున్నారు.. వీరు క్రైస్తవ సాహిత్యంలో కొన్ని రచనలు కూడా చేసారు.

ఫాదర్ డా. గుజ్జుల అంథోని పీటర్ కిశోర్, యస్.జె
అంథోని పీటర్ కిశోర్
ఒక కళాశాల కార్యక్రమంలో ప్రసంగిస్తున్న ఫాదర్ కిశోర్
జననంఫాదర్ డా. గుజ్జుల అంథోని పీటర్ కిశోర్, యస్.జె.
1965,ఫిబ్రవరి 1
కృష్ణా జిల్లా గుడివాడ
నివాస ప్రాంతంవిజయవాడ
ఇతర పేర్లుఫాదర్ కిశోర్
వృత్తియేసు సభ సభ్యులు
ఆంధ్ర లొయోల కళాశాల, విజయవాడలో ప్రాచార్యులు (ప్రిన్సిపాల్)
సమాజ సేవకులు
పదవి పేరుఫాదర్, యస్.జె.

బాల్యం

ఫాదర్ కిశోర్ 1965 ఫిబ్రవరి 1న గుడివాడలో జన్మించారు. మరియమ్మ, ప్రసాదరావు వీరి తల్లిదండ్రులు, ఇద్దరూ ఉపాధ్యాయ వృత్తిలో పనిచేసిన వారే. ఫాదర్ కిశోర్ కు ఒక తమ్ముడు, ఒక అక్క, ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. 1965 మార్చి 14న గుడివాడలోని కలవపూడి అగ్రహారంలో బాప్తిజం పొందారు.

విద్యాభ్యాసం

ఫాదర్ కిశోర్ ప్రాథమిక విద్యను కలవపూడి అగ్రహారంలోని పంచాయతీ సమితి ఎలిమెంటరీ స్కూలులో 1975లో పూర్తి చేసారు. అక్కడి నుండి హై స్కూల్ విద్య కోసం సెయింట్ జేవియర్స్ హై స్కూల్ ఏలూరుకు వచ్చి 1980లో పూర్తి చేసారు. ఇంటర్ ఎంపీసీ ఆంగ్ల మాధ్యమంలో 1982లో ఆంధ్ర లొయోల కళాశాల విజయవాడలో పూర్తి చేసారు. ఆపై యేసు సభలో చేరారు. యేసు సభలో చేరాక ఆంధ్రా లొయోల కళాశాల నుండి 1986-88 మధ్య తెలుగులో బీ.ఏ. మొదటి రెండు సంవత్సరాలు అభ్యసించారు, 1989లో మూడో సంవత్సరం బీ.ఏ. ఆంధ్ర క్రైస్తవ కళాశాల గుంటూరులో పూర్తి చేసారు. డిగ్రీలో విశ్వవిద్యాలయ స్థాయిలో బంగారు పతకం సాధించారు. 1991 లో తత్త్వశాస్త్రంలో ఎం.ఏ మద్రాసులోని సత్యనిలయంలో పూర్తి చేసారు. 1991-93 మధ్య హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి తెలుగులో ఎం.ఏ చేసారు. అక్కడ కూడా యూనివర్సిటీ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించారు. ఎం.ఏ పూర్తి చేసాక యూజీసీ వారి నెట్ పరీక్షలో ఉత్తీర్ణులై అధ్యాపకవృత్తికి అర్హత సాధించారు, ఇలా యేసు సభ నుండి నెట్ కు అర్హత సాధించిన వారిలో మొట్టమొదటి వ్యక్తిగా గుర్తింపు పొందారు. మే 2009 లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి "తెలుగు, బైబులు సామెతలు : ఒక తులనాత్మక పరిశీలనం" అనే అంశానికి పీహెచ్‍డీ పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం పీహీచ్‍డీతో పాటు ఫాదర్ కిశోర్ ను బంగారు పతకంతో సత్కరించింది.

రచనలు

  • స్థానిక శ్రీ సభ (ప్రాంతీయ చర్చి గురించి) - 1988లో
  • ఇగ్నేషియస్ లొయోల - 1991లో
  • తెలుగులో దాదాపు 50 వరకూ క్రైస్తవ భక్తి గీతాలు.
  • తెలుగు, బైబుల్ సామెతలు - పరిశీలన, మానవ నైజము, ఉపదేశ సారము ( మూడు సంపుటాలు)

మూలాలు

అంథోని పీటర్ కిశోర్ 
Wikisource
తెలుగువికీసోర్స్ నందు ఈ వ్యాసమునకు సంబంధించిన మూల పాఠ్యము(లు) లేక మాధ్యమము(లు) కలవు:

Tags:

అంథోని పీటర్ కిశోర్ బాల్యంఅంథోని పీటర్ కిశోర్ విద్యాభ్యాసంఅంథోని పీటర్ కిశోర్ రచనలుఅంథోని పీటర్ కిశోర్ మూలాలుఅంథోని పీటర్ కిశోర్

🔥 Trending searches on Wiki తెలుగు:

చింతామణి (నాటకం)బుర్రకథఅన్నయ్య (సినిమా)గుణింతంతిలక్ వర్మవాతావరణంభూమితెలంగాణలో 2024 భారత సార్వత్రిక ఎన్నికలుప్రేమలుకిరణజన్య సంయోగ క్రియసుకన్య సమృద్ధి ఖాతాప్రభుదేవాకుక్కవిశాఖ నక్షత్రముశ్రీవిష్ణు (నటుడు)గ్యాస్ ట్రబుల్నడుము నొప్పిసంధ్యావందనంపూర్వాషాఢ నక్షత్రముఉగాదిముహమ్మద్ ప్రవక్తఎస్. శంకర్రుద్రమ దేవిగజేంద్ర మోక్షంహలో గురు ప్రేమకోసమేశకుంతలఅండాశయముమహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంతెలుగు కవులు - బిరుదులుసిరికిం జెప్పడు (పద్యం)శ్రీ కృష్ణుడుఉషా మెహతాదాశరథి కృష్ణమాచార్యపక్షముమొదటి పేజీపిచ్చుకుంటులవారుపాములపర్తి వెంకట నరసింహారావురచిన్ రవీంద్రకృష్ణా నదివందే భారత్ ఎక్స్‌ప్రెస్సౌందర్యలహరిజవాహర్ లాల్ నెహ్రూవేమననారా చంద్రబాబునాయుడుఆది శంకరాచార్యులుకిరణ్ రావునల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డిబాలకాండఉప రాష్ట్రపతిసామెతలుపోసాని కృష్ణ మురళివిశ్వామిత్రుడువిజయవాడ పశ్చిమ శాసనసభ నియోజకవర్గంసమాసంఏకలవ్యుడురాకేష్ మాస్టర్మొఘల్ సామ్రాజ్యంరంగస్థలం (సినిమా)షాజహాన్చరవాణి (సెల్ ఫోన్)2019 భారత సార్వత్రిక ఎన్నికలుఐక్యరాజ్య సమితిపంచారామాలుప్రకృతి - వికృతితెనాలి రామకృష్ణుడుగద్దలు (పక్షిజాతి)యూట్యూబ్త్రినాథ వ్రతకల్పంకన్యారాశిఆరోగ్యంతట్టుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాఇందుకూరి సునీల్ వర్మసెక్యులరిజంఆర్య (సినిమా)పాల్కురికి సోమనాథుడుఇజ్రాయిల్శివపురాణంవన్ ఇండియా🡆 More