దుద్దిల్ల శ్రీపాద రావు

డి.

శ్రీపాదరావు (మార్చి 2, 1935 - ఏప్రిల్ 13, 1999) ప్రముఖ శాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు.

దుద్దిల్ల శ్రీపాద రావు
దుద్దిల్ల శ్రీపాద రావు
దుద్దిల్ల శ్రీపాద రావు
జననందుద్దిల్ల శ్రీపాద రావు
మార్చి 2, 1935
ధన్వాడ గ్రామం, కాటారం మండలం, జయశంకర్ జిల్లా, తెలంగాణ
మరణంఏప్రిల్ 13, 1999
మహాదేవపూర్ మండలం అన్నారం
మరణ కారణంనక్సల్స్ దుశ్చర్య
ఇతర పేర్లు శ్రీపాదరావు
ప్రసిద్ధిశాసనసభ్యుడు, శాసనసభ స్పీకరు.
పదవి పేరుమంథని శాసనసభ నియోజకవర్గం శాసన సభ్యులు
రాజకీయ పార్టీకాంగ్రెస్ పార్టీ
తండ్రిమౌళి పటేల్ రాధాకిష్టయ్య
తల్లికమలా బాయి

జననం

1935 సంవత్సరమలో మార్చి 2కాటారం మండల ధన్వాడ గ్రామానికి చెందినా మౌళి పటేల్ రాధాకిష్టయ్య, కమలా బాయి దంపతులకు జన్మించాడు. అమ్మమ్మ వారు నివాసముండే నాగపూర్ లో పుట్టిన అయన ప్రాధమికవిద్య ధన్వాడ గ్రామంలో చేసి, ఎస్ ఎస్ సి వరకు మంథనిలోని బావ సువర్ణ చంటయ్య ఇంట్లో ఉండి పూర్తిచేశాడు. ఇంటర్, డిగ్రీ హైదరాబాద్ లో చేసిన తరువాత ఆదిలాబాద్ జిల్లాలో పంచాయతి ఇన్స్పెక్టర్ గా ఉద్యోగం కొన్ని రోజులు చేశారు. ఆ తరువాత నాగపూర్ లో న్యాయవాదిగా ప్రజలకు సేవ చేయాలనే తలంపుతో ఎల్. ఎల్. బి. పూర్తి చేసి ప్రాక్టీసు పెట్టారు. తండ్రి మరణాంతరం స్వంత ఊరికి వచ్చిన శ్రీపాద వ్యవసాయమే వృత్తిగా చేసుకొని, గ్రామంలోనే ఉన్నాడు.

రాజకీయ ప్రస్థానం

కొన్ని రోజుల తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామం నుండి సర్పంచ్ గా పోటీ చేయాలని ప్రజలు ఒత్తిడిచేశారు. నాయకత్వ లక్షణాలు పుణికి పుచ్చుకున్న శ్రీపాద రాజకీయాల్లోకి అడుగిడాలని స్నేహితులు, హితులు ప్రోత్శాహించారు. ఆ దిశగా అడుగులు వేస్తూ పోటి చేసి మొదటిసారి సర్పంచ్ గా ఎన్నుకోబడ్డారు. వరుసగా మరో మారు ఆయనకే ప్రజలు మద్దతు పలకడంతో రెండవ సారి ఎన్నికయ్యారు. మహాదేవపూర్ సమితి అధ్యక్షునిగా ఎన్నికైన తరువాత ఎల్ ఎం బి ఛైర్మన్ పదవికి మంథని నుండి గెలిచాడు. ఆయన రాజకీయ ఎదుగుదలకు ఎల్ ఎం బి బ్యాంకు ఛైర్మన్ ఎన్నిక ఎంతో సహకరించింది. దీంతో పూర్తిగా నియోజకవర్గానికే ఆయన సుపరిచితమైనాడు. పదవివస్తే ముఖంచాటు చేసుకునే నాయకులకు భిన్నంగా అయన ప్రజల మధ్యనే ఉంటూ, వారి కష్ట, నష్టాలలో పాలు పంచుకొని ప్రజానాయకునిగా ఎదిగాడు.

1984 ఎన్నికల్లో ఆయనకు కాంగ్రెస్ పార్టీ నుండి ఏమ్మేల్లెగా పోటి చేసే అవకాశం లభించింది. అప్పుడే పురుడు పోసుకున్న తెలుగు దేశం పార్టీ ప్రభావం, ఎన్టిఆర్ ప్రభంజనం ముందు శ్రీపాదరావు విజయం సాదించగలుగుతాడా అనే అంశం ఫై స్వపార్టీ, విపక్షాలలో చర్చ జరిగింది. తెలుగుదేశం, సంజయ్ విచార మంచ్ మధ్య ఎన్నికల ఒప్పందం కారణంగా మంథని శాసనసభ నియోజకవర్గం నుండి పోటిగా విచార మంచ్ నుండి చంద్రుపట్ల రాజి రెడ్డి దిగారు. వీరిద్దరి మధ్య గట్టి పోటి నెలకొనగా చివరకు శ్రీపాదరావు విజయం సాధించారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో మూడు సార్లు శాసన సభ్యులుగాఎన్నికైన ఆయనకు శాసనసభ స్పీకర్ గా అన్ని పార్టీల మధ్హతుతో పదవి నదిష్టించారు. ఆ పదివికి వన్నె తెచ్చారని ఎంతోమంది ప్రముఖులు, రాజకీయా విశ్లేసకులతో ప్రశంశలు పొందారు. ఒకవైపు స్పీకర్ పదవి బాధ్యతతో నిర్వహిస్తునే మరోవైపు తన స్వంత నియోజకవర్గ ప్రజలను మాత్రం మరిచిపోకుండా, మరింత దగ్గరయ్యారు. విమర్శలకు వెరవకుండా, పొగడ్తలను లెక్క చేయకుండా, అభివ్రుదిఫై దృష్టి సారిస్తూ ముందుకు కదిలారు.

మంథని ప్రాంతంలో అభివ్రుదిపరిమళాల పరంపరlఉ ఐవీయడం ప్రారంభం అయింది అంటే శ్రీపాద రావు స్పీకర్ ఉన్న సమయంలోనే అని చెప్పుకోవచ్చు. 1994 ఎన్నికల ముందు నక్సల్స్, పోలీసుల మధ్య జరిగిన ప్రత్యేక్ష పోరు తీవ్రంగా ప్రభావం చూపింది. తీవ్రఉద్రిక్త పరిస్థితుల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల్లో శ్రీపాదరావు పరాజయం పాలయ్యాడు. అయిన ఓటమి పాలయిన ప్రజలకు మాత్రం దూరం కాలేదు. వారి మధ్య లోనే ఉంటూ వారికి తన శక్తి మేరకు సేవ చేస్తూనే ఉంటూ వచ్చాడు. పాలకపక్షం, ప్రాతినిధ్యం వహిస్తున్న అప్పటి శాసన సభ్యులు రామ్ రెడ్డి ఫై కనీసం పల్లెత్హు మాట, విమర్శ కూడా చేయకుండా హుందాగా వ్యవహరించి, తన ప్రజాభిమాన్ని మరింత చూరగొన్నారు.

మరణం

ప్రజల మధ్య ఉంటూ వారి బాగోగులను పట్టించుకునే పరిస్థితుల్లోనే ఆయనను మృత్యువు నక్సల్స్ రూపంలో కబళించింది. 1999 ఏప్రిల్ 13మహాదేవపూర్ మండలం అన్నారంకు తన అనుచర వర్గంతో వెళ్లివస్తున్న క్రమంలో మార్గ మధ్యంలోని అడవుల్లో ఆయన వాహనాన్ని నక్సల్స్ ఆపివేసి, ఆయనతో మాట్లాడాలని చెప్పి లోపలి తీసుకెళ్ళి కరుకు తుపాకి తూటాలతో విగత జీవున్ని చేశారు. ఈ సంఘటన రాష్ట్రాన్ని కుదిపివేసింది. ఎన్నడు అపకారాన్ని తలపెట్టని నాయకుణ్ణి నిష్కారణంగా హతమార్చిన నక్సల్స్ పై విమర్శలు గుప్పు మన్నాయి. రాజకీయంగా అనిశ్చిత పరిస్థితి నెలకొంది. ప్రజల కోసం తుపాకులు పట్టినట్లు చెప్పుకొనే నక్సల్స్ ఇలాంటి దుశ్చర్యకు పాల్పడడం ప్రతి ఒక్కరు ప్రత్యేక్షంగా విమర్శించారు. అప్పటి రాష్ట్ర ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు సైతం హుటాహుటిన మర్తురీలో ఉన్న మృత దేహాన్ని చూసేందుకు తరళివచ్చారు. నక్సల్స్ కు వెతిరేఖంగా నినాదాలు చీస్తూ, కన్నీటి పర్యంతమై అయన అంత్య క్రియల్లో పాల్గొన్నారు. అయన మరణించిన.. ఇప్పటికి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు... విధాత ఆ ఉన్నత ప్రజా నాయకునికి హృదయ పూర్వక నివాళులు అర్పిస్తున్నది..

అధికారికంగా జయంతి వేడుకలు

దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు మార్చి 2న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరపాలని 2024 ఫిబ్రవరి 25న నిర్ణయించింది.

మూలాలు


మూలాలు

Tags:

దుద్దిల్ల శ్రీపాద రావు జననందుద్దిల్ల శ్రీపాద రావు రాజకీయ ప్రస్థానందుద్దిల్ల శ్రీపాద రావు మరణందుద్దిల్ల శ్రీపాద రావు అధికారికంగా జయంతి వేడుకలుదుద్దిల్ల శ్రీపాద రావు మూలాలుదుద్దిల్ల శ్రీపాద రావు మూలాలుదుద్దిల్ల శ్రీపాద రావు19351999ఏప్రిల్ 13మార్చి 2

🔥 Trending searches on Wiki తెలుగు:

సన్ రైజర్స్ హైదరాబాద్మొఘల్ సామ్రాజ్యంరకుల్ ప్రీత్ సింగ్భూమితెలుగు విద్యార్థిమియా ఖలీఫాలలితా సహస్రనామ స్తోత్రంఎస్. ఎస్. రాజమౌళినోటాచిరంజీవిభలే అబ్బాయిలు (1969 సినిమా)రాహుల్ గాంధీపెళ్ళికుప్పం శాసనసభ నియోజకవర్గంతెలుగుదేశం పార్టీశ్రీలలిత (గాయని)శింగనమల శాసనసభ నియోజకవర్గంఔటర్ రింగు రోడ్డు, హైదరాబాద్ఆటవెలదిబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంమహబూబ్‌నగర్ లోక్‌సభ నియోజకవర్గంరవీంద్రనాథ్ ఠాగూర్రేవతి నక్షత్రంతోటపల్లి మధుమేరీ ఆంటోనిట్టేపిఠాపురం శాసనసభ నియోజకవర్గంవంగవీటి రంగావై.యస్.అవినాష్‌రెడ్డిదశావతారములుతెలుగు నెలలుఅమిత్ షాతెలుగు సాహిత్యంవర్షంసర్పిఆవుసన్నాఫ్ సత్యమూర్తివృషభరాశిరైతుకాలేయంపెళ్ళి (సినిమా)కుండలేశ్వరస్వామి దేవాలయంగంగా నదిభారతదేశ సరిహద్దులుశుభాకాంక్షలు (సినిమా)భారతీయ తపాలా వ్యవస్థఎయిడ్స్అర్జునుడుఆప్రికాట్దగ్గుబాటి వెంకటేష్సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానంమహేంద్రసింగ్ ధోనిగర్భిణి స్త్రీలు తీసుకోవలసిన జాగ్రత్తలుభరణి నక్షత్రముభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుకీర్తి సురేష్తులారాశియాదవవిశ్వామిత్రుడుయతినాగార్జునసాగర్లోక్‌సభశతభిష నక్షత్రమునామవాచకం (తెలుగు వ్యాకరణం)అష్టదిక్కులు - దిక్పాలకులు - పట్టణాలువై.యస్.భారతికస్తూరి రంగ రంగా (పాట)భారత ప్రభుత్వంపెరిక క్షత్రియులుఇంటి పేర్లురోహిణి నక్షత్రంపల్లెల్లో కులవృత్తులుపుష్యమి నక్షత్రముసురవరం ప్రతాపరెడ్డినూరు వరహాలుసోరియాసిస్హల్లులువృశ్చిక రాశిపది ఆజ్ఞలు🡆 More