కాంతి శాస్త్రం

కాంతి శాస్త్రం అంటే కాంతి లక్షణాలను, ప్రవర్తనను వివరించే భౌతిక శాస్త్ర విభాగం.

ఈ శాస్త్రంలో కాంతిని గుర్తించే పరికరాలు, కాంతిని వాడుకునే పరికరాలు, వివిధ రకాలైన పదార్థాల మీద కాంతి ప్రభావం లాంటి అంశాలు ఉంటాయి. ప్రధానంగా మానవులు చూడగలిగే కాంతి, అతినీలలోహిత కిరణాలు, పరారుణ కిరణాలు గురించి ఇందులో వివరణ ఉంటుంది. కాంతిని విద్యుదయస్కాంత తరంగాలుగా కూడా అభివర్ణిస్తారు కాబట్టి ఆ తరంగాల ఇతర రూపాలైన ఎక్స్-రే, మైక్రోవేవ్, రేడియో తరంగాలను అధ్యయనం చేయడం కూడా ఇందులో భాగమే.

కాంతి శాస్త్రం
కాంతి విక్షేపణం

కాంతి చాలా ధర్మాలను కాంతిని విద్యుదయస్కాంత తరంగాలుగా భావించి వివరించవచ్చు. అయితే ఈ భావన ద్వారా కాంతి అన్ని ధర్మాలను ప్రయోగపూర్వకంగా నిరూపించడం కష్టసాధ్యం. అందుకోసం సరళమైన నమూనాల ద్వారా కాంతి మీద ప్రయోగాలు సాగించారు. కాంతి జ్యామితి ఇందులో ప్రధానమైనది. ఇందులో కాంతిని ఋజువుగా (నేరుగా) ప్రయాణించే కిరణాల సముదాయంగా అభివర్ణించారు. అవి ఏదైనా ఉపరితలాన్ని తాకినప్పుడు వంగడమో లేదా ఆ వస్తువుల గుండా చొచ్చుకుని ప్రయాణించడమో చేస్తాయి. కాంతి భౌతిక శాస్త్ర నమూనా కాంతి ధర్మాలను మరింత విపులంగా వివరిస్తుంది. 19వ శతాబ్దంలో విద్యుదయస్కాంత సిద్ధాంతం అభివృద్ధి సాధించడంతో కాంతిని విద్యుదయస్కాంత తరంగాలుగా ఉంటుందని నిర్ధారణకు వచ్చారు.

కొన్ని కాంతి ధర్మాలు వివరించాలంటే కాంతిని తరంగాలు గానూ,, కణాలుగా కూడా ఊహించాలి. క్వాంటమ్ మెకానిక్స్ ద్వారా వీటిని వివరిస్తారు. కాంతిని కణధర్మాలను వివరించడానికి దానిని ఫోటాన్ల సముదాయంగా భావిస్తారు.

కాంతి శాస్త్రాన్ని దాని అనుబంధ రంగాలైన ఖగోళ శాస్త్రం, వివిధ ఇంజనీరింగ్ రంగాలు, ఫోటోగ్రఫీ, వైద్యరంగాలలో విరివిగా వాడుతున్నారు. నిత్యజీవితంలో మనం వాడే వస్తువులైన అద్దాలు, కటకాలు, టెలిస్కోపు, మైక్రోస్కోపు, లేజర్లు, ఫైబర్ ఆప్టిక్స్ మొదలైనవి కాంతి సూత్రాల ఆధారంగా తయారుచేయబడ్డవే.

మూలాలు

Tags:

ఎక్స్-రేకాంతిభౌతిక శాస్త్రమువిద్యుదయస్కాంత తరంగాలు

🔥 Trending searches on Wiki తెలుగు:

నువ్వులుఏకలవ్యుడుఈదుమూడిసికింద్రాబాద్ జంక్షన్ రైల్వే స్టేషనురచిన్ రవీంద్రశివ కార్తీకేయన్ద్రౌపది ముర్ముతూర్పు కాపుభారత రాజ్యాంగ సవరణల జాబితారంగనాథస్వామి దేవాలయం (శ్రీరంగం)కామినేని శ్రీనివాసరావుసమంతశ్రీ కృష్ణదేవ రాయలుడి.వై. చంద్రచూడ్జాతీయ విద్యా విధానం 2020రోహిత్ శర్మకాకతీయుల శాసనాలుబారసాలతెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్బోడె ప్రసాద్ఏనుగుయేసురావుల శ్రీధర్ రెడ్డిప్రకటనపసుపు గణపతి పూజవిజయవాడభౌతిక శాస్త్రంతెలంగాణ రాష్ట్ర పవర్ జనరేషన్ కార్పోరేషన్నయన తారకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయంఅటల్ బిహారీ వాజపేయిరుక్మిణీ కళ్యాణంఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంజోల పాటలుఢిల్లీ మద్యం కుంభకోణంవనపర్తి సంస్థానంభారతదేశంలో కోడి పందాలుఆంధ్రజ్యోతిఉత్తర ఫల్గుణి నక్షత్రముసుమ కనకాలభీమా నదిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డియజుర్వేదంఅల్లు అర్జున్శ్రీశైలం (శ్రీశైలం మండలం)భారత కేంద్ర మంత్రిమండలిసౌర కుటుంబంభారతీయ తపాలా వ్యవస్థవడ్డీప్రధాన సంఖ్యసత్యనారాయణ వ్రతంగ్యాంగ్స్ ఆఫ్ గోదావరిచిన్న ప్రేగువింధ్య విశాఖ మేడపాటివిశాఖ నక్షత్రముహోళీఅక్కినేని నాగేశ్వరరావురెండవ ప్రపంచ యుద్ధంమహాత్మా గాంధీవేమనశ్రీవిష్ణు (నటుడు)మూర్ఛలు (ఫిట్స్)కొణతాల రామకృష్ణసుస్థిర అభివృద్ధి లక్ష్యాలుసురేఖా వాణిAభారత జాతీయ ఎస్సీ కమిషన్మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గంటిల్లు స్క్వేర్అలెగ్జాండర్మురళీమోహన్ (నటుడు)పాండవులుయాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంచార్మినార్స్త్రీవిశ్వబ్రాహ్మణమానవ శరీరముజాతీయ ఆదాయం🡆 More