ఏక్తా బిష్త్

ఏక్తా బిష్త్ ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారిణి.

ఆమె పూర్తి పేరు ఏక్తా కుందన్‌సింగ్ బిష్త్ ఆమె ఉత్తరాఖండ్‌కు చెందిన తొలి అంతర్జాతీయ మహిళా క్రికెటర్‌, స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థోడాక్స్ బౌలర్‌గా ఆడుతుంది. మహిళల ట్వంటీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారత్ క్రికెటర్ కూడా ఆమె.

ఏక్తా బిష్త్
ఏక్తా బిష్త్
ఏక్తా బిష్త్ 2012
వ్యక్తిగత సమాచారం
పూర్తి పేరు
ఏక్తా కుందన్ సింగ్ బిష్త్
పుట్టిన తేదీ (1986-02-08) 1986 ఫిబ్రవరి 8 (వయసు 38)
అల్మోరా, ఉత్తరాఖండ్, భారత దేశము
బ్యాటింగుఎడమ చేతి వాటం
బౌలింగుఎడమ చేతి ఆర్థోడాక్స్ స్పిన్/ స్లో
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 73)2014 13 ఆగస్ట్ - ఇంగ్లాండ్ తో
తొలి వన్‌డే (క్యాప్ 97)2011 2 జులై - ఆస్ట్రేలియా తో
చివరి వన్‌డే2022 ఫిబ్రవరి 18 - న్యూజిలాండ్ తో
తొలి T20I (క్యాప్ 24)2011 జూన్ 23 - ఆస్ట్రేలియా తో
చివరి T20I2019 9 మార్చ్ - ఇంగ్లాండ్ తో
దేశీయ జట్టు సమాచారం
YearsTeam
2006/07–2012/13ఉత్తరప్రదేశ్ మహిళా క్రికెట్ జట్టు
2013/14–2021/22రైల్వేస్
2018IPL ట్రైల్ బ్లెజెర్స్
2019–2020IPL వేగం
2022/23–ప్రస్తుతంఉత్తరాఖండ్ మహిళా క్రికెట్ జట్టు
కెరీర్ గణాంకాలు
పోటీ WTest WODI WT20I
మ్యాచ్‌లు 1 63 42
చేసిన పరుగులు 0 172 40
బ్యాటింగు సగటు 8.19 5.00
100s/50s 0/0 0/0 0/0
అత్యధిక స్కోరు 0* 18* 15
వేసిన బంతులు 228 3,399 883
వికెట్లు 3 98 53
బౌలింగు సగటు 14.66 21.83 14.71
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0 2 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0 0 0
అత్యుత్తమ బౌలింగు 2/33 5/8 4/21
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 16/– 6/–
మూలం: ESPNcricinfo, 2022 నవంబర్ 6

వ్యక్తిగత జీవితం

ఏక్తా బిష్త్ 1986 ఫిబ్రవరి 8న ఉత్తర ప్రదేశ్‌లోని అల్మోరాలో (ప్రస్తుతం ఉత్తరాఖండ్‌లో ఉంది) కుందన్ సింగ్ బిష్త్, తారా బిష్త్ దంపతులకు జన్మించింది. ఆమె తండ్రి కుందన్ సింగ్ బిష్త్1988లో భారత సైన్యం నుండి హవల్దార్ హోదాలో పదవీ విరమణ చేశాడు. ఏక్తా బిష్త్‌కు ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, కౌశల్ బిష్త్, వినీత్ బిష్త్, శ్వేతా బిష్త్. బిష్త్ ఆరేళ్ల వయసులో క్రికెట్ ఆడటం ప్రారంభించింది. ఆమె అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆటను ఆడుతుండేది. ఇది ప్రేక్షకులను బాగా ఆకర్షించేది. అప్పట్లో తండ్రి రు.1,500 (2020 నాటికీ రు. 17000 లేదా US $ 220 తో సమానము) పింఛెను మాత్రమేలభిస్తుండేది. కుందన్ సింగ్ బిష్త్ కుటుంబ ఆదాయాన్ని పెంచడానికి అల్మోరాలో ఒక టీ కొట్టును ప్రారంభించి, తన కుమార్తె క్రికెట్ అభివృద్ధికు కూడా మద్దతుగా నిలిచాడు. ఆమె ఉత్తర మండలం లోని కుమాన్ విశ్వవిద్యాలయం జట్టుకికి నాయకత్వం వహించింది. 2011లో ఏక్తా జాతీయ జట్టుకు ఎంపికైన తర్వాత కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగుపడింది, దాతల (స్పాన్సర్‌) నుండి నిధులు పొందడం, ఆమె తండ్రి సైనిక పింఛెను పెరగడముతో, కుటుంబం టీ కొట్టును మూసివేయగలిగింది.

క్రికెట్ జీవితం

బిష్త్ జూలై 2006-2007, 2012-13 మధ్య ఉత్తరప్రదేశ్ తరపున ఆడింది. ఆమె నార్త్ జోన్‌లోని కుమాన్ విశ్వవిద్యాలయం జట్టుకి నాయకత్వం వహించింది. 2003 నుండి 2006 వరకు ఉత్తరాంచల్ మహిళా క్రికెట్ సంఘం జట్టుకు శిక్షకుడుగా పనిచేసిన లియాకత్ అలీ ఏక్తాకు తన ప్రారంభ సంవత్సరాల్లో శిక్షకుడుగా ఉన్నారు

బిష్త్ 2011లో భారత మహిళల జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైంది. తన మొదటి ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ 2011 జూలై 2న ఆస్ట్రేలియాతో ఆడింది.

2012 అక్టోబరు 3న, శ్రీలంకలోని కొలంబోలో జరిగిన ICC ప్రపంచ మహిళల ట్వంటీ20 మ్యాచ్‌లో భారత్‌ జట్టు తరపున బిష్త్ హ్యాట్రిక్ సాధించింది. చివరి ఓవర్లో బిష్త్ హ్యాట్రిక్ సాధించడంతో భారత్ శ్రీలంకను ఎనిమిది వికెట్ల నష్టానికి 100 పరుగులకు పరిమితం చేసింది. 2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్‌లో భారత జట్టు చివరి రోజు ఆటకు చేరుకోవడానికి బిష్త్ కారణమయింది. అయితే చివరి రోజు భారత జట్టు తొమ్మిది పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చేతిలో ఓడిపోయింది. 

2017 డిసెంబరులో, ICC మహిళా ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో 'ICC ఉమెన్స్ టీమ్ ఆఫ్ ది ఇయర్, ICC ఉమెన్స్ T20I టీమ్ ఆఫ్ ది ఇయర్' రెండింటిలోనూ ఆమె ఒక క్రీడాకారిణి (ప్లేయర్‌)గా ఎంపికైంది. రెండు జట్ల జాబితాలోనూ పేరున్న ఏకైక మహిళ ఆమె.

ఏక్తా బిష్త్ 
2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్

2017 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ సందర్భంగా, బిష్త్ పాకిస్థాన్‌పై 18 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి, భారత్‌ను 95 పరుగుల తేడాతో గెలిపించింది. దీంతో అదే ఏడాది ఫిబ్రవరిలో కొలంబోపై 8 పరుగులకే 5 వికెట్లు తీసి తన రికార్డును తానే బ్రేక్ చేసింది. అదే పద్ధతిలో 12 సంవత్సరాల క్రితం 2005లో, ఆమె గాయపడి మ్యాచ్‌ను మధ్యలోనే వదిలివేయవలసి వచ్చింది. కానీ 2017లో ఆమె తనను తాను నిలదొక్కుకొని అభివృద్ధి చేసుకొని తన చారిత్రక విజయం సాధించింది. 2017లో 16 మ్యాచ్‌ల్లో 29 వికెట్లతో 17.27 సగటుతో ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా కూడా బిష్త్ నిలిచింది.

2018 అక్టోబరులో, వెస్టిండీస్‌లో జరిగిన 2018 ICC ప్రపంచ మహిళా ట్వంటీ20 పోటీలలో ఆమె భారత జట్టులో ఎంపికైంది. 2018 నవంబరు నాటికి, ఆమె ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో 79 వికెట్లు, T20I లలో 50వికెట్లను పడగొట్టి వరుసగా 21.98 14.50 సగటు సాధించింది .

ఆమె 129 అంతర్జాతీయ వికెట్లతో 100 వికెట్ల గీతను దాటిన 5వ భారతీయ క్రికెట్ జట్టు మహిళ. ఆమె ఒక రోజు అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ లలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో ఐదవది, T20I లలో అత్యధిక వికెట్లు తీసిన వారిలో మూడవది. సచిన్ టెండూల్కర్ ఆమె ఫీల్డింగ్ నైపుణ్యాలను ప్రశంసించాడు. ఆమెకు సచిన్ అభిమాన క్రికెటర్.

2021 మేలో, ఇంగ్లండ్ మహిళల క్రికెట్ జట్టుతో జరిగిన వన్-ఆఫ్ మ్యాచ్ కోసం ఆమె భారత టెస్ట్ జట్టులో ఎంపికైంది. 2022 జనవరిలో, న్యూజిలాండ్‌లో జరిగే 2022 మహిళల క్రికెట్ ప్రపంచ కప్ కోసం భారత జట్టులోని ముగ్గురు రిజర్వ్ ప్లేయర్‌లలో ఆమె ఒకరిగా ఎంపికైంది.

2022 అక్టోబరు 12న ఉత్తరాఖండ్ జట్టు హర్యానాతో వడోదరలో టీ20 మ్యాచ్ కు తలపడే 15 మంది సభ్యులతో కూడిన ఉత్తరాఖండ్ జట్టు నాయకత్వ బాధ్యతలను ఏక్తా బిష్త్ కు ఇచ్చారు. ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఏక్తా బౌలింగ్‌కు అభిమాని. ఏక్తా అల్మోరాలో ఉన్నప్పుడు, తరచుగా స్టేడియంలో క్రికెట్ సాధన చేస్తూ కనిపిస్తుంది. యువ క్రీడాకారులకు బౌలింగ్ చిట్కాలు ఇస్తూ వారిని ప్రోత్సహిస్తుంది. 

అవార్డులు

2017 నవంబరులో, ఉత్తరాఖండ్ ప్రభుత్వం బౌలర్ ఏక్తా బిష్త్‌కు ఖేల్ రత్న అవార్డును, ఆమె శిక్షకుడు లియాకత్ అలీ ఖాన్‌కు ద్రోణాచార్య అవార్డును ప్రదానం చేయాలని నిర్ణయించింది.

ప్రస్తావనలు

బాహ్య లింకులు

Tags:

ఏక్తా బిష్త్ వ్యక్తిగత జీవితంఏక్తా బిష్త్ క్రికెట్ జీవితంఏక్తా బిష్త్ అవార్డులుఏక్తా బిష్త్ ప్రస్తావనలుఏక్తా బిష్త్ బాహ్య లింకులుఏక్తా బిష్త్ఉత్తరాఖండ్ఎడమచేతి ఆర్థడాక్స్ స్పిన్క్రికెట్బౌలింగ్ (క్రికెట్)మహిళల ట్వంటీ20 ఇంటర్నేషనల్

🔥 Trending searches on Wiki తెలుగు:

చంద్రుడువీర్యంసంయుక్త మీనన్గద్దర్సుందర కాండహనుమంతుడుభారత జాతీయ ఎస్సీ కమిషన్గరికిపాటి నరసింహారావుస్వామిసంధిభారత స్వాతంత్ర్య దినోత్సవంఅమెజాన్ ప్రైమ్ వీడియోకుంభరాశిబ్రాహ్మణులుబలంఒగ్గు కథసీమ చింతకురుక్షేత్ర సంగ్రామంయాదవరాహువు జ్యోతిషంమహామృత్యుంజయ మంత్రంపుష్యమి నక్షత్రముఆపిల్శాకుంతలంఅయస్కాంత క్షేత్రంపల్లెల్లో కులవృత్తులుఎస్. పి. బాలసుబ్రహ్మణ్యంఎకరంరాజ్యసంక్రమణ సిద్ధాంతంవిటమిన్మార్కాపురంజనాభాభారత రాజ్యాంగం - ప్రాథమిక హక్కులుయేసుప్రకృతి - వికృతిఆలివ్ నూనెపొట్టి శ్రీరాములుకవిత్రయంవాతావరణంఉపనయనముగిలక (హెర్నియా)జాతీయ మహిళ కమిషన్మానవ పరిణామంప్రజాస్వామ్యంరామాయణంగిరిజనులుఅంగుళంఛత్రపతి శివాజీసంక్రాంతిపాల కూరఅటార్నీ జనరల్వేయి స్తంభాల గుడిచిరుధాన్యంఅక్బర్ నామాన్యుమోనియాక్రికెట్ఉత్తరాషాఢ నక్షత్రముగన్నేరు చెట్టుచతుర్వేదాలుదాదాసాహెబ్ ఫాల్కేవేములవాడసిందూరం (2023 సినిమా)ఐనవోలు మల్లన్న స్వామి దేవాలయంబ్రాహ్మణ గోత్రాలు, ప్రవరలుఅగ్నికులక్షత్రియులుతెలంగాణ రాష్ట్ర సమితిఇ.వి.వి.సత్యనారాయణవేమన శతకముబలిజవిశ్వబ్రాహ్మణచిత్త నక్షత్రముభారతదేశ పంచవర్ష ప్రణాళికలుషోయబ్ ఉల్లాఖాన్భగీరథుడునక్షత్రం (జ్యోతిషం)సాయి ధరమ్ తేజ్గంగా పుష్కరంవ్యతిరేక పదాల జాబితాసరోజినీ నాయుడు🡆 More