స్టీఫెన్ కింగ్

స్టీఫెన్ ఎడ్విన్ కింగ్ (జననం 1947 సెప్టెంబరు 21) అమెరికన్ రచయిత.

ఆయన ప్రధానంగా హారర్, అతీంద్రియ కల్పన (supernatural fiction), సస్పెన్స్, క్రైమ్, సైన్స్ ఫిక్షన్, ఫాంటసీ నవలలతో ప్రసిద్ధిచెందాడు. దీంతో ఆయనను "కింగ్ ఆఫ్ హారర్"గా పాఠకులు పిలుచుకుంటారు, ఆయన పుస్తకాలు 2006 నాటికి 350 మిలియన్లకు పైగా కాపీలు అమ్ముడయ్యాయి. అంతేకాకుండా, వీటిలో చాలా వరకు చలనచిత్రాలు, టెలివిజన్ ధారావాహికలు, చిన్న సిరీస్‌లు, కామిక్ పుస్తకాలుగా మార్చబడ్డాయి. ఆయన కింగ్ రిచర్డ్ బాచ్‌మన్ అనే కలం పేరుతో ఏడు, అలాగే ఐదు నాన్ ఫిక్షన్ పుస్తకాలతో సహా 65కి పైగా నవలలు ప్రచురించాడు. ఆయన దాదాపు 200 చిన్న కథలు కూడా రాశాడు, వాటిలో ఎక్కువ భాగం పుస్తక సేకరణలలో ప్రచురించబడ్డాయి.

స్టీఫెన్ కింగ్
స్టీఫెన్ కింగ్
2007లో స్టీఫెన్ కింగ్
పుట్టిన తేదీ, స్థలంస్టీఫెన్ ఎడ్విన్ కింగ్
(1947-09-21) 1947 సెప్టెంబరు 21 (వయసు 76)
పోర్ట్ ల్యాండ్, మైన్, యు.ఎస్.
కలం పేరు
  • రిచర్డ్ బాచ్‌మన్
  • జాన్ స్విటెన్
  • బెరిల్ ఎవాన్స్
వృత్తిరచయిత
పూర్వవిద్యార్థియూనివర్సిటీ ఆఫ్ మైనే (బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్)
కాలం1967–ప్రస్తుతం
రచనా రంగం
  • హారర్ ఫిక్షన్
  • ఫాంటసీ ఫిక్షన్
  • అతీంద్రియ కల్పన
  • డ్రామా ఫిక్షన్ (నాటకం)
  • గోతిక్ ఫిక్షన్
  • జానర్ ఫిక్షన్
  • డార్క్ ఫాంటసీ
  • అపోకలిప్టిక్ అనంతర కల్పన
  • క్రైమ్ ఫిక్షన్
  • సస్పెన్స్ ఫిక్షన్
  • థ్రిల్లర్ ఫిక్షన్
జీవిత భాగస్వామి
సంతానం3, జో హిల్ (రచయిత), ఓవెన్ కింగ్ లతో సహా

సంతకంస్టీఫెన్ కింగ్

బ్రామ్ స్టోకర్ అవార్డులు, వరల్డ్ ఫాంటసీ అవార్డులు, బ్రిటిష్ ఫాంటసీ సొసైటీ అవార్డులతో పాటు పలు పురస్కారాలను ఆయన అందుకున్నాడు. 2003లో, నేషనల్ బుక్ ఫౌండేషన్ అతనికి అమెరికన్ లెటర్స్‌కు విశిష్ట సహకారం అందించినందుకు మెడల్‌ను ప్రదానం చేసింది. 2004 వరల్డ్ ఫాంటసీ అవార్డ్ ఫర్ లైఫ్ అచీవ్‌మెంట్, మిస్టరీ రైటర్స్ ఆఫ్ అమెరికా నుండి 2007 గ్రాండ్ మాస్టర్ అవార్డ్ వంటివి ఆయన సాహిత్యానికి చేసిన కృషికి అందుకున్నాడు. 2015లో, ఆయన సాహిత్యానికి చేసిన కృషికి అమెరికా నేషనల్ ఎండోమెంట్ ఫర్ ది ఆర్ట్స్ నుండి నేషనల్ మెడల్ ఆఫ్ ఆర్ట్స్‌ను కూడా అందుకున్నాడు.

వ్యక్తిగత జీవితం

ఆయన 1971 జనవరి 2న తబితా స్ప్రూస్‌ను వివాహం చేసుకున్నాడు. ఆమె కూడా నవలా రచయిత. వారి నివాసాల్లో ఒకటైన బాంగోర్‌లోని కింగ్స్ హోమ్ పర్యాటక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా రచయతలకు కేంద్రమైన ఇక్కడ వారి ఆర్కైవ్‌లు అందుబాటులో ఉంచారు.

వీరికి ముగ్గురు పిల్లలు, ఒక కుమార్తె కాగా ఇద్దరు కుమారులు. వారి కుమార్తె నయోమి ఫ్లోరిడాలోని ప్లాంటేషన్‌లో యూనిటేరియన్ యూనివర్సలిస్ట్ చర్చి మంత్రిగా, ఆమె భాగస్వామి తండెకాతో కలిసి పని చేస్తోంది. ఇక కుమారులు ఇద్దరూ రచయితలు: ఓవెన్ కింగ్ తన మొదటి కథల సంకలనాన్ని 2005లో ప్రచురించాడు, అలాగే అదే సంవత్సరం జో హిల్‌గా వ్రాసే జోసెఫ్ హిల్‌స్ట్రోమ్ కింగ్ 20వ శతాబ్దపు గోస్ట్స్‌లో మొదటి చిన్న కథల సంకలనం ప్రచురించాడు.

తను రచయిత అవడానికి ఏదీ చేతకాకపోవడమే కారణం అని చెప్పే స్టీఫెన్ కింగ్ రోజూ కనీసం నాలుగు నుంచి ఆరు గంటలు చదవడం, రాయడం చేస్తాడుట. అలాగే సుమారు రెండు వేల పదాలైనా రాయకుండా నిద్రపోకూడదనేది ఆయన నియమం.

మూలాలు

Tags:

en:Richard Bachmanen:Stephen King short fiction bibliographyసైన్స్ ఫిక్షన్

🔥 Trending searches on Wiki తెలుగు:

ఐశ్వర్య రాయ్వేపశారదపాట్ కమ్మిన్స్పంచభూతలింగ క్షేత్రాలుపార్లమెంట్ సభ్యుడు2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలురంగస్థలం (సినిమా)పచ్చకామెర్లుతెలుగు పత్రికలుఫేస్‌బుక్రతన్ టాటాఒగ్గు కథజోర్దార్ సుజాతప్రియురాలు పిలిచిందిముహమ్మద్ ప్రవక్తప్లీహమురక్తపోటుకుష్టు వ్యాధిచేతబడిప్రకటనఆంధ్రప్రదేశ్ చరిత్రచిలకమర్తి లక్ష్మీనరసింహంపెద్దపల్లి లోక్‌సభ నియోజకవర్గంనన్నయ్యజె. చిత్తరంజన్ దాస్మహాకాళేశ్వర జ్యోతిర్లింగంలోక్‌సభA90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్పాముప్రీతీ జింటారక్తంషిర్డీ సాయిబాబాఅయ్యప్ప స్వామి అష్టోత్తర శత నామావళివై.యస్.భారతిరుక్మిణీ కళ్యాణంవిష్ణువువావిలికల్పనా చావ్లాఅచ్చులుభారతీయ సంస్కృతిక్లోమముబ్రెజిల్టబుశ్రీకాళహస్తిగోవిందుడు అందరివాడేలేవిశాఖ నక్షత్రముకాజల్ అగర్వాల్పరిటాల రవిగౌడఅన్నయ్య (సినిమా)వరలక్ష్మి శరత్ కుమార్క్వినోవాఈజిప్టుమనుస్మృతిఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాసెక్స్ (అయోమయ నివృత్తి)బమ్మెర పోతనభారత జాతీయ ఎస్టీ కమిషన్చర్మములలితా సహస్రనామ స్తోత్రంచిత్తూరు నాగయ్యజ్యోతీరావ్ ఫులేఅమ్మకోసంతెలుగు పద్యముహనుమంతుడువిద్యారావుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాప్రజా రాజ్యం పార్టీఅమరావతిరఘురామ కృష్ణంరాజుయేసుమలబద్దకంశ్రీలీల (నటి)హైదరాబాద్ రేస్ క్లబ్2024 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలుఅక్కినేని నాగార్జున🡆 More