చెక్ రిపబ్లిక్ జాతీయ గ్రంథాలయం

చెక్ రిపబ్లిక్ జాతీయ గ్రంథాలయం (Czech: Národní knihovna České republiky ) చెక్ రిపబ్లిక్ దేశపు కేంద్ర గ్రంథాలయం.

ఇది దేశ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉంది. లైబ్రరీ ప్రధాన భవనం ప్రాగ్ మధ్యలో ఉన్న చారిత్రక క్లెమెంటినమ్ భవనంలో ఉంది. లైబ్రరీ లోని దాదాపు సగం పుస్తకాలు ఇక్కడ ఉంటాయి. మిగిలిన సగం పుస్తకాలు హోస్టివార్ జిల్లాలో ఉంటాయి. నేషనల్ లైబ్రరీ చెక్ రిపబ్లిక్‌లో అతిపెద్ద లైబ్రరీ. ఇందులో దాదాపు 60 లక్షల డాక్యుమెంట్‌లున్నాయి. లైబ్రరీలో ప్రస్తుతం దాదాపు 20,000 మంది నమోదిత పాఠకులు ఉన్నారు. ఎక్కువగా చెక్ భాషా పుస్తకాలు ఉన్నప్పటికీ, ఈ లైబ్రరీలో టర్కీ, ఇరాన్, భారతదేశాలకు చెందిన పాత విషయాలను కూడా నిల్వ చేస్తుంది. లైబ్రరీలో ప్రేగ్‌లోని చార్లెస్ విశ్వవిద్యాలయానికి సంబంధించిన పుస్తకాలు కూడా ఉన్నాయి.

చెక్ రిపబ్లిక్ జాతీయ గ్రంథాలయం
చెక్ రిపబ్లిక్ జాతీయ గ్రంథాలయం
జాతీయ గ్రంథాలయం లోని బరోక్ లైబ్రరీ హాల్
దేశముచెక్ రిపబ్లిక్
తరహాజాతీయ గ్రంథాలయం
స్థాపితము1777 (247 సంవత్సరాల క్రితం) (1777)
ప్రదేశముClementinum, Prague
భౌగోళికాంశాలు50°5′14.62″N 14°25′2.58″E / 50.0873944°N 14.4173833°E / 50.0873944; 14.4173833
గ్రంధ సంగ్రహం / సేకరణ
గ్రంధాల సంఖ్యమొత్తం 73,58,308
21,271 manuscripts
c. 4,200 incunabula

చరిత్ర

13వ శతాబ్దంలో, ప్రాగ్ ఓల్డ్ టౌన్‌లోని డొమినికన్ మఠంలో స్టూడియో జనరల్ స్కూల్‌ను స్థాపించారు. 14వ శతాబ్దంలో ఈ పాఠశాలను, దాని లైబ్రరీతో సహా, విశ్వవిద్యాలయంలో విలీనం చేసారు.

1556లో, జెస్యూట్ ఆర్డర్ యొక్క సన్యాసులు డొమినికన్ మఠం యొక్క అవశేషాలపై క్లెమెంటినమ్ అనే బోర్డింగ్ పాఠశాలను నిర్మించారు. 1622 నుండి, జెస్యూట్‌లు చార్లెస్ విశ్వవిద్యాలయాన్ని కూడా నిర్వహించేవారు. వారి లైబ్రరీలన్నీ క్లెమెంటినమ్‌ లోనే ఉండేవి.

చెక్ రిపబ్లిక్ జాతీయ గ్రంథాలయం 
క్లెమెంటినమ్ తూర్పు ప్రవేశ ద్వారం

జెస్యూట్‌ల అణచివేత తరువాత, 1773లో విశ్వవిద్యాలయం ప్రభుత్వ సంస్థగా మారింది. 1777లో దాని లైబ్రరీని "ఇంపీరియల్-రాయల్ పబ్లిక్ అండ్ యూనివర్శిటీ లైబ్రరీ"గా మారియా థెరిసా ప్రకటించింది. 1882లో యూనివర్శిటీని చెక్, జర్మన్ అనే రెండు యూనివర్శిటీలుగా విభజించిన తర్వాత కూడా లైబ్రరీ ఉమ్మడి సంస్థగానే కొనసాగింది.

1918లో, పబ్లిక్ అండ్ యూనివర్శిటీ లైబ్రరీని కొత్తగా స్థాపించబడిన చెకోస్లోవేకియా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 1924లో, స్లావోనిక్ లైబ్రరీని ( స్లోవాన్‌స్కా నిహోవ్నా ) స్థాపించారు. 1929లో దాన్ని క్లెమెంటినమ్‌కు తరలించారు. ఇది ఇప్పటికీ నేషనల్ లైబ్రరీలో స్వయంప్రతిపత్తి కలిగిన భాగం. 1935లో, లైబ్రరీకి "నేషనల్ అండ్ యూనివర్శిటీ లైబ్రరీ"గా పేరు మార్చారు (Národní a univerzitní knihovna ). అదే సంవత్సరంలో, చట్టపరమైన డిపాజిట్ కాపీ డ్యూటీపై ఒక చట్టాన్ని ప్రవేశపెట్టారు దాని ప్రకారం, ప్రేగ్ ప్రింటర్లు తమ ప్రింట్‌ల చట్టపరమైన డిపాజిట్ కాపీలను లైబ్రరీకి అందజేయాలి.

1939లో జెకోస్లోవేకియాని జర్మనీ ఆక్రమించుకున్న తర్వాత చెక్ విశ్వవిద్యాలయాలు, కళాశాలలను మూసివేసినప్పటికీ, లైబ్రరీ "మునిసిపల్, యూనివర్సిటీ లైబ్రరీ" ( Zemská a univerzitní knihovna ) పేరుతో తెరిచే ఉంది.

1958లో, ప్రాగ్ లోని పెద్ద లైబ్రరీలన్నిటినీ చెకోస్లోవాక్ రిపబ్లిక్ (స్టాట్నీ నిహోవ్నా CSR ) యొక్క ఒకే కేంద్రీకృత స్టేట్ లైబ్రరీలో విలీనం చేసారు.

డిజిటైజేషను

చెక్ రిపబ్లిక్ నేషనల్ లైబ్రరీ వారి డిజిటలైజేషన్ ప్రయత్నాలు 1992లో చెక్ కంపెనీ AiP బెరౌన్ సహకారంతో మొదలయ్యాయి. ఈ ప్రయత్నాలలో, నేషనల్ లైబ్రరీ డిజిటలైజేషన్ ప్రమాణాల సృష్టిలో ప్రపంచ స్థాయిలో మార్గదర్శకమైన కృషి చేసింది. తరువాత, ఇది అనేక యూరోపియన్ ప్రాజెక్ట్‌లలో పాల్గొంది. రాతప్రతులు, పాత ప్రింట్‌లకు సంబంధించి అదనపు పరిణామాలను నెలకొల్పడంలో పాల్గొంది. అనేక పైలట్ ప్రాజెక్ట్‌లను రూపొందించిన సమయంలో, UNESCO మెమరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రామ్ యొక్క మొదటి సంవత్సరాలలో కూడా మద్దతు ఇచ్చింది (కార్యక్రమం యొక్క మొదటి పైలట్ ప్రాజెక్ట్ 1993లో చెక్ రిపబ్లిక్ యొక్క నేషనల్ లైబ్రరీ నుండే వచ్చింది).

పాత గ్రంథాలను డిజిటలైజ్ చేయడంలో చేసిన కృషికి గాను, యునెస్కో వారి మెమరీ ఆఫ్ ది వరల్డ్ ప్రోగ్రామ్ నుండి ప్రారంభ జిక్జీ బహుమతిని అందుకోవడంతో లైబ్రరీ 2005లో అంతర్జాతీయ గుర్తింపు పొందింది. 1992 నుండి దాని మొదటి 13 సంవత్సరాలలో, ఈ ప్రాజెక్టు 1,700 డాక్యుమెంట్ల డిజిటలైజేషన్‌ను పూర్తి చేసి, వాటిని అందరికీ అందుబాటులో ఉంచింది.

నేషనల్ లైబ్రరీ మాన్యుస్క్రిప్టోరియం( http://www.manuscriptorium.com/en ), క్రమేరియస్ ( http://kramerius5.nkp.cz ) డిజిటల్ లైబ్రరీలలో డిజిటల్ కంటెంట్‌ను అందుబాటులో ఉంచుతుంది. మాన్యుస్క్రిప్టోరియంలో 1,11,000 పైచిలుకు మాన్యుస్క్రిప్ట్‌లు, పాత ప్రింట్‌లను ఉన్నాయి. వాటిలో దాదాపు 84,000 నేషనల్ లైబ్రరీ అందించనవే. మిగిలినవి 24 దేశాల లోని 138 భాగస్వాముల నుండి వచ్చాయి.  2008 నుండి, యూరోపియన్ యూనియన్ యొక్క సాంస్కృతిక వారసత్వం కోసం డిజిటల్ ప్లాట్‌ఫారమ్ అయిన యూరోపియన్నా ఉనికిలోకి వచ్చినప్పటి నుండి మాన్యుస్క్రిప్టోరియం, చెక్ రిపబ్లిక్‌లోని లైబ్రరీలు తయారుచేసే మాన్యుస్క్రిప్ట్‌లు, పాత ప్రింట్‌లను యూరోపియన్ ప్లాట్‌ఫారమ్‌కి అందిస్తోంది. ఈ డిజిటల్ కాపీలను ప్రొఫెషనల్ అకడమిక్ రిసోర్స్ డిస్కవరీ సేవలతో సహా ప్రత్యేక పోర్టల్‌లు, ఉదా EBSCO, ProQuest, ExLibris వంటి వాటికి కూడా అందిస్తోంది.


క్రమేరియస్ డిజిటల్ లైబ్రరీలో 1800 సంవత్సరం తర్వాత ప్రచురితమైన డిజిటలైజ్డ్ డాక్యుమెంట్‌లున్నాయి. ఇప్పటివరకు, 2,000 కంటే ఎక్కువ పీరియాడికల్ సిరీస్‌లను డిజిటలైజ్ చేసింది. డిజిటలైజ్ చేసిన పుస్తకాల సంఖ్య పెరుగుతూనే ఉంది. 

సంఘటనలు

2002 యూరోపియన్ వరదల సమయంలో లైబ్రరీ లోకి నీళ్ళు వచ్చాయి. తడవకుండా రక్షించేందుకు కొన్ని పత్రాలను పై అంతస్థుల్లోకి తరలించారు. 2011 జూలైలో ప్రధాన భవనంలోని కొన్ని భాగాలలోకి వరదలు రావడంతో లైబ్రరీ నుండి 4,000 పుస్తకాలను తీసేసారు. 2012 డిసెంబరులో లైబ్రరీలో అగ్నిప్రమాదం జరిగింది. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు.

మూలాలు

Tags:

చెక్ రిపబ్లిక్ జాతీయ గ్రంథాలయం చరిత్రచెక్ రిపబ్లిక్ జాతీయ గ్రంథాలయం డిజిటైజేషనుచెక్ రిపబ్లిక్ జాతీయ గ్రంథాలయం సంఘటనలుచెక్ రిపబ్లిక్ జాతీయ గ్రంథాలయం మూలాలుచెక్ రిపబ్లిక్ జాతీయ గ్రంథాలయంచెక్ రిపబ్లిక్ప్రాగ్

🔥 Trending searches on Wiki తెలుగు:

భారత జాతీయ ఎస్సీ కమిషన్ఇ.వి.వి.సత్యనారాయణగౌడచాట్‌జిపిటిభారతదేశం - మొట్టమొదటి వ్యక్తులుకన్యకా పరమేశ్వరివారాహిమౌర్య సామ్రాజ్యంఅయ్యప్పశ్రీశ్రీ రచనల జాబితాశ్రవణ నక్షత్రముభారత జాతీయగీతంకృష్ణా నదిముహమ్మద్ ప్రవక్తభారతీయ శిక్షాస్మృతిగోవిందుడు అందరివాడేలేవిజయశాంతిమోదుగసూర్యుడు (జ్యోతిషం)శ్రీరామనవమిపాండ్యులుతామర పువ్వువై.యస్.అవినాష్‌రెడ్డిభారతదేశంలో బ్రిటిషు పాలనఉసిరిసూర్యప్రభ (నటి)తెలుగు నెలలుఅథర్వణ వేదంబ్రహ్మపుత్రా నదిసురభి బాలసరస్వతిసిందూరం (2023 సినిమా)ప్రియ భవాని శంకర్నాగుపాముజై శ్రీరామ్ (2013 సినిమా)కళ్యాణలక్ష్మి పథకంసుందర కాండభారత ఎన్నికల కమిషనుతెలుగు శాసనాలుమూలా నక్షత్రంవాల్మీకిసచిన్ టెండుల్కర్శాతవాహనులుసుభాష్ చంద్రబోస్శేషాద్రి నాయుడుతెలంగాణ తల్లిశక్తిపీఠాలుసత్యనారాయణ వ్రతంకాపు, తెలగ, బలిజకరక్కాయకవిత్రయంనవరసాలునిర్మలమ్మపొడుపు కథలుఅనంత శ్రీరామ్బరాక్ ఒబామాభారత రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల రాజధానులుమహేంద్రసింగ్ ధోనిషోయబ్ ఉల్లాఖాన్నిజాంబద్రీనాథ్ దేవస్థానంసర్దార్ వల్లభభాయి పటేల్గ్లోబల్ వార్మింగ్సర్వాయి పాపన్నదక్షిణ భారతదేశంచోళ సామ్రాజ్యంరైతుబంధు పథకంమీనరాశిగిడుగు వెంకట రామమూర్తిరజాకార్లువిశాఖపట్నంహెపటైటిస్‌-బికామాక్షి అమ్మవారి దేవాలయం (కంచి)ఈత చెట్టురెవెన్యూ గ్రామంక్షయఆశ్లేష నక్షత్రమురాశిఉమ్మెత్తశ్రీ కృష్ణుడు🡆 More