మీనా: నటి

మీనా (సెప్టెంబర్ 16,1975), దక్షిణ భారత సినిమా నటి. అప్పటి మద్రాసు నగరంలో పుట్టి పెరిగిన మీనా తెలుగు, తమిళ, మలయాళం సినిమా రంగములలో పేరుతెచ్చుకొన్నది. 1975, సెప్టెంబర్ 16న మద్రాసులో జన్మించిన మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి.

మీనా
మీనా: వ్యక్తిగత జీవితం, మీనా నటించిన తెలుగు సినిమాలు, మీనా నటించిన తమిళ సినిమాలు
జన్మ నామంమీనా
జననం సెప్టెంబర్ 16, 1975
భార్య/భర్త విద్యాసాగర్ (2009–2022) మరణం (28/6/2022)
పిల్లలు 1, నైనికా విద్యాసాగర్ (కూతురు)

మీనా తెలుగు, తమిళ చిత్రాలలో బాలనటిగా సినీరంగ ప్రవేశము చేసింది. బాలనటిగా రజినీకాంత్, కమలహాసన్ తదితర నటులతో నటించి ఆ తరువాత కథానాయికగా యెదిగింది. ఈమె నటించిన తమిళ సినిమాల్లో ముత్తు, యజమాన్, వీరా, అవ్వై షణ్ముగి మంచి విజయాలు సాధించాయి. ఈమె రజనీకాంత్ తో నటించిన సినిమాలు జపాన్లో కూడా విడుదలై మంచి ఆదరణ పొందడము చేత ఈమెకు జపాన్లో కూడా మంచి అభిమానవర్గము ఉంది. మీనా దాదాపు అన్ని దక్షిణ భారత భాషా సినిమాల్లో నటించింది. ఈమె తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రరంగములలోని అగ్ర నాయకులందరితో కలిసి పనిచేసింది. తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి విజయవంతమైన సినిమాలు వచ్చాయి. ఇలా తెలుగు, తమిళ చిత్రరంగాలలో 1991 నుండి 2000 వరకూ, సుమారు ఒక దశాబ్దం పాటు అగ్రతారగా నిలచింది.

వ్యక్తిగత జీవితం

2009లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ విద్యాసాగర్‌తో మీనా వివాహం అయింది. ఈ దంపతులకు నైనికా అనే కుమార్తె ఉంది. తేరీ (తెలుగులో పోలీస్) సినిమాలో నైనిక చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించింది. పోస్ట్ కొవిడ్ స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ 2022 జూన్ 28న రాత్రి చెన్నైలోని ఎంజీఎం ఆస్ప‌త్రిలో మీనా భ‌ర్త తుది శ్వాస విడిచారు.

మీనా నటించిన తెలుగు సినిమాలు

Tags:

మీనా వ్యక్తిగత జీవితంమీనా నటించిన తెలుగు సినిమాలుమీనా నటించిన తమిళ సినిమాలుమీనా నటించిన మళయాళ సినిమాలుమీనా నటించిన కన్నడ సినిమాలుమీనా నటించిన హిందీ చిత్రాలుమీనా మూలాలుమీనా

🔥 Trending searches on Wiki తెలుగు:

రాజకీయాలుసెక్యులరిజంత్యాగరాజుశ్రీశైలం (శ్రీశైలం మండలం)కాటసాని రామిరెడ్డిరేవతి నక్షత్రంభలే మంచి రోజుపరిపూర్ణానంద స్వామిఆంధ్రప్రదేశ్ రాష్ట్రీయ చిహ్నాలు.జీమెయిల్గాయత్రీ మంత్రం2023 తెలంగాణ శాసనసభ ఎన్నికలుఅశ్వత్థామటిల్లు స్క్వేర్వేమిరెడ్డి ప్రభాకరరెడ్డిరతన్ టాటాజ్ఞాన సరస్వతి దేవాలయం, బాసరబైండ్లజాతీయములురావి చెట్టుగుంటూరుసోనియా గాంధీతరుణ్ కుమార్ఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్సెక్స్ (అయోమయ నివృత్తి)మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిమూర్ఛలు (ఫిట్స్)నాగార్జునసాగర్టంగుటూరి అంజయ్యమహాభారతంనయన తారభారత రాజ్యాంగ సవరణల జాబితాప్రకటనజవాహర్ లాల్ నెహ్రూభారతదేశ ప్రధానమంత్రిబైబిల్అమ్మల గన్నయమ్మ (పద్యం)మంద జగన్నాథ్2024 భారత సార్వత్రిక ఎన్నికలురమ్యకృష్ణవాల్మీకిపి.వెంక‌ట్రామి రెడ్డితెలుగు నెలలుకవిత్రయంపూజా హెగ్డేకన్యారాశివంగవీటి రాధాకృష్ణపరశురామ్ (దర్శకుడు)అన్నవరంఎల్లమ్మవై.యస్. రాజశేఖరరెడ్డివినోద్ కాంబ్లీAభారత ఆర్ధిక వ్యవస్థసురవరం ప్రతాపరెడ్డిపూజ భట్మత్తేభ విక్రీడితముబ్రాహ్మణ గోత్రాల జాబితాశోభన్ బాబుపండుపరిటాల రవిలక్ష్మీనారాయణ వి విషారుఖ్ ఖాన్దొమ్మరాజు గుకేష్శ్రేయా ధన్వంతరిపూర్వాభాద్ర నక్షత్రముమౌర్య సామ్రాజ్యంఅమిత్ షాయోనివర్షంకరక్కాయఫరియా అబ్దుల్లాపది ఆజ్ఞలుసూర్య నమస్కారాలుటంగుటూరి ప్రకాశంగురువు (జ్యోతిషం)శివుడు🡆 More