రాజు శ్రీవాస్తవ

సత్య ప్రకాష్ శ్రీవాస్తవ (1963 డిసెంబరు 25 - 2022 సెప్టెంబరు 21) ఒక భారతీయ హాస్యనటుడు, రాజకీయ నాయకుడు.

బాలీవుడ్ నటుడైన ఆయన ఉత్తరప్రదేశ్ ఫిల్మ్ బోర్డ్ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. ఆయన గజోధర్‌గా ఘనత పొందాడు.

రాజు శ్రీవాస్తవ
రాజు శ్రీవాస్తవ
ఒక కార్యక్రమంలో రాజు శ్రీవాస్తవ
జన్మ నామంసత్య ప్రకాష్ శ్రీవాస్తవ
జననం (1963-12-25) 1963 డిసెంబరు 25 (వయసు 60)
కాన్పూర్, ఉత్తర ప్రదేశ్, భారతదేశం
మరణం2022 సెప్టెంబరు 21
ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ
మాధ్యమంహింధీ
కళలుఅబ్జర్వేషనల్ కామెడీ, స్టాండింగ్ కామెడీ
భార్య లేక భర్తశిఖా శ్రీవాస్తవ
విశేష కృషి, పాత్రలుది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్పై స్టాండప్ కామెడీ

జీవితం తొలి దశలో

1963 డిసెంబరు 25న కాన్పూర్‌లో మధ్యతరగతి కుటుంబంలో రాజు శ్రీవాస్తవ జన్మించాడు. అతని తండ్రి రమేష్ చంద్ర శ్రీవాస్తవ, బాలై కాకా అని పిలువబడే కవి. రాజు శ్రీవాస్తవ చిన్నప్పటి నుంచి మిమిక్రి కళాకారుడు కావడంతో హాస్యనటుడు కావాలనే కోరిక ఉండేది.

కెరీర్

భారతదేశంతో పాటూ విదేశాలలో రాజు శ్రీవాస్తవ ఎన్నో స్టేజ్ షోలను ప్రదర్శించాడు. ఆయన ఆడియో క్యాసెట్‌లు, వీడియో సీడీలను కూడా విడుదల చేశాడు. ఆయన అమితాబ్ బచ్చన్ లుక్-అలైక్‌గా ప్రారంభ గుర్తింపు పొందాడు. బాలీవుడ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ కెరీర్ ప్రారంభించాడు. రాజశ్రీ ప్రొడక్షన్స్ సినిమా మైనే ప్యార్ కియాలో, బాజీగర్, బాంబే టు గోవా వంటి ప్రజాధరణ పొందిన చిత్రాలలో చిన్న పాత్రలు పోషించాడు. ఆయన బాలీవుడ్ చిత్రం అమ్దాని అత్తన్ని ఖర్చ రూపయ్యలో హాస్యనటుడిగా మెప్పించాడు. ఆయన టాలెంట్ షో ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్‌తో స్టాండ్-అప్ కామెడీలోకి ప్రవేశించాడు. ఇందులో రెండవ రన్నరప్‌గా నిలిచాడు. తదనంతరం స్పిన్-ఆఫ్, ది గ్రేట్ ఇండియన్ లాఫ్టర్ ఛాలెంజ్ - ఛాంపియన్స్‌లో పాల్గొని టైటిల్ గెలుచుకున్నాడు.

రాజకీయ జీవితం

2014 లోక్‌సభ ఎన్నికల్లో సమాజ్‌వాదీ పార్టీ రాజు శ్రీవాస్తవను కాన్పూర్ నుంచి పోటీకి పెట్టాలని చివరిదశలో విరమించుకుంది. ఆ తర్వాత 2014 మార్చి 19న భారతీయ జనతా పార్టీలో చేరాడు. స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనను నామినేట్ చేశారు. అప్పటి నుండి అతను వివిధ నగరాల్లో తన కార్యక్రమాల ద్వారా పరిశుభ్రతను ప్రోత్సహిస్తున్నాడు. అతను పరిశుభ్రత ప్రచారం కోసం వివిధ మ్యూజిక్ వీడియోలను రూపొందించాడు. అతను స్వచ్ఛ భారత్ అభియాన్ కోసం వివిధ టీవీ ప్రకటనలు, సామాజిక సేవా సందేశ వీడియోను కూడా చిత్రీకరించాడు.

వ్యక్తిగత జీవితం

లక్నోకు చెందిన శిఖాను 1993 జులై 1న వివాహం చేసుకున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు, అంతారా, ఆయుష్మాన్. 2010లో అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం, పాకిస్థాన్‌పై తన షోల సమయంలో జోకులు వేయవద్దని హెచ్చరిస్తూ పాకిస్థాన్ నుంచి ఆయనకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. 58 ఏళ్ల ఆయన 2022 ఆగస్టు 11న జిమ్‌లో వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెపోటుకు గురయ్యాడు. అప్పటి నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్ లో వైద్యులు ఆయన్ను వెంటిలేటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. కాగా 2022 ఆగస్టు 25న స్పృహలోకి వచ్చాడు.

మరణం

కొద్దిరోజులుగా న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లో చికిత్స పొందుతున్న రాజు శ్రీవాస్తవ 2022 సెప్టెంబరు 21న ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుది శ్వాస విడిచాడు.

మూలాలు

Tags:

రాజు శ్రీవాస్తవ జీవితం తొలి దశలోరాజు శ్రీవాస్తవ కెరీర్రాజు శ్రీవాస్తవ రాజకీయ జీవితంరాజు శ్రీవాస్తవ వ్యక్తిగత జీవితంరాజు శ్రీవాస్తవ మరణంరాజు శ్రీవాస్తవ మూలాలురాజు శ్రీవాస్తవ

🔥 Trending searches on Wiki తెలుగు:

రామప్ప దేవాలయంఅంగుళంక్వినోవారమణ మహర్షిదేవులపల్లి కృష్ణశాస్త్రిఅంగారకుడునందిగం సురేష్ బాబుభారతీయ శిక్షాస్మృతిపి.వెంక‌ట్రామి రెడ్డిగరుత్మంతుడుశోభన్ బాబుమియా ఖలీఫాభారతీయ స్టేట్ బ్యాంకుబోయపాటి శ్రీనుశ్రీ లక్ష్మీ అష్టోత్తర స్తోత్రముభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుగుంటూరుసిద్ధార్థ్తెలంగాణ విమోచనోద్యమంనీటి కాలుష్యంహార్దిక్ పాండ్యాభారతదేశ పేరు పుట్టుపూర్వోత్తరాలుకడియం కావ్యభారత రాజ్యాంగ ఆధికరణలునజ్రియా నజీమ్రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంమీనరాశిమృణాల్ ఠాకూర్భారతదేశంలో సెక్యులరిజంమానవ శరీరముఘిల్లినీ మనసు నాకు తెలుసునువ్వు నాకు నచ్చావ్పంచారామాలుసోరియాసిస్శ్రీరామనవమిఊరు పేరు భైరవకోనసౌందర్యజగ్గయ్యపేట శాసనసభ నియోజకవర్గంపిఠాపురంబంగారంఆవేశం (1994 సినిమా)కర్కాటకరాశికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)అలంకారంకేతిరెడ్డి పెద్దారెడ్డిసవర్ణదీర్ఘ సంధిరతన్ టాటాచేతబడిశ్రీ కృష్ణుడుబద్దెనవర్షం (సినిమా)గ్లెన్ ఫిలిప్స్సుస్థిర అభివృద్ధి లక్ష్యాలుకె. అన్నామలైహైదరాబాదుసత్యనారాయణ వ్రతంఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థజనసేన పార్టీసరోజినీ నాయుడుశ్రీనివాస రామానుజన్దేశాల జాబితా – వైశాల్యం క్రమంలోకీర్తి రెడ్డిపూరీ జగన్నాథ దేవాలయంఇందిరా గాంధీఫ్లిప్‌కార్ట్ఎఱ్రాప్రగడఅమెరికా సంయుక్త రాష్ట్రాలుసూర్యుడురైతుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాశార్దూల విక్రీడితముఆరోగ్యంశక్తిపీఠాలుఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితారోజా సెల్వమణిపిఠాపురం శాసనసభ నియోజకవర్గం🡆 More