కాపు రాజయ్య

కాపు రాజయ్య ( ఏప్రిల్ 7, 1925 – ఆగష్టు 20, 2012) తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు.

గ్రామీణ నేపథ్యం గల చిత్రాలకు ఈయన పేరు పొందాడు. ఈయన చిత్రపటాలు ప్రపంచం లోని పలు ప్రదేశాలలో ప్రదర్శింపబడినవి. ఈయన 1963 లో లలితకళా సమితిని స్థాపించారు.

కాపు రాజయ్య
కాపు రాజయ్య
జననంకాపు రాజయ్య
ఏప్రిల్ 7, 1925
మెదక్ జిల్లా కి చెందిన సిద్ధిపేట
మరణంఆగష్టు 20, 2012
నివాస ప్రాంతంమెదక్ జిల్లా కి చెందిన సిద్ధిపేట
ప్రసిద్ధిచిత్రకారుడు
తండ్రిరాఘవులు

జీవితం

రాజయ్య సిద్ధిపేటలో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. హైదరాబాదు లోని ప్రభుత్వ కళాశాల నుండి చిత్రకళలో డిప్లోమా పొందాడు.

కళాకారునిగా

డ్రాయింగ్‌లో మద్రాసు ప్రభుత్వ డిప్లమా కూడా పొందారు. లలితా కళా అకాడమీ ద్వారా ఆయన చెకోస్లోవికియా, హంగేరి, రుమేనియా, బల్గేరియా దేశాల్లో ప్రదర్శనలు పెట్టారు. జెఎన్‌టియు ఆయనను గౌరవ డాక్టరేట్ ద్వారా గౌరవించింది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన కళారంగంలో అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. ఆయన ఏ బొమ్మ గీసినా సజీవ లక్షణం ఉట్టిపడేది. ఆయన తండ్రి రాఘవులు సిద్ధిపేటలో చిన్నపాటి వ్యాపారి. రాఘవులుకు ఆయన మూడో సంతానం. ఆయనకు ముందు ఇద్దరు ఆడపిల్లలు జన్మించారు. చిన్న వయస్సులోనే తండ్రి మరణించడంతో ఆయన తీవ్రమైన ఇబ్బందుల పాలయ్యారు. కాపు రాజయ్య కుటుంబాన్ని తండ్రి మిత్రుడు మార్క చంద్రయ్య ఆదుకున్నారు. ఆరో స్టాండర్డులో ఉన్నప్పుడు ఆయన మొదటి చిత్ర ప్రదర్శన జరిగింది. కుబేరుడు అనే ఉపాధ్యాయుడు చిత్రకళలో కాపు రాజయ్యను ప్రోత్సహించారు. రాజయ్యకు 50 దాకా అవార్డులు వచ్చాయి. రాష్ట్రప్రభుత్వం ఆయనను 1966లో రజత పత్రంతో సత్కరించింది. 1969లో తామ్ర పత్రంతో సత్కరించింది. 1975లో ఆయనకు చిత్ర కళాప్రపూర్ణ సత్కారం లభించింది. వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంటపొలాలు, వసంతకేళి, కోలాటం వంటి ఎన్నో అద్భుతమైన కళాఖండాలకు ఆయన ప్రాణం పోశారు. కళాకారుడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించినా ఆయన తన పుట్టిన గడ్డను మరిచిపోలేదు. ఆయన సిద్ధిపేటలో సైకిల్‌పై తిరుగుతూ ఉండేవారు. రాజయ్య తొలి చిత్రాలు సంప్రదాయబద్దమైన, కాలపరీక్షకు నిలిచిన ప్రాచ్య విధానంలో, అంటే వాష్ పద్ధతిలో చిత్రాలు వేశారు. ఆ తర్వాత నకాషీ చిత్రకారుల అద్భుతమైన టెక్నిక్ ఆయను ముగ్ధుడ్ని చేసింది. దాంతో టెంపరా రంగుల వాడకాన్ని ప్రారంభించారు. నకాషీ చిత్రకారులంటే ఆయనకు ఎనలేని అభిమానం. ఇరవై ఏళ్ల పాటు 1950 నుంచి 1970 వరకు ఆయన టెంపరా చిత్రాలు వేశారు.

ఈయన వేసే నకాషి శైలి చిత్రాలలో వడ్డెర మహిళ, ఎల్లమ్మ జోగి, గోపికా కృష్ణ, పంట పొలాలు, వసంత కేళి, కోలాటం, బోనాలు, బతుకమ్మలు నేపథ్యాలుగా ఉండేవి.

అస్తమయం

20 ఆగష్టు 2012లో తన 87వ ఏట రాజయ్య పార్కిన్సన్స్ వ్యాధి వలన మరణించారు. (Telugu)

అవార్డులు

రాజయ్య 1993లో కళా ప్రవీణ, 1997లో కళా విభూషణ్, 2000లో హంస, 2007లో లలిత కళారత్న అవార్డు అందుకున్నారు. విదేశాల్లో సైతం ఆయన చిత్రాల ప్రదర్శనలు జరిగాయి. రాజయ్య చిత్రాలు పార్లమెంటు హౌస్, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, సాలార్‌జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లలితా కళా అకాడమీల్లో ప్రదర్శనకు ఉంచారు.

  • చిత్రకళా ప్రపూర్ణ (1975)
  • సీనియర్ ఫెలోషిప్ (1988 లో భారతదేశ ప్రభుత్వం చే)
  • లలిత కళా అకాడెమీ
  • కళాప్రవీణ (1993 లో జే ఎన్ టీ యూ వారి చే)
  • కళారత్న (1993 లో మదనపల్లెకి చెందిన భరతముని ఆర్ట్స్ అకాడమీ చే)
  • కళావిభూషణ (AIFACS చే)
  • 1992లో తెలుగు విశ్వవిద్యాలయం నుండి చిత్రలేఖనంలో విశిష్ట పురస్కారం

సూచికలు

యితర లింకులు


Tags:

కాపు రాజయ్య జీవితంకాపు రాజయ్య కళాకారునిగాకాపు రాజయ్య అస్తమయంకాపు రాజయ్య అవార్డులుకాపు రాజయ్య సూచికలుకాపు రాజయ్య యితర లింకులుకాపు రాజయ్య19252012ఆగష్టు 20ఏప్రిల్ 7తెలంగాణప్రపంచము

🔥 Trending searches on Wiki తెలుగు:

సమాచార హక్కులోక్‌సభశ్రీశైలం (శ్రీశైలం మండలం)బౌద్ధ మతంఫిదాసెక్స్ (అయోమయ నివృత్తి)ఆంధ్రప్రదేశ్ నదులు, ఉపనదులుఎఱ్రాప్రగడపూర్వాషాఢ నక్షత్రముభారతదేశ రాజకీయ పార్టీల జాబితాకుప్పం శాసనసభ నియోజకవర్గంకియారా అద్వానీయూట్యూబ్బరాక్ ఒబామాజాతీయ విద్యా విధానం 2020అంగన్వాడిసామ్యూల్ F. B. మోర్స్అగ్నికులక్షత్రియులుయన్టీ రామారావు నటించిన సినిమాల జాబితాపిఠాపురంప్రహ్లాదుడుబలి చక్రవర్తిసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుఅమరావతిఋగ్వేదంపద్మశాలీలుగోత్రాలు జాబితాఅనుష్క శెట్టిప్రపంచ రంగస్థల దినోత్సవంఅమ్మల గన్నయమ్మ (పద్యం)కంగనా రనౌత్నక్షత్రం (జ్యోతిషం)అమ్మభారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థమహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంఎస్. ఎస్. రాజమౌళిరామోజీరావుగరుడ పురాణంకాజల్ అగర్వాల్మురళీమోహన్ (నటుడు)శ్రీదేవి (నటి)స్వామియే శరణం అయ్యప్పఇందుకూరి సునీల్ వర్మభారతదేశంరామప్ప దేవాలయంఆటలమ్మఆయాసంఆకాశం నీ హద్దురాకామసూత్రయజుర్వేదంపాల కూరఅంబటి రాయుడుఆంధ్రప్రదేశ్పరిటాల రవిబియ్యమునవగ్రహాలు జ్యోతిషంరక్త పింజరిఆప్రికాట్వింధ్య విశాఖ మేడపాటిఉగాదిరతన్ టాటాఉపనిషత్తువనపర్తిలోక్‌సభ స్పీకర్పెరిక క్షత్రియులుఊర్వశి (నటి)పార్లమెంట్ సభ్యుడుఆహారంభారతదేశంలో మహిళలుLలోక్‌సభ నియోజకవర్గాల జాబితాపాట్ కమ్మిన్స్ఫేస్‌బుక్వడ్డీఅనుపమ పరమేశ్వరన్90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్కిరణ్ రావుగోత్రాలుసంధ్యావందనం🡆 More