సుభాష్ కాక్

సుభాష్ కాక్ (జననం 1947 మార్చి 26, శ్రీనగర్) భారతీయ-అమెరికన్ కంప్యూటర్ శాస్త్రవేత్త.

హిందుత్వ ఆధారిత చారిత్రక రివిజనిస్టు. అతను ఓక్లహోమా స్టేట్ యూనివర్శిటీ-స్టిల్‌వాటర్‌లో కంప్యూటర్ సైన్సు విభాగం రీజెంట్స్ ప్రొఫెసరు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో గౌరవ విజిటింగ్ ప్రొఫెసరు. భారతదేశ ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ (PM -STIAC)లో సభ్యుడు

సుభాష్ కాక్
సుభాష్ కాక్
స్వీడన్ లోని వాక్సియోలో జరిగిన ఫౌండేషన్స్ ఆఫ్ క్వాంటమ్ మెకానిక్స్ కాన్ఫరెన్సులో సుభాష్ కాక్
జననం
శ్రీనగర్, జమ్మూ కాశ్మీరు
విద్యా నేపథ్యం
చదువుకున్న సంస్థలుఎన్‌ఐటి శ్రీనగర్, ఐఐటి ఢిల్లీ
పరిశోధక కృషి
వ్యాసంగంకంప్యూటర్ సైన్స్
ఉప వ్యాసంగం
  • క్రిప్టోగ్రఫీ
  • క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ
  • క్వాంటమ్ ఇన్ఫర్మేషన్
  • హిస్టరీ ఆఫ్ సైన్స్
పనిచేసిన సంస్థలుఓక్లహోమా స్టేట్ యూనివర్సిటీ -స్టిల్‌వాటర్
గుర్తింపు పొందిన కృషి
  • ఇన్ సెర్చ్ ఆఫ్ క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్
గుర్తింపు పొందిన ఆలోచనలుఇన్‌స్టంటేనియస్లీ ట్రెయిన్‌డ్ న్యూరల్ నెట్‌వర్క్స్

కాక్, సైన్సు చరిత్ర, సైన్సు తత్వశాస్త్రం, ప్రాచీన ఖగోళ శాస్త్రం, గణిత చరిత్రపై రచనలు చేసాడు. పురావస్తు శాస్త్రంపై కూడా రచించాడు. స్వదేశీ ఆర్యుల ఆలోచనను సమర్థించాడు. చాలా మంది పండితులు ఈ అంశాలపై అతని సిద్ధాంతాలను పూర్తిగా తిరస్కరించారు. అతని రచనలపై తీవ్రంగా విమర్శలు వచ్చాయి.

2019 లో భారత ప్రభుత్వం అతనికి భారతదేశంలో నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం, పద్మశ్రీ ప్రదానం చేసింది.

ప్రారంభ జీవితం, విద్య

కాక్ రామ్ నాథ్ కాక్, సరోజిని కాక్ లకు భారతదేశంలోని శ్రీనగర్లో జన్మించాడు. అతని తండ్రి ప్రభుత్వ పశువైద్య వైద్యుడు. సోదరుడు అవినాష్ కాక్ కంప్యూటర్ శాస్త్రవేత్త. సోదరి జయశ్రీ ఓడిన్ సాహిత్య సిద్ధాంతకర్త.

కాక్ శ్రీనగర్ లోని రీజినల్ ఇంజనీరింగ్ కాలేజీ (ప్రస్తుతం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అని పేరు మార్చారు) నుండి బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ పట్టా పొందాడు. 1970 లో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఢిల్లీ నుండి పిహెచ్‌డి పొందాడు.

విద్యా వృత్తి

1975-1976 మధ్యకాలంలో, కాక్ లండన్లోని ఇంపీరియల్ కాలేజీలో విజిటింగ్ ఫ్యాకల్టీగా, ముర్రే హిల్‌లోని బెల్ లాబొరేటరీస్‌లో అతిథి పరిశోధకుడుగా పనిచేసాడు. 1977 లో, అతను బొంబాయిలోని టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌లో సందర్శక పరిశోధకుడుగా పనిచేసాడు. 1979 లో, అతను లూసియానా స్టేట్ యూనివర్శిటీ, బాటన్ రూజ్‌లో చేరాడు. అక్కడ డోనాల్డ్ సి. అండ్ ఎలైన్ టి. డెలాన్ ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విశిష్ట ప్రొఫెసరుగా నియమితులయ్యాడు. 2007 లో అతను ఓక్లహోమా స్టేట్ యూనివర్శిటీ-స్టిల్‌వాటర్‌లో కంప్యూటర్ సైన్సు విభాగంలో చేరాడు.

కాక్ సైన్సు చరిత్ర, సైన్సు తత్వశాస్త్రం, గణిత చరిత్రపై ప్రచురించారు .

చెరిల్ ఫ్రికాస్సో, స్టాన్లీ క్రిప్నర్ సంపాదకులుగా ఉన్న న్యూరో క్వాంటాలజీ పత్రికలో క్వాంటం అభ్యాసానికి మార్గదర్శకులలో ఒకరుగా ఆయన ఉన్నాడు. కాక్ సమర్థవంతమైన త్రీ-లేయర్ ఫీడ్-ఫార్వర్డ్ న్యూరల్ నెట్‌వర్క్ నిర్మాణాన్ని ప్రతిపాదించాడు. శిక్షణ కోసం నాలుగు మూలల వర్గీకరణ అల్గారిథమ్‌లను అభివృద్ధి చేశాడు. స్కేలబిలిటీ సమస్యలపై విమర్శలు ఉన్నప్పటికీ; ఇది ఎలక్ట్రానిక్ హార్డ్‌వేర్ సమాజపు దృష్టిని ఆకర్షించింది. కృత్రిమ మేధస్సుకు పరిమితులు ఉన్నాయని, అది జీవ మేధస్సుతో సమానం కాదని కాక్ వాదించారు.

కాక్ ఓక్లహోమా స్టేట్ యూనివర్శిటీ-స్టిల్‌వాటర్ కంప్యూటర్ సైన్సు విభాగం రీజెంట్స్ ప్రొఫెసరు, జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ గౌరవ విజిటింగ్ ప్రొఫెసరు.

2018 ఆగస్టు 28 న ఆయన భారతదేశంలో ప్రధానమంత్రి సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ అడ్వైజరీ కౌన్సిల్ (పిఎం-ఎస్‌టిఐఐసి) సభ్యుడుగా నియమితులయ్యాడు.

ఇండాలజీ

ఇండో-ఆర్యుల వలస సిద్ధాంతపు ప్రామాణికత గురించి పండితుల ఏకాభిప్రాయానికి విరుద్ధంగా కాక్, ప్రధానంగా పంజాబులో ఇండో-ఆర్యన్ల ఆటోచోనస్ మూలం ఉందని వాదించాడు (" స్వదేశీ ఆర్యులు " పరికల్పన). వలస సిద్ధాంతం జాత్యహంకార ధోరణుల నుండి ఉత్పన్నమయిందని కాక్ అభిప్రాయపడ్డాడు. అతని ఆరోపణలు ఎటువంటి ఆధారాలూ లేనివని, వాటిపై విమర్శనాత్మక పరిశీలన జరగలేదనీ, ప్రధానంగా హిందూ ఆధిపత్యాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించినవనీ కొందరు పండితులు విమర్శించారు.

కాక్ ఋగ్వేదంలో ఆధునిక కంప్యూటింగు, ఖగోళశాస్త్రమూ ఉన్నట్లు ఆధారాలు కనుగొన్నానని చెప్పాడు. ఇది "ఆధునిక శాస్త్రవిజ్ఞానంపై సామాజిక నిర్మాణాత్మకత, ఆధునికోత్తర శాస్త్రాల దాడి" అని నోరెట్టా కోర్టియే భావించింది. వైదిక శాస్త్రవేత్తలు యోగ ధ్యానం ద్వారా భౌతిక నియమాలను కనుగొన్నారని అన్నాడు. ఇది సరైన శాస్త్రీయ పద్ధతేనని, ఇది యోగిక జ్ఞానం పొందిన వారు మాత్రమే అంచనా వేయగలరనీ అన్నాడు. కాక్ ముస్లింలపై హిందువుల ఆధిపత్యాన్ని నమ్ముతాడని మీరా నందా ఆరోపించింది. 2004 లో చేసిన విమర్శలో ఆమె, ముస్లిములకు చెందిన "సైనిక సామ్రాజ్యాలు" ఆక్రమణలపై ఆధారపడినట్లుగా కాకుండా, హిందువులు సైనిక విజయాలేమీ లేకుండానే "సాంస్కృతిక సామ్రాజ్యాలను" నిర్మించారని కాక్ అభిప్రాయపడినట్లు ఆమె విమర్శించింది.

మీరా నందా కాక్ ను ఒక హిందుత్వ ప్రముఖుడిగా, ప్రముఖ “మేధో క్షత్రియులలో” ఒకరిగా గౌరవం పొందాడని చెప్పింది. ఎడ్విన్ బ్రయంట్ అతన్ని స్వదేశీ ఆర్య పరికల్పనకు, పురాతన భారతీయ విజ్ఞాన శాస్త్రం, సంస్కృతి లకు సంబంధించిన ఇతర సమస్యలకూ ప్రతినిధి అని భావించాడు.

కొందరు పండితులు అతని సిద్ధాంతాలను పూర్తిగా తిరస్కరించారు. అతని రచనలను తీవ్రంగా విమర్శించారు. తప్పుడు పరిశీలనలతో పాటు వాస్తవాలను తీవ్రంగా తప్పుగా చూపించడం, చాలా సరళమైన, తరచుగా స్వీయ-విరుద్ధంగా ఉండే విశ్లేషణలు, అనుకూలంగా ఉన్న డేటాను మాత్రమే ఎంచుకోవడం, తేలికగా ఖండించదగిన పరికల్పనలను ముందుకు తీసుకుపోవడం వంటి వాటిని వీరు పేర్కొన్నారు. భాషాశాస్త్రంపై అతని అవగాహనను, తదుపరి సమర్ధనలనూ సవాలు చేసారు. రోమిలా థాపర్ కాక్ ను ఒక ఔత్సాహిక చరిత్రకారుడు అని వర్ణించింది. సింధు నాగరికతపై అతడి అభిప్రాయాలు ప్రధాన స్రవంతిలో కాకుండా బాటకు అంచుల్లో ఉంటాయని చెప్పింది. చరిత్రను అడ్డుపెట్టుకుని రాజకీయ యుద్ధాలు చేసే సమూహంలో అతడు భాగమని ఆమె ఆరోపించింది. మైఖేల్ విట్జెల్ అతన్ని ఒక రివిజనిస్టు అని, "చిక్కగా అల్లుకుపోయిన, స్వీయ-సంకలన సమూహం" లో భాగమని ఆరోపించాడు. ఈ సమూహం లోని సభ్యులు తరచూ కలిసి వ్రాస్తూంటారు. వీళ్ళు ఒకరి రచనను మరొకరు ఉదహరిస్తూంటారు, కాపీ చేసుకుంటూంటారు. తద్వారా వాస్తవమేంటో తెలియనంతగా మొత్తం దృశ్యాన్ని గజిబిజిగా మారుస్తారు అని విట్జెల్ ఆడిపోసుకున్నాడు నకిలీ పురావస్తు శాస్త్రాన్ని విమర్శించే గారెట్ జి. ఫాగన్, విట్జెల్ తో ఏకీభవించాడు. అతను "హిందుత్వ ఆధారిత రివిజనిస్టు" కావడం పట్ల కొందరు ఇతర రచయితలు కూడా ఆందోళనలు వెలిబుచ్చారు. హిందుత్వ భావజాలంలో, సిద్ధాంతాలలో తప్పుడు శాస్త్రీయ తార్కికత ఉంటుందని చేసిన విమర్శలో అలాన్ సోకల్, కాక్‌ను " హిందూ-జాతీయవాద ప్రవాసుల ప్రముఖంగా వెలుగుతున్న మేధో ప్రకాశం" అని వ్యంగ్యంగా విమర్శించాడు. ప్రాచీన హిందూ నాగరికత ఆధిపత్యాన్ని నిరూపించే ప్రయత్నంలో వేద గ్రంథాలలో సాపేక్షంగా అధునాతన నైరూప్య భౌతిక శాస్త్రవిషయాలున్నాయనీ, సంస్కృతం మాట్లాడే ఇండిక్ ఆర్యన్లు స్వదేశీయులేననీ చెప్పి ప్రాచీన హైందవ గొప్పదనాన్ని ప్రకటించే హిందుత్వ ఆధారిత సూడో సైన్సు పురోగతికి కాక్ కృషి దోహదపడుతోందని కోర్టియే, మీరా నందావ్యాఖ్యానించారు.

పై విమర్శలు ఎన్ని ఉన్నప్పటికీ, వేదకాలంలో భారతదేశం లోను, పశ్చిమ దేశాల లోనూ విలసిల్లిన ఖగోళశాస్త్రంపై కాక్ చేసిన వ్యాఖ్యానాలను ఖగోళ శాస్త్ర అవలోకనాలలో ప్రచురించారు. అతని కాలక్రమాన్ని, ఖగోళ గణనలనూ మైఖేల్ విట్జెల్, వంటి ఇండాలజిస్టులు, కిమ్ ప్లాఫ్కర్ వంటి చరిత్రకారులూ విమర్శించారు.

సమీక్షించిన రచనలు

ఆర్కియోఏస్ట్రానమీ - ది ఏస్ట్రనామికల్ కోడ్ ఆఫ్ ది ఋగ్వేద

ఋగ్వేదంలో శ్లోకాల కూర్పు గ్రహాల గతులు, సౌర సంవత్సరం చంద్ర సంవత్సరాల పొడవు, సూర్యుడు, భూమి మధ్య దూరం వంటి వాటిని బట్టి ఉందని కాక్ ప్రతిపాదించాడు. దీనిని ఆధారంగా చేసుకుని కాక్, క్రీ.పూ 3000, 4000 నాటికే భారతదేశంలో అధునాతన పరిశీలనా ఖగోళ శాస్త్ర సంప్రదాయం ఉండేదని అన్నాడు. హోమగుండాల నిర్మాణం వారి ఖగోళశాస్త్ర పరిజ్ఞానానికి సంకేతమని అతడు పేర్కొన్నాడు వేద నాగరికత ప్రజలకు కాంతి వేగం గురించి తెలుసునని కూడా అన్నాడు. అతను UNESCO ప్రపంచ వారసత్వ సదస్సు సందర్భంలో తయారు చేసిన ఆస్ట్రానమీ అండ్ ఆర్కియోఆస్ట్రానమీ హెరిటేజ్ సైట్స్ అధ్యయనంలో భారతదేశం భారతదేశ విభాగాన్ని కాక్ తయారు చేసాడు.

ఋగ్వేదం లోని శ్లోకాల సంఖ్యా కలయికలలో గ్రహల కక్ష్యాకాల సంఖ్యల ఉనికి ఉందని కాక్ చేసిన సంభావ్య విశ్లేషణను కిమ్ ప్లోఫ్కర్ తిరస్కరించాడు. సూచించిన విశేషాలకు "సంఖ్యా గణాంక ప్రాముఖ్యత లేదు" అని అతడన్నాడు. అతడి విశ్లేషణలో అనేక లోపాలునయని చెబుతూ విట్జెల్ దాన్ని తిరస్కరించాడు. కావలసిన ఫలితాలను రాబట్టేందుకు గుణకార కారకాలను ఏకపక్షంగా ఉపయోగించాడని విమర్శించాడు. కాక్ యొక్క పద్ధతి, వేదాల శాఖా పరిష్కారాలపై ఆధారపడి ఉంటుంది. దీంతో వీటి కాలాన్ని నిర్ధారించే కాక్ ప్రయత్నం టెక్స్ట్ లోపభూయిష్టంగా మారిందని విట్జెల్ విమర్శించాడు. ఎందుకంటే ఒక్కో శ్లోకం కూర్పు జరిగినా చాలా కాలం తర్వాత ఈ పునర్నిర్మాణ ప్రక్రియ జరిగింది. అంతిమంగా ఈ వ్యవహారం మొత్తం, ఋగ్వేదం ప్రతి పద్యంలో ఖగోళశాస్త్రపు సాక్ష్యాలను కనుగొనాలనే ఉద్దేశంతోనే అధ్యయనం చేసిన కాక్ సృజనాత్మకత, అతడు చేసిన అతి విశ్లేషణగా మిగిలిపోయింద్ని విట్జెల్ చెప్పాడు. మీరా నందా, కాక్ చేసిన విశ్లేషణ ఏకపక్షమైనదని, అసంబద్ధమైనదనీ సుదీర్ఘంగా విమర్శించింది. అతని పద్ధతిని "గుక్క తిప్పుకోలేనంత తాత్కాలికమైనద"ని తెలుసుకుంది. ఇది " న్యూమరాలజీ" లాంటిది అని చెప్పింది." భండార్కర్ ఓరియంటల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ యొక్క అన్నల్స్ లో చేసిన సమీక్షలో, ఎంఏ మెహెందలే, ఈ పుస్తకం లోని అనేక లోపాలను విమర్శించాడు. ఇందులో తప్పుదోవ పట్టించే వ్యాఖ్యానాలున్నాయని అంటూ, ఇది తీక్ష్ణమైన పరిశీలనకు నిలబడలేదు అని వ్యాఖ్యానించాడు. శాంతి స్వరూప్ భట్నాగర్ బహుమతి గ్రహీత SG డానీ, కాక్ పరికల్పనను అశాస్త్రీయమనీ, చాలా అస్పష్టమైన వివరాలతో ఉన్న అత్యంత ఊహాత్మకమైనదనీ తిరస్కరించాడు. దీని ఫలితాలు గణాంకశాస్త్ర పరంగా గుర్తింపు లేనివని చెప్పాడు.

క్లాస్ క్లోస్టర్‌మైర్ తన పుస్తకం ఎ సర్వే ఆఫ్ హిందూయిజంలో కాక్‌ను ప్రశంసించాడు. "అనుభవ ఖగోళ / గణిత దృక్పథం నుండి వేదకాలపు విశ్వోద్భవ శాస్త్ర అధ్యయనానికి పూర్తిగా కొత్త విధానాన్ని" తెరిచినందుకు కాక్‌ను అతడు అభినందించాడు. దీంతో హిందూ అనుకూల అభిప్రాయాలను వెల్లడించాయని చెబుతూ క్లోస్టర్‌మైర్ పుస్తకాలను కూడా తీవ్రంగా విమర్శించారు.

ప్రభావం

కాక్ చేసిన కృషితో ప్రభావితుడై రాజా రామ్ మోహన్ రాయ్, 1999 లో వేదిక్ ఫిజిక్స్: సైంటిఫిక్ ఆరిజిన్ ఆఫ్ హిందూయిజం అనే పుస్తకం రాసాడు. ఋగ్వేదంలో క్వాంటం ఫిజిక్స్, పార్టికల్ ఫిజిక్స్ సూత్రాలు గర్భితమై ఉన్నాయని నిరూపించడానికి ఆ పుస్తకంలో అతడు ప్రయత్నించాడు. వేద భౌతిక శాస్త్రాన్ని చూసే కొత్త మార్గమని రాయ్ వ్యాఖ్యానాలను ప్రశంసిస్తూ కాక్, ఈ పుస్తకానికి ముందుమాట రాశాడు. కాక్ ప్రధాన విమర్శకులలో ఒకరైన మీరా నందా దీన్ని, "భౌతిక శాస్త్రంతో పాటు వేదాలను కూడా సిగ్గుపడేలా చేయడం" అనీ "పిచ్చి ప్రేలాపనలనీ" వర్ణించింది.

ఇన్ సెర్చ్ ఆఫ్ ది క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్

జార్జ్ ఫ్యూయర్‌స్టెయిన్, డేవిడ్ ఫ్రోలీలతో కలిసి కాక్, ఇన్ సెర్చ్ ఆఫ్ ది క్రాడిల్ ఆఫ్ సివిలైజేషన్ అనే పుస్తకం రాసాడు. వేదకాలపు ఆర్యులను హరప్పన్లతో సమానం చేసి, తద్వారా "స్వదేశీ ఆర్య" సిద్ధాంతం చుట్టూ తలెత్తిన రాజకీయ వివాదంలో తలదూర్చాడు. వివిధ గ్రంథాల్లో ఉన్న సూచనలు, పురావస్తు అవశేషాలను పరస్పరం అనుసంధానించడం ద్వారా పొందిన పురావస్తు ఆధారాలపై ఆధారపడి ఈ పుస్తకంలో పేర్కొన్న కాలక్రమం ఉంటుంది.

భారత పురావస్తు శాస్త్రవేత్త ఎం.కె. ధవాలికర్ చేసిన సమీక్షలో ఇది ఆర్యుల వలస పరికల్పనకు వ్యతిరేకంగా, దేశీయ ఆర్య సిద్ధాంతానికి బలమైన సమర్ధనగా నిలిచిన చక్కటి ప్రచురణ అని అన్నాడు. కాని కొన్ని కీలకమైన అంశాలపై మౌనంగా ఉండకుండా వివరించి ఉండాల్సింది అని అతడన్నాడు. గై బెక్ యోగా జర్నల్ లో రాసిన తన సమీక్షలో పుస్తకంపై అద్భుతమైన ప్రశంసలు కురిపించాడు. క్లోస్టెర్మైర్ తదితరులు. కూడా ఆ పుస్తకాన్ని ప్రశంసించారు. యూరోపియన్లతో వారి ఉన్నతమైన జాతి, సాంస్కృతిక సంబంధాలను ప్రదర్శించడం ద్వారా ప్రవాస హిందూ అమెరికన్లను ఇతర మైనారిటీ సమూహాల నుండి వేరు చేయడానికి ఈ పుస్తకం ప్రయత్నించినట్లు ప్రేమా కురియన్ గుర్తించింది.

ది నేచర్ ఆఫ్ ఫిజికల్ రియాలిటీ

అమెరికన్ మనస్తత్వవేత్త స్టాన్లీ క్రిప్నర్, ఈ పుస్తకాన్ని పాఠకులను జ్ఞానాన్ని విస్తరించే చక్కటి పుస్తకం అని ది నేచర్ ఆఫ్ ఫిజికల్ రియాలిటీని ప్రశంసించాడు.

తెలుగు అనువాదాలు

కాక్ రాసిన ఏస్ట్రనామికల్ కోడ్ ఆఫ్ ఋగ్వేద అనే పుస్తకాన్ని ఋగ్వేద సాంకేతికత-ఖగోళ రహస్యాలు పేరుతో శాఖమూరి శివరాంబాబు, అర్జునాదేవి లు తెలుగు లోకి అనువదించారు.

గమనికలు

మూలాలు

This article uses material from the Wikipedia తెలుగు article సుభాష్ కాక్, which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.

Tags:

సుభాష్ కాక్ ప్రారంభ జీవితం, విద్యసుభాష్ కాక్ విద్యా వృత్తిసుభాష్ కాక్ ఇండాలజీసుభాష్ కాక్ తెలుగు అనువాదాలుసుభాష్ కాక్ గమనికలుసుభాష్ కాక్ మూలాలుసుభాష్ కాక్జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (న్యూ ఢిల్లీ)శ్రీనగర్హిందుత్వ

🔥 Trending searches on Wiki తెలుగు:

పొంగూరు నారాయణతామర వ్యాధిశ్రీలీల (నటి)రుద్రమ దేవిఎస్. ఎస్. రాజమౌళిభరతుడుకృష్ణా నదిద్వాదశ జ్యోతిర్లింగాలుఎఱ్రాప్రగడకాసర్ల శ్యామ్జాతీయ ఆదాయంమదర్ థెరీసాభారతదేశంయేసుఆంధ్రప్రదేశ్ వెనుకబడిన కులాల జాబితావేయి స్తంభాల గుడితెలంగాణ ప్రజా సమితిపాఠశాలగరుడ పురాణంకాకతీయుల శాసనాలుశ్రవణ నక్షత్రముభాస్కర్ (దర్శకుడు)మూలకముఅమెరికా సంయుక్త రాష్ట్రాలుమసూదవిష్ణువుజమ్మి చెట్టుఉగాదివేమనఅనుపమ పరమేశ్వరన్రాజ్యాంగంమంగళసూత్రంమహాభారతంపేరురాగులుగుమ్మడి నర్సయ్యతెలుగు జర్నలిజంరాజనీతి శాస్త్రముగజేంద్ర మోక్షంకంటి వెలుగుఆర్యవైశ్య కుల జాబితాలేపాక్షిరాకేష్ మాస్టర్నెట్‌ఫ్లిక్స్కేతువు జ్యోతిషంపర్యాయపదంఖోరాన్PHతిథిబుజ్జీ ఇలారాఉపాధ్యాయుడుగోవిందుడు అందరివాడేలేభారత రాజ్యాంగం - ఆదేశిక సూత్రాలువీర సింహా రెడ్డిభూమివాలిదళితులువై.యస్. రాజశేఖరరెడ్డిశతక సాహిత్యముతెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘంకొమురం భీమ్జాషువావందేమాతరంకళలుదావీదుఆకు కూరలుసావిత్రిబాయి ఫూలేపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిరైతుహిందూధర్మంసౌందర్యలహరినవరసాలునాయిబ్రాహ్మణులు(ఇంటి పేర్లు,గోత్ర నామములు)యేసు శిష్యులుఇస్లామీయ ఐదు కలిమాలుద్రౌపది ముర్మునెల్లూరు చరిత్రమలబద్దకంరామేశ్వరం🡆 More