యోగి వేమన 1947 లో కె.
వి. రెడ్డి దర్శకత్వంలో విడుదలైన చిత్రం. వాహిని పిక్చర్స్ బ్యానర్ పై కదిరి వెంకటరెడ్డి నిర్మించిన ఈ సినిమాకు చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావులు సంగీతాన్ని అందించారు.
యోగి వేమన (1947 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | కె.వి.రెడ్డి |
---|---|
నిర్మాణం | బి.యన్.రెడ్డి, మూలా నారాయణ స్వామి |
తారాగణం | చిత్తూరు నాగయ్య, ముదిగొండ లింగమూర్తి, ఎమ్.వి.రాజమ్మ, దొరైస్వామి, పార్వతీబాయి, కృష్ణవేణి, బెజవాడ రాజారత్నం, పద్మనాభం |
సంగీతం | చిత్తూరు నాగయ్య, ఓగిరాల రామచంద్రరావు |
గీతరచన | సముద్రాల రాఘవాచార్య |
సంభాషణలు | సముద్రాల రాఘవాచార్య |
నిర్మాణ సంస్థ | వాహినీ పిక్చర్స్ |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
ఈ చిత్రంలో వేమన పాత్రధారి చిత్తూరు నాగయ్య. ఈ చిత్రంలో నాగయ్య నటన ఆయనకు ఎంతో పేరు ప్రఖ్యాతులను తెచ్చి పెట్టింది. నాగయ్య నటనతో పాటు కె వి రెడ్డి దర్శకత్వ ప్రతిభ ఈ చిత్రానికి వన్నె తెచ్చింది. 1947వ సంవత్సరములో దేశానికి స్వతంత్రము వచ్చిన వెంటనే విడుదలయిన చిత్రాలలో ఇది ఒకటి. ఈ చిత్రంలో నాగయ్య నటన ఒక ఎత్తు, ఆయన పాడిన పాటలు పద్యాలు ఒక ఎత్తు. తన అద్భుతమైన గాత్రంతో నాగయ్య వేమన పద్యాలను చక్కగా గానం చేసి ప్రేక్షకులను ఎంతగానో అలరించారు. ఆ పాటలు ఇప్పటికి "క్లాసిక్స్"గా పరిగణింపబడుతున్నాయి.
కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన సినిమాలు | |
---|---|
భక్త పోతన | యోగి వేమన | గుణసుందరి కథ | పాతాళభైరవి | పెద్దమనుషులు | దొంగరాముడు | మాయాబజార్ | పెళ్ళినాటి ప్రమాణాలు | జగదేకవీరుని కథ | శ్రీకృష్ణార్జున యుద్ధం | సత్య హరిశ్చంద్ర | భాగ్యచక్రం | ఉమా చండీ గౌరీ శంకరుల కథ | శ్రీకృష్ణసత్య |
This article uses material from the Wikipedia తెలుగు article యోగివేమన (1947 సినిమా), which is released under the Creative Commons Attribution-ShareAlike 3.0 license ("CC BY-SA 3.0"); additional terms may apply (view authors). అదనంగా సూచించని పక్షంలో పాఠ్యం CC BY-SA 4.0 క్రింద లభ్యం Images, videos and audio are available under their respective licenses.
®Wikipedia is a registered trademark of the Wiki Foundation, Inc. Wiki తెలుగు (DUHOCTRUNGQUOC.VN) is an independent company and has no affiliation with Wiki Foundation.