ఏ.యం.రాజా

ఏ.యం.రాజా (అయిమల మన్మథరాజు రాజా) (జూలై 1, 1929 -ఏప్రిల్ 9, 1989) 1950వ దశకంలో తమిళ, తెలుగు సినిమా రంగాలలో విశిష్టమైన నేపథ్య గాయకులు, సంగీత దర్శకులు, నటుడు.

విప్రనారాయణ, చక్రపాణి, ప్రేమలేఖలు, మిస్సమ్మ పాటలు రాజా గాత్ర మాధుర్యానికి కొన్ని మచ్చు తునకలు.ఇతను వివిధ భాషలలో 10,000 పాటలు పాడి, వందకు పైగా సినిమాలకు సంగీతం సమకూర్చాడు.

అయిమల మన్మథరాజు రాజా
ఏ.యం.రాజా
ఏ.యం.రాజా
జననంజూలై 1, 1929
చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురం
మరణం1989
ఇతర పేర్లుఏ.యం.రాజా
వృత్తిసంగీత దర్శకుడు
ప్రసిద్ధినేపద్య గాయకుడు
తండ్రిమన్మధరాజు,
తల్లిలక్ష్మమ్మ

ఏ.యం.రాజా 1929, జూలై 1 న చిత్తూరు జిల్లాలోని రామచంద్రపురంలో మన్మధరాజు, లక్ష్మమ్మ దంపతులకు జన్మించాడు. మూడు నెలల ప్రాయంలోనే తండ్రి మరణించడంతో ఈయన రేణుకాపురానికి తరలి వెళ్ళింది. అక్కడే రాజా తన చదువు ప్రారంభించాడు. 1951లో మద్రాసు పచ్చయప్ప కళాశాల నుండి బి.ఎ. పట్టా పొందాడు. ఈయన చదువుకునే రోజుల్లోనే సంగీతంపై ఆసక్తితో మూడేళ్ళపాటు సాధనచేసి నేర్చుకున్నాడు. పచ్చయప్ప కళాశాల సంగీత పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్నాడు. 1951లో కుమారి సినిమాకు నేపథ్యగాయకునిగా పనిచేయటానికి ఒప్పందం కుదిరింది. ఆ తరువాత సంసారంలో సినిమాలో పాడాడు. ఆ తరువాత అప్పట్లో విడుదలైన దాదాపు సినిమాలన్నింటిలో రాజా గొంతు వినిపించేది. ఈయన గాత్రం 1954, 1955 సంవత్సరాల్లో ఆంధ్రదేశంలో విపరీతంగా విహారం చేసింది.

రాజా, గాయని జిక్కీని, ఎం.జి.రామచంద్రన్ హీరోగా నటించిన జెనోవా సినిమా సెట్స్‌లో కలిశాడు. జిక్కిని వివాహం చేసుకున్న సమయంలో వీరిద్దరూ పాడిన ప్రేమలేఖలు సూపర్ హిట్ కావటం ఒక విశేషం. వీరికి 4 కుమార్తెలు, ఇద్దరు కుమారులు. రాజా సరదాగా నటించి, పాడిన హాస్యరస చిత్రం పక్కింటి అమ్మాయి, అశ్వత్థామ స్వరకల్పనలో రూపొందిన ఆ చిత్రంలోని గీతాలు హాయి గొలిపే లలిత గాన మాధుర్యానికి సంకేతాలు. అలాగే అమర సందేశం గీతాలు కూడా రాజా శక్తిని నిరూపించాయి. శోభ, పెళ్ళి కానుక చిత్రాలకు, మరికొన్ని తమిళ చిత్రాలకు ఏ.యం.రాజా సంగీత దర్శకత్వం వహించారు. పెళ్ళి కానుక లోని నేపథ్య సంగీతం కూడా ఎంతో భావగర్భితంగా వుండి చిత్ర విజయానికి దోహదం చేసాయి.

ఈయన కన్యాకుమారి జిల్లాలోని ఒక గుడిలో సంగీతకచ్చేరి చేసి తిరిగి వస్తుండగా తిరునల్వేలి జిల్లాలోని వల్లియూరులో జరిగిన రైలు ప్రమాదంలో 1989, ఏప్రిల్ 9న మరణించాడు.

చిత్ర సమాహారం

నేపథ్య గాయకునిగా

సంగీత దర్శకునిగా

నటునిగా

మూలాలు

బయటి లింకులు

Tags:

ఏ.యం.రాజా చిత్ర సమాహారంఏ.యం.రాజా మూలాలుఏ.యం.రాజా బయటి లింకులుఏ.యం.రాజా19291989చక్రపాణితమిళతెలుగుప్రేమలేఖలుమిస్సమ్మ

🔥 Trending searches on Wiki తెలుగు:

హైదరాబాదు మెట్రో స్టేషన్ల జాబితావింధ్య విశాఖ మేడపాటిఅంగారకుడు (జ్యోతిషం)కర్మ సిద్ధాంతంకన్యారాశిసంజు శాంసన్అయ్యప్పతెలుగు నాటకరంగంప్రీతీ జింటావినాయకుడుగుంటూరు లోక్‌సభ నియోజకవర్గంషిర్డీ సాయిబాబాఎస్త‌ర్ నోరోన్హాతెలుగు నెలలురాశిఐక్యరాజ్య సమితిఅశోకుడుహలో బ్రదర్సావిత్రి (నటి)చాళుక్యులుసీత్లవిశ్వనాథ సత్యనారాయణకామసూత్రవిభీషణుడుఆశ్లేష నక్షత్రమువెంట్రుకతిరుమల చరిత్రఉష్ణోగ్రతయానాంకావ్యమువాతావరణంసజ్జల రామకృష్ణా రెడ్డినితీశ్ కుమార్ రెడ్డిఎనుముల రేవంత్ రెడ్డిపేర్ల వారీగా తెలుగు సినిమాల జాబితారాహుల్ గాంధీఅంజలి (నటి)ఉత్తరాభాద్ర నక్షత్రముకోదండ రామాలయం, ఒంటిమిట్టఆర్టికల్ 370 రద్దుఆవారాబ్రాహ్మణులుఅగ్నికులక్షత్రియులుసంతోష్ యాదవ్దిల్ రాజుస్త్రీనువ్వు వస్తావనిధర్మవరం శాసనసభ నియోజకవర్గంఅమెరికా రాజ్యాంగంకుంభరాశినారా లోకేశ్ఎస్. జానకిపమేలా సత్పతిసరోజినీ నాయుడుభారతదేశంలో కోడి పందాలుపార్లమెంటు సభ్యుడుపెళ్ళి (సినిమా)రాజ్యసభవిలియం షేక్‌స్పియర్PHసంధిబాపట్ల లోక్‌సభ నియోజకవర్గంరవీంద్ర జడేజాసుందర కాండశ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రిచతుర్వేదాలుతెనాలి రామకృష్ణుడుభారతదేశ చరిత్రజయలలిత (నటి)శివ కార్తీకేయన్గ్రామంపూరీ జగన్నాథ దేవాలయంభారతదేశంలో సెక్యులరిజంజాతీయ విద్యా విధానం 2020భారత స్వాతంత్ర్యోద్యమంభీమా (2024 సినిమా)రామాయణంపొడుపు కథలు🡆 More