నాసిక్

  ?నాసిక్
మహారాష్ట్ర • భారతదేశం
అక్షాంశరేఖాంశాలు: 20°01′N 73°30′E / 20.02°N 73.50°E / 20.02; 73.50
కాలాంశం భాప్రాకా (గ్రీ.కా+5:30)
విస్తీర్ణంఎత్తు 264.23 కి.మీ² (102 sq mi)• 1,001 మీ (3,284 అడుగులు)
జిల్లా (లు) నాసిక్
జనాభాజనసాంద్రత 13,64,000 (2005 నాటికి)• 5,162/కి.మీ² (13,370/చ.మై)
మేయర్ వినాయక్ పాండే (2007)
కోడులుప్రాంతీయ ఫోన్ కోడ్• వాహనం • +0253• MH 15

నాసిక్, భారతదేశం, మహారాష్ట్రలాని నాసిక్ జిల్లాకు చెందిన ఒక నగరం. ఇది నాసిక్ జిల్లా కేంద్రం. ఇది బొంబాయి, పూణే లకు 180, 220 కి.మీ. దూరంలో పడమటి కనుమలలో దక్కను పీఠభూమికి పడమటి అంచున ఉంది. ఇది భారతదేశ వైన్ కాపిటల్ గా ప్రసిద్ధిచిందినది. నాశిక్ దగ్గరలోనున్న త్రయంబకేశ్వర్ గోదావరి నదికి జన్మస్థానం. త్వరగా అభివృద్ధి చెందుతున్న నాశిక్ పట్టణ జనాభా ఇంచుమించు 1.4 మిలియన్లు (2006 అంచనా). ప్రఖ్యాత సినీరంగ పితామహుడు దాదా సాహెబ్ ఫాల్కే ఇక్కడే జన్మించాడు.

త్రయంబకేశ్వరాలయం

త్రయంబకేశ్వరుడు అనగా పరమశివుడు. 'అంబక 'మంటే 'నేత్ర' మని అర్థం. మూడు నేత్రాలు గల దేవుడు త్రయంబకుడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని - అనే మూడు తేజస్సులు మూడు నేత్రలుగా వెలసిన దేవుడు. పాలభాగంలోని మూడవ నేత్రమే అగ్నినేత్రం. మన్మథుణ్ణి ఈ నేత్రాగ్నితోనే శివుడు భస్మం చేశాడు. స్వర్గం, ఆకాశం, భూమి - అనే మూడు స్థానాలకు సంరక్షకుడైన తండ్రి శివుడు అని కూడా త్రయంబక శబ్దాన్ని వివరిస్తారు. 'త్రయంబకం యజామహే - సుగంధిం పుష్టి వర్ధనమ్' మృత్యుంజయ మహామంత్రంతో మృత్యువు అనగా మరణం నుండి విడుదల చేయమని భక్తులు శివుణ్ణి ప్రార్థిస్తారు. పురాతన త్రయంబకేశ్వరాలయం నాశిక్ నుండి 28 కి.మీ.దూరంలోని త్రయంబకం అనే పట్టణంలో ఉంది. శివుని ఆరాధన ప్రాముఖ్యంగా గల ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి. ఇది పవిత్ర గోదావరి జన్మస్థానం. గోదావరి నది జన్మించిన పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్. త్రయంబకేశ్వర్' లో పూజించే దేవుడు మహా శివుడు. ద్వాదశ మహార్లింగాలల్లో ఒక పుణ్యక్షేత్రం త్రయంబకేశ్వర్.

నాసిక్ 
త్రయంబకేశ్వరాలయం, నాశిక్.

ఇతర దేవాలయాలు

  • గంగా గోదావరి దేవాలయం: గంగా గోదావరి దేవాలయం అనేది నాశిక్ లో ఉంది. నాశిక్ లో రాంకుండ్ సమీపంలో గోదావరి కుడిగట్టున ఉన్న ప్రసిద్ధ దేవాలయం. ఈ గుడిలో గోదావరి మాత కొలువై ఉంది. ఈ నదిలో స్నానం చేయగానే ఈ మాతను దర్శించుకుంటారు.
  • బాలచంద్ర గణపతి మందిరం: బాలచంద్ర గణపతి మందిరాన్ని మోరేశ్వర్ దేవాలయం అనీ అంటారు. భారతదేశంలో 21 గణపతి పీటాల్లో ఒకటి అయిన ఈ కోవెల ఎంతో పురాతనమైనది.
  • ప్రవర సంగమం: గోదావరి ప్రవరా నదుల సంగమస్థలంలోని అందమైన ప్రదేశమిది. ఔరాంగాబాదుకు 40 కిలోమీటర్లు దూరం. రామాయణంలో ముడిపడి ఉన్న ఈ ప్రదేశంలో సిద్దేశ్వరం, రామేశ్వర, ముక్తేశ్వర ఆలయాలు ఉన్నాయి.
  • చంగ్ దేవ్ మహరాజ్ మందిరం, పుణతాంబ, కోపర్ గావ్: ఇక్కడ సాధువు వందేవ్ మహరాజ్ సమాధి ఉంది. గోదావరి ఒడ్డునే ఉన్న ఈ పుణతాంబ షిర్డికి దగ్గర్లో ఉంటుంది.
  • సుందర నారాయణ మందిరం: గోదావరికి సమీపంలో ఉన్న ఈ మందిరాన్ని 1756లో గంగాధర యశ్వంత చంద్రచూడు నిర్మించాడు. ప్రధానమూర్తి నారాయణుడు. ఆయనకు ఇరువైపులా లక్ష్మీ సరస్వతులు కొలువై ఉన్నారు. దీనికి దగ్గర్లోనే బదరికా కొలను ఉంటుంది. ఈ కొలనును ప్రముఖ మహారాష్ట్ర సాధువు సంత్ జ్ఞానేశ్వర్ తన జ్ఞానేశ్వరిలో ప్రస్తావించాడు. మార్చి21 నాడు ఆలయంలోని విగ్రహాల మీద సూర్య కిరణాలు ప్రసరించడం విశేషం. ఈ ఆలయ నిర్మాణశైలిలో మొగలుల వాస్తుశిల్ప ప్రభావం కనిపిస్తుంది.

ఇవి కూడా చూడండి

బయటి లింకులు

వెలుపలి లింకులు

Tags:

నాసిక్ త్రయంబకేశ్వరాలయంనాసిక్ ఇతర దేవాలయాలునాసిక్ ఇవి కూడా చూడండినాసిక్ బయటి లింకులునాసిక్ వెలుపలి లింకులునాసిక్

🔥 Trending searches on Wiki తెలుగు:

కాలుష్యంఉత్తరాషాఢ నక్షత్రముకబడ్డీబ్రహ్మంగారి కాలజ్ఞానంకుతుబ్ షాహీ సమాధులుఆంధ్రప్రదేశ్ శాసనసభ నియోజకవర్గాల జాబితాసర్పంచిసపోటాబొత్స సత్యనారాయణనయన తారపి.వెంక‌ట్రామి రెడ్డిఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డు కులాల జాబితాఫ్లోరెన్స్ నైటింగేల్తెలుగు నెలలుఎలక్ట్రానిక్ వోటింగ్ మిషన్సీ.ఎం.రమేష్సమాసంభారతీయ శిక్షాస్మృతిశుక్రుడుధనూరాశిఛందస్సుపి.వి.మిధున్ రెడ్డిఅసమర్థుని జీవయాత్రపవన్ కళ్యాణ్పోకిరితెలుగుదేశం పార్టీకొమర్రాజు వెంకట లక్ష్మణరావుఈడెన్ గార్డెన్స్కల్వకుంట్ల చంద్రశేఖరరావుప్రకాష్ రాజ్వినాయకుడుఆటలమ్మఅమరావతిపంచభూతలింగ క్షేత్రాలుసురవరం ప్రతాపరెడ్డిహైదరాబాదుపొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంఎన్నికలుఅయోధ్య రామమందిరంచలివేంద్రంకర్ణుడుకరక్కాయఇన్‌స్టాగ్రామ్గోత్రాలు జాబితాగుంటూరు కారంఅంజలి (నటి)బెంగళూరుమృణాల్ ఠాకూర్శాసన మండలిరైతుసాహిత్యంఆంధ్రప్రదేశ్భూమా శోభా నాగిరెడ్డినరసింహ (సినిమా)2024 భారతదేశ ఎన్నికలుతెలుగు పత్రికలుఒగ్గు కథమహాభారతంబైబిల్వంగవీటి రాధాకృష్ణరామాయణంమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డిసింధు లోయ నాగరికతభారత రాజ్యాంగం - ప్రాథమిక విధులుభారతదేశ జిల్లాల జాబితాచిరుధాన్యంఉత్తర ఫల్గుణి నక్షత్రముహోమియోపతీ వైద్య విధానంలక్ష్మిపొడుపు కథలుతిరుమల చరిత్రరత్నం (2024 సినిమా)చింతామణి (నాటకం)కన్నెగంటి బ్రహ్మానందంరావి చెట్టుఇంగువ🡆 More