ఆక్రోటిరి, ఢెకెలియా

అక్రోటిరి, ధెకెలియా సావరిన్ బేస్ ఏరియాలు (The Sovereign Base Areas of Akrotiri and Dhekelia) సైప్రస్ దీవిలో బ్రిటిష్ వారి నిర్వహణలో (UK administered) ఉన్న భూభాగాలు.

ఇవి సావరిన్ బేస్ ఏరియాలు (అనగా స్వాధిపత్యం కలిగిన స్థావర ప్రాంతాలు). యునైటెడ్ కింగ్‌డమ్‌కు ఇవి సీమాంతర భూభాగాలు.

అక్రోటిరి, ధెకెలియా
(పశ్చిమ, తూర్పు)
సావరిన్ బేస్ ఏరియాలు
Flag of యునైటెడ్ కింగ్‌డమ్ అధినంలో ఉన్న దేశం యునైటెడ్ కింగ్‌డమ్ అధినంలో ఉన్న దేశం యొక్క చిహ్నం
జాతీయగీతం
"గాడ్ సేవ్ ది క్వీన్"
యునైటెడ్ కింగ్‌డమ్ అధినంలో ఉన్న దేశం యొక్క స్థానం
యునైటెడ్ కింగ్‌డమ్ అధినంలో ఉన్న దేశం యొక్క స్థానం
అక్రోటిరి, ధెకెలియా సావరిన్ బేస్ ఏరియాలు గులాబి రంగులో చూపబడ్డాయి.
రాజధానిఎపిస్కోపి కంటోన్మెంట్
అధికార భాషలు ఆంగ్ల భాష, గ్రీక్ భాష
ప్రభుత్వం సావరిన్ బేస్ ఏరియాలు
 -  నిర్వాహకుడు (Administrator) రిచర్డ్ లేసీ

బ్రిటిష్ ఓవర్సీస్ భూభాగం
 -  స్థాపించబడింది 1960 
జనాభా
 -   అంచనా 7,000 సైప్రస్ జాతీయులు, 7,500 బ్రిటిష్ మిలిటరీ వ్యక్తులు, వారి కుటుంబాలు 
కరెన్సీ సైప్రియట్ పౌండ్ (CYP)
కాలాంశం EET (UTC+2)
 -  వేసవి (DST) EEST (UTC+3)
ఇంటర్నెట్ డొమైన్ కోడ్ n/a
కాలింగ్ కోడ్ +357

అంతకుముందు బ్రిటిష్ సామ్రాజ్యంలో కాలనీగా ఉన్న సైప్రస్‌కు స్వతంత్ర కామన్‌వెల్త్‌గా అధికారం బదలాయించిన సమయంలో యునైటెడ్ కింగ్‌డమ్ ఈ స్థావరాలను అట్టిపెట్టుకుంది. మధ్యధరా సముద్రంలో సైప్రస్ దీవికి ఉన్న కీలక స్థానం దృష్ట్యా బ్రిటిష్ ప్రభుత్వం ఈ పనిచేసింది. ఈ స్థావరాలలో పశ్చిమాన అక్రోటిరి (ఎపిస్కోపి గారిసన్ దీనిలోనిదే), తూర్పున ధెకెలియా ఉన్నాయి.

చరిత్ర

బ్రిటిష్ సామ్రాజ్యంలో భాగమైన సైప్రస్ 1960 ఒడంబడిక ప్రకారం స్వతంత్ర దేశమైంది. కాని కీలకమైన ఈ స్థావరాలను బ్రిటిష్ ప్రభుత్వం తన అధీనంలో ఉంచుకోదలచింది. బ్రిటిష్ సైన్యానికి ఇవి ముఖ్యమైన వనరులు. మధ్యధరా సముద్రం లోని ఈ స్థావరాలు సూయజ్ కాలువకు, మధ్య ప్రాచ్య దేశాలకు దగ్గరలో ఉన్నాయి.

1974లో టర్కీ దేశం ఉత్తర సైప్రస్‌పై దాడి చేసింది. తద్వారా ఉత్తర సైప్రస్ టర్కిష్ రిపబ్లిక్ ఏర్పడింది. అయితే ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు జోక్యం కలుగజేసుకోలేదు. టర్కీ కూడా వారి జోలికి పోకుండా సైనిక స్థావరాల సమీపంలో యుద్ధం ఆపేశారు. కనుక ఈ స్థావరాల స్థితిలో ఏమీ మార్పు రాలేదు. అందువలన దక్షిణాన ఉన్న 'ఫమగుస్టా' ప్రాంతం గ్రీకు వారి అధీనంలో ఉండిపోయింది. 1974 తరువాత అక్కడ ఎన్నో రమణీయమైన విహార కేంద్రాలు వెలసి పర్యాటకం బాగా అభివృద్ధి చెందింది. అంతకు ముందు అక్కడ ఉన్న చిన్న చిన్న గ్రామాలు పెద్ద విహార స్థలాలుగా రూపొందాయి. అయ్యా నాపా అనేది వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది.

సైప్రస్‌తో వివాదం

ఈ స్థావరాలను తమకు తిరిగి అప్పగించమని, పౌర సంబంధమైన అభివృద్ధి కార్యాలకు అవి అవుసరమని సైప్రస్ అప్పుడప్పుడూ కోరడం జరిగింది. 1960నుండి 1964 వరకూ బ్రిటన్ సైప్రస్‌కు ఆర్థిక సహకారం అందిస్తూ వస్తున్నది. 1964 తరువాత ఇది ఆపివేశారు. 1964 తరువాత అన్ని సంవత్సరాలకూ తమకు ఈ దీవుల వినియోగానికి గాను పరిహారం (1 బిలియన్ యూరోల వరకు) చెల్లించాలని ప్రస్తుత సైప్రస్ ప్రభుత్వం వాదిస్తున్నది. ఆక్రోటిరిలో బ్రిటిష్ విమానాల విన్యాసాలు (ఆంగ్ల వికీలో చిత్రం) జూలై 2001లో బ్రిటిష్ సైనికాధికారులు ఎత్తైన రేడియో masts విర్మింప దలచినప్పుడు స్థానిక సైప్రియట్లనుండి తీవ్రమైన ప్రతిఘటన ఎదురయ్యింది.

ఏమైనా ఈ స్థావరాలను తిరిగి సైప్రస్‌కు స్వాధీనం చేసేందుకు బ్రిటిష్ ప్రభుత్వం ఏమాత్రం సుముఖత చూపలేదు. అయితే 117 చదరపు హెక్టేరుల వ్యవసాయ భూమిని తిరిగి ఇచ్చేందుకు మాత్రం సంసిద్ధత వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ స్థావరాలలో 3,000 మంది బ్రిటిష్ సైనికులున్నారు. తూర్పు స్థావరంలోని అయియోస్ నికొలౌస్ గూఢచారి వెట్‌వర్క్ ఎకిలన్‌కు సంకేత సేకరణా కేంద్రం అని అంటారు.

రాజ్యాంగం, పాలన

సావరిన్ స్థావరాలు (SBAs) 1960లో ఒడంబడిక ప్రకారం బ్రిటన్ స్వాధిపత్య ప్రాంతాలుగా ఉన్నాయి. అంటే ఇవి కాలనీలు కాదు.

1960 ఒడంబడికలో ఈ ప్రాంతాల పాలనకు సంబంధించిన నియమాలు:

  • వీటి వినియోగం మిలిటరీ అవసరాలకు మాత్రమే పరిమితం
  • ఇక్కడ కాలనీలు ఏర్పాటు చేయరాదు.
  • సావరిన్ స్థావరాలకూ, సైప్రస్ రిపబ్లిక్‌కూ మధ్య కస్టమ్స్ లేదా సరిహద్దు పోస్టులు ఏర్పాటు చేయరాదు.
  • మిలిటరీ అవసరాలకు తప్ప వేరే పరిశ్రమలు స్థాపించరాదు. సైప్రస్ ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీయరాదు.
  • వాణిజ్య, పౌర విమానాశ్రయాలు గాని, నౌకాశ్రయాలు గాని స్థాపించరాదు.
  • తాత్కాలిక అవుసరాలకు మాత్రమే గాని శాశ్వతంగా క్రొత్త జనుల ఆవాసాలు అనుమతించరాదు.
  • ప్రైవేటు ఆస్థులను స్వాధీనపరచుకోరాదు. మిలిటరీ అవసరాలకు కావాలంటే తగిన పరిహారం చెల్లించాలి

ఈ స్థావరాలకు వాటి వ్యాయ వ్యవస్థ ఉంది. వీలయినంత వరకు సైప్రస్ చట్టాలకు అనుగుణంగా ఈ చట్టాలను రూపొందిస్తారు. బ్రిటిష్ సైన్యం స్థావరం - ధెకెలియా (ఆంగ్ల వికీలో చిత్రం)

రాజకీయాలు

ఈ సావరిన్ స్థావర ప్రాంతాలు మిలిటరీ అవసరాలకు ఏర్పరచబడినవి గాని వాటిని బ్రిటిష్ ఆధారిత ప్రాంతాలుగా పరిగణించ కూడదు. కనుక ఈ స్థావరాల విర్వహణాధికారులు లండన్‌లోని రక్షణా మంత్రిత్వ శాఖ అధీనంలో ఉంటారు. వారికి నికోషియా (సైప్రస్)లోని విదేశ, కామన్‌వెల్త్ కార్యాలయాలతో అధికారకంగా ఏ విధమైన సంబంధం లేదు. అయితే వ్యావహారికమైన సంబంధాలు ఉంటుంటాయి

స్థావరాలకు ఒక నిర్వహణాధికారి (Administrator of the Sovereign Base Areas) ఉంటాడు. అతనే సైప్రస్ బ్రిటిష్ సేనల కమాండర్. (2006 నుండి ఎయిర్ మార్షల్ లేసీ). ఇతనిని, ఇతర పాలక వర్గాన్ని రక్షణ మంత్రిత్వం సలహాపై బ్రిఒటిష్ పాలకులు నియమిస్తారు. తోడుగా ఇతర అధికారులుంటారు. స్థావరాలలో ఎన్నికలు జరుగవు. అయితే బ్రిటిష్ పౌరులు యు.కె. ఎన్నికలలో వోటు వేయవచ్చును.

భౌగోళికం

ఆక్రోటిరి, ఢెకెలియా 
ఆక్రోటిరి (పశ్చిమ) SBA
ఆక్రోటిరి, ఢెకెలియా 
ధెకెలియా (తూర్పు) SBA

ఆక్రోటిరి వైశాల్యం 47.5 చదరపు మైళ్ళు. ధెకెలియా 50.5 చదరపు మైళ్ళు. మొత్తం 98 చ.మై. సైప్రస్‌ భూభాగంలో ఇది 3%. ఇందులో 40% సేనల ఆధీనంలోనూ, నిగిలిన 60% (బ్రిటిష్, లేదా సైప్రస్) ప్రైవేటు వ్యక్తుల ఆధీనంలోనూ ఉంది.

అక్రోటిరి ప్రాంతం సైప్రస్ దీవికి దక్షిణాన లిమాస్సోల్ పట్టణం వద్ద ఉంది. దెఖెలియా ప్రాంతం ఆగ్నేయంలో లర్నకా వద్ద ఉంది.

జన విస్తరణ

వీలయినంత వరకు జనావాసాలకు దూరంగా ఈ స్థావరాలను ఏర్పరచారు. అయినా ప్రస్తుతం ఈ ప్రాంతాలలో 14,000 మంది నివసిస్తున్నాఆరు. వీరిలో 7,000 మంది స్థానిక సైప్రియట్లు స్థావరాలలో గాని, పొలాలలో గాని పనిచేస్తారు. మిగిలినవాఱి బ్రిటిష్ మిలిటరీలో పని చేసేవారు, వారి కుటుంబాలు.

ఈ స్థావరాలలో పౌరసత్వం అనే విధానం లేదు. కొందరు బ్రిటిష్ సీమాంతర పౌరసత్వానికి అర్హులు కావచ్చును. కాని ఇక్కడ సైనికేతర పాలన నిషిద్ధం కనుక బ్రిటిష్ సీమాంతర చట్టం ఇక్కడికి వర్తించదు.

ఆర్ధిక వ్యవస్థ

ప్రధానంగా మిలిటరీ కార్య కలాపాలు, కొద్దిపాటి వ్యవసాయం ఇక్కడి ఆర్థిక వ్యవస్థకు మూల స్తంభాలు. ఈ ప్రాంతానికి ఆర్థిక గణాంకాలు లెక్కింపబడలేదు. 2008లో తక్కిన సైప్రస్‌తో బాటు ఆక్రోటిరి, ధెకెలియాలో కూడా యూరో కరెన్సీ సాధారణ వినియోగంలోకి వస్తుంది..

మూలాలు

  • Vassilis K. Fouskas. 2003. Zones of Conflict: U.S. Foreign Policy in the Balkans and the Greater Middle East. Pluto Press. ISBN 0-7453-2030-9. Pp. 93, 111

మూలాలు

ఇవి కూడా చూడండి

  • British overseas territories
  • Postal Orders of the Akrotiri Sovereign Base Area (The numismatic history of the Akrotiri SBA.)
  • Postal Orders of the Dhekelia Sovereign Base Area (The numismatic history of the Dhekelia SBA.)

బయటి లింకులు

ఆక్రోటిరి, ఢెకెలియా  Wiki Atlas of Akrotiri and Dhekelia


మూస:British dependencies మూస:Dependent and other territories of Europe 32°59′E / 34.583°N 32.983°E / 34.583; 32.983


Tags:

ఆక్రోటిరి, ఢెకెలియా చరిత్రఆక్రోటిరి, ఢెకెలియా సైప్రస్‌తో వివాదంఆక్రోటిరి, ఢెకెలియా రాజ్యాంగం, పాలనఆక్రోటిరి, ఢెకెలియా రాజకీయాలుఆక్రోటిరి, ఢెకెలియా భౌగోళికంఆక్రోటిరి, ఢెకెలియా జన విస్తరణఆక్రోటిరి, ఢెకెలియా ఆర్ధిక వ్యవస్థఆక్రోటిరి, ఢెకెలియా మూలాలుఆక్రోటిరి, ఢెకెలియా మూలాలుఆక్రోటిరి, ఢెకెలియా ఇవి కూడా చూడండిఆక్రోటిరి, ఢెకెలియా బయటి లింకులుఆక్రోటిరి, ఢెకెలియాen:British overseas territoriesen:Sovereign Base Areasయునైటెడ్ కింగ్‌డమ్సైప్రస్

🔥 Trending searches on Wiki తెలుగు:

చంద్రుడు జ్యోతిషంవ్యవసాయంరాజ్యసంక్రమణ సిద్ధాంతంగంగా పుష్కరంభారతదేశ ప్రధానమంత్రివృషభరాశిజాతీయములుకుక్కే సుబ్రహ్మణ్య దేవాలయందశావతారములుతెలుగునాట జానపద కళలుఅర్జునుడుశ్రీ కృష్ణుడుదుర్యోధనుడువర్షంయువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీలక్ష్మీనరసింహామంగ్లీ (సత్యవతి)శిశోడియాకోడి రామ్మూర్తి నాయుడుకంప్యూటరురామేశ్వరంసింధు లోయ నాగరికతకాసర్ల శ్యామ్ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీహరిద్వార్వేంకటేశ్వరుడువందేమాతరంకొండగట్టురోహిణి నక్షత్రంచరవాణి (సెల్ ఫోన్)ఉలవలురత్నపాపఘటోత్కచుడుబ్రాహ్మణులుకవిత్రయంమే దినోత్సవంశతక సాహిత్యముపెళ్ళి చూపులు (2016 సినిమా)భావ కవిత్వంజ్వరంప్రకృతి - వికృతిఇంగ్లీషు-తెలుగు అనువాద సమస్యలువీర్యంరావి చెట్టుఆరుద్ర నక్షత్రముమధుమేహంపెళ్ళిరెవెన్యూ గ్రామంసుందర కాండపట్టుదలనందమూరి బాలకృష్ణఅనుష్క శెట్టివాస్తు శాస్త్రంధర్మరాజుఅక్బర్గౌడభారతదేశపు చట్టాలుదక్షిణామూర్తిభారత రాజ్యాంగ ఆధికరణలునవగ్రహాలుభారత జాతీయ ఎస్టీ కమిషన్గ్లోబల్ వార్మింగ్నవరసాలుబరాక్ ఒబామాఫ్లిప్‌కార్ట్రక్తపోటువిద్యుత్తుదగ్గుబాటి వెంకటేష్దీపావళిఅష్ట దిక్కులుభారత ప్రభుత్వంరౌద్రం రణం రుధిరంనరసింహ శతకమురాధభారత జాతీయ కాంగ్రెస్త్రినాథ వ్రతకల్పం20వ శతాబ్దం ముందు తెలుగు పల్లెల్లో జీవనశైలిఉత్తరాభాద్ర నక్షత్రము🡆 More