దశిక సూర్యప్రకాశరావు

దశిక సూర్యప్రకాశరావు స్వాతంత్ర్య సమరయోధుడు, రచయిత.

దశిక సూర్యప్రకాశ రావు
దశిక సూర్యప్రకాశరావు
జననం(1898-04-10)1898 ఏప్రిల్ 10
వృత్తిరచయిత

జీవిత విశేషాలు

ఈయన 1898, ఏప్రిల్ 10వ తేదీన కృష్ణాజిల్లా, నూజివీడులో జన్మించాడు. ఇతని విద్యాభ్యాసం ప్రాథమిక విద్య నుండి ఎఫ్.ఎ. వరకు తన మాతామహుని స్థానమైన రాజమండ్రిలో సాగింది. 1919-21ల మధ్య ఈయన విజయనగరం కళాశాలలో బి.ఎ.చదివాడు. 1926-1929 మధ్యకాలంలో ఇతడు ఆత్మకూరి గోవిందాచార్యుల సంపాదకత్వంలో వెలువడిన "సత్యాగ్రాహి" వారపత్రికకు ఉపసంపాదకుడిగా పనిచేశాడు. 1939నుండి 1942 వరకు నూజివీడులోని ఎస్.ఆర్.ఆర్. ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఇతని సేవానిరతిని గుర్తించి ఇతడు దరఖాస్తు చేసుకోకుండానే టంగుటూరి ప్రకాశం పంతులు ఇతనికి నూజివీడు ఫిర్కా డెవలెప్‌మెంట్ ఆఫీసరు ఉద్యోగం ఇచ్చాడు. 1949 నుండి 1959 వరకు బెజవాడలో దక్షిణభారత హిందీ ప్రచారసభ శాఖలో హిందీ పండితుడిగా పనిచేశాడు. తరువాతి కాలంలో రాజమండ్రిలో అదే ఉద్యోగంలో పనిచేసి పదవీ విరమణ చేశాడు. జాతీయవాది తేకుమళ్ల వెంకాజీరావు శిష్యుడైన దశిక సూర్యప్రకాశరావు 1922లో నూజివీడులో కల్లు దుకాణాలవద్ద పికెటింగ్‌లో పాల్గొన్నాడు. ఫలితంగా రాజమండ్రి సెంట్రల్ జైలులో 3 నెలలు, కడలూరు జైలులో 6 నెలలు శిక్షను అనుభవించాడు. కడలూరు జైలులో కొండా వెంకటప్పయ్య, గొల్లపూడి సీతారామశాస్త్రి, బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం, తెన్నేటి సత్యనారాయణ, కళా వెంకటరావు, అయ్యదేవర కాళేశ్వరరావు వంటి హేమాహేమీలతో కలిసి శిక్షను అనుభవించాడు. 1930లో ఉప్పుసత్యాగ్రహంలో పాల్గొని బళ్లారి జైలులో శిక్ష అనుభవించాడు. అక్కడ చక్రవర్తి రాజగోపాలాచారి, దండు నారాయణరాజు, నరసింహదేవర సత్యనారాయణ వంటి ప్రముఖులు ఇతని సహచరులుగా ఉన్నారు. 1932లో స్వరాజ్య కార్యక్రమాలలో ముమ్మరంగా పాల్గొని రాజమండ్రి జైలులో 7 నెలలు జైలుశిక్ష అనుభవించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని 1942లో అల్లీపూర్ జైలులో శిక్షను అనుభవించాడు. ఇతనికి భారతప్రభుత్వం తామ్రపత్రంతో సత్కరించింది.

రచనలు

  1. వినోబాజీ సన్నిధిలో
  2. నవీనవిద్య
  3. బాపూజీ మాతృప్రేమ
  4. బాబూ రాజేంద్రప్రసాద్ ఆత్మకథ
  5. గాంధీజీ యుగంలో పూచిన అడవిమల్లెలు
  6. భక్తమాల
  7. త్యాగధనులు
  8. గాంధివాణి
  9. గాంధి దర్శనమే పావనము
  10. లోకోత్తరుడు
  11. గాంధీజీ విద్యార్థి జీవితము
  12. తులసీ మానస సుధ
  13. వ్యాస రత్నావళి
  14. శ్రీ జమునాలాల్ దంపతులు
  15. కథాపారిజాతం మొదలైనవి.

మూలాలు

Tags:

🔥 Trending searches on Wiki తెలుగు:

పూర్వాభాద్ర నక్షత్రమునెట్‌ఫ్లిక్స్భీమసేనుడునువ్వు నేనుజోల పాటలురంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)విరాట్ కోహ్లిఇంగువహైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితామంగళవారం (2023 సినిమా)శ్రీ కృష్ణుడురాహువు జ్యోతిషంగంగా నదిపి.వెంక‌ట్రామి రెడ్డిమ్యాడ్ (2023 తెలుగు సినిమా)భారతీయ రైల్వేలుసీ.ఎం.రమేష్స్వర్ణ దేవాలయం, శ్రీపురంరావి చెట్టుదేవుడుగురజాడ అప్పారావుషర్మిలారెడ్డికొంపెల్ల మాధవీలతశ్రీలీల (నటి)వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం (సింహాచలం)నందమూరి తారక రామారావుసమంతకంప్యూటరువిశ్వామిత్రుడుసూర్యుడుసత్య సాయి బాబాసుకన్య సమృద్ధి ఖాతారుద్రమ దేవిగజము (పొడవు)సమ్మక్క సారక్క జాతరఒగ్గు కథపిఠాపురంభారతదేశ రాజకీయ పార్టీల జాబితాబ్రాహ్మణ గోత్రాల జాబితాఆర్టికల్ 370జాతీయ విద్యా విధానం 2020లోక్‌సభమానవ జీర్ణవ్యవస్థసిరికిం జెప్పడు (పద్యం)స్వాతి నక్షత్రముఏలకులుఈడెన్ గార్డెన్స్గ్రామ పంచాయతీఈనాడుచాళుక్యులురత్నం (2024 సినిమా)సింహంచిరుధాన్యంఆరుద్ర నక్షత్రముత్రిఫల చూర్ణంభారతదేశంకన్యారాశితిథిభోపాల్ దుర్ఘటననాని (నటుడు)రామోజీరావుగర్భాశయముగోదావరిశోభన్ బాబుభారతీయ స్టేట్ బ్యాంకుగుణింతంస్వలింగ సంపర్కంగరుడ పురాణంచింతామణి (నాటకం)కొండా సురేఖభారతదేశంలో సెక్యులరిజంఇతర వెనుకబడిన తరగతుల జాబితాలేపాక్షిభూమి🡆 More