యార్లగడ్డ వెంకన్న

యార్లగడ్డ వెంకన్న చౌదరి (1911 - 1986) ప్రకాశం జిల్లా కారంచేడు వాస్తవ్యుడు, స్వాతంత్ర్య సమర యోధుడు, మహా దాత, పారిశ్రామిక వేత్త.

గణితములో, న్యాయశాస్త్రములో మంచి ప్రవేశము గల మేధావి.

యార్లగడ్డ వెంకన్న చౌదరి
దస్త్రం:Yarlagadda Venkanna Chowdary.jpg
స్వాతంత్ర సమర యోధుడు, మహా దాత, పారిశ్రామిక వేత్త
జననం1911
ప్రకాశం జిల్లా ,కారంచేడు గ్రామం
మరణం1986
ప్రసిద్ధినమ్మిన బంటు సినిమా నిర్మాత
మతంహిందువు
భార్య / భర్తశ్రీమతి రాజ్యలక్ష్మమ్మ
పిల్లలుశంభు ప్రసాద్
తల్లిదండ్రులుయార్లగడ్డ నాయుడమ్మ, రత్నమాంబ

జననం

వెంకన్న చౌదరి ప్రకాశం జిల్లా కారంచేడు గ్రామంలో యార్లగడ్డ నాయుడమ్మ, రత్నమాంబ దంపతులకు1911 లో జన్మించారు. వీరికి ఒక అక్కయ్య శ్రీమతి దగ్గుబాటి సీతమ్మ ఒక తమ్ముడు రంగనాయకులు చౌదరి ఉన్నారు. వెంకన్న చౌదరి తమ మేనమామ కూతురు రాజ్యలక్ష్మమ్మని వివాహమాడారు. వీరికి కుమారుడు శంభు ప్రసాద్. శంభు ప్రసాద్ గారి భార్య శ్రీమతి ప్రభావతి ఈమె అమరావతి రాజా వాసిరెడ్డి శ్రీనాధ్ ప్రసాద్ గారి కుమార్తె.

సమాజసేవ

ఉప్పు సత్యాగ్రహములో పాల్గొని ఒక సంవత్సరము జైలు శిక్ష అనుభవించాడు. కారంచేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా బాధ్యతలు నిర్వహించారు. మద్రాసులోని ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్కు అధ్యక్షునిగా పనిచేశాడు.

సాహిత్య పోషణ

తుమ్మలపల్లి రామలింగేశ్వర రావు గారు తాళ్ళపాక అన్నమాచార్యుని జీవితంపై వ్రాసిన తొలి రచన కృతి స్వీకరించారు. కోట సోదర కవులు తమ రచన "రాజ్యలక్ష్మీ విలాసము" వీరికి అంకితమిచ్చారు.

ఆచార్య యార్లగడ్డ వెంకట రాఘవయ్య గారు తమ విశిష్ట రచన "కాకతీయ తరంగిణి"ని వెంకన్న చౌదరి గారికి అంకితమిచ్చారు.

విశేషమేమిటంటే వీరిద్దరూ జీవితంలో ఎప్పుడూ కలుసుకోలేదు. వెంకన్న చౌదరి గారి దాతృత్వ గుణాన్ని అభిమానించి, అన్నగా భావించి శ్రీ రాఘవయ్య గారు తమ రచనను వెంకన్న చౌదరి గారికి అంకితమిచ్చారు.

వెంకన్న చౌదరి గారి ప్రోద్బలంతో, నాటి ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు, తితిదే నిర్వహణాధికారి అన్నా రావు గారు అన్నమాచార్య ప్రాజెక్ట్ ప్రారంభించారు.

సినిమా నిర్మాత

శంభూ ఫిల్మ్స్ పతాకంపై వెంకన్న నిర్మించిన 'నమ్మిన బంటు' (1960) అనే చలనచిత్రము భారత రాష్ట్రపతి నుండి రజత పతకము పొందింది. స్పెయిన్లో జరిగిన అంతర్జాతీయ చలనచిత్ర వేడుకలో ప్రదర్శించబడి పలువురి ప్రశంశలు పొందింది.

దాతృత్వం

వెంకన్న చౌదరి మహా దాత. పలు పాఠశాలకు, కళాశాలలకు భూరి విరాళాలిచ్చాడు. తన తండ్రి పేరిట 'యార్లగడ్డ నాయుడమ్మ ఓరియంటల్ విద్యాలయము' స్థాపించాడు. తిరుపతి, తిరుత్తణి, శ్రీశైలం వంటి దేవస్థానములలో కాటేజీలు, సత్రములు నిర్మించాడు. గుంటూరు జిల్లా మంగళగిరి వద్ద కాన్సర్ ఇన్స్టిట్యూట్ నకు 30 లక్షల విరాళమిచ్చాడు.

భార్య రాజ్యలక్ష్మి పేరిట 1980 నుండి తెలుగువారిలో పేరుప్రఖ్యాతులు పొందిన వ్యక్తులకు పురస్కారములు ఇవ్వబడుచున్నవి.

మరణం

మద్రాసులో స్ధిరపడి, అశేష సంపదను సృష్టించి సమాజ శ్రేయస్సుకు వుపయోగ పెట్టిన దానశీలి వెంకన్న చౌదరి గారు1986లో పరమపదించారు.

మూలాలు

Tags:

యార్లగడ్డ వెంకన్న జననంయార్లగడ్డ వెంకన్న సమాజసేవయార్లగడ్డ వెంకన్న సాహిత్య పోషణయార్లగడ్డ వెంకన్న సినిమా నిర్మాతయార్లగడ్డ వెంకన్న దాతృత్వంయార్లగడ్డ వెంకన్న మరణంయార్లగడ్డ వెంకన్న మూలాలుయార్లగడ్డ వెంకన్న19111986కారంచేడుగణితముప్రకాశంయార్లగడ్డ వెంకన్న చౌదరి

🔥 Trending searches on Wiki తెలుగు:

చరవాణి (సెల్ ఫోన్)20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిసోరియాసిస్సిద్ధు జొన్నలగడ్డవరల్డ్ ఫేమస్ లవర్ఆంధ్రప్రదేశ్హార్దిక్ పాండ్యాతేటగీతిశ్రీనాథుడుఉగాదిఆది శంకరాచార్యులుఈసీ గంగిరెడ్డిరోహిణి నక్షత్రంఖమ్మం లోక్‌సభ నియోజకవర్గంప్రియురాలు పిలిచిందిసజ్జల రామకృష్ణా రెడ్డిస్వాతి నక్షత్రమువిభక్తిచెమటకాయలుపాల కూరనాయీ బ్రాహ్మణులుభారతదేశ రాజకీయ పార్టీల జాబితాకృతి శెట్టిచంపకమాలలావు శ్రీకృష్ణ దేవరాయలుకొంపెల్ల మాధవీలతభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుప్లీహముభగత్ సింగ్ఏప్రిల్ 26పూర్వాభాద్ర నక్షత్రము2019 ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలుతెలుగు సంవత్సరాలుబోయపాటి శ్రీనురేణూ దేశాయ్మకరరాశిమాచెర్ల శాసనసభ నియోజకవర్గంగరుత్మంతుడుసప్త చిరంజీవులుశతభిష నక్షత్రముతెలుగు విద్యార్థిశ్యామశాస్త్రిశుక్రుడుభలే అబ్బాయిలు (1969 సినిమా)వై.ఎస్.వివేకానందరెడ్డి హత్యవాట్స్‌యాప్భారత రాజ్యాంగ పీఠికతూర్పు చాళుక్యులునువ్వు నాకు నచ్చావ్అమర్ సింగ్ చంకీలాసుడిగాలి సుధీర్మంగళవారం (2023 సినిమా)మహేంద్రగిరిజాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్కడియం కావ్యఆర్యవైశ్య కుల జాబితాలలితా సహస్ర నామములు- 1-100భారతీయ శిక్షాస్మృతికూరదసరాతాటిఇండియన్ ప్రీమియర్ లీగ్ఉమ్రాహ్గ్లోబల్ వార్మింగ్తెలుగు కవులు - బిరుదులురాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్సాక్షి (దినపత్రిక)భారతదేశ పంచవర్ష ప్రణాళికలుకులంపెళ్ళిబతుకమ్మఆవుభారత జాతీయగీతంపోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిరఘురామ కృష్ణంరాజునవధాన్యాలుతాజ్ మహల్🡆 More